17 వేలకు పైగా మారుతీ కార్లు రీకాల్‌.. కారణం ఇదే! | Maruti Suzuki Recalls These Popular Car Models To Inspect Airbag Issues | Sakshi
Sakshi News home page

17 వేలకు పైగా మారుతీ కార్లు రీకాల్‌.. కారణం ఇదే!

Published Thu, Jan 19 2023 8:48 AM | Last Updated on Thu, Jan 19 2023 9:48 AM

Maruti Suzuki Recalls These Popular Car Models To Inspect Airbag Issues - Sakshi

న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ 17,362 యూనిట్లు రీకాల్‌ చేస్తోంది. వీటిలో డిసెంబర్‌ 8 నుంచి జనవరి 12 మధ్య తయారైన ఆల్టో కె10, ఎస్‌–ప్రెస్సో, ఈకో, బ్రెజ్జా, బలేనో, గ్రాండ్‌ వితారా ఉన్నాయి.

ఈ కార్లలో ఎయిర్‌బ్యాగ్‌ కంట్రోలర్‌ తనిఖీ చేసి లోపాలు ఉంటే ఉచితంగా మార్పిడి చేయనున్నట్టు కంపెనీ బుధవారం ప్రకటించింది. ప్రభావిత భాగంలో లోపం ఉండవచ్చునని అనుమానిస్తున్నట్టు వెల్లడించింది. సంబంధిత కస్టమర్లకు మారుతీ సుజుకీ అధీకృత వర్క్‌షాప్స్‌ నుంచి సమాచారం వస్తుందని తెలిపింది.

చదవండి: గ్యాస్‌ సిలిండర్‌ డోర్‌ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే!
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement