maruti suzuki company
-
మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ రైడ్
న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్ 2029–30 నాటికి భారత్‌లో ఆరు ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. ఆ సమయానికి మొత్తం మోడళ్లలో ఈవీల వాటా 15 శాతం ఉంటుందని వెల్లడించింది. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ వాహనాలు 60 శాతం, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ 25 శాతం ఉంటాయని తెలిపింది. ఇటీవల జరిగిన ఆటో ఎక్స్పో సందర్భంగా ఈవీఎక్స్ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కంపెనీ ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఈ మోడల్ 2025లో భారత్‌లో రంగ ప్రవేశం చేయనుంది. చదవండి: Union Budget 2023: కేంద్రం శుభవార్త.. రైతులకు ఇస్తున్న సాయం పెంచనుందా! -
17 వేలకు పైగా మారుతీ కార్లు రీకాల్.. కారణం ఇదే!
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ 17,362 యూనిట్లు రీకాల్ చేస్తోంది. వీటిలో డిసెంబర్ 8 నుంచి జనవరి 12 మధ్య తయారైన ఆల్టో కె10, ఎస్–ప్రెస్సో, ఈకో, బ్రెజ్జా, బలేనో, గ్రాండ్ వితారా ఉన్నాయి. ఈ కార్లలో ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్ తనిఖీ చేసి లోపాలు ఉంటే ఉచితంగా మార్పిడి చేయనున్నట్టు కంపెనీ బుధవారం ప్రకటించింది. ప్రభావిత భాగంలో లోపం ఉండవచ్చునని అనుమానిస్తున్నట్టు వెల్లడించింది. సంబంధిత కస్టమర్లకు మారుతీ సుజుకీ అధీకృత వర్క్‌షాప్స్ నుంచి సమాచారం వస్తుందని తెలిపింది. చదవండి: గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే! -
ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాల జోరు, దేశంలో సుజుకీ వేలకోట్ల పెట్టుబడులు!
న్యూఢిల్లీ: భారత్‌లో స్థానికంగా బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను (బీఈవీ), బ్యాటరీలను ఉత్పత్తి చేయనున్నట్లు జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకీ మోటర్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ) ప్రెసిడెంట్ తొషిహిరో సుజుకీ తెలిపారు. ఇందుకోసం 2025 నాటికి రూ.10,445 కోట్ల మేర (150 బిలియన్ జపాన్ యెన్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి గుజరాత్ ప్రభుత్వంతో ఎస్ఎంసీ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియా–జపాన్ ఎకనమిక్ ఫోరం సదస్సు సందర్భంగా ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో దీనిపై సంతకాలు చేసినట్లు ఎస్ఎంసీ వివరించింది. ఈ ఎంవోయూ కింద ప్రస్తుతం ఎస్ఎంసీకి ఉన్న ప్లాంటుకు పక్కన బీఈవీ బ్యాటరీల తయారీ కోసం కొత్తగా ఫ్యాక్టరీని నిర్మించనున్నారు. దీనికోసం రూ. 7,300 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నారు. అలాగే బీఈవీల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు 2025 నాటికి మరో రూ. 3,100 కోట్లు ఎస్ఎంసీ ఇన్వెస్ట్ చేయనుంది. ప్రస్తుతం ప్రధాన అనుబంధ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా ద్వారా సుజుకీ గ్రూప్‌నకు హర్యానాలో రెండు ప్లాంట్లు, సొంతంగా గుజరాత్లో ఒక ప్లాంటు ఉంది. హర్యానాలో ప్లాంట్లలో ఏటా 15 లక్షల సాంప్రదాయ ఇంధనాల (పెట్రోల్, డీజిల్ మొదలైనవి) వాహనాలను తయారు చేస్తోంది. ఇక మారుతికి మాత్రమే వాహనాలను సరఫరా చేసే ఎంఎంసీ సొంత ప్లాంటు సామర్థ్యం ఏటా 7.5 లక్షల యూనిట్లుగా ఉంది. మరోవైపు, గ్రూప్‌లోని మరో సంస్థ మారుతి సుజుకీ టొయుత్సు ఇండియా (ఎంఎస్‌టీఐ) సారథ్యంలోని వాహనాల రీసైక్లింగ్ ప్లాంటుపై 2025 నాటికి రూ. 45 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఎస్ఎంసీ తెలిపింది. -
కార్ల రేట్లు రయ్..!
న్యూఢిల్లీ: ముడి వస్తువుల వ్యయాలు పెరిగిపోవడంతో కార్ల తయారీ కంపెనీలు మళ్లీ రేట్ల పెంపు బాట పట్టాయి. మారుతీ సుజుకీ, ఆడి, మెర్సిడెస్ తదితర సంస్థలు జనవరి 1 నుంచి ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించాయి. పెంపు అనేది మోడల్‌ను బట్టి ఆధారపడి ఉంటుందని దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ (ఎంఎస్ఐ) తెలిపింది. ఎంత మేర పెంచేది మాత్రం వెల్లడించలేదు. ‘వివిధ ముడి వస్తువుల ధరలు ఎగియడం వల్ల వాహనాల తయారీ వ్యయాలపై గత ఏడాది కాలంగా తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో అదనపు వ్యయాల భారంలో కొంత భాగాన్ని వాహనాల రేట్ల పెంపు రూపంలో కస్టమర్లకు బదలాయించక తప్పడం లేదు‘ అని కంపెనీ వివరించింది. ‘కమోడిటీల రేట్లు భారీగా పెరిగిన నేపథ్యంలో ధరల పెంపు కూడా గణనీయంగానే ఉండవచ్చు‘ అని ఎంఎస్ఐ సీనియర్ ఈడీ (మార్కెటింగ్ అండ్ సేల్స్ విభాగం) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. హ్యాచ్‌బ్యాక్ ఆల్టో మొదలుకుని ఎస్యూవీ ఎస్ క్రాస్ దాకా వివిధ మోడల్స్‌ను మారుతీ విక్రయిస్తోంది. వీటి ధరలు సుమారు రూ. 3.15 లక్షల నుంచి రూ. 12.56 లక్షల వరకూ (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ఉంటున్నాయి. మారుతీ ఈ ఏడాదిలో ఇప్పటికే మూడు సార్లు రేట్లు పెంచింది. జనవరిలో 1.4 శాతం, ఏప్రిల్‌లో 1.6 శాతం, సెప్టెంబర్‌లో 1.9 శాతం.. మొత్తం మీద 4.9 శాతం మేర పెంచింది. ఉక్కు, అల్యూమినియం, రాగి, ప్లాస్టిక్‌తో పాటు ఇతర ముఖ్యమైన లోహాల ధరలు గత ఏడాది కాలంగా పెరుగుతూనే ఉన్నాయని శ్రీవాస్తవ తెలిపారు. వాహన తయారీ వ్యయాల్లో వీటి వాటా 75–80 శాతంగా ఉంటుందని, అందుకే ఉత్పత్తి ఖర్చు పెరిగిపోతోందని ఆయన పేర్కొన్నారు. 2 శాతం వరకూ మెర్సిడెస్ పెంపు.. లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్–బెంజ్.. జనవరి 1 నుంచి తమ కార్ల ధరలను 2 శాతం వరకూ పెంచనున్నట్లు తెలిపింది. కొత్త ఫీచర్లను జోడిస్తుండటం, ముడి వస్తువుల ధరలు పెరుగుతుండటం ఇందుకు కారణమని వివరించింది. అయితే, ఎంపిక చేసిన కొన్ని మోడల్స్‌కు మాత్రమే పెంపును వర్తింపచేయనున్నట్లు పేర్కొంది. జీఎల్ఈ 400, జీఎల్ఈ 400డి ఎస్‌యూవీలను ఇప్పటికే బుక్ చేసుకుని, డెలివరీ కోసం ఏప్రిల్ నుంచి నిరీక్షిస్తున్న కస్టమర్లకు ధర పెంపుపరంగా రక్షణ ఉంటుందని వివరించింది. ఆడి 3 శాతం వరకూ.. అటు ఆడి కూడా తమ వాహనాల ధరలను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 3 శాతం వరకూ పెంచనున్నట్లు ప్రకటించింది. ముడి వస్తువులు, నిర్వహణ వ్యయాలు పెరిగిపోవడమే ఇందుకు కారణమని వివరించింది. ఏ4, ఏ6, ఆర్ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్ తదితర మోడల్స్‌ను దేశీయంగా ఆడి విక్రయిస్తోంది. 2021లో అయిదు ఎలక్ట్రిక్ కార్లతో పాటు మొత్తం 9 కొత్త వాహనాలను ప్రవేశపెట్టింది. అసాధారణంగా పెరుగుతున్న కమోడిటీల ధరలు.. కమోడిటీ ధరల పెరుగుదల భారం కంటే తాము తక్కువే పెంచామని శ్రీవాస్తవ వివరించారు. ‘గతేడాది ఏప్రిల్–మేలో కేజీ ఉక్కు ధర రూ. 38గా ఉండేది. ఈ ఏడాది అది రూ. 77కి పెరిగిపోయింది. ఇది అసాధారణ స్థాయి. ఉక్కు రేట్లు.. అలాగే ప్లాస్టిక్ ఖర్చులు కూడా భారీ స్థాయిలోనే కొనసాగవచ్చని అంచనాలు ఉన్నాయి. ఇక చైనాలో అల్యూమినియం ఉత్పత్తి పడిపోవడంతో టన్ను ధర 1,700–1,800 డాలర్ల నుంచి ఏకంగా రూ. 2,700–2,800 డాలర్లకు ఎగిసింది. అలాగే రాగి, ఇతర విలువైన లోహాల ధరలు కూడా పెరిగిపోయాయి. రేట్లు తగ్గుతాయేమోనని మేము వేచి చూస్తూ ఉన్నప్పటికీ అది జరగలేదు. మా పరంగా మేము ఖర్చులు తగ్గించుకోవడం వంటి చర్యలు అన్నీ తీసుకున్నాం. కానీ ముడి వస్తువుల వ్యయాలు ఈ స్థాయిలో ఉంటే తట్టుకునే పరిస్థితి లేదు. అందుకే రేట్ల పెంపు నిర్ణయం తీసుకోక తప్పలేదు‘ అని ఆయన తెలిపారు. -
మారుతీ మినీ ఎస్యూవీ.. ఎస్–ప్రెసో
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ మినీ ఎస్యూవీ(స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్), ఎస్–ప్రెసోను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మినీ ఎస్యూవీ ధరలు రూ.3.69 లక్షల నుంచి రూ.4.91 లక్షల రేంజ్(ఎక్స్ షోరూమ్ ధరలు)లో ఉన్నాయి. స్టాండర్డ్‌తో సహా మొత్తం నాలుగు వేరియంట్లు, ఆరు రంగుల్లో ఈ కారు లభ్యమవుతోంది. రెనో క్విడ్, డాట్సన్ రెడీ–గో, మారుతీ సుజుకీ కంపెనీకే చెందిన ఆల్టో కే10 కార్లకు ఈ ఎస్–ప్రెసో గట్టి పోటీనిస్తుందని అంచనా. ఎనిమిదవ బీఎస్–సిక్స్ మారుతీ మోడల్ మారుతీ కంపెనీ ఐదవ తరం హార్ట్‌టెక్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన ఈ కారు లీటర్‌కు 21.7 కిమీ. మైలేజీని ఇస్తుందని కంపెనీ ఎమ్డీ, సీఈఓ కెనిచి అయుకవ చెప్పారు. బీఎస్(భారత్ స్టేజ్)–సిక్స్ పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఉండే 1 లీటర్ కే10 పెట్రోల్ ఇంజిన్‌తో ఈ కారును తయారు చేశామని పేర్కొన్నారు. తమ కంపెనీ నుంచి బీఎస్–సిక్స్ ఇంజిన్‌తో వస్తున్న ఎనిమిదవ మోడల్ ఇదని తెలిపారు. ఈ కారు మాన్యువల్(5 గేర్లు), ఆటో గేర్ షిఫ్ట్(ఏజీఎస్) ఆప్షన్లలో లభిస్తుందని తెలిపారు. వివిధ భద్రతా ఫీచర్లతో ఈ కారును రూపొందించామని చెప్పారు. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ (యాంటీ–లాక్బ్రేకింగ్ సిస్టమ్) లిమిటర్స్, రియర్ పార్కింగ్ అసిస్ట్ సిస్టమ్, హైస్పీడ్ వారి్నంగ్ అలర్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సర్లు.. తదితర ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. ట్విన్ చాంబర్ హెడ్‌ల్యాంప్స్, సిగ్నేచర్ సి షేప్డ్ టెయిల్ ల్యాంప్స్, బాడీ కలర్డ్ బంపర్స్, ఓఆర్వీఎమ్స్ వంటి ఫీచర్లున్నాయని తెలిపారు. ఇక ఇంటీరియర్ విషయానికొస్తే, ఆడియో, వాయిస్ కంట్రోల్స్‌తో కూడిన మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, 7–అంగుళాల స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌్రస్కీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తదితర ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. రూ. 640 కోట్ల పెట్టుబడులు... ఈ కారు తయారీలో స్థానిక విడిభాగాలను 98 శాతం మేర ఉపయోగించామని అయుకవ చెప్పారు. ఈ కారు అభివృద్ధి కోసం రూ.640 కోట్లు ఇన్వెస్ట్ చేశామని తెలిపారు. మార్కెట్లో ప్రస్తుతమున్న మందగమనం తాత్కాలికమేనని భావిస్తున్నామని చెప్పారు. మార్కెట్ సెంటిమెంట్‌ను మార్చడానికి ఎస్–ప్రెసో తోడ్పడగలదన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. కాంపాక్ట్ కార్లకే మొగ్గు.... ఇటీవలి కాలంలో వినియోగదారులు కాంపాక్ట్ కార్ల కొనుగోలుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని ఆయుకవ చెప్పారు. ఎంట్రీ లెవల్ కాంపాక్ట్ కార్ల సెగ్మెంట్లో తాజా డిజైన్‌తో కూడిన కారు అవసరం ఉందని, దీని కోసమే ఎస్–ప్రెసో కారును అందుబా టులోకి తెచ్చామని వివరించారు. తర్వాతి తరం కాంపాక్ట్ కార్ల డిజైన్‌కు ఎస్–ప్రెసో దారి చూపుతుందని తెలిపారు. ఎరెనా రిటైల్ నెట్వర్క్ ద్వారా ఈ కార్లను విక్రయిస్తామని పేర్కొన్నారు. -
అన్ని మారుతీ ఆల్టో కార్లలో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ ఆల్టో 800, ఆల్టో కే10 మోడళ్లలో అన్ని వేరియంట్లలో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్స్ ఆప్షన్‌ను అందిస్తోంది. డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ ఆప్షన్ ఉన్న ఆల్టో 800 వేరియంట్ల ధర రూ.2.62 లక్షల నుంచి రూ.3.78 లక్షల రేంజ్లో ఉంటాయని మారుతీ సుజుకీ కంపెనీ తెలిపింది. అలాగే ఇదే ఆప్షన్ ఉన్న ఆల్టో కే10 వేరియంట్ల ధర రూ.3.45 లక్షల నుంచి రూ.4.08 లక్షల రేంజ్లో(అన్ని ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉంటాయని మారుతీ సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(మార్కెటింగ్, సేల్స్) ఆర్.ఎస్. కల్సి చెప్పారు. డ్రైవర్ ఎయిర్ బ్యాగ్‌ల వల్ల కార్ల యజమానులందరూ తమ కార్లు మరింత భద్రంగా ఉంటాయని భావిస్తారని పేర్కొన్నారు. -
అదన్నమాట ఈక్విటీ... బ్యూటీ!
మారుతీ సుజుకీ సంస్థ 2003, జూలై 9న స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. సురేష్ అని నా స్నేహితుడు అప్పట్లో మారుతీ 800 కారు కొందామనుకుని మళ్లీ ఆ ఆలోచన విరమించుకున్నాడు. కారుకు వెచ్చిద్దామనుకున్న రూ.2 లక్షలతో ఆ కంపెనీ షేర్లు కొన్నాడు. షేరుకు రూ.160 చొప్పున 1250 షేర్లు కొనుగోలు చేశాడు. ప్రస్తుతం కంపెనీ షేర్ ధర దాదాపు రూ.4,000 వద్ద ఉంది. గడచిన 12 సంవత్సరాల్లో కంపెనీ ఆదాయం 3.5 రెట్లు పెరిగింది. అమ్మకాలు 5.5 రెట్లు ఎగశాయి. షేర్ ధర మాత్రం 23 రెట్లు పెరిగింది. 2003 లిస్టింగ్‌లో మారుతీ 800 కొందామనుకున్న వ్యక్తి... ఇప్పుడు అంతకన్నా మంచి కారును కొనుగోలు చేసే స్థితికి చేరుకున్నాడు. అదీ ఈక్విటీ మార్కెట్లో ఉన్న గొప్పతనం. దీర్ఘకాలంలో అత్యుత్తమం... ఒక వ్యక్తి చేతిలో డబ్బులుంటే... అతనికి రెండు అవకాశాలుంటాయి. డబ్బును తక్షణం అవసరాలకు ఖర్చుపెట్టుకోవడం. లేదా ఆ అవసరాలను వాయిదా వేసుకొని డబ్బును సాధ్యమైనంత వరకూ దాచుకోవడం. రెండవ తరహా వ్యక్తి తన దగ్గరున్న డబ్బును జాగ్రత్తగా మంచి పెట్టుబడుల్లోకి మళ్లిస్తే... నేడు తాను కొనాలనుకున్న వస్తువుకు బదులుగా... రేపు మరింత నాణ్యతతో కూడిన వస్తువును కొనుగోలు చేసే వీలుంటుంది. ఏ పెట్టుబడి సాధనంలోనో డబ్బు దాచుకుందామని ఆలోచించే వ్యక్తికి... దీర్ఘకాలంలో చూస్తే- ఈక్విటీలు అత్యుత్తమం. అన్నింటిలోకీ బెటర్... గడచిన 20 సంవత్సరాల కాలాన్ని తీసుకుందాం. ఈక్విటీల్లో పెట్టుబడులు సగటున 13.3 శాతం వార్షిక రాబడి అందించాయి. ఇదే కాలంలో బంగారంలో వార్షిక రాబడి 9.4 శాతం ఉండగా, బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్లలో 7.9 శాతందాకా ఉంది. 1995లో ఈక్విటీల్లో ఒక లక్ష పెట్టుబడి పెడితే అది ప్రస్తుతం రూ.12 లక్షలయింది. బంగారంలో రూ.6 లక్షలయ్యింది. స్థిర డిపాజిట్లలో 4.6 లక్షలయింది. మ్యూచువల్ ఫండ్స్ కూడా... దీర్ఘకాలానికి మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడులు కూడా అత్యుత్తమమైనవే. టాప్ 15 లార్జ్‌క్యాప్ డైవర్సిఫైడ్ ఫండ్స్ గడచిన 10 ఏళ్లలో 19.9 శాతం రిటర్న్స్ అందించాయి. సెన్సెక్స్ అందించిన 17.4 శాతం రిటర్న్స్ కన్నా ఇది అధికం కావడం గమనార్హం. కొనుగోళ్లకు అవకాశం... ప్రస్తుతం మార్కెట్లో ఒడిదుడుకుల ధోరణి కనబడుతోంది. అయితే భారతదేశ ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే... దేశ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు ఇప్పటికీ లాభదాయకమే. దేశ మౌలిక రంగంలో పెరుగుతున్న పెట్టుబడులు, దేశ స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటం వంటి అంశాలు దీర్ఘకాలంలో మార్కెట్లో పెట్టుబడులకు భరోసా ఇస్తున్నాయి. -
పల్లెకు పోదాం.. చలో చలో!
గ్రామీణ మార్కెట్లపై మారుతీ కన్ను అమ్మకాలు పెంచుకోవడమే లక్ష్యం న్యూఢిల్లీ: అమ్మకాలు పెంచుకునేందుకు మారుతీ సుజుకి కంపెనీ గ్రామీణ మార్కెట్లపై కన్నేసింది. వచ్చే ఏడాది మార్చి కల్లా లక్ష గ్రామాలకు విస్తరించాలని యోచిస్తున్నామని మారుతీ సుజుకి ఇండియా చైర్మన్ ఆర్.సి. భార్గవ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ కాలానికి అన్ని కంపెనీల వాహనాల అమ్మకాలు 4-5% క్షీణించాయని పేర్కొన్నారు. అయితే మొత్తం అమ్మకాల్లో 30 శాతంగా ఉండే గ్రామీణ ప్రాంత విక్రయాలు మాత్రం 18% పెరిగాయని వివరించారు. అంతేకాకుండా పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ 5-6% క్షీణించిందని, ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాలు పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నామని భార్గవ వివరించారు. ఐదేళ్ల క్రితమే గ్రామీణ మార్కెట్లకు విస్తరించాలని ప్రణాళిక రూపొందించామని తెలిపారు. గత ఏడాది 44 వేల గ్రామాలకు చేరువ అయ్యామని, ఈ ఏడాది నవంబర్ వరకూ 60 వేల గ్రామాలకు విస్తరించామని పేర్కొన్నారు. భారత్‌లో లక్ష గ్రామాలకు వచ్చే ఏడాది మార్చికల్లా చేరనున్నామని తెలిపారు. ప్రస్తుతం తమ కంపెనీ 700 గ్రామీణ అవుట్లెట్లను నిర్వహిస్తోందని వివరించారు. అంతే కాకుండా గ్రామీణ ప్రాంత వినియోగదారుల కార్ల సర్వీసింగ్ కోసం 650 మొబైల్ వ్యాన్లను కూడా ఉపయోగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ మొబైల్ వర్క్‌షాప్‌ల సంఖ్యను వెయ్యికి పెంచనున్నామని పేర్కొన్నారు. ఈ మొబైల్ వర్క్‌షాపుల సంఖ్యను పెంచడం, గ్రామీణ అవుట్లెట్ల సంఖ్యను అధికం చేయడం తదితర మార్గాల ద్వారా లక్ష గ్రామాలకు చేరువకావాలన్నది కంపెనీ ఉద్దేశం. అమ్మకాలు మరింత తగ్గుతాయ్ ప్రస్తుత మార్కెట్, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను చూస్తే అమ్మకాలు మరింతగా తగ్గే అవకాశాలున్నాయని భార్గవ వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం కూడా గత ఆర్థిక సంవత్సరం నాటి విక్రయాలనే సాధిస్తామన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ ఏడాది 1.2 లక్షల వాహనాలు ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. డిమాండ్ లేదని, అందుకని ఉత్పత్తి గుజరాత్లో ప్లాంట్ ప్రతిపాదనను విరమించుకున్నట్లు భార్గవ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 2016కల్లా ఎల్సీవీ... ఒక్కో కారుకు సగటున రూ.17,000 డిస్కౌంట్నిస్తున్నామని, ఇంకా ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్లనందిస్తున్నామని వీటన్నింటి దృష్ట్యా డిసెంబర్, జనవరిలో అమ్మకాలు పుంజుకోగలవని మారుతీ సుజుకి సీవోవో(మార్కెటింగ్ అండ్ సేల్స్) మయాంక్ పరీక్ చెప్పారు. తేలిక రకం వాణిజ్య వాహనాన్ని(ఎల్సీవీ) 2016కల్లా అందించనున్నామని.. దీన్ని పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లలో కూడా అందిస్తామని పేర్కొన్నారు. రోహ్తక్లో నిర్మిస్తోన్న పరిశోధన, అభివృద్ధి కేంద్రం(ఆర్అండ్డీ) 2016 కల్లా సిద్ధమవుతుందని చెప్పారు. ఇది మారుతీ మాతృసంస్థ సుజుకీకి నాలుగో ఆర్అండ్డీ కేంద్రం. మిగిలిన మూడూ జపాన్‌లోనే ఉన్నాయి.