recalls
-
భగ్గుమన్న దౌత్య బంధం
న్యూఢిల్లీ: సిక్కు వేర్పాటువాది, ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యోదంతం ఒక్కసారిగా భారత్, కెనడా దౌత్యసంబంధాల్లో మంటలు రాజేసింది. నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును కెనడా ప్రభుత్వం చేర్చింది. వర్మను విచారించాల్సి ఉందంటూ ఆదివారం భారత విదేశాంగ శాఖకు కెనడా సందేశం పంపింది. దీంతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఖలిస్తాన్ వేర్పాటువాది హత్య కేసులో తమ దౌత్యాధికారులను ఇరికించడంపై భారత సర్కార్ తీవ్రంగా స్పందించింది. కెనడా తాత్కాలిక హైకమిషనర్ స్టివార్ట్ వీలర్సహా ఆరుగురు దౌత్యవేత్తలను భారత్ బహిష్కరించింది. బహిష్కరణకు గురైన వారిలో డెప్యూటీ హై కమిషనర్ ప్యాట్రిక్ హేబర్ట్, ఫస్ట్ సెక్రటరీలు మేరీ కేథరీన్ జోలీ, అయాన్ రోస్ డేవిడ్ ట్రైస్, ఆడమ్ జేమ్స్ చుప్కా, పౌలా ఓర్జులాలు ఉన్నారు. అక్టోబర్ 19వ తేదీన రాత్రి 11.59 గంటల్లోపు భారత్‌ను వీడాలని ఆదేశాలు జారీచేసింది. కెనడాలో విధులు నిర్వర్తిస్తున్న భారత దౌత్యవేత్త, దౌత్యాధికారులు, సిబ్బందిని స్వదేశానికి రప్పిస్తామని సోమవారం భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. అంతకుముందు తన నిరసన తెలిపేందుకు కెనడా దౌత్యవేత్త స్టీవర్ట్ రోస్ వీలర్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీచేసింది. దీంతో ఆయన సోమవారం సాయంత్రం ఢిల్లీలోని విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చి ఆ శాఖ కార్యదర్శి(తూర్పు) జైదీప్ మజుందార్‌ను కలిశారు. అనుమానితుల జాబితాలో భారత దౌత్యవేత్త పేరును చేర్చడంపై ఆయన ఎదుట భారత్ తన నిరసనను వ్యక్తంచేసింది. ఇది జరిగిన కొద్దిసేపటికే దౌత్యాధికారులను రప్పించడంపై విదేశాంగశాఖ నిర్ణయం వెలువడింది. ‘‘ కెనడాలో తీవ్రవాదం, హింసాత్మక ఘటనలు, ట్రూడో ప్రభుత్వ చర్యలు అక్కడి భారతీయ దౌత్యాధికారులను ప్రమాదంలోకి నెట్టేశాయి. ప్రస్తుత కెనడా ప్రభుత్వం వీళ్ల భద్రతకు భరోసా కలి్పస్తుందన్న నమ్మకం పోయింది. అందుకే వీళ్లందరినీ వెనక్కి రప్పించుకోవాలని భారత సర్కార్ నిర్ణయంచుకుంది. సిక్కు వేర్పాటువాదానికి మద్దతు పలుకుతూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ట్రూడో సర్కార్ దుందుడుకు చర్యలకు దీటుగా ప్రతిస్పందించే హక్కు భారత్‌కు ఉంది’’ అని విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. భారత్, కెనడా దౌత్యసంబంధాలు దారుణస్థాయికి క్షీణించడంతో కెనడాలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయ పౌరులు, విద్యనభ్యసిస్తున్న లక్షలాది మంది భారతీయ విద్యార్థులపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ట్రూడో ఓటు బ్యాంక్ రాజకీయాలు ఓటు బ్యాంక్ రాజకీయ లబి్ధపొందేందుకు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఇలా తమ దౌత్యవేత్తలను అప్రతిష్టపాలు చేస్తోందని భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. మీ ప్రభుత్వం నిందారోపణలు చేయడం మానుకోవాలని కెనడా దౌత్యవేత్త ఎదుట భారత్ తన నిరసన వ్యక్తంచేసింది. ‘‘ కెనడాలోని భారతీయ హై కమిషనర్, ఇతర దౌత్యవేత్తలు, అధికారులపై ఇలా నిరాధారపూరితంగా వేధించడం ఏమాత్రం ఆమోదనీయం కాదు’’ అని స్పష్టంచేసింది. ఆరోపణలకు తగ్గ ఆధారాలు ఇవ్వలేదు ‘‘ 2023 సెపె్టంబర్లో ఈ ఉదంతంలో భారత ప్రమేయం ఉందంటూ ట్రూడో ఆరోపణలు చేశారు. కానీ ఆ మేరకు సాక్ష్యాధారాలను భారత ప్రభుత్వానికి అందజేయలేదు. ట్రూడో కెనడా ఓటుబ్యాంక్ రాజకీయాల్లో లబ్ది పొందేందుకే కేసు దర్యాప్తు సమగ్రంగా జరక్కముందే వాస్తవాలు లేకుండా భారత హైకమిషనర్ వర్మకు వ్యతిరేకంగా కెనడా వ్యవహరిస్తోందన్నది సుస్పష్టం. 2018లో భారతలో పర్యటించినప్పటి నుంచే ట్రూడో భారత్‌తో ఘర్షణాత్మక వైఖరిని అవలంభిస్తున్నారు. భారత్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న, తీవ్రవాదులతో సత్సంబంధాలున్న వ్యక్తులకు ట్రూడో మంత్రివర్గంలో చోటుదక్కింది. 2020 డిసెంబర్లో భారత ఎన్నికల ప్రక్రియలోనూ ట్రూడో జోక్యం చేసుకునేందుకు యతి్నంచారు. ట్రూడో ప్రభుత్వం పూర్తిగా ఒకే రాజకీయ పారీ్టపై ఆధారపడింది. ఆ పార్టీ కేవలం భారత్‌లో సిక్కు వేర్పాటువాదాన్ని ఎగదోయడమే పనిగా పెట్టుకుంది’’ అని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.విశ్వసనీయ సమాచారం ఇచ్చాం: వీలర్ భారత విదేశాంగ శాఖ కార్యాలయం నుంచి బయటికొచ్చాక కెనడా దౌత్యవేత్త స్టీవర్ట్ వీలర్ మీడియాతో మాట్లాడారు. ‘‘ భారత్ ఏవైతే ఆధారాలను అడిగిందో వాటిని కెనడా ప్రభుత్వం ఇచి్చంది. కెనడా సొంత గడ్డపై కెనడా పౌరుడి హత్యోదంతంలో భారత సర్కార్‌కు చెందిన ఏజెంట్ల పాత్రపై విశ్వసనీయ, ఖచి్చతమైన సమగ్ర ఆధారాలను భారత్‌కు కెనడా ప్రభుత్వం అందజేసింది. ఇక నిర్ణయం భారత్‌కే వదిలేస్తున్నాం. ఇరు దేశాల స్వప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారత్ తన తదుపరి చర్యలు చేపట్టాలని ఆశిస్తున్నాం. ఈ విషయంలో సహకరించేందకు కెనడా సిద్ధంగా ఉంది’’అని వీలర్ వ్యాఖ్యానించారు.ఏమిటీ నిజ్జర్ వివాదం? నిజ్జర్ కెనడా కేంద్రంగా భారత వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని గతంలోనే భారత్ కెనడా సర్కార్‌కు తెలియజేసినా ఎలాంటి స్పందనా రాలేదు. 2023 ఏడాది జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రే నగరంలో గురుద్వారా సాహెబ్ పార్కింగ్ ప్రదేశంలో నిజ్జర్‌ను గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు కాల్చి చంపారు. అయితే ఈ కాల్పుల ఘటన వెనుక భారత నిఘా ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడో గత ఏడాది సెపె్టంబర్లో తీవ్ర ఆరోపణలు చేశారు. ట్రూడో ఆరోపణలను భారత్ ఖండించింది. ఆధారాల్లేకుండా నిందలు వేయడం తగదని గట్టిగా హెచ్చరించింది. హత్యకు సంబంధించి ఆధారాలు సమర్పిస్తే పరిశీలించి దర్యాప్తునకు సహకరించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని భారత్ స్పష్టంగా చెప్పింది. అయితే నిజ్జర్‌ను పాక్ ఐఎస్ఐ ఏజెంట్లు చంపేసి ఆ నేరం భారత్‌పై మోపాలని కుట్ర జరిగిందని గతంలో అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. నిజ్జర్ హత్యకు గురై ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది జూన్‌లో అక్కడి పార్లమెంట్ దిగువసభలో కెనడా ఎంపీలు నిజ్జర్‌కు నివాళులర్పించడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘ భారత్ ఉగ్రవాదిగా ప్రకటించిన, ఇంటర్‌పోల్ వాంటెడ్ జాబితాలో ఉన్న వ్యక్తికి ఏకంగా పార్లమెంటులో నివాళులరి్పంచడం దారుణం’’ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఎవరీ నిజ్జర్? నిషేధిత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్, ‘గురునానక్ సిక్ గురుద్వారా సాహిబ్’ అధిపతి అయిన నిజ్జర్ సిక్కు వేర్పాటువాదిగా పేరొందాడు. భారత్‌లోని జలంధర్ ప్రాంతంలోని బార్సింగ్పూర్లో జని్మంచాడు. 1997లో తప్పుడు పాస్ట్‌పోర్ట్‌లో కెనడాకు వెళ్లి స్థిరపడ్డాడు. అయితే అక్కడి నుంచే భారత్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించాడు. అమెరికాలో నెలకొల్పిన జస్టిస్ ఫర్ సిఖ్స్ సంస్థలో క్రియాశీలకంగా పనిచేశాడు. పంజాబ్‌లో హత్యలకు కుట్రపన్నాడన్న కేసులో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద భారత్ ఇతడిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఇతని తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది. జాతీయ దర్యాప్తు సంస్థ భారత్‌లోని ఇతని ఆస్తులను స్వా«దీనం చేసుకుంది. -
రతన్ టాటాతో చివరి మీటింగ్ గుర్తు చేసుకున్న గూగుల్ సీఈఓ
ముంబై: ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తన 86వ ఏట కన్నుమూశారు. ఆయన మృతిపై పారిశ్రామికవేత్తలతో పాటు పలువురు రాజకీయ నేతలు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు నివాళులు అర్పించిన వారిలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఉన్నారు.భారతీయ సంతతికి చెందిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వ్యాపార దిగ్గజం రతన్ టాటాతో తన చివరి సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు. గూగుల్‌లో రతన్ టాటాతో తమ చివరి సమావేశంలో తాము అనేక అంశాలపై చర్చించామని సుందర్ పిచాయ్ తెలిపారు. ఆయన విజన్ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఆయన తన దాతృత్వ విలువలను మనకు అందించారు. మన దేశంలో ఆధునిక వ్యాపార నాయకత్వానికి మార్గదర్శకత్వం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పిచాయ్ ఎక్స్ వేదికగా ఒక పోస్టులో పేర్కొన్నారు.భారతదేశాన్ని అభివృద్ధిపథంలో నడపడంలో టాటా ఎంతో శ్రద్ధ వహించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రతన్ జీ.. మీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వేడుకుంటున్నాను అంటూ సుందర్ పిచాయ్ ట్విట్టర్ వేదికగా నివాళులు అర్పించారు. టాటా గ్రూప్‌నకు రతన్ టాటా 20 ఏళ్లు ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన ముంబైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మీడియాకు ఈ విషయాన్ని తెలిపారు.ఇది కూడా చదవండి: రతన్ టాటా..రతనాల మాటలు -
ఫిష్ మాసాలాలో పురుగుమందులు? సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ సీరియస్
ఎవరెస్ట్ బ్రాండ్ పేరుతో అనేక రకాల మసాలాలు, సుగంధ ద్రవ్యాలు మిశ్రమాలను విక్రయించే ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. భారతదేశం నుండి దిగుమతి చేసుకున్న కంపెనీ ఫిష్ కర్రీ మసాలాలో పరిమితికి మించి పురుగుమందులు ఉన్నట్లు గుర్తించింది సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ. దీంతో షిష్ మసాలా ప్యాకెట్లను రీకాల్ చేయాలని ఆదేశించింది. ఈమేరకు నిన్న (ఏప్రిల్ 18న) ఒక ప్రకటన విడుదల చేసింది. హాంకాంగ్‌లోని సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ రీకాల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మానవ వినియోగానికి పనికిరాని స్థాయిలో పురుగుమందు ఇథిలీన్ ఆక్సైడ్ అవశేషాలను ఉన్నట్లు గుర్తించినట్టు ఏజెన్సీ పేర్కొంది. “ఇంప్లికేట్ చేయబడిన ఉత్పత్తులు సింగపూర్‌లోకి దిగుమతి అయినందున, సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ (SFA) ఉత్పత్తులను రీకాల్ చేయమని దిగుమతిదారు, ముత్తయ్య & సన్స్‌ని ఆదేశించింది. విషాదం: స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల దుర్మరణం) వ్యవసాయ ఉత్పత్తులో ఇథిలీన్ ఆక్సైడ్ వినియోగం, ఆహారంలో పురుగుమందు అనుమతి లేదని ఫుడ్ ఏజెన్సీ తెలిపింది. ఇది దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించింది. ఇది వినియోగదారుల ఆరోగ్యానికి ప్రమాదమని ఎస్ఎఫ్ఏ పేర్కొంది. ఈ మసాలా ఉత్పత్తులను వినియోగించి, తమ ఆరోగ్యంపై ఆందోళనలున్నవారు వైద్య సలహాను పొందాలనీ, ఇతర సమాచారం నిమిత్తం వారి కొనుగోలు కేంద్రాలను సంప్రదించాలని కూడా సూచించింది. ఈ ఉదంతంపై ఎవరెస్ట్ కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయ లేదు. (యూట్యూబర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే షాక్!) -
ఈ యమహా స్కూటర్లలో ప్రాబ్లమ్.. 3 లక్షల యూనిట్లు రీకాల్!
ప్రముఖ ద్విచక్ర వాహన తయారు సంస్థ యమహా ( Yamaha ) తమ కస్టమర్లకు అత్యవసర సమాచారం ఇచ్చింది. 2022 జనవరి 1 నుంచి 2024 జనవరి 4 మధ్య కాలంలో తయారు చేసిన దాదాపు 3 లక్షల యూనిట్ల 125cc స్కూటర్లను తక్షణమే అమలులోకి వచ్చేలా స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ స్కూటర్లు ఇవే.. కంపెనీ వెల్లడించిన ప్రకారం.. ఎంపిక చేసిన యూనిట్లలో బ్రేక్ లివర్ ఫంక్షన్లో సమస్య ఉన్నట్లు కంపెనీ గుర్తించింది. Ray ZR 125 Fi హైబ్రిడ్, Fascino 125 Fi హైబ్రిడ్ స్కూటర్ మోడల్స్ (2022 జనవరి తరువాతి మోడల్స్) ఎంపిక చేసిన యూనిట్లలో బ్రేక్ లివర్ ఫంక్షన్లో ఉన్న సమస్యను పరిష్కరించడమే రీకాల్ లక్ష్యంగా యమహా చెబుతోంది. ఉచితంగానే రీప్లేస్మెంట్ రీప్లేస్మెంట్ పార్ట్ కస్టమర్‌కు ఉచితంగా అందించనున్నట్లు యమహా కంపెనీ వెల్లడించింది. రీకాల్ కోసం అర్హతను ధ్రువీకరించడానికి కస్టమర్లు ఇండియా యమహా మోటర్ వెబ్సైట్లోకి వెళ్లి సర్వీస్ సెక్షన్‌లోని 'SC 125 వాలంటరీ రీకాల్'ని క్లిక్ చేయాలి. ఇక్కడ బండి ఛాసిస్ నంబర్, వివరాలు నమోదు చేస్తే తదుపరి దశలు వస్తాయి. యమహా 2023 కొత్త 125 cc హైబ్రిడ్ స్కూటర్ శ్రేణి BS-VI OBD2 & E-20 ఫ్యూయల్ కంప్లైంట్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్ట్ (FI), 125 cc బ్లూ కోర్ ఇంజన్‌తో 8.2 PS @ 6,500 RPM పవర్ అవుట్‌పుట్, 10.3 NM @ 5,000 RPM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. యమహా అంతర్జాతీయ పరిశోధన, అభివృద్ధితో ఈ 125 Fi హైబ్రిడ్ ఇంజన్ తయారు చేశారు. -
మారుతి కస్టమర్లకు మరోషాక్, 11 వేల కార్లు రీకాల్
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరోసారి తన కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. తన పాపులర్ మోడల్ గ్రాండ్ విటారా 11,177 కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్లలో రేర్ సీట్ బెల్ట్ మౌంటింగ్ బ్రాకెట్స్ సమస్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. గత ఏడాది ఆగస్టు ఎనిమిది నుంచి నవంబర్ 15 వరకు తయారైన గ్రాండ్ విటారా కార్లను రీకాల్ చేస్తున్నట్లు వెల్లడించింది. రేర్ సీట్ బెల్ట్ మౌంటింగ్ బ్రాకెట్లలో సమస్య తలెత్తింది. దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు రేర్ సీట్ బెల్ట్ లూజ్ అయ్యే అవకాశం ఉందని, దానివల్ల పనితీరు దెబ్బ తింటుందని మారుతి తెలిపింది. గత ఆగస్టు – నవంబర్ మధ్య తయారైన గ్రాండ్ విటారా కార్లు కొనుగోలు చేసిన వినియోగదారులకు తమ డీలర్ల ద్వారా సమాచారం అందుతుందని తెలిపింది. దెబ్బ తిన్న విడి భాగాలను ఉచితంగా రీ ప్లేస్ చేస్తామని మారుతి ప్రకటించింది. కాగా ఎయిర్‌బ్యాగ్ లోపం కారణంగా వివిధ మోడళ్లకు చెందిన 17,362 కార్లు ఇటీవల మారుతి రీకాల్ చేసింది. ముఖ్యంగా ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, ఈకో, బ్రెజా, బాలెనో, గ్రాండ్ విటారా మోడల్ కార్లు ఉన్న సంగతి తెలిసిందే. -
17 వేలకు పైగా మారుతీ కార్లు రీకాల్.. కారణం ఇదే!
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ 17,362 యూనిట్లు రీకాల్ చేస్తోంది. వీటిలో డిసెంబర్ 8 నుంచి జనవరి 12 మధ్య తయారైన ఆల్టో కె10, ఎస్–ప్రెస్సో, ఈకో, బ్రెజ్జా, బలేనో, గ్రాండ్ వితారా ఉన్నాయి. ఈ కార్లలో ఎయిర్‌బ్యాగ్ కంట్రోలర్ తనిఖీ చేసి లోపాలు ఉంటే ఉచితంగా మార్పిడి చేయనున్నట్టు కంపెనీ బుధవారం ప్రకటించింది. ప్రభావిత భాగంలో లోపం ఉండవచ్చునని అనుమానిస్తున్నట్టు వెల్లడించింది. సంబంధిత కస్టమర్లకు మారుతీ సుజుకీ అధీకృత వర్క్‌షాప్స్ నుంచి సమాచారం వస్తుందని తెలిపింది. చదవండి: గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే! -
అలర్ట్: పాపులర్ డవ్, ఇతర షాంపూల్లో కేన్సర్ కారక కెమికల్స్,రీకాల్
సాక్షి,ముంబై: ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ యూనీ లీవర్ తన వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. డవ్, ట్రెస్మే, నెక్సస్, సువేవ్, టిగీ లాంటి షాంపూల్లో కేన్సర్ కారక కెమికల్ ఉన్నట్టు గుర్తించిన కారణంగా వాటిని భారీ ఎత్తున రీకాల్ చేసింది. ఈ నేపథ్యంలో కలుషితమైన ఏరోసోల్ డ్రై షాంపూ ఉత్పత్తుల వినియోగాన్ని నిలిపి వేయాలని వినియోగదారులకు కంపెనీ సూచించింది. వీటిని వినియోగించడం ప్రమాదమంటూ హెచ్చరిక జారీ చేసింది. యూనిలీవర్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వెబ్సైట్లో రీకాల్ వివరాలను అక్టోబర్ 18న ప్రకటించింది. రీకాల్ చేసిన వాటిల్లో అక్టోబరు 2021కి ముందు తయారు చేసిన డ్రై షాంపూ ఏరోసోల్ ఉత్పత్తులున్నాయని యునిలీవర్ తన నివేదికలో తెలిపింది. తమ అంతర్గత పరిశోధనలో ఏరోసోల్స్ ప్రొపెల్లెంట్ కేన్సర్ కారకం బెంజీన్కు మూలమని కనుగొన్నట్లు తెలిపింది. వీటి వాడకంతో బెంజీన్ స్థాయిలు పెరిగే అవకాశం ఉన్నందున అమెరికాలో పంపిణీ చేసిన ఉత్పత్తులు అన్నింటినీ రీకాల్ చేశామనీ, ఆయా ఉత్పత్తులను షెల్ఫ్‌ల నుండి తీసివేయమని రిటైలర్లను కోరింది. కాగా బెంజీన్ అధిక స్థాయిలోశరీరంలో చేరితే లుకేమియా, ప్రాణాంతక రక్త రుగ్మతలు, బోన్ మారో క్యాన్సర్ వంటి క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే స్ప్రై ఆన్ డ్రై షాంపూలలో ప్రమాదకరమైన కలుషితాలను గుర్తించడం ఇదే మొదటి సారి కాదు. తాజా పరిణామంతో వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులలో ఏరోసోల్‌ల భద్రత మరోసారి ప్రశ్నార్థకమైంది. గత ఏడాదిన్నర కాలంలో, జాన్సన్ అండ్ జాన్సన్స్ న్యూట్రోజెనా, ఎడ్జ్‌వెల్ పర్సనల్ కేర్ కంపెనీకి చెందిన బనానా బోట్ లాంటి ఉత్పత్తులను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నాయి.అలాగే ప్రోక్టర్ అండ్ గాంబుల్ స్ప్రే-ఆన్ యాంటీ పెర్స్పిరెంట్‌లు సీక్రెట్ అండ్ ఓల్డ్ స్పైస్, యూనిలివర్స్ సువేవ్ లాంటి ఉత్పత్తులలో బెజీన్ కనుగొనడం, రీకాల్ చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. -
తొలి ఈవీతో వచ్చిన గండం.. టయోటాకు తప్పని తిప్పలు..
ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అనేక దేశాల్లో మంచి పేరున్న టయోటాకు తొలి ఎలక్ట్రిక్ వెహికల్తో ఇబ్బందులు వచ్చి పడ్డాయి. ఎంతో అర్భాటంగా ఇటీవల టయోటా తమ సంస్థ తరఫున బీజెడ్4ఎక్స్ పేరుతో ఎస్యూవీ కారుని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. టయోటా పేరుకున్న బ్రాండ్ ఇమేజ్‌తో ఈ కార్లకు బాగానే అమ్మకాలు సాగాయి. అయితే ఇటీవల బీజెడ్4ఎక్స్ వాహనంలో వరుసగా ఇబ్బందులు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రయాణం మధ్యలో చక్రాలు ఊడిపోతున్నాయంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయ్. దీంతో వెంటనే టయోటా అప్రమత్తమైంది. ఇబ్బందులు వస్తున్న బీజెడ్4ఎక్స్ కార్లను వెనక్కి రీకాల్ చేయాలని నిర్ణయించింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 2700 కార్లను రీకాల్ చేయనున్నారు. ఇందులో యూరప్ 2,200, యూఎస్ 260, కెనాడ 10, జపాన్ 110 వరకు కార్లు ఉన్నాయి. టయోటా ఈవీ కారులో ఇబ్బందులు రావడం ఆటోమొబైల్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇటీవల ఈవీలలో మంటలు చెలరేగడం పరిపాటిగా మారింది. తాజాగా ఇండియాలో టాటా నెక్సస్ కారులో మంటలు వ్యాపించాయి. ఇదే సమయంలో టయోటా ఈవీ కారు ఉదంతం తెరపైకి రావడంతో ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై సందేహాలు కమ్ముకున్నాయి. అయితే టయోటా విషయంలో సమస్య బ్యాటరీలో కాకుండా చక్రాల దగ్గర కావడంతో సమస్య తీవ్రత తగ్గింది. చదవండి: షాకింగ్ వీడియో: మంటల్లో టాటా నెక్సాన్ ఈవీ, స్పందించిన సంస్థ -
పోర్స్చేకు చైనా భారీ షాక్!
ప్రముఖ పోర్స్చే టేకాన్ సంస్థకు చైనా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్ (ఎస్ఎంఆర్) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పోర్స్చేకు చెందిన 6,172 కార్లను రీకాల్ చేయాలని ఆదేశించింది. చైనాలో అమ్మకాలు జరిపిన పోర్స్చే 2020-21 సంవత్సరానికి చెందిన మోడల్ ఎలక్ట్రిక్ కార్లను రీకాల్ చేయాలని ఎస్ఎంఆర్ తెలిపింది.పోర్స్చే టేకాన్ డ్రైవింగ్ సీట్ వైరింగ్ సమస్యలతో పాటు సీట్ల సప్లిమెంటల్ రెస్ట్రెయింట్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్) పని చేయడంలో విఫలమయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అనుమానం వ్యక్తం చేసింది. సీటు పనికిరాకుండా పోయినా లేదా ఎస్ఆర్ఎస్ పని చేయడం ఆగినా వెహికల్ క్రాష్ అవుతుందనే అనుమానం వ్యక్తం చేసింది. అందుకే ఆ కార్లను రీకాల్ చేయాలని తెలిపింది. దీంతో పోర్స్చే తన డీలర్ల వద్ద రీకాల్ చేసిన అన్ని వాహనాలపై సీట్ వైర్ హార్నెస్‌లను ఫ్రీగా చెక్ చేయాలని ఎస్ఆర్ఎస్ ఆదేశించినుంది. ఒక జీను పాడైపోయినా లేదా డిస్కనెక్ట్ అయిన సందర్భంలో, పోర్స్చే దానిని రిపేర్ చేస్తుంది. లేదంటే మార్చేస్తుంది. -
అగ్ని ప్రమాదాల కలకలం...ఓలా ఎలక్ట్రిక్ కీలక నిర్ణయం..!
దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. పలు కంపెనీల స్కూటర్లు అగ్రి ప్రమాదాలకు గురికావడంతో ఆయా కంపెనీలు సదరు ఎలక్ట్రిక్ స్కూటర్లను వెనక్కి పిలిచేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ కీలక నిర్ణయం తీసుకుంది. 1,441 వెనక్కి..! పేలుళ్ల నేపథ్యంలో...1441 యూనిట్ల ఒలా ఎలక్ట్రిక్ స్కూటర్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది. మార్చి 26న పుణెలో జరిగిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ అగ్ని ప్రమాదం నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రమాదానికి గురైన స్కూటర్‌తో పాటు ఆ బ్యాచ్‌లో తయారైన అన్నింటినీ తనిఖీ చేయాలని నిర్ణయించామని తెలిపింది. అందులో భాగంగానే ఈ రీకాల్ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. బ్యాటరీ వ్యవస్థలు, థర్మల్ వ్యవస్థలపై తమ సర్వీస్ ఇంజినీర్లు పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తారని ఓలా తెలిపింది. తమ స్కూటర్లలో అమర్చిన బ్యాటరీలు భారత ప్రమాణాలతో పాటు ఐరోపా ప్రమాణాలకు కూడా సరిపోతాయని పేర్కొంది. ఇటీవల పుణెలో జరిగిన ప్రమాదాన్ని ప్రస్తావిస్తూ.. ఈ ఘటనపై ఇంకా పూర్తిస్థాయి సమీక్ష కొనసాగుతున్నట్లు వెల్లడించింది. చదవండి: ఆ స్కూటర్లు కూడా రీకాల్.. ఒకినావా బాటలో ప్యూర్ ఈవీ -
సోదరుడితో సంబంధం అంటగట్టారు.. నిద్ర లేని రాత్రులు గడిపా
Raveena Tandon Recalls Being Linked To Her Own Brother: బాలీవుడ్ నటి రవీనా టండన్ ఆకాశ వీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన పుకార్లను షేర్ చేసుకుంది రవీనా. తనకు తన కోస్టార్స్‌తో రిలేషన్ ఉన్నట్లు అవాస్తవాలను మీడియా రాసేది అని అసహనం వ్యక్తం చేసింది. అసలు ఎలా రాస్తారు అని ప్రశ్నించింది. ఒకానొక సమయంలో తన సోదరుడితో రిలేషన్లో ఉన్నట్లు వచ్చిన వార్తలపై తాను ఎంతో కృంగిపోయాను అని చెప్పింది. రవీనా తన కోస్టార్స్‌ను మంచి స్నేహితులుగా చూస్తానని.. ఆ విషయాన్ని పత్రికా సంపాదకులు అంగీకరించలేకపోయేవారని తెలిపింది. అప్పట్లో జర్నలిస్టుల దయతో నటులు ఉండేవారని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రవీనా. ఇంకా ఆ ఇంటర్వూలో 'నేను అనేక నిద్ర లేని రాత్రులు గడపడం నాకు గుర్తుంది. నిద్ర పోవడం కోసం ఏడ్చేదాన్ని. ప్రతి నెల సినిమా మ్యాగజీన్లు విడదల అవుతున్నాయంటే భయం పట్టుకునేది. ఎప్పుడూ ఏ పుకారు నా మీద వస్తుందో అని. ఆ పుకార్లు నా పూర్తిగా నాశనం చేశాయి. నా విశ్వసనీయత, నా ప్రతిష్ఠ, నా తల్లిదండ్రుల మనసులను ముక్కలు చేశాయి. నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే ఇదంతా దేని గురించి అని. వారు నా సొంత సోదరుడితో సంబంధం ఉన్నట్లు పుకార్లు పుట్టించారు. రవీనా టండన్‌ను డ్రాప్ చేయడానికి ఒక అందమైన అబ్బాయి వచ్చాడు, మేము రవీనా టండన్ బాయ్‌ఫ్రెండ్‌ను కనిపెట్టాం అని స్టార్‌డస్ట్ రాసింది. అసలు ఎలా చెప్తారు మీరు. ఎలా ధృవీకరీస్తారు. చిత్ర పరిశ్రమలో సినిమా పాత్రికేయులు, ఎడిటర్ల దయతో జీవిస్తున్నట్లుగా ఉండేది.' అని తన మనసులోని భారాన్ని దించేసుకుంది రవీనా. ఇదీ చదవండి: సల్మాన్ ఖాన్ డ్యాన్స్ వీడియో వైరల్.. సిక్స్ ప్యాక్ ఫేక్ అని ట్రోలింగ్ -
లస్సీలో తేనెటీగ పడినా తాగాను: షారుక్
ముంబై : బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తన మొదటి సంపాదనతో తాజ్‌మహాల్‌ను సందర్శించడం..అక్కడ తాను ఎదుర్కొన్న సంఘటనలను అభిమానులతో పంచుకున్నారు. షారుక్ తాజాగా కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రెమో డి సౌజాతో కలిసి డాన్స్ ప్లస్ సీజన్ 5లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రెమో డి సౌజా న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తుండగా.. డాన్స్ ప్లస్ షోలో గణతంత్య్ర దినోత్సవ ప్రత్యేక ఎపిసోడ్లో షారుఖ్ కనిపించనున్నారు. ఇందుకు తాజ్ మహల్ కటౌట్ నేపథ్యంలో 20 నిమిషాల పాటు పలు పాటలకు డాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా షారుక్ తన కెరీర్ ప్రారంభంలోని అనుభూతులను నెమరువేసుకున్నారు. (ఆ నలుగురూ నాకు స్ఫూర్తి) షారుక్ మాట్లాడుతూ.. నా మొదటి సంపాదన రూ.50తో తాజ్ మహాల్‌ను చుట్టి వచ్చాను. రైలు టిక్కెటు కొన్న తర్వాత తన దగ్గర కేవలం లస్సీ కొనుగోలుకు మాత్రమే డబ్బులు ఉన్నాయి. నేను లస్సీ కొనుకున్నాను. కానీ అందులో తేనెటీగ పడింది. అయినా గుట్టు చప్పుడు కాకుండా తాగి.. తిరిగి ప్రయాణమయ్యాను’ అని తన అనుభూతులను పంచుకున్నాడు. అలాగే.. ‘నాకు 95 ఏళ్లు వచ్చినా రైలు పైనా, వీల్ చైర్లో ఛయ్యా.. ఛయ్యా పాటకు డాన్స్ చేస్తూనే ఉంటాను. అలాగే నా వెంట రెమో కూడా ఉంటారు.’ అని చమత్కరించారు. కాగా నటుడితో పాటు జీరో సినిమాతో షారుఖ్ నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. అతని నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బార్డ్ ఆఫ్ బ్లడ్ అనే నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌ను నిర్మిస్తుంది. ఇక షారుక్ తన నెక్ట్స్ ప్రాజెక్టును తమిళ దర్శకుడు అట్లీతో చేయనున్నారని వార్తలు వెలువడగా, షారుక్ మాత్రం దీనిపై ఏలాంటి క్లారీటీ ఇవ్వలేదు -
జిల్లెట్ రేజర్లు వాడుతున్నారా..?
సాధారణంగా కొన్ని రకాల మందులు, భద్రతా కారణాల రీత్యా ఆటో కంపెనీలు, లేదా ఫుడ్ ఉత్పతుల రీకాల్‌ను చూస్తుంటాం. కానీ రేజర్లు రీకాల్స్ చేయడం చాలా అరుదు. అయితే షేవింగ్ బ్లేడ్స్, షేవింగ్ క్రీమ్ తయారీ దిగ్గజ సంస్థ జిల్లెట్ తాజాగా భారీ సంఖ్యలో రేజర్లను రీకాల్ చేస్తోంది. మరీ పదునుగా ఉన్నాయనీ, తద్వారా తెగి పోవడం, లోతైన గాయం అయ్యే అవకాశం ఉందంటూ రెండు ఉత్సత్తులను వెనక్కి తీసుకుంటోంది. వీనస్ సింప్లీ 3 డిస్పోజబుల్ రేజర్ 4-ప్యాక్, డైసీ క్లాసిక్ 12 + 1 వీనస్ సింప్లీ 3 బోనస్ ప్యాక్ ఇందులో ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. మరీ ఎక్కువ షార్ప్‌గా ఉన్నాయంటూ 87వేల డిస్పోజబుల్ రేజర్లను జిల్లెట్ రీకాల్ చేస్తోంది. తయారీలో లోపం కారణంగా రేజర్‌లోని బ్లేడ్ల అమరిక తప్పుగా ఉందని కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి-మే నెలల మధ్య విక్రయించిన ఉత్పత్తులు ప్రభావితమయ్యాయని వాటిని వెనక్కి తీసుకుంటామని తెలిపింది. ఈ రేజర్లను ఉపయోగించడాన్ని వెంటనే ఆపివేసి, వాటిని జిల్లెట్‌కు అందించి రీప్లేస్మెంట్ వోచర్ తీసుకోవాలని వినియోగదారులకు సూచిస్తోంది. లక్షలాది మంది మహిళల భద్రత, వారి విశ్వాసమే తమకు ముఖ్యమని జిల్లెట్ ఒక ప్రకటనలో తెలిపింది. మరిన్ని వివరాలు జిల్లెట్ అధికారిక వెబ్సైట్లో లభ్యం. -
కొత్త డిజైర్, స్విప్ట్ కార్ల రీకాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఆటోదిగ్గజం మారుతి సుజుకి దేశంలో భారీ ఎత్తున కార్లను రీకాల్ చేస్తోంది. ఎయిర్ బాగ్స్‌లో లోపాల కారణంగా కొత్త జనరేషన్ స్విఫ్ట్, డిజైర్ కార్లను వెనక్కి తీసుకుంటోంది. ఈ మేరకు మారుతి ఒక ప్రకటన విడుదల చేసింది. మే 7నుంచి జులై 5, 2018 మధ్య ఉత్పత్తి అయిన మొత్తం 1279 కార్లను పరీక్షిస్తున్నట్టు తెలిపింది. 2018, జులై 25నుంచి ఈ రీకాల్ ప్రారంభమవుతుందని ప్రకటించాంది. మారుతి సుజుకి దేశంలో కొత్త తరం స్విఫ్ట్ , డిజైర్ మోడళ్ల కార్లలో లోపాలను తనిఖీ చేయడానికి ఈ రీకాల్ చేపట్టినట్టు కంపెనీ తెలిపింది. 566 స్విఫ్ట్ , 713 డిజైర్ కార్లను వెనక్కి తీసుకుంటోంది. సంబంధిత వాహన యజమానులను మారుతి సుజుకి డీలర్లు సంప్రదించనున్నారని తెలిపింది. వారికి ఉచితంగా ఆయా భాగాలను ఉచితంగా అందిస్తామని వెల్లడించింది. అలాగే అధికారిక మారుతి సుజుకి వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని కార్ల యజమానులను కంపెనీ కోరింది. -
భారీ మొత్తంలో ఆడి కార్ల రీకాల్
ఫ్రాంక్ఫర్ట్: జర్మనీ కార్ మేకర్ ఆడి భారీ సంఖ్యలో కార్లను రీకాల్ చేయనుంది. ప్రపంచ వ్యాప్తంగా 8లక్షల 50 వేల డీజిల్ కార్లను వెనక్కి తీసుకుంటున్నట్టు శుక్రవారం ప్రకటించింది. కార్ల ఉద్గారాల వృద్ధికిగాను కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా, కెనడా మినహా ప్రపంచ వ్యాప్తంగా ఆరు సిలిండర్ల , ఎనిమిది-సిలిండర్ డీజిల్ ఇంజిన్ల కార్లను రీకాల్ చేస్తోంది. ఈయూ5, ఈయూ6 డీజిల్ ఇంజిన్లతో ఉన్న కార్ల కోసం "రెట్రోఫైట్ ప్రోగ్రాం" ఆఫర్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఫోక్స్ వ్యాగన్ సబ్సిడరీ గాఉన్న ఆడి కర్బన ఉద్గారాల కుంభకోణంలో ఆరోపణలుఎదుర్కొంటున్న ఆడి ఈ పరిహార కార్యక్రమాన్ని కస్టమర్లకు ఉచితంగా అందిస్తోంది. ఈ రీకాల్ ద్వారా ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మొత్తం ఉద్గారాలు తగ్గించేందుకు, అలాగే డీజిల్ ఇంజన్ల భవిష్యత్తులో సాధ్యత నిర్వహించాలని ఆడి భావిస్తున్నట్టు సమాచారం. కాగా ఇదే కారణంగా, మరో జర్మన్ కార్ల తయారీ సంస్థ, ఆటోమొబైల్ దిగ్గజం డైమ్లెర్ ఏజీ కూడా "డీజిల్ ఇంజిన్లు సమగ్ర ప్రణాళిక’’ లో భాగంగా యూరోప్ అంతటా మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్, మూడు మిలియన్లకు పైగా డీజిల్ కార్లు రీకాల్ చేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. ఆడి, డైమ్లెర్ రెండూ కర్బన ఉద్గారాల కుంభకోణంలో నిందిత కంపెనీలే. ఉద్గార పరీక్షల్లో మోసం చేయడానికి ఇల్లీగల్ సాఫ్ట్ వేర్ ఉపయోగించాన్న ఆరోపణలున్నాయి. -
టయోటా భారీ రీకాల్
న్యూఢిల్లీ: ప్రపంచంలో అతిపెద్ద భారత అనుబంధ వాహనతయారీసంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత మార్కెట్లో భారీగా వాహనాలను రీకాల్ చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా వాహనాల కొనసాగుతున్న రీకాల్ భాగంగా సెడాన్ వాహనాలను వెనక్కి తీసుకోనుంది. భారత్ లో 23,157 టయోటా కరొల్లా ఆల్టిస్ వాహనాలను రీకాల్ చేయనుంది. ఎయిర్ బ్యాగ్ లో లోపాల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. దీని ధర రూ 15.87 లక్షలు, రూ 19.91 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) రేంజ్ లో ఉన్నాయి. జనవరి 2010, డిశెంబర్ 2012 మధ్య తయారైన కరొల్లా వాహనాలను రీకాల్ చేస్తున్న టయోటా కిర్లోస్కర్ మోటార్ ప్రతినిధి పిటిఐకి చెప్పారు. కాగా జపాన్ కుచెందిన టకోటా ఎయిర్‌బ్యాగ్ లోపాల కారణంగా ఇండియా, జపాన్, చైనాలతోపాటు ఎయిర్ బ్యాగ్ లోపాల కారణంగా గ్లోబల్ గా 2.9 మిలియన్ వాహనాలను రీకాల్ చేస్తోంది. హోండా కంపెనీ కూడా భారీ రీకాల్ చేపట్టింది. గత జనవరిలో 41,580 వాహనాలను వెనక్కి తీసుకుంది. -
సుమారు 7లక్షల ఫోర్డ్ కార్లు...
ప్రముఖ కార్ల సంస్థ ఫోర్డ్ మోటార్ భారీ ఎత్తున సెడాన్ కార్లను రీకాల్ చేస్తోంది. సీట్ బెల్ట్ ఫంక్షనింగ్ లో సమస్య కారణంగా అమెరికా, ఉత్తర అమెరికాలో సుమారు 680,000 వాహనాలు వెనక్కి తీసుకుంటున్నట్టు శుక్రవారంవెల్లడించింది. ప్రమాదంలో సంభవించినపుడు సీటు బెల్టులు సరిగా పనిచేయకపోవడంతో ఈనిర్ణయం తీసుకున్నట్టుతెలిపింది. 2013-16 ఫోర్డ్ ఫ్యూజన్, 2015-16 ఫోర్డ్ మోండో, మరియు 2013-15 లింకన్ ఎంకేజే మోడల్ కార్లు ఉన్నట్టు కంపెనీ చెప్పింది. సాంకేతిక లోపం కారణంగా అధిక ఉష్ణోగ్రతల్లో సరిగా పనిచేయని సీటు బెల్టు సమస్యను పరిష్కరించేందుకు ఈ కార్లను రీకాల్ చేసింది. ప్రమాదం సమయంలో సీటు బెల్ట్, ఎయిర్ బ్యాగ్ సమన్వయం లోపం కారణంగా రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయన్నారు. -
సన్ ఫార్మాకు అమెరికాలో ఎదురు దెబ్బ
-
సన్ ఫార్మా మందుల భారీ రీకాల్
ఫార్మా దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కి అమెరికాలో ఎదురు దెబ్బ తగిలింది. డిప్రెసివ్ డిజార్డర్ చికిత్స లో వాడే బుప్రోపియాన్ హైడ్రోక్లోరైడ్ మాత్రలను భారీ ఎత్తునరీ కాల్ చేస్తోంది. బుప్రోపియాన్ హైడ్రోక్లోరైడ్ ఎక్స్టెండెడ్ 50 మి.గ్రా మాత్రలున్న 31, 762 సీసాలను ఉపసంహరించుకోనుంది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తన తాజా ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో ఈ విషయాన్ని తెలిపింది. డిజల్యూషన్ స్పెసికేషన్స్ సమర్పించడంలో పెయిలైన కారణంగా అమెరికా దేశవ్యాప్తంగా ఈ రీకాల్ చేస్తున్నట్టు తెలిపింది. ఇది క్లాస్ 3రీకాల్ అని నివేదించింది. వీటిని సన్ ఫార్మా కు చెందిన హలోల్ కర్మాగారంలో ఉత్పత్తి చేసినట్టు మాచారం. -
పదిలక్షల కార్లను రీకాల్ చేసిన హోండా
బీజింగ్: ప్రముఖ కార్ల కంపెనీలను ఎయిర్ బ్యాగ్ లోపాలు పట్టిపీడిస్తున్నాయి. ఎయిర్ బ్యాగ్ లోపాల కారణంగా దిగ్గజ కంపెనీలు లక్షల సంఖ్యలో కార్లను అనేకమార్లు వెనక్కితీసుకున్నాయి. తాజాగా హోండా మోటార్స్ 10 లక్షల ఎస్యూవీ, సెడాన్ కార్లను రీకాల్ చేయనుంది. చైనా భాగస్వామ్యంతో తయారుచేసి చైనాలో విక్రయించినకార్లను వెనక్కి తీసుకుంటున్నట్టు కంపెనీ క్వాలిటీ ఎజెన్సీ శుక్రవారం ప్రకటించింది . 2007 -11 మధ్య కాలంలో డాంగ్ ఫెంగ్ హోండా ఆటోమొబైల్స్ ఉత్పత్తి చేసి న హోండా సీఆర్ -వీ యుటిలిటీ వెహికల్స్, సివిక్ అండ్ ప్లాటినం రూయీ సెడాన్ , సివిక్ హైబ్రిడ్ కార్లను రీకాల్ చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. కాగా టకాటా ఎయిర్ బ్యాగ్ లోపాల కారణంగా ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల కార్లను అనేక కంపెనీలు రీకాల్ చేశారు. మరోవైపు ఈ లోపాల కారణంగా జరిగిన ప్రమాదాల కారణంగా 11 మంది మరణించగా 100మంది గాయపడ్డారు. . టకాటా ఎయిర్ బ్యాగ్ లో వైఫల్యం కారణంగా ఇప్పటికే లక్షల కార్లను హోండా వెనక్కి తీసుకుంది. గతంలో జపాన్ లో కంపెనీ7 లక్షల 84 వేల కార్లను ఉపసంహరించుకుంది. ఒకేసారి బలంగా ఈ ఎయిర్ బ్యాగ్ లు తెరచుకోవడంతో ప్రయాణీకులను గాయాల పాలవుతున్నారని పేర్కొంది. -
8.9 లక్షల ఫియట్ వాహనాలు రీకాల్
డెట్రాయిట్: ప్రముఖ వాహన తయారీ కంపెనీ 'ఫియట్' పెద్ద సంఖ్యలో వాహనాలను వెనక్కి పిలిచింది. ఫియట్ క్రిస్లర్కు చెందిన వాహనాల యాంటీ లాక్ బ్రేక్స్, ఎయిర్ బ్యాగ్‌లలో సమస్యలు తలెత్తడంతో ఫియట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వాహనాలలో జీప్, డోగ్జే, ఫియట్ ఎస్యూవీ రకానికి చెందినవి ఉన్నాయి. యాంటీ లాక్ బ్రేక్ వ్యవస్థలో తేమ చేరే అవకాశాలు ఉన్నందున, సమస్యను పరిష్కరించడానికి వాహనాలను వెనక్కి పిలుస్తున్నట్లు ఫియట్ తెలిపింది. ఈ నిర్ణయంతో 2012 నుండి 2015 మధ్య కాలంలో తయారైన 5.5 లక్షల డోగ్జే వాహనాలలో సమస్యలను పరిష్కరించనున్నారు. -
భయానక క్షణం నుంచీ..
మూడేళ్ళ క్రితం ఆమె... మెర్సీ కిల్లింగ్ కు పర్మిషన్ ఇమ్మంటూ కోర్టుకు అర్జీ పెట్టుకుంది. సగం కాలిన గాయాలతో, చూపు, వినికిడి కోల్పోయి బతకడమే కష్టంగా ఉందంటూ కోర్టును వేడుకుంది. అయితే ఇప్పుడామె బతకాలనుకుంటోంది. తనవంటి బాధితులకు జీవితంపై ఆశ కల్పించి, అండగా నిలబడి న్యాయంకోసం పోరాడేందుకు సిద్ధమైంది. పదేళ్ళక్రితం ఝార్ఖండ్ కి చెందిన సోనాలీ ముఖర్జీ.. ముగ్గురు దుండగుల యాసిడ్ దాడినుంచీ కేవలం ప్రాణాలతో బయట పడింది. అది.. 2002 సంవత్సరం. అప్పుడామెకు పదిహేడేళ్ళ వయసు. అందరిలాగే కాలేజీ జీవితాన్ని హాయిగా గడుపుతోంది. కానీ ఆమెపై కన్నేసిన దుండగులు ఎంత బతిమలాడినా ఆమెను వదల్లేదు. ఆఖరికి ఆమె తండ్రి కూడ వేడుకున్నాడు. తన కూతరి వెంట పడొద్దని. కొన్నాళ్ళు ప్రశాంతంగా జరిగిపోయింది. అయితే ఆ ప్రశాంతత వెనుక తుఫాను లాంటి భయం ఉందని వారు గమనించలేదు. దుండగులు రహస్యంగా పన్నిన పన్నాగంలో సోనాలీ చిక్కుకుపోయింది. యాసిడ్ దాడిలో కాలిన ముఖంతోపాటు, కళ్ళు చాలా వరకు దెబ్బతిన్నాయి. వినికిడి శక్తి కొంతశాతం కోల్పోయింది. డాక్టర్లు కూడ ఇంతటి దారుణాన్ని తామెప్పుడూ చూడలేదన్నారు. అయితే ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆమెకు ఎంతగానో సహకరించారు. గత పదేళ్ళలో ఆమె ముఖాన్నికొంతవరకైనా సాధారణ స్థితికి తెచ్చేందుకు కనీసం 28 సార్లు ప్లాస్టిక్ సర్జరీ నిర్వహిచారు. భవిష్యత్తులో కూడ మరెన్నో చికిత్సలు చేయాల్సి ఉంది. అయినా ఆమె సగం కాలిన ముఖంతోనే జీవితం గడపాల్సి ఉంది. కానీ ఆమెపై దాడి చేసిన దుండగులు మాత్రం కేవలం రెండున్నరేళ్ళ జైలు శిక్ష అనుభవించి బయటకొచ్చేశారు. ప్రశాతంగా జీవితం గడుపుతున్నారు. 2012 లో సోనాలీ కోర్టును ఆశ్రయించింది. ఇండియాలో అమలులోలేని.. మెర్సీ కిల్లింగ్ కు పర్మిషన్ ఇవ్వాలని అర్జీ పెట్టుకుంది. ''నాకు న్యాయం జరగడం లేదు, నేనీ బాధ భరించలేను. సగం ముఖంతో మిగిలిన సగం జీవితాన్నిజీవించలేను. నాకు మిగిలిన మార్గం ఒక్కటే. నా ప్రాణం తీసుకునేందుకు పర్మిషన్ ఇవ్వండి'' అంటూ వేడుకుంది. అయితే 2013 లో జరిగిన ఘటన ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఇండియాలోనే అతిపెద్ద టీవీ కార్యక్రమం కౌన్ బనేగా కరోడ్ పతి లో పాల్గొన్న ఆమెను చూసిన చిత్తరంజన్ తివారి ఫేస్ బుక్ ద్వారా పలకరించాడు. ఆ స్నేహం ప్రేమగా మారి పెళ్ళికూడ చేసుకునేందుకు అంగీకరించాడు. ఈ ఏడాది ఏప్రిల్ లో వారి వివాహం జరిగింది. '' నాకు పెళ్ళవుతుందని నేను ఏమాత్రం ఊహించలేదు. పదేళ్ళుగా నన్ను నేను నిలబెట్టుకునేందుకు ఎంతో ప్రయాస పడ్డాను. కానీ పెళ్ళి జరుగుతుందని మాత్రం కలలో కూడ అనుకోలేదు'' అంటుంది సోనాలి. ఇప్పుడామె ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతోంది. తనవంటి బాధితులకు అండగా నిలబడి, న్యాయ పోరాటం చేసేందుకు కృషి చేస్తోంది. లండన్ కు చెందిన ఓ సేవా సంస్థ, యాసిడ్ సర్వైవర్స్ ఇంటర్నేషనల్ లెక్కల ప్రకారం... సంవత్సరంలో సుమారు పదిహేను వందల యాసిడ్ అటాక్స్ జరుగుతున్నట్లు లెక్కలు చెప్తున్నాయి . అందులో 80 శాతం బాధితులు మహిళలే ఉంటున్నారు. చాలామంది విషయాన్ని బహిర్గతం చేసేందుకు భయపడతున్నారు. అయతే అటువంటి క్రిమినల్స్ కు తగిన శిక్ష పడటం లేదని, వారు ఎంతో హాయిగా తిరుగుతుంటే బాధితులు నరకం చూస్తున్నారని సోనాలి చెప్తోంది. బాధితులకోసం న్యాయ పోరాటానికి తాను సిద్ధమంటోంది. -
'ఆ తీర్పు'ను రద్దుచేసిన హైకోర్టు
చెన్నై: అత్యాచారం కేసులో రాజీ కుదుర్చుకోమని బాధితురాలికి సలహా ఇస్తూ, అందుకుగాను నేరస్తుడికి బెయిల్ మంజూరు చేసిన వివాదాస్పదమైన తీర్పును మద్రాస్ హైకోర్టు వెనక్కి తీసుకుంది. రేప్ కేసుల్లో మధ్యవర్తిత్వం నేరమని, ఇది మహిళల గౌరవానికి భంగకరమని జూలై 1న సుప్రీం తేల్చి చెప్పిన నేపథ్యంలోనే కోర్టు శనివారం తన తీర్పును రద్దు చేసింది. జస్టిస్ పి.దేవదాస్ ఆధ్వర్యంలో మద్రాస్ హైకోర్టు నేరస్తుడితో రాజీ చేసుకోమని కోరుతూ అతనికి బెయిల్ చేయడంతో పాటు, అతన్ని పెళ్లి చేసుకోవాలని కూడా సూచించింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. కొంతమంది న్యాయవాదులు దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. అయితే హైకోర్టు సూచనను బాధితురాలు నిరాకరించింది. మైనర్‌గా ఉన్నపుడే ఆమె అత్యాచారానికి గురైంది. ఆ తర్వాత తల్లిదండ్రులను కోల్పోవడంతో పాటు ఒక బిడ్డకు జన్మనిచ్చింది. కాగా లైంగిక దాడి చేసిన వ్యక్తులతో రాజీ కుదుర్చుకోమని కోరడమంటే నేరస్తుల పట్ల మెతక వైఖరి చూపించినట్లు అవుతుందని , రాజీ చేయడమంటే మహిళా హక్కులను కాలరాయడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది చాలా తీవ్రమైన తప్పిదమని పేర్కొంటూ మద్రాసు హైకోర్ట్ తీర్పును తీవ్రంగా దుయ్యబట్టిన సంగతి తెలిసిందే. -
అమెరికా నుంచి డాక్టర్ రెడ్డీస్ ‘రానిటిడిన్’ ఔషధం రీకాల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గ్యాస్ట్రిక్ సమ స్యల చికిత్సలో ఉపయోగించే రానిటిడిన్ హైడ్రోక్లోరైడ్ (150 మి.గ్రా.) ఔషధ లాట్లు అయిదింటిని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) అమెరికా మార్కెట్ నుంచి రీకాల్ చేస్తోంది. ఇవి సూక్ష్మజీవుల వల్ల కలుషితం కావడం ఇందుకు కారణం. తమ సొంత బ్రాండ్ కింద విక్రయించుకునేలా మూడు వేర్వేరు సంస్థలకు డాక్టర్ రెడ్డీస్ వీటిని ఎగుమతి చేసింది. కంపెనీ వీటిని స్వచ్ఛందంగా ఉపసంహరించుకుంటున్నట్లు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ తెలిపింది.