Raveena Tandon: Recalls Being Linked To Her Own Brother - Sakshi
Sakshi News home page

Raveena Tandon: ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపా.. పాపులర్‌ నటి

Published Wed, Jan 5 2022 3:58 PM | Last Updated on Wed, Jan 5 2022 8:58 PM

Raveena Tandon Recalls Being Linked To Her Own Brother - Sakshi

Raveena Tandon Recalls Being Linked To Her Own Brother: బాలీవుడ్‌ నటి రవీనా టండన్‌ ఆకాశ వీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన పుకార్లను షేర్‌ చేసుకుంది రవీనా. తనకు తన కోస్టార్స్‌తో రిలేషన్‌ ఉన్నట్లు అవాస్తవాలను మీడియా రాసేది అని అసహనం వ్యక్తం చేసింది. అసలు ఎలా రాస్తారు అని ప్రశ్నించింది. ఒకానొక సమయంలో తన సోదరుడితో రిలేషన్‌లో ఉన్నట్లు వచ్చిన వార్తలపై తాను ఎంతో కృంగిపోయాను అని చెప్పింది. రవీనా తన కోస్టార్స్‌ను మంచి స్నేహితులుగా చూస్తానని.. ఆ విషయాన్ని పత్రికా సంపాదకులు అంగీకరించలేకపోయేవారని తెలిపింది. అప్పట్లో జర్నలిస్టుల దయతో నటులు ఉండేవారని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రవీనా.

ఇంకా ఆ ఇంటర్వూలో 'నేను అనేక నిద్ర లేని రాత్రులు గడపడం నాకు గుర్తుంది. నిద్ర పోవడం కోసం ఏడ్చేదాన్ని. ప్రతి నెల సినిమా మ్యాగజీన్లు విడదల అవుతున్నాయంటే భయం పట్టుకునేది. ఎప్పుడూ ఏ పుకారు నా మీద వస్తుందో అని. ఆ పుకార్లు నా పూర్తిగా నాశనం చేశాయి. నా విశ్వసనీయత, నా ప్రతిష్ఠ, నా తల్లిదండ్రుల మనసులను ముక్కలు చేశాయి. నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే ఇదంతా దేని గురించి అని. వారు నా సొంత సోదరుడితో సంబంధం ఉన్నట్లు పుకార్లు పుట్టించారు. రవీనా టండన్‌ను డ్రాప్‌ చేయడానికి ఒక అందమైన అబ్బాయి వచ్చాడు, మేము రవీనా టండన్‌ బాయ్‌ఫ్రెండ్‌ను కనిపెట్టాం అని స్టార్‌డస్ట్‌ రాసింది. అసలు ఎలా చెప్తారు మీరు. ఎలా ధృవీకరీస్తారు. చిత్ర పరిశ్రమలో సినిమా పాత్రికేయులు, ఎడిటర్ల దయతో జీవిస్తున్నట్లుగా ఉండేది.' అని తన మనసులోని భారాన్ని దించేసుకుంది రవీనా. 



ఇదీ చదవండి: సల్మాన్‌ ఖాన్‌ డ్యాన్స్‌ వీడియో వైరల్‌.. సిక్స్‌ ప్యాక్‌ ఫేక్ అని ట్రోలింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement