సుమారు 7లక్షల ఫోర్డ్ కార్లు...
ప్రముఖ కార్ల సంస్థ ఫోర్డ్ మోటార్ భారీ ఎత్తున సెడాన్ కార్లను రీకాల్ చేస్తోంది. సీట్ బెల్ట్ ఫంక్షనింగ్ లో సమస్య కారణంగా అమెరికా, ఉత్తర అమెరికాలో సుమారు 680,000 వాహనాలు వెనక్కి తీసుకుంటున్నట్టు శుక్రవారంవెల్లడించింది. ప్రమాదంలో సంభవించినపుడు సీటు బెల్టులు సరిగా పనిచేయకపోవడంతో ఈనిర్ణయం తీసుకున్నట్టుతెలిపింది. 2013-16 ఫోర్డ్ ఫ్యూజన్, 2015-16 ఫోర్డ్ మోండో, మరియు 2013-15 లింకన్ ఎంకేజే మోడల్ కార్లు ఉన్నట్టు కంపెనీ చెప్పింది.
సాంకేతిక లోపం కారణంగా అధిక ఉష్ణోగ్రతల్లో సరిగా పనిచేయని సీటు బెల్టు సమస్యను పరిష్కరించేందుకు ఈ కార్లను రీకాల్ చేసింది.
ప్రమాదం సమయంలో సీటు బెల్ట్, ఎయిర్ బ్యాగ్ సమన్వయం లోపం కారణంగా రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయన్నారు.