ముంబై : బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ గత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తన మొదటి సంపాదనతో తాజ్‌మహాల్‌ను సందర్శించడం..అక్కడ తాను ఎదుర్కొన్న సంఘటనలను అభిమానులతో పంచుకున్నారు. షారుక్ తాజాగా కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రెమో డి సౌజాతో కలిసి డాన్స్ ప్లస్ సీజన్ 5లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రెమో డి సౌజా న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తుండగా.. డాన్స్ ప్లస్ షోలో గణతంత్య్ర దినోత్సవ ప్రత్యేక ఎపిసోడ్‌లో షారుఖ్ కనిపించనున్నారు. ఇందుకు తాజ్ మహల్ కటౌట్ నేపథ్యంలో 20 నిమిషాల పాటు పలు పాటలకు డాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా షారుక్ తన కెరీర్ ప్రారంభంలోని అనుభూతులను నెమరువేసుకున్నారు. (ఆ నలుగురూ నాకు స్ఫూర్తి)
షారుక్ మాట్లాడుతూ.. నా మొదటి సంపాదన రూ.50తో తాజ్ మహాల్‌ను చుట్టి వచ్చాను. రైలు టిక్కెటు కొన్న తర్వాత తన దగ్గర కేవలం లస్సీ కొనుగోలుకు మాత్రమే డబ్బులు ఉన్నాయి. నేను లస్సీ కొనుకున్నాను. కానీ అందులో తేనెటీగ పడింది. అయినా గుట్టు చప్పుడు కాకుండా తాగి.. తిరిగి ప్రయాణమయ్యాను’ అని తన అనుభూతులను పంచుకున్నాడు. అలాగే.. ‘నాకు 95 ఏళ్లు వచ్చినా రైలు పైనా, వీల్ చైర్‌లో ఛయ్యా.. ఛయ్యా పాటకు డాన్స్ చేస్తూనే ఉంటాను. అలాగే నా వెంట రెమో కూడా ఉంటారు.’ అని చమత్కరించారు. కాగా నటుడితో పాటు జీరో సినిమాతో షారుఖ్ నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. అతని నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బార్డ్ ఆఫ్ బ్లడ్ అనే నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌ను నిర్మిస్తుంది. ఇక షారుక్ తన నెక్ట్స్ ప్రాజెక్టును తమిళ దర్శకుడు అట్లీతో చేయనున్నారని వార్తలు వెలువడగా, షారుక్ మాత్రం దీనిపై ఏలాంటి క్లారీటీ ఇవ్వలేదు
Comments
Please login to add a commentAdd a comment