seat belt
-
సీటుబెల్ట్ ధరించినా తీవ్రత ఎలా!
సాక్షి, హైదరాబాద్: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితను బలితీసుకున్న రోడ్డు ప్రమాద ఘటనపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. ఎమ్మెల్యే నందిత ప్రయాణించిన కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడాన్ని పరిగణనలోకి తీసుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు ఆమె సీట్ బెల్ట్ ధరించే ఉండచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రమాద తీవ్రత ఫలితంగా అది ఊడిపోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన తీరు, ప్రమాదం అనంతరం కారు స్థితిగతులు, లాస్య మృతదేహం పడున్న పరిస్థితి, ఆమెకు అయిన గాయాలను పరిగణనలోకి తీసుకున్న రవాణా రంగ నిపుణులు మాత్రం సీట్ బెల్ట్ సరిగ్గా పెట్టుకోకపోయి ఉండొచ్చని అంటున్నారు. ప్రమాద సమయంలో లాస్య కారులో డ్రైవర్ పక్కన ఉన్న ఫ్రంట్ సీటులో కూర్చుని ప్రయాణిస్తున్నారు. నేరుగా కూర్చున్న స్థితిలో కాకుండా వెనక్కు వాలి పడుకున్నారు. సీట్ ఈ స్థితిలో ఉన్నప్పుడు ప్రమాదం జరిగినా... సీటులో ఉన్న వారు ముందుకు రావడంతో ఏర్పడే ఫోర్స్ సీట్ బెల్ట్ బకెల్ ఊడిపోయే స్థాయిలో ఉండదని చెప్తున్నారు. లాస్య సీట్‌బెల్ట్ సరిగ్గా ధరించి ఉంటే... అన్ని గాయాలకు ఆస్కారం లేదని చెప్తున్నారు. దీన్ని బట్టి అలారం బజర్ రాకుండా ఆమె సీటు బెల్ట్‌ను ముందే పెట్టేసి దాన్ని ఆనుకుని కూర్చుని ఉండొచ్చని, ఫలితంగా సీట్ వెనక్కు వాలినప్పుడు ఆ బెల్ట్ ఆమె ఛాతీ భాగంలో కాకుండా వీపు భాగంలో ఉండి ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. సీట్ బెల్టులు సరిగ్గా పెట్టుకోకుంటే.. ఇటీవల కాలంలో మార్కెట్లోకి వస్తున్న దాదాపు అన్ని కార్లలో ఎయిర్‌బ్యాగ్ తప్పనిసరి అయింది. కొన్ని వాహనాల్లో దీనికి సీట్ బెల్ట్‌కు మధ్య లింకు ఉంటోంది. వాహనం ప్రమాదానికి గురైనప్పుడు అవి తెరుచుకోవాలంటే దానికి సంబంధించిన సెన్సర్లు యాక్టివేట్ కావాలి. ఇవి ఏసీయూకు (ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్) అనుసంధానించి ఉంటాయి. యాక్సిలో మీటర్ సెన్సర్ (యాక్సిలో మీటర్ స్పందన ఆధారంగా యాక్టివేట్ అయ్యేవి), ఇంపాక్ట్ సెన్సర్ (ఢీకొన్నప్పుడు యాక్టివేట్ అయ్యేవి), సైడ్ రోడ్ ప్రెజర్ సెన్సర్స్ (పక్క తలుపులపై పడే ఒత్తిడి ఆధారంగా యాక్టివేట్ అయ్యేవి), వీల్ స్పీడ్ సెన్సర్స్ (చక్రం స్పీడ్ ఆధారంగా పని చేసేవి), బ్రేక్ ప్రెజర్ సెన్సర్స్ (బ్రేక్ కొట్టిన తీరు ఆధారంగా యాక్టివేట్ అయ్యేవి) కార్లకు ఉంటాయి. కొన్ని మోడల్స్‌లో ఇవన్నీ ఉండగా, మరికొన్నింటిలో కొన్ని మాత్రమే ఉంటాయి. ప్రమాదం జరిగినప్పుడు ఒత్తిడి కారణంగా ఇవన్నీ యాక్టివేట్ అయి ఓ యాంగిల్ ఏర్పరుచుకుని ఏసీయూకు సందేశం ఇవ్వడంతో అది బెలూన్ను యాక్టివేట్ చేసి తెరుచుకునేలా చేస్తుంది. ఈ ప్రక్రియ సెకనులోపు సమయంలోనే జరుగుతుంది. సీటు బెల్టులు పెట్టుకోకపోతే కొన్ని వాహనాల్లో ఎయిర్ బ్యాగ్స్ యాక్టివేట్ కావు. మితిమీరిన వేగంలో ఎయిర్‌బ్యాగ్స్ పనిచేయలేవు హైఎండ్ కార్లు అయినప్పటికీ... అనేక సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నప్పటికీ కొన్ని ప్రమాదాల నుంచి ఎయిర్‌బ్యాగ్స్ సైతం కాపాడలేవు. మితిమీరిన వేగమే దానికి కారణం. కొన్ని ప్రమాదాల్లో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పటికీ అవి డ్రైవింగ్ చేస్తున్న, పక్కన కూర్చున్న వారి ప్రాణాలను కాపాడలేవు. యాక్సిడెంట్ జరిగినప్పుడు సెన్సర్లు యాక్టివేట్ అయి, ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ కావడానికి కొంత సమయం పడుతుంది. సాధారణంగా ఇది 0.05 సెకన్‌గా ఉంటుంది. వాహనం మితిమీరిన వేగంతో ఉన్నప్పుడు ఈ సమయంలోపే డ్రైవర్, ప్రయాణికులు స్టీరింగ్, డాష్‌బోర్డ్, ముందు సీటు, పక్కడోర్లకు బలంగా ఢీ కొట్టుకుంటారు. రోడ్డు ప్రమాదంతో వాహనం ఛిద్రమైపోయిన సందర్భాల్లోనూ ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకున్నా ఉపయోగం ఉండదని నిపుణులు చెప్తున్నారు. -
బండి మాకొద్దు బాబోయ్..!
నిబంధనలు ఉల్లంఘించి జరిమానాకు గురవుతున్న వాహనదారులు తమ వాహనాలను స్టేషన్లలోనే వదిలేస్తున్నారు. ఫైన్లు పెద్దమొత్తంలో ఉండడంతో వాటిని చెల్లించలేక సతమతం అవుతున్నారు. దీంతో సీజ్ చేసిన వాహనాలతో రాజధాని చైన్నెలోని పోలీస్ స్టేషన్లు నిండిపోతున్నాయి. సాక్షి, చైన్నె: రాష్ట్రంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే వారికి, మద్యం మత్తులో వాహనం నడిపి పట్టుబడ్డ వారికి పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. పెద్దమొత్తంలో ఫైన్లు విధిస్తున్నారు. దీంతో జరిమానాలు చెల్లించలేక తమ వాహనాలను వదులు కోవాల్సిన పరిస్థితి నెలకొంది. గత ఏడాదిన్నర కాలంలో 50 వేల వాహనాలు పోలీసు స్టేషన్లకు పరిమితమై తుప్పు బడుతుండడం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందులో 371 వాహనాలను వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు. ట్రాఫిక్ పోలీసుల దూకుడు.. చైన్నెతో పాటు ఇతర నగరాల్లో ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించే వారి సంఖ్య ఎక్కువే. ఇలాంటి వారి భరతం పట్టే రీతిలో ట్రాఫిక్ పోలీసులు దూకుడుగానే ముందుకు సాగుతున్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడిపే వారు కొందరు అయితే, ట్రిబుల్ రైటింగ్‌తో దూసుకెళ్లే ద్విచక్ర వాహన చోదకులు మరికొందరు. సిగ్నల్స్‌లో నిబంధనల్ని అనుసరించకుండా దూసుకెళ్లే కుర్ర కారు కూడా ఎక్కువే. వీరితోపాటు రాత్రుల్లో మద్యం తాగి వాహనం నడిపే వారికీ పోలీసులు జరిమానాల మోత మోగిస్తున్నారు. తాజాగా మోటార్ వెహికల్ చట్టం అమల్లోకి రావడంతో జరిమానాల వడ్డనే కాదు, నిబంధనలూ మరింత కఠినతరం అయ్యాయి. గత ఏడాదిన్నర కాలంగా చైన్నెలోనే కాదు రాష్ట్రంలోని అనేక నగరాలు, పట్టణాలలో ట్రాఫిక్ నిబంధనల్ని పాటించకుండా ముందుకు సాగే వారి భరతం పట్టే విధంగా పోలీసులు ముందుకెళ్తున్నారు. జరిమానాలు చెల్లించలేక.. ట్రాఫిక్ నిబంధనల్ని పదే పదే ఉల్లంఘించడం, ప్రమాదాలకు కారకులుగా ఉండే వాహన చోదకులు, మందు బాంబులకు రూ. 1000 నుంచి రూ. 10 వేల వరకు జరిమానా విధిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికత ఆధారంగా ఈ చెలాన్లపై అధిక దృష్టి పెడుతున్నారు. వాహనాలను సీజ్ చేయడం, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లు లేదా కోర్టుల్లో వాటి యజమానులు జరిమానా చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ పోలీసులే కాదు, నేర విభాగం పోలీసులు సైతం జరిమానాల వడ్డనలో బిజీగానే ఉన్నారు. దీంతో ద్విచక్ర వాహనదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ జరిమానాలు చెల్లించ లేక అనేక మంది తమ వాహనాలను వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అధిక వేగం, మద్యం మత్తులో వాహనాలు నడిపే వారికి రూ. 10 వేలు జరిమానా విధిస్తుండడంతో వాటిని చెల్లించే పరిస్థితి లేక వాహనాలను పోలీసు స్టేషన్ల వద్దే వదలి పెట్టి వెళ్తున్నారు. పోలీసులు తమను పట్టుకున్న చోటే వాహనం వదిలి ఉడాయించే వారూ ఉన్నారు. ఇక, రూ. 10 వేలు కూడా విలువ చేయని తమ వాహనానికి ఎందుకు అంత భారీస్థాయిలో జరిమానా కట్టాలన్నట్లు.. వాహనం మీరే ఉంచుకోండి అంటూ కరాఖండిగా చెప్పేస్తున్నారు. తుప్పు పడుతున్న వాహనాలు గత ఏడాదిన్నర కాలంలో 50 వేల వాహనాలకు చెందిన యజమానులు జరిమానా చెల్లించక పోవడంతో ఆ వాహనాలన్నీ పోలీసు స్టేషన్ల బయట, పోలీసులకు సంబంధించిన ఖాళీ ప్రదేశాల్లో పార్క్ చేస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ. 43 కోట్ల వరకు జరిమానా విధించారు. ఇందులో రూ. 16 కోట్లు మాత్రమే వసూళ్లైంది. జరిమానా చెల్లించిన వారి వాహనాలను తిరిగి అప్పగిస్తున్నారు. చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న మిగిలిన వారి వాహనాలు పోలీస్ స్టేషన్ల సమీపంలో రోడ్ల మీద తప్పుబట్టే విధంగా పడి ఉన్నాయి. ఇందులో అత్యధికంగా మద్యం తాగి వాహనాలు నడిపిన వాళ్లే ఉన్నట్టు పరిశీలనలో తేలింది. ఇక సీజ్ చేసిన వాటిలో 371 వాహనాలను వేలం వేయాలని చైన్నెలోని పోలీసు అధికారులు తాజాగా నిర్ణయించారు. -
ఇలా కూడా బరువు తగ్గొచ్చా! విమానంలో వెళ్లాలని..
చాలామంది బరువు తగ్గడానికి రకరకాల డైట్లు ఫాలో అవుతారు. కొన్ని రోజులు ఏదో సీరియస్‌గా చేసి వదిలేస్తాం. మరికొందరూ బరువు తగ్గడం కోసం డైట్ మార్చుకుని మరీ ఇష్టమైన ఫ్యాటీ ఆహార పదార్థాలను కూడా త్యాగం చేస్తారు. బరువు తగ్గడానికి ఇవి కాదు ముఖ్యం అంటున్నాడు ఇక్కడొక వ్యక్తి. కేవలం సీరియస్‌నెస్, నిబద్ధత అనేవి ఉంటే ఎవ్వరైన అవలీలగా కిలోలకిలోలకు తగ్గిపోవచ్చని నిరూపించాడు సదరు వ్యక్తి. అందుకు సంబంధించిన విషయం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. డేవ్ ఎదన్నా అనే ట్విట్టర్ వినియోగదారుడు అధిక బరువుతో బాధపడుతున్నాడు. డైట్ చేసినా తగ్గుతాడని అనుకోలేం అంత హెవీగా ఉంది శరీరం. ఆ శరీరమే అతన్ని విమానంలో ప్రయాణించేందుకు ఇబ్బందిపెట్టింది. అంత భారీకాయంతో విమానంలోని సీటులో కూర్చొ లేక సీటు బెల్ట్ పట్టక నానా ఇబ్బందులు పడ్డాడు. ఇక జీవితంలో విమానంలో ప్రయాణించడం కలేనేమో అనేంత భయం వేసింది డేవ్‌కి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బరువు తగ్గడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎలాగైన బరువు తగ్గి విమానంలో వెళ్లాలి అదే అతని జీవిత ధ్యేయం అన్నంతగా అంకితభావంతో కష్టపడ్డాడు. ఏకంగా 10 నెలల్లో సుమారు 45 కేజీల బరువు తగ్గి ఔరా! అనిపించుకున్నాడు. ఈ మేరకు డేవ్ ట్విట్టర్ వేదికగా తాను బరువుగా ఉన్నప్పుడూ ఫోటోలు, తగ్గాక ఫోటోలు షేర్ చేస్తూ..నేను ఇప్పుడూ ఎగరగలను ఏమైనా చేయగలను అంటూ క్యాప్షన్ పెట్టి మరీ పోస్ట్ చేశాడు. అందుకు సంబంధిదంచిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండటంతో నెజిజన్లు నువ్వు గ్రేట్ స్వామి అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. ఏదీఏమైన మన చేయాలి అని బలంగా అనుకోవడం మాత్రమే గాదు ఆచరణ కూడా ఉంటే..సాధ్యం కానిది ఏది ఉండదని నిరూపించాడు డేవ్. A victory. A concern. Not an easy picture to post. Victory: after losing 100lb I can fly & I don't need a seatbelt extender. Concern: I'm starting to get some loose skin & my stomach is starting to hang, with another 100lb of weight loss I think it could get much worse. pic.twitter.com/yuCzUE8NKV I'm just trying to not be so fat y'all 🙏 pic.twitter.com/lMe4F39aj6 — Dave Danna (@DaveEDanna) May 18, 2023 A victory. A concern. Not an easy picture to post. Victory: after losing 100lb I can fly & I don't need a seatbelt extender. Concern: I'm starting to get some loose skin & my stomach is starting to hang, with another 100lb of weight loss I think it could get much worse. pic.twitter.com/yuCzUE8NKV — Dave Danna (@DaveEDanna) May 18, 2023 (చదవండి: ఆ దేశంతో మామూలు సంబంధాలు కావాలి..కానీ ఆ విషయంలో మాత్రం..: మోదీ) -
బండెక్కితే భయమే! రాష్ట్రంలో రోజూ 20 మంది మృతి.. టాప్ 10లో తెలంగాణ
సాక్షి ప్రత్యేక ప్రతినిధి : రోడ్డెక్కగానే బండిని రయ్‌మంటూ పరుగెత్తిస్తారు.. జన సంచారం ఉండని హైవేలపై అయితే వాయు వేగంతో పోటీ పడతారు.. ఇలా దూసుకుపోతే ఆ కిక్కే వేరనుకుంటారు.. దీనికోసం ట్రాఫిక్ నిబంధనలనూ బేఖాతరు చేస్తారు.. ఇందులో కిక్కు ఎంత వస్తుందో వారికే తెలుసుగానీ.. ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోవడం మాత్రం పెరిగిపోతోంది. రహదారులపై బ్లాక్ స్పాట్లు, వాహన వేగ నియంత్రణలో వైఫల్యం, హెల్మెట్, సీటుబెల్టు పెట్టుకోవడంలో నిర్లక్ష్యం వంటివి వేలకొద్దీ మరణాలకు కారణమవుతున్నాయి. కరోనా అనంతరం వ్యక్తిగత వాహనాల వినియోగం బాగా పెరిగింది. దీనితో రోడ్లపై ట్రాఫిక్ రద్దీ ఎక్కువై ప్రమాదాలు– మరణాల శాతం పెరగడానికి దారితీస్తోందని నిపుణులు చెప్తున్నారు. ప్రమాద మృతుల్లో 35ఏళ్ల లోపు వారే 46.3శాతం ఉంటుండటంపై ఆందోళన కరమని పేర్కొంటున్నారు. 2021 సంవత్సరానికిసంబంధించి కేంద్ర రవాణాశాఖ ఇటీవలి పార్లమెంటు సమావేశాల్లో వెల్లడించిన గణాంకాలు ఈ పరిస్థితిని స్పష్టంగా చూపుతున్నాయి. అతి వేగమే.. చంపేస్తోంది ♦ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారిలో 18–35 ఏళ్లలోపు వారే అత్యధికంగా (46.3శాతం) ఉన్నారు. ఇందులోనూ 45.1శాతం టూవీలర్స్‌పై, 12.9 శాతం కార్లలో ప్రయాణిస్తున్నవారుకాగా.. 18.9శాతం మంది పాదచారులు. ♦ 71.7శాతం ప్రమాదాలు అతివేగంతో డ్రైవర్ వైఫల్యం వల్లే చోటు చేసుకున్నాయి. ఇందులో 31శాతం కొత్త వాహనాలు (5 ఏళ్లలోపువే) నడిపేవారే చేశారు. 9.5 శాతం మంది మద్యం–సెల్‌ఫోన్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదాల బారినపడ్డారు. ♦ ప్రమాదాలు చేసిన వారిలో ఏడు శాతం మందికి లైసెన్స్‌లు కూడా లేకపోవడం గమనార్హం. ♦ నేషనల్ హైవేలపైనే అత్యధిక ప్రమాదాలు–మరణాలు చోటు చేసుకున్నాయి. 2021లో 1,28,825 (31.6శాతం) ప్రమాదాలు, 56,007 మరణాలు హైవేలపైనే నమోదయ్యాయి. ఆ ఏడాది తెలంగాణలోని హైవేల 2,735 మంది చనిపోయారు. ♦ 10 లక్షలు జనాభా దాటిన నగరాల్లో రోడ్డు ప్రమాదాల విషయంలో చెన్నై, ఢిల్లీ, జబల్పూర్లో తొలి మూడు స్థానాల్లో ఉండగా.. హైదరాబాద్ 8వ ప్లేస్‌లో ఉంది. మహానగరాల్లో జరుగుతున్న ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో 25 శాతం మంది పాదచారులే. హైవేలపై లోపాలు సరిదిద్దక.. తెలంగాణ మీదుగా వెళుతున్న ప్రధాన హైవేలపై లోపాలను సరిదిద్దే అంశం వేగంగా ముందుకు కదలటం లేదు. అత్యధిక ప్రమాదాలు జరిగే హైవే–65 (మచిలీపట్నం– హైదరాబాద్– పుణే), హైవే–44 (కన్యాకుమారి–కశ్మీర్), హైవే–563 (భూపాలపట్నం–హైదరాబాద్)లపై పలుచోట్ల ఇంజనీరింగ్ లోపాలను గతంలోనే గుర్తించారు. వాటితో ప్రమాదాలు జరుగుతున్నట్టూ తేల్చారు. కానీ వాటిని సరిదిద్దే విషయంలో జాప్యం జరుగుతోంది. ముఖ్యంగా హైవే–65పై కోదాడ, మునగాల, కట్టంగూర్, చిట్యాల, చౌటుప్పల్ ప్రాంతాల్లో అండర్‌వేలు నిర్మించాల్సి ఉంది. మూడేళ్లుగా టెండర్ల ప్రక్రియే పూర్తికాలేదు. హైవే–44లోనూ నిర్మల్, కామారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో ఇంజనీరింగ్ లోపాలు అలానే ఉన్నాయి. ఇప్పుడేం చేయాలి? తెలంగాణలో ప్రమాదాల నియంత్రణ దిశగా నూతన మోటార్ వెహికల్ యాక్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బ్లాక్ స్పాట్స్‌లో లోపాలను సరిచేయడం, సైన్‌బోర్డులు, ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ను పెంచటం, ప్రమాద బాధితులకు సత్వర వైద్యం అందే చర్యలు తీసుకోవడం అవసరమని స్పష్టం చేస్తున్నారు. మితిమీరిన వేగంతో ప్రయాణించకుండా తగిన అవగాహన కల్పించాలని పేర్కొంటున్నారు. ప్రమాదాల్లో యూఎస్.. మరణాల్లో భారత్.. వరల్డ్ రోడ్ స్టాటిస్టిక్స్–2020 నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో 19,27,654 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో సంభవించిన మరణాల సంఖ్య (36,650)లో మూడో స్థానంలో నిలిచింది. భారత్ 4,12,432 ప్రమాదాలతో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉండగా.. 1,53,972 మృతులతో మరణాల సంఖ్యలో మాత్రం టాప్‌లో నిలిచింది. అమ్మానాన్నను రోడ్డు మింగింది గత ఏడాది డిసెంబర్ 11న సూర్యాపేట జిల్లా అనంతగిరి నుంచి ఖమ్మం జిల్లా జల్లేపల్లికి వెళ్తున్న ఆటోను బస్సు ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో రమేష్–రేణుక దంపతులు మృతిచెందడంతో.. వారి పిల్లలు కార్తీక్, హాసిని అనాథలుగా మారిపోయారు. -
సీట్ బెల్ట్ వివాదం.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు జరిమానా
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్‌కు అక్కడి పోలీసులు జరిమానా విధించారు. కారులో సీట్ బెల్ట్ ధరించకుండా ప్రయాణించినందుకు 100 పౌండ్ల ఫైన్ విధించినట్లు లంకాషైర్ పోలీసులు తెలిపారు. కాగా కారులో ప్రయాణిస్తున్న రిషి సునాక్ ఓ ప్రచార కార్యక్రమం కోసం సీటు బెల్టు తొలగించి వీడియో చిత్రీకరించిన విషయం తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వివాదం రాజుకుంది. ప్రధాని అయ్యి ఉండి నిబంధనలు ఉల్లంఘించారంటూ రిషిసునాక్పై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రిషి సునాక్ బ్రిటన్ ప్రజలకు క్షమాపణలు తెలియజేశారు. సీటుబెల్ట్ ధరించకుండా ప్రయాణించడం తప్పేనని ఒప్పుకున్నారు. ప్రతి ఒక్కరూ సీటు బెల్ట్ ధరించాలని కోరారు. అయితే యూకే చట్టాల ప్రకారం బ్రిటన్‌లో కారులో ప్రయాణించే సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సీటు బెల్టు ధరించాల్సి ఉంటుంది. అత్యవసర వైద్యం పొందాల్సిన వ్యక్తి మినహా ప్రతీఒక్కరూ సీటు బెల్టు ధరించాల్సిందే. లేదంటూ డ్రైవర్లు, ప్రయాణీకులకు భారీగా జరిమానా విధిస్తారు. సీట్ బెల్ట్ పెట్టుకోకుండే అక్కడికక్కడే 100 పౌండ్లు జరిమానా చెల్లించాలి. వ్యవహారం కోర్టుకు చేరితే 500 పౌండ్ల వరకు జరిమానా పెరిగే అవకాశం ఉంటుంది. చదవండి: గోడపై మూత్రం పోస్తే చింది మీదనే పడుతుంది Apologies for not wearing a seatbelt, but I thought that rule only applied to other people and not to us. You know, like all the other rules.#LevellingUpFundpic.twitter.com/ZzFmiHcgFL — Parody Rishi Sunak (@Parody_PM) January 19, 2023 -
బ్రిటన్ ప్రజలకు క్షమాపణలు చెప్పిన రిషి సునాక్
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. తాను చేసింది తప్పే అని ఒప్పుకున్నారు. కారులో ప్రయాణిస్తూ సీటు బెల్టు ధరించనందుకు తీవ్ర విమర్శలు రావడంతో ఆయన ఈమేరకు స్పందించారు. రిషి అధికార ప్రధినిధి జేమీ డేవిస్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఓ ప్రచార కార్యక్రమం కోసం వీడియో చిత్రీకరిస్తుండగా రిషి సునాక్ కారులో వెనకాల కూర్చొని మాట్లాడారు. ఈ సమయంలో ఆయన సీటు బెల్టు ధరించలేదు. దీంతో నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ప్రధాని అయి ఉండి రూల్స్ పాటించకపోవడంపై నెటిజన్లు మండిపడ్డారు. దీంతో రిషి తన తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పారు. గతంలో కరోనా ఆంక్షల సమయంలో కూడా రిషి నిబంధనలు అతిక్రమించారు. పోలీసులు అందుకు జరిమానా కూడా విధించారు. అప్పుడు కూడా ప్రజల ఆగ్రహానికి గురై విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మరోమారు ఇరకాటంలో పడ్డారు. దీన్నే అవకాశంగా తీసుకున్న ప్రతిపక్ష లేబర్ పార్టీ రిషిపై విమర్శలతో విరుచుకుపడింది. గతంలో ఓసారి ఆయన కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డును ఉపయోగించేందుకు ఇబ్బంది పడిన విషయాన్ని గుర్తు చేసింది. 'రిషి సునాక్‌కు సీటు బెల్టు పెట్టుకోవడం రాదు. డెబిట్ కార్డు ఉపయోగించడం రాదు. రైలు సేవలు, దేశ ఆర్థిక వ్యవస్థ గురించి కూడా తెలియదు' అని లేబర్ పార్టీ ఎద్దేవా చేసింది. చదవండి: బాప్రే!..పాత సామాన్లు అమ్ముకున్న ఎలాన్ మస్క్, ఏ వస్తువు ఎంత ధర పలికిందంటే -
Rear Seat Belt: ‘కారు సీటు బెల్ట్’పై తర్జనభర్జన!
సాక్షి, హైదరాబాద్: కారు ప్రయాణంలో సీటు బెల్ట్ పెట్టుకోకపోవటంతో జరిగే ప్రమాదాలను నివారించేందుకు కేంద్రం వాహన చట్టం నిబంధనలను మరింత కఠినతరం చేసింది. కారు నడిపే డ్రైవర్ మాత్రమే కాదు వెనకాల కూర్చున్న వ్యక్తులూ సీటు బెల్ట్ పెట్టుకోవాల్సిందేనని, లేకపోతే మోటారు వాహన చట్టం సెక్షన్ 194 బీ ప్రకారం రూ.1,000 జరిమానా విధించాలని నిర్ణయించింది. 8 సీట్ల లో పు ఉన్న అన్ని ప్యాసింజర్ వాహనాలకు ఈ చ ట్టం వర్తిస్తుంది. అయితే ఈ నిర్ణయం అమలులో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు కలుగుతాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. దీంతో ఆయా నిబంధనల అమలుపై అధికారులు పునరాలోచనలో పడినట్లు తెలిసింది. విజన్ ఉండదు.. బైక్ రైడర్‌కి హెల్మెట్, కారు నడిపేవారికి సీటు బెల్ట్ రక్షణ కల్పిస్తుంది. కానీ, కారులో డ్రైవర్ మినహా ముందు, వెనక కూర్చున్న వారు సీటు బెల్ట్‌ను పెట్టుకోవటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. పోలీసులు కూడా బెల్ట్ పెట్టుకోని డ్రైవర్‌ను మాత్రమే గుర్తించి జరిమానా విధించేవారు. కారు ప్రమాదంలో వెనకాల వ్యక్తులకూ ప్రాణ నష్టం వాటిల్లుతుండటంతో కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అ యితే ఈ నిబంధన అమలు సాంకేతికంగా ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతోంది. రోడ్డు మీద జంక్షన్లో ఉన్న కానిస్టేబుల్‌కు వేగం కారణంగా వాహనాల లోపల వ్యక్తులు స్పష్టంగా కనిపించరు. నిరిష్టంగా వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తే తప్ప వెనకాల వ్యక్తి సీటు బెల్టు పెట్టుకున్నాడో లేదో తెలియదు. పోనీ ప్రయాణంలో ఉన్న కారును రోడ్డు మీద ఆపి తనిఖీ చేస్తే ట్రాఫిక్ జాం అయ్యే ప్రమాదం ఉంది. ఇతర వాహనదారులకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని పలువురు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించారు. ఇలా చేస్తే బెటర్.. దీంతో ఈ నిబంధనను అమలు చేసేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించారు. ఇతర ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణ సమయంలో కారును ఆపినప్పుడు వెనకాల వ్యక్తి సీటు బెల్టు పెట్టుకున్నాడో లేదా గమనించి, ఒకవేళ పెట్టుకోకుంటే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. దీనికంటే ముందు సీటు బెల్ట్ ప్రాధాన్యతపై వాహనదారులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. సీటు బెల్ట్ పెట్టుకోకపోవటం వల్ల జరిగే ప్రమాదాలను వివరిస్తూ ప్రత్యేక అవగాహన ఆల్బమ్‌ను రూపొందిస్తున్నారు. ట్రాఫిక్ జంక్షన్ల వద్ద అవగాహన కల్పించనున్నారు. డ్రైవ్ చేసే వారితో పాటు కారులోని మిగతా వారికీ ప్రమాదాల గురించి వివరించనున్నారు. కరపత్రాలు, డిజిటల్ సూచికలతో ప్రచారం చేసేలా ప్లాన్ చేశారు. -
కారులో ముందు కూర్చున్నా, వెనకాల కూర్చున్నా అది తప్పనిసరి
ముంబై: ఇకపై కారులో ప్రయాణించే వారందరు కచ్చితంగా సీటు బెల్టు పెట్టుకోవాల్సిందేనని ముంబై పోలీసులు స్పష్టం చేశారు. నవంబర్ 1 నుంచి కొత్త రూల్ అమల్లోకి వస్తుందని చెప్పారు. ఈ నిబంధనను పాటించని వారికి మోటారు వాహనాల చట్టం-2019 ప్రకారం శిక్ష విధిస్తామని హెచ్చరించారు. కారులో ముందు కూర్చున్నా, వెనకాల కూర్చున్నా సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలన్నారు. ఒకవేళ కార్లలో ప్రయాణికులందరికీ సరిపడా సీటు బెల్టులు లేకపోతే యజమానులు తక్షణమే వాటిని ఏర్పాటు చేసుకోవాలని ముంబై పోలీసులు సూచించారు. కార్లలో ప్రయాణికులందరికీ సీటు బెల్టు తప్పనిసరి అని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గత నెలలోనే ప్రకటించారు. దిగ్గజ వ్యాపారవేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన అనంతరం ఈ ప్రకటన చేశారు. కార్లలో సీటు బెల్టు నిబంధన, ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో లోపాల వల్లే సైరస్ మిస్త్రీ ప్రాణాలు కోల్పోయారని విమర్శలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం వెంటనే ఈ నిర్ణయం తీసుకుంది. చదవండి: హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ -
బాలకిష్న ముక్యమంత్రి అయితడు.. పాదయాత్రలు మనకెంద్కు బిడ్డా
యాల పొద్దుగాల. తుప్పర్లు బడ్తున్నయి. విజయవాడ కండ్లు దెరుస్తున్నది. సీపురు కట్ట బట్కోని సపాయోల్లు తొవ్వలు ఊక్తున్నరు. పాలపాకెట్లు అమ్మెటోల్లు పాలపాకిట్లు అమ్ముతున్నరు. బాసండ్లు తోమెతంద్కు పనిమన్సులు బోతున్నరు. వేరె గల్లి కెల్లి వొచ్చిన కుక్కను జూసి గల్లి కుక్కలు మొర్గుతున్నయి. కొంతమంది లీడర్లు సుత గప్పుడే నిద్ర లేసిండ్రు. మోటర్ల ఎన్క గూసున్నోల్లు గూడ సీటు బెల్టు బెట్టు కోవాలని జెప్తున్నరు. మంత్రి కుర్సికి ఆకర్కి ముక్యమంత్రి కుర్సికి గుడ్క సీటు బెల్టు బెట్టుకుంటె మంచిగుంటదని లీడర్లు అన్కుంటున్నరు. గట్ల జేస్తె సచ్చెదాంక కుర్సిమీద గూసుండొచ్చు. ఎలచ్చన్లు, గిలచ్చన్లు లేకుండబోతె మజా చెయ్యొచ్చని గాల్లు జెప్తున్నరు. తొమ్మిది గొట్టింది. తుప్పర్లు బందైనయి. మబ్బుల సాటుకెల్లి సూర్యుడెల్లిండు. పల్చటి ఎండ గొట్టబట్టింది. టీడీపీ లీడర్ యనమల రామకిష్నుడు కాఫి దాగిండు. ఆరాం కుర్సిల గూసోని పేపర్ సద్వబట్టిండు. ఏం కొంప మున్గిందేమొగని ఒక విలేకరి గాయిన తాన్కి బోయిండు. ‘నమస్తే సార్’ అని అన్నడు. ‘నమస్తే. ఏందివయా యాల పొద్దుగాలే వొచ్చినవ్’ అని యనమల అడిగిండు. ‘బల్క్ డ్రగ్ పార్క్ మా రాస్ట్రంల బెట్టుండ్రి అంటె మా రాస్ట్రంల బెట్టుండ్రనుకుంట పదిహేడు రాస్ట్రాలు దర్కాస్తు బెడ్తె మూడు రాస్ట్రాలల్ల బెట్టెతంద్కు పర్మిషన్ ఇచ్చిండ్రు. గా మూడు రాస్ట్రాలల్ల మన ఆంద్రప్రదేశ్ గూడ ఉన్నది గదా’. ‘అవ్ ఉన్నది’. ‘మన రాస్ట్రంల బల్క్ డ్రగ్ పార్క్ బెట్టొద్దని సంటర్కు కారటెందుకేసిండ్రు’. ‘గదిగిన బెడ్తె కాకినాడ కాడ రైతుల బత్కులే గాకుంట బెస్తోల్ల బత్కులు బండలైతయి. గాలి, నీల్లు కరాబైతయి’. ‘గవి కరాబ్ గాకుంట ట్రీట్మెంట్ ప్లాంట్ బెడ్తరు. గది బెడ్తెనే బల్క్ డ్రగ్ పార్క్‌కు పర్మిషనిస్తరు. గా పార్క్ తోని ఇర్వై వేల మందికి కొల్వులు దొరుక్తయి. గంతేగాకుంట గాదాంట్ల రోగాలు తక్వజేసేటి మందులు తయారు జేస్తరు’. ‘అన్ని రోగాలు తక్వ జేసేటి మందుండంగ గా మందుల్తోని పనేమున్నది. మందుగొడ్తె ముసలోడు గుడ్క మైకేల్ జాక్సన్ లెక్క డాన్సు జేస్తడు. కీసల పైసలేనోడు గూడ అమరావతి బూములు గొంటనంటడు. ఏబీసీడీలు రానోడు సుత అంగ్రేజిల మాడ్లాడ్తడు. మొన్నటిదాంక మా అయ్యన్న పాత్రున్కి విశాక డిస్టిలరి ఉండె. మా వియ్యంకునికి పి.ఎం.కె. డిస్టిలరి ఉన్నది. ఆదికేశవులు నాయుడికి శ్రీకిష్న డిస్టిలరి ఉన్నది. గివన్ని మా చెంద్రబాబు జమానకెల్లే నడుస్తున్నయి. గివన్ని ఉండంగ వేరె బల్క్ డ్రగ్ పార్క్ ఎందుకు? బ్రాంది తాగినోడు బ్రహ్మలోకమున కేగు విస్కిగొట్టినోడు విష్ణువు చెంత జేరు ఏమి తాగనోడు ఎడ్డోడు చెడ్డోడు మందు భాగ్యశీల మరి మాటలేల’ అని యనమల పద్దెం బాడిండు. ‘వహ్వా! వహ్వా! క్యా ఖూబ్’ అన్కుంట విలేకరి బోయిండు. ఒక దిక్కు గిట్లుంటె ఇంకో దిక్కు లోకేశ్, చెంద్రబాబు తాన్కి బోయిండు. ‘నాయినా! నాయినా!’ అని బిల్సిండు. ‘ఏం గావాలె బిడ్డా!’ అని చెంద్రబాబు అడిగిండు. ‘రాహుల్ గాంది బారత్ జోడో యాత్ర జేస్తుండే’. ‘గాయిన జేస్తె నీకేందిరా?’ ‘నేను గూడ ఏపీ జోడో యాత్ర జేస్తనే’. ‘నువ్వు జేసుడెందుకు?’ ‘రాహుల్ గాందిని అందరు పప్పు అంటరు. నన్ను గూడ పప్పనే అంటున్నరు. పెద్ద పప్పు పాదయాత్ర జేస్తుండంగ చిన్న పప్పు జెయ్యకుంటె ఏం బాగుంటదే’. ‘రాజకీయాలు ఎన్నడు నేర్సుకుంటవురా. చెట్టు మనది గాకున్నా పండ్లు మనమే దీస్కోవాలె. పంట మనం పండియ్యకున్నా పంటంత మనదే అనాలె’. ‘గదెట్లనే’. ‘వొచ్చెపారి బాలకిష్ననే ముక్యమంత్రి క్యాండేట్ అనాలె. మా కాక అన్కుంట జూనియర్ ఎన్టీఆర్ గాయిన దిక్కుకెల్లి ప్రచారం జేస్తడు. మల్లొక పారి టీడీపీ సర్కారొస్తది. బాలకిష్న ముక్యమంత్రి అయితడు’. (క్లిక్ చేయండి: గటు దిక్కు బోవద్దు గన్పతీ!) ‘మా మామ ముక్యమంత్రి అయితె నాకేం ఫాయిద?’ ‘పిల్లనిచ్చిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు బొడ్సి నేను ముక్యమంత్రిని గాలేదా? నా తీర్గనే పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు బొడ్సి నువ్వు ముక్యమంత్రివి గావొచ్చు. షార్ట్‌కట్ ఉండంగ పాదయాత్రలు, గీదయాత్రలు మనకెంద్కు బిడ్డా’ అని చెంద్రబాబు అన్నడు. దాంతోని లోకేశ్ బోది చెట్టు కింది బుద్దుడయ్యిండు. - వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడడంలో ‘సీటు బెల్టు’ కీలక పాత్ర
మితిమీరిన వేగం.. సీటు బెల్టు ధరించడంలో నిర్లక్ష్యం.. ఇవీ స్థూలంగా కార్ల వంటి తేలికపాటి వాహన ప్రమాదాల్లో సంభవిస్తున్న మరణాలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. వ్యాపార దిగ్గజం, టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ కారు వెనుక సీట్లో కూర్చున్నప్పటికీ సీటు బెల్టు ధరించకపోవడం వల్లే ఆయన దుర్మరణం చెందారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీటు బెల్టు వాడకం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాద సమయంలో సీటు బెల్టు పనితీరు, సీటు బెల్టు–ఎయిర్‌బ్యాగ్‌ల అనుసంధానం, ఒక్కోసారి సీటుబెల్టు పెట్టుకున్నా ప్రమాదాల్లో మృతిచెందేందుకు ఉన్న అవకాశాల వంటి వాటిపై కథనం. సాక్షి, హైదరాబాద్: మోటారు వాహన చట్ట నిబంధనల ప్రకారం ద్విచక్రవాహనదారులు హెల్మెట్లు.. కార్ల వంటి ఇతర వాహనదారులు సీటు బెల్ట్ ధరించడం తప్పనిసరి. కానీ దేశంలో ఎక్కడా ఈ నిబంధనలు పూర్తిస్థాయిలో అమలు కావట్లేదు. నగరాల్లో ప్రయాణిస్తున్నప్పుడు వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల జరిమానాలకు భయపడి సీటు బెల్ట్‌లు ధరిస్తున్నా హైవేలపై ప్రయాణాల్లో మాత్రం చాలా మంది సీటు బెల్ట్‌లు పెట్టుకోవడంలేదు. కొన్ని సందర్భాల్లో డ్రైవింగ్ సీట్లో కూర్చొనే వారు మినహా మిగిలిన వారు వాటిని ఉపయోగించట్లేదు. ఫలితంగా ప్రమాదాలబారిన పడినప్పుడు ప్రాణాలు కోల్పోతున్నారు. సీటు బెల్ట్ ధరించకపోతే అలారం మోగేలా కార్ల తయారీ కంపెనీలు సాంకేతికతను అభివృద్ధి చేశాయి. దీన్ని తప్పించుకోవడానికి చాలా మంది సీట్ బెల్ట్ బకెల్ను దాని సాకెట్లో పెట్టి... బెల్ట్‌ను మాత్రం తమకు, సీటుకు మధ్య ఉంచుతున్నారు. దీని కోసం సీట్ బెల్ట్ అలారం స్టాపర్ బకెల్స్ను వినియోగిస్తున్నారు. వాటిని కార్ డెకార్స్ దుకాణాలు విక్రయిస్తున్నాయి. అయితే ఈ బకెల్స్ ద్వారా అలారం మోగకుండా ఆపినా ప్రమాదం జరగకుండా ఆపలేవని పోలీసులు చెబుతున్నారు. ప్రాణాలు నిలిపిన ‘బెల్ట్’... ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడు సహా నలుగురు ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రమాదానికి లోనైంది. ఆ సమయంలో కారు గంటకు 150 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోంది. ఈ ప్రమాదంలో సీటుబెల్ట్ పెట్టుకోని ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి మాత్రం సీటు బెల్ట్ పెట్టుకోవడంతో మృత్యుంజయుడు అయ్యాడు. బెల్ట్ వాడని ఫలితం.. వ్యాపార దిగ్గజం, టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మరో ముగ్గురితో కలసి 4న అహ్మదాబాద్–ముంబై హైవేపై వెళ్తుండగా మెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ హైఎండ్ కారు ప్రమాదానికి గురైంది. ముందున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో బ్రిడ్జి రెయిలింగ్‌ను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో సీటు బెల్టు ధరించిన ముందు సీట్లోని ఇద్దరు గాయాలతో బయటపడగా వెనుక సీట్లో కూర్చున్న మిస్త్రీ, మరొకరు సీటు బెల్టు ధరించకపోవడంతో మృతిచెందారు. సీటు బెల్ట్ ధరించకుంటే.. ► నిర్ణీత వేగంతో వెళ్తున్న కారులో ప్రయాణికులు స్థిరంగా కూర్చున్నప్పటికీ వాహనం దేన్నయినా గుద్దుకున్నా లేదా హఠాత్తుగా వేగాన్ని కోల్పోయినా అందులోని వారు అదే వేగంతో ముందుకు వెళ్తారు. ► ఫలితంగా వాళ్లు డ్యాష్ బోర్డ్స్ (ముందు సీట్లో వారు), ముందు సీట్లు (వెనుక కూర్చున్న వారు), ముందు సీట్ల మధ్యలో ఉన్న ఖాళీ నుంచి అద్దం తదితరాలను అత్యంత వేగంగా ఢీకొంటారు. ► ఒక్కోసారి వాహనం పల్టీలు కొడితే అద్దాల్లోంచి లేదా డోర్ ఊడిపోతే అందులోంచి బయటకు ఎగిరి పడతారు. ఫలితంగా తల, ముఖం తదితర చోట్ల తీవ్ర గాయాలై మరణిస్తుంటారు. సీటు బెల్ట్ ధరిస్తే.. ► సీటు బెల్ట్ ధరించి ప్రయాణిస్తుప్పుడు ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొన్నా లేదా కారు పల్టీలు కొట్టినా లేదా ఒక్కసారిగా బ్రేక్ వేయాల్సి వచ్చినా ప్రయాణికులు వాహనంలోంచి ఎగిరిపడిపోకుండా కాపాడుతుంది. ► ముఖ్యంగా ప్రయాణికులు డ్యాష్ బోర్డు లేదా ముందు సీట్లకు గుద్దుకోకుండా సీటు బెల్ట్ వ్యతిరేక శక్తిని ప్రయోగిస్తుంది. ► ఫలితంగా ప్రయాణికులు కేవలం గాయాలతో బయటపడేందుకు ఎక్కువ అవకాశం ఉంది. ► 2016 మే 17న ఏపీ మాజీ మంత్రి, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్ రెయిలింగ్‌ను ఢీకొని బోల్తా కొట్టిన ఘటనలో ఆయన సతీమణి, డ్రైవర్ అక్కడికక్కడే కన్నుమూశారు. సీటు బెల్ట్ పెట్టుకున్న వెంకటేశ్వరరావు ప్రాణాలతో బయటపడ్డారు. ఒక్కోసారి ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నా... అత్యాధునిక భద్రతా ప్రమాణాలు ఉండే హైఎండ్ కార్లు సైతం కొన్ని సందర్భాల్లో ప్రయాణికుల ప్రాణాలు కాపడలేవని నిపుణులు చెబుతున్నారు. మితిమీరిన వేగమే అందుకు కారణమని విశ్లేషిస్తున్నారు. కొన్ని ప్రమాదాల్లో ఎయిర్ బ్యాగ్స్ సెన్సర్లు యాక్టివేట్ అయి, తెరుచుకోవడానికి కొంత సమయం పడుతుందని.. సాధారణంగా ఇది 0.05 సెకన్లుగా ఉంటుందని పేర్కొంటున్నారు. వాహనం మితిమీరిన వేగంతో ఉన్నప్పుడు ఈ సమయంలోపే డ్రైవర్ స్టీరింగ్ వరకు, పక్క సీటులో ఉన్న వారు డాష్‌బోర్డ్ వరకు ప్రయాణించి బలంగా ఢీకొనడం జరిగిపోతుందని వివరిస్తున్నారు. స్పందించేందుకు సమయం... ప్రతి వాహనచోదకుడు వాహనంపై ప్రయాణిస్తున్న సమయంలో ఏవైనా ముప్పు కనిపించినప్పుడు స్పందించి బ్రేక్ వేయడానికో లేదా పక్కను తప్పించుకోవడానికో ప్రయత్నిస్తాడు. ఇందుకు కొంత సమయం పడుతుంది. దీన్నే సాంకేతికంగా రెస్పాన్స్ టైమ్ అంటారు. ఎదుట ఉన్న ముప్పును మెదడు గుర్తించి తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేయడానికి పట్టే సమయమింది. ఈ మధ్యలోనే వాహనం కొంత మేర ముందుకు ప్రయాణించేస్తుంది. ఎయిర్ బ్యాగ్ టెక్నాలజీలు అనేకం.. హైఎండ్ కార్లలో ఎయిర్ బ్యాగ్‌కు–సీట్ బెల్ట్‌కు మధ్య లింకు ఉంటోంది. వాహనం ప్రమాదానికి గురైనప్పుడు అవి తెరుచుకోవాలంటే దానికి సంబంధించిన సెన్సర్లు యాక్టివేట్ కావాలి. ఇవి ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్ (ఏసీయూ)కు అనుసంధానమై ఉంటాయి. ప్రమాదం జరిగినప్పుడు ఒత్తిడి కారణంగా ఇవన్నీ యాక్టివేట్ అయి ఓ యాంగిల్ ఏర్పరుచుకుని ఏసీయూకు సందేశం ఇవ్వడంతో అది బెలూన్ను యాక్టివేట్ చేసి తెరుచుకునేలా చేస్తుంది. ఈ ప్రక్రియ సెకనులోపు సమయంలోనే జరిగిపోతుంది. సీటు బెల్ట్‌లు పెట్టుకోకపోతే కొన్ని వాహనాల్లో ఎయిర్ బ్యాగ్స్ యాక్టివేట్ కావు. -
మితిమీరిన వేగం వల్లే... మిస్త్రీ మృతి
ముంబై: రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ (54) అంత్యక్రియలు మంగళవారం ముంబైలో జరగనున్నాయి. మృతదేహానికి సోమవారం అటాప్సీ పూర్తయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ డాక్టర్ అనాహిత పండోలే, ఆమె భర్త డేరియస్ పండోలే ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు ప్రయాణిస్తున్న బెంజ్ కారు ఆదివారం మధ్యాహ్నం ముంబైకి 120 కిలోమీటర్ల దూరంలో ప్రమాదానికి గురవడం తెలిసిందే. వెనక సీట్లో ఉన్న మిస్త్రీ, ఆయన మిత్రుడు జహంగీర్ పండోలే అక్కడికక్కడే మరణించారు. వాళ్లిద్దరూ సీటు బెల్టు పెట్టుకోలేదని పోలీసులు తెలిపారు. మితిమీరిన వేగం, మరో వాహనాన్ని రాంగ్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో కారు అదుపు తప్పడమే ప్రమాదానికి కారణమన్నారు. చరోటీ చెక్ పోస్టు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రమాద స్థలానికి కారు 9 నిమిషాల్లో చేరుకుందని వివరించారు. జర్మనీ నుంచి వచ్చిన బెంజ్ సంస్థ బృందం ఘటనా స్థలిని పరిశీలించింది. -
మిస్త్రీ కారు ప్రమాదం.. వెనక సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే..?
ముంబై: టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఆదివారం కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోడం వ్యాపార, వాణిజ్య వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రమాదానికి గల కారణాలను అధికారులు, నిపుణులు అన్వేషిస్తున్నారు. మిస్త్రీతో పాటు కారు వెనుక సీట్లో కూర్చున్న జహంగీర్ పండోలే.. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారని నిపుణులు అంటున్నారు. వారిద్దరూ కనుక సీట్ బెల్ట్ ధరించివుంటే ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకుని ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గురైన కారు పరిశీలిస్తే ముందు భాగంలో రెండు ఎయిర్ బ్యాగ్‌లు తెరుచుకున్నట్టు స్పష్టంగా కనబడుతోంది. దీంతో ముందు సీట్లో ఉన్న డేరియస్ పండోలే, కారు నడుపుతున్న ఆయన భార్య డాక్టర్ అనాహిత గాయాలతో బయటపడ్డారు. వారిద్దరూ సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఎయిర్ బ్యాగ్‌లు తెరుచుకుని ప్రమాద తీవ్రత తగ్గి ప్రాణాలు నిలుపుకున్నారు. (క్లిక్: మిస్త్రీ హఠాన్మరణం.. ఆనంద్ మహీంద్ర భావోద్వేగం) సెక్యురిటీ ఫీచర్లు ఉన్నప్పటికీ.. కారుకు ఒకవైపు మాత్రమే అమర్చినట్లుగా కనిపించే నీలం రంగు సైడ్-కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఓపెన్ అయినట్టు తెలుస్తోంది. మిస్త్రీ, జహంగీర్ సీటు బెల్ట్ ధరించపోవడంతో వారి సీట్లలో నుంచి ఎగిరిపడివుండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన మెర్సిడెస్ జీఎల్సీ ఎస్‌యూవీలో అత్యంత సురక్షితమైన సెక్యురిటీ ఏర్పాట్లు ఉన్నప్పటికీ అజాగ్రత్త కారణంగానే మిస్త్రీ, జహంగీర్ ప్రాణాలు కోల్పోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మన దేశంలో చాలా తక్కువ మంది మాత్రమే వెనుక సీటులో సీట్ బెల్ట్‌లు ధరిస్తారన్న విషయం తెలిసిందే. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఏమౌతుంది? కారు వెనుక కూర్చున్న వారు సీటు బెల్ట్ ధరించకపోతే ఏమవుతుందనే దాని గురించి తెలిపే వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. వెనుక సీట్లో ఉన్న ఇద్దరిలో ఒకరు మాత్రమే సీటు బెల్ట్ ధరించారు. ప్రమాదం జరిగినప్పడు సీటు బెల్ట్ పెట్టుకోని వ్యక్తి ఎగిరి ముందు సీటులోని వ్యక్తి ఎగిరిపడిపోయినట్టుగా వీడియో చూపించారు. బాహుశా మిస్త్రీ కారు ప్రమాదానికి గురైనప్పుడు ఈవిధంగానే జరిగివుండొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. కారులో ప్రయాణించే వారంతా తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలని చెబుతున్నారు. (క్లిక్: చిన్న పొరపాట్లే మిస్త్రీ ప్రాణాలు తీశాయా.. ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే..!) చట్టం ఏం చెబుతోంది? సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ (సీఎంవీఆర్) ప్రకారం వెనుక సీటులో కూర్చున్న ప్రయాణికులు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలి. సీఎంవీఆర్ రూల్ 138 (3) ప్రకారం వాహనం కదులుతున్నప్పుడు.. ముందు సీటులో కూర్చున్న వారితో పాటు వెనుక సీటులో ఉన్న వారు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఈ నిబంధనను ఉల్లంఘించిన వారికి 1,000 రూపాయల జరిమానా విధిస్తారు. కాగా, కారులో అన్ని సీట్లకు Y- ఆకారపు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉండాలని ఈ సంవత్సరం ప్రారంభంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. 25 శాతం మరణాలను నివారించొచ్చు వెనుక సీటు బెల్ట్‌లను ఉపయోగించడం వల్ల 25 శాతం మరణాలను నివారించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. అంతేకాదు ప్రమాదాల్లో ముందు సీటు ప్రయాణికులకు అదనపు గాయాలు లేదా మరణాన్ని కూడా నిరోధించవచ్చని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. -
సైరస్ మిస్త్రీ హఠాన్మరణం: ఆనంద్ మహీంద్ర భావోద్వేగం
సాక్షి,ముంబై: టాటాసన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ అకాలమరణం కార్పొరేట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఘోర రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించిన తీరుతో మితిమీరినవేగం, సీట్ బెల్ట్ పెట్టుకోకవడం తదితర అంశాలు మరోసారి తీవ్ర చర్చకు దారి తీసాయి. ముఖ్యంగా పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ‘కారు వెనుక సీటులో కూర్చున్నప్పుడు కూడా ఎప్పుడూ నా సీటు బెల్ట్ ధరించాలని నిర్ణయించుకుంటున్నాను. మీ అందరూ కూడా ఇలాంటి ప్రతిజ్ఞ తీసుకోండి’ అంటూ ట్వీట్ చేశారు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లనే సైరస్ చనిపోయారన్న వార్తలపై పలు వ్యాపార, రాజకీయ రంగ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆనంద్ మహీంద్ర మనసులోని బాధను, ఆవేదనను ట్విటర్లో తన ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. దయచేసి అందరూ సీట్ బెల్ట్‌లు ధరించండి. వెనక సీట్లో కూర్చున్నా కూడా బకిల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు. మన వెనుక మన కుంటుంబాలు ఉన్నాయన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి. కచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తాను అందరూ కూడా ప్రతిజ్ఞను కూడా తీసుకోవాలంటూ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కోరారు. కాగా సైరస్ మిస్త్రీ (54) గుజరాత్‌లోని ఉద్వాడనుంచి ముంబై వెళ్తుండగా ఆదివారం జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. టాటా గ్రూప్ మాజీ ఇండిపెండెంట్ డైరెక్టర్ డారియస్ పండోల్, అతని భార్య ముంబైకి చెందిన గైనకాలజిస్ట్ అనహిత పండోల్, సోదరుడు జహంగీర్ పండోల్‌తో కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. అనహిత పండోలే మెర్సిడెస్ కారు నడుపుతున్న క్రమంలో అతి వేగంతో మరో వాహనాన్ని ఓవర్టేక్ చేస్తున్న సమయంలో ఆమె కారు అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే వెనుక సీట్లో కూర్చున్న సైరస్ మిస్త్రీ, జహంగీర్ పండోలే సీటు బెల్టు పెట్టుకోలేదని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలోసైరస్, జహంగీర్ అక్కడికక్కడే చనిపోగా, అనహిత పండోలె, డారియస్ పండోలే తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. I resolve to always wear my seat belt even when in the rear seat of the car. And I urge all of you to take that pledge too. We all owe it to our families. https://t.co/4jpeZtlsw0 — anand mahindra (@anandmahindra) September 5, 2022 -
చిన్న పొరపాట్లే మిస్త్రీ ప్రాణాలు తీశాయా? ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే..!
పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. మిస్త్రీ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశీయ వ్యాపార దిగ్గజాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆయన రోడ్డు ప్రమాదంపై పాల్ఘర్ జిల్లా పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. రోడ్డు పక్కనే ఓ గ్యారేజీలో పనిచేస్తున్న వ్యక్తి సైరస్ మిస్త్రీ కారు ప్రమాదం ఎలా జరిగిందో వివరించారు. ‘నా కళ్లెదురుగా ఓ మహిళ అతివేగంతో మిస్త్రీ కారును నడుపుతుంది. ఎడమ నుంచి మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు ఆమె ప్రయత్నించారు. ఆ సమయంలో డ్రైవింగ్ సీట్లో ఉన్న మహిళ వాహనంపై నియంత్రణ కోల్పోయి డివైడర్‌కు ఢీకొట్టారు’ అని అతను వెల్లడించాడు. ఎవరీ అనిహిత పండోలే సైరస్ మిస్త్రీ తన మెర్సిడెజ్ బెంజ్ కారులో గుజరాత్ ఉడవాడ నుంచి ముంబైకి ప్రయాణిస్తున్నారు. అదే కారులో మిస్త్రీతో పాటు ముంబైకి చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ అనిహిత పండోలే, ఆమె భర్త డారియస్ పండోలే.. డారియస్ పండోలే సోదరుడు జహంగీర్ పండోలేలు కూడా ఉన్నారు. అనిహిత పండోలే కారు నడుపుతుండగా.. పక్క సీట్లో ఆమె భర్త డారియస్ పండోలే కూర్చుకున్నారు. వెనక సీట్లలో సైరస్ మిస్త్రీ ఆయన పక్కన జహంగీర్ పండోలేలు ఉన్నారు. సరిగ్గా ఆదివారం మధ్యాహ్నం మహరాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో సూర్య నది వంతెనపై మిస్త్రీ కారు ఘోర ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో కారు సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఎయిర్ బెలూన్లు ఓపెన్ కాలేదు. దీంతో సైరస్ మిస్త్రీ ఆయన పక్కనే ఉన్న జహంగీర్ పండోలేలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనిహిత పండోలే, ఆమె భర్త డారియస్ పండోలే తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రుల్ని స్థానికులు అత్యవసర చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం మిస్త్రీ కారుప్రమాదానికి గల కారణాల్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా చరోటీ నాకా వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తున్నారు. కారులో ఏదైనా మెకానికల్ సమస్యలు ఉన్నాయా అని నిర్ధారించేందుకు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాదు ఆ కారులో బ్లాక్ బాక్స్ తరహాలో అసెంబుల్ చేసిన చిప్ నుండి డేటాను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. చదవండి👉 టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ కన్నుమూత -
సీటు బెల్ట్ పెట్టుకోలేదో మూడో కన్ను పట్టేస్తుంది!
సాక్షి, అమరావతి: సీటు బెల్టు పెట్టుకోకుండా హైవేపై దూసుకుపోయారా.. అయితే మీ ఇంటికి చలానా వచ్చేస్తుంది. పొల్యూషన్ సర్టిఫికెట్‌గానీ ఇతరత్రా అనుమతులుగానీ లేకుండా వాహనంలో ప్రయాణిస్తున్నారా.. జరిమానా తప్పదు.. మీ వాహనాన్ని ఎవరూ ఆపరు. తనిఖీ చేయరు. కానీ నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం జరిమానాల కొరడా ఝళిపిస్తారు. అదే అడ్వాన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఏటీఎస్) పనితీరు. దేశంలో అన్ని హైవేలు, ఎక్స్‌ప్రెస్ హైవేలపై ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేసేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఉద్యుక్తమైంది. అందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ హైవేలు, ఎక్స్‌ప్రెస్ హైవేలపై ‘అడ్వాన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం (ఏటీఎస్)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రవాణా శాఖల వద్ద ఉన్న వాహనాల డాటాబేస్‌తో అనుసంధానిస్తూ ఏటీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఏటీఎస్ వ్యవస్థను పరీక్షించిన ఎన్హెచ్ఏఐ దశలవారీగా అమలు చేయనుంది. హైవేలు, ఎక్స్‌ప్రెస్ హైవేలపై ట్రాఫిక్ తీరును పరిశీలించేందుకు టోల్గేట్లు, ఇతర ప్రధాన కూడళ్లు, మలుపుల వద్ద సీసీ కెమెరాలను, ఇతర ఆధునిక సాంకేతిక వ్యవస్థను దశలవారీగా ఏర్పాటు చేస్తారు. హైవేలు, ఎక్స్‌ప్రెస్ హైవేలపై ప్రయాణించే అన్ని వాహనాల నంబర్ ప్లేట్లను ఈ వ్యవస్థ స్కాన్ చేస్తుంది. ఆ నంబర్ ఉన్న వాహనానికి పొల్యూషన్ సర్టిఫికెట్, పిట్నెస్ సర్టిఫికెట్, అవసరమైన ఇతర సర్టిఫికెట్లు ఉన్నాయా లేదా అని ఆటోమేటిగ్గా పరిశీలిస్తుంది. సరుకు రవాణా వాహనాలను పర్మిట్లు ఉన్నాయా లేదా కూడా పరిశీలిస్తుంది. అవసరమైన సర్టిఫికెట్లు లేవని గుర్తిస్తే వెంటనే ఆ వాహన నంబర్‌ప్లేటు ఆధారంగా జరిమానా విధిస్తారు. సంబంధిత చిరునామాకు చలానా పంపిస్తారు. ఇక ఎవరైనా సీటు బెల్టు పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తే, సీసీ కెమెరాలో రికార్డు అవుతుంది. ఆ వాహనం నంబర్ ప్లేట్ ఆధారంగా జరిమానా విధించి సంబంధిత చిరునామాకు చలానా పంపిస్తారు. ఆ జరిమానాలు విధించిన సమాచారాన్ని సంబంధిత రాష్ట్రాల రవాణా శాఖ కార్యాలయాలకు ఎన్హెచ్ఏఐ నివేదిస్తుంది. ఆయా రాష్ట్రాల రవాణా శాఖ అధికారులు ఆ జరిమానాలను వసూలు చేస్తారు. హైవేలు, ఎక్స్‌ప్రెస్ హైవేలపై ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించేలా పటిష్టంగా పర్యవేక్షించడం ద్వారా ట్రాఫిక్ జామ్‌లు, ప్రమాదాలు నివారించడమే లక్ష్యంగా ఏటీఎస్ వ్యవస్థ ఏర్పాటు కానుంది. -
సీటు బెల్ట్ పెట్టుకోమన్నందుకు.. పళ్లు రాలగొట్టింది
-
సీటు బెల్ట్ పెట్టుకోమన్నందుకు.. పళ్లు రాలగొట్టింది
వాషింగ్టన్: సీటు బెల్ట్ పెట్టుకోమన్నందుకు ఎయిర్‌హోస్టెస్ పళ్లు రాలగొట్టింది ఒక మహిళ. ఈ సంఘటన అమెరికా సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలో చోటు చేసుకుంది. ‘‘విమానం ల్యాండ్ అవ్వబోతుంది. సీట్ బెల్ట్ ధరించండి’’ అని చెప్పినందుకు సదరు ప్రయాణికురాలు ఇంత దారుణానికి తెగబడింది. విమానంలో ఉన్న ప్యాసింజర్ ఒకరు దీన్ని వీడియో తీసి షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. విమానం ల్యాండ్ అవబోతుందనగా ఎయిర్ హోస్టెస్ విమానంలో ఉన్న 28 ఏళ్ల ప్రయాణికురాలు వైవియానా క్వినోనెజ్ని సీట్ బెల్ట్ ధరించాల్సిందిగా కోరింది. దాంతో తీవ్ర ఆగ్రహానికి లోననై క్వినోనెజ్ని ఫ్లైట్ అటెండెంట్ మీద దాడి చేసింది. ఆమె ముఖం మీద గట్టిగా కొట్టింది. పక్కనున్న ప్రయాణికులు ఆపడానికి ప్రయత్నించారు వీలు కాలేదు. ఓ ప్రయాణికుడు ఎయిర్ హోస్టెస్ మీద ఇలా దాడి చేయడం మంచి పద్దతి కాదని వారించాడు. కానీ ఆ ప్రయాణికురాలు వారి మాటలు వినిపించుకోలేదు. ఈ డాడిలో ఎయిర్‌హోస్టెస్ రెండు పళ్లు ఊడిపోయాయి, ఆమె ముఖానికి తీవ్ర గాయలైనట్లు తెలిసింది శాన్ డియాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగిన తర్వాత క్వినోనెజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరువాత ఆమెను బ్యాటరీ కోసం అరెస్టు చేసినట్లు పోర్ట్ ఆఫ్ శాన్ డియాగో హార్బర్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి: ఎయిర్ హోస్టెస్ వ్యభిచార ప్రచారం: విమానంలో.. -
స్మృతి ఇరానీ పోస్ట్‌పై సోనూసూద్ కామెంట్
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను షేర్చేస్తూ..'కరోనా ఇంకా ముగియలేదు. కాబట్టి మీరు బయటికి వెళ్లేటప్పుడు మాస్క్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించండి. లుక్స్ కంటే మాస్క్‌పై దృష్టి పెట్టండి. సరక్షితంగా ఉండండి' అంటూ పేర్కొన్నారు. ఈ పోస్ట్‌పై సోనూసూద్ సహా పలువురు ప్రముఖులు స్పందించారు. జో హుకుమ్(మీరు ఎలా చెబితే అలాగే)అంటూ సోనూ సూద్ పేర్కొనగా, మీరు మాస్క్ ఉన్నా లేకపోయినా అందంగానే ఉంటారంటూ ఫేమస్ చెఫ్ సువిర్ సారన్ ప్రశంసించారు. స్మృతి పోస్ట్‌పై పలువురు నెటిజన్లు సైతం హార్ట్ ఎమోజీలతో కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Smriti Irani (@smritiiraniofficial) చదవండి : శర్వానంద్‌కి సర్ప్రైజ్ ఇచ్చిన మెగా హీరో.. చదవండి : తాప్సీని మరోసారి టార్గెట్ చేసిన కంగనా -
సీటు బెల్ట్‌తో యువ డాక్టర్ సేఫ్
సాక్షి, రాజేంద్రనగర్: కారు సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో ఎయిర్ బ్యాగ్ తెరుచుకుని ప్రమాదం నుంచి సురక్షితంగా ఓ యువ డాక్టర్ బయటపడింది. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సైదాబాద్ పూర్ణాదేవీకాలనీకి చెందిన డాక్టర్ ఎ.దివ్యారెడ్డి(26) గచ్చిబౌలిలోని ఓ ఆసుపత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తుంది. గురువారం నైట్ డ్యూటీ చేసిన డాక్టర్ దివ్యారెడ్డి శుక్రవారం ఉదయం విధులు ముగించుకుని తన కారులో ఇంటికి బయలుదేరింది. ఔటర్ పై నుంచి హిమాయత్‌సాగర్ వద్ద దిగి రాజేంద్రనగర్ మీదుగా చంద్రాయణగుట్ట వైపు వెల్తుంది. గాందీనగర్ మందిరం దాటగానే రోడ్డుపై ఓ వీధి కుక్క అడ్డు రావడంతో దానిని తప్పించే క్రమంలో కారు కాస్తా పక్కనే ఉన్న సైన్‌బోర్డును ఢీకొని అలాగే ముందున్న రాళ్లను ఢీకొంటూ వెళ్ళి ఆగిపోయింది. ఆమె సీటు సీటు బెల్టు ధరించడంతో వెంటనే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడింది. వాహనం పూర్తిగా ధ్వంసమయింది. ఆ రోడ్డు మీదుగా వెళ్తున్న వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన దివ్యారెడ్డిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సీటు బెల్టు కత్తిలా మారి ఆమె కడుపును..
మిచిగాన్ : ఓ కారు ప్రమాదంలో సీటు బెల్టు కత్తిలా మారి చోదకురాలి కడుపును చీల్చివేసింది. దాదాపు రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఈ విషాదకర సంఘటనలో ఆమె ప్రాణాలతో బయటపడ్డా.. శరీరం మాత్రం చెరిగిపోని గాయంతో చిరుగులు పడ్డ గుడ్డముక్కలా తయారైంది. వివరాల్లోకి వెళితే.. మిచిగాన్కు చెందిన గీనా ఆర్నాల్డ్ 2017 ఆక్టోబర్‌లో తన సొంత కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. దాదాపు 7 సార్లు కారు పల్టీలు కొట్టడంతో రక్షణ కోసం ధరించిన సీటు బెల్టు ఓ కత్తిలా మారి కడుపును చీల్చింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మూడు నెలల పాటు ఇన్టెన్సివ్ కేర్‌లో గడిపింది. దాదాపు 20 అత్యవసర సర్జరీల అనంతరం ప్రాణాలతో బయటపడగలిగింది. గీనా ఆర్నాల్డ్ మాట్లాడుతూ.. ‘‘ ఆ రోజు ఏం జరిగిందో నాకు సరిగా గుర్తులేదు. ప్రమాదం జరిగినపుడు వర్షం పడిందని, కారు నా కంట్రోల్ తప్పి ప్రమాదానికి గురైందని తర్వాత తెలిసింది. నా కారు ఏడు సార్లు పల్టీలు కొట్టి, చెట్టును ఢీకొట్టిందని సంఘటన జరిగిన రోజు అక్కడున్న వ్యక్తి చెప్పాడు. సీటు బెల్టు కత్తిలా మారి నా పొట్టను చీల్చినా.. నా అదృష్టం అది పెట్టుకోవటం వల్ల ప్రాణాలతో బయటపడగలిగాను. ఆ తర్వాత నేను మూడు రోజులు కోమాలో ఉన్నాను. నా రెండు ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. ఏ ఏ ఎముకలు విరిగాయో తెలుసుకోవటానికి డాక్టర్లకు ఓ వారం రోజులు పట్టింది. నన్ను ప్రాణాలతో రక్షించటానికి అత్యవసర సర్జరీలు చేయాల్సి వచ్చింది. ఆ నొప్పిని నా జీవితంలో నేనెప్పుడూ భరించలేదు. సర్జరీలు జరిగినా నడుస్తానన్న నమ్మకం ఉండేది కాదు. నా కడుపులోని చాలా భాగాన్ని తొలగించాల్సి వచ్చింద’’ని తెలిపింది. 14నెలల తర్వాత కోలుకున్న గీనా దివ్యాంగులకు సేవ చేస్తూ జీవితాన్ని గడిపేస్తోంది. -
పోలీస్ పాటకు జనం ఫిదా.. వీడియో వైరల్
-
పోలీస్ పాటకు జనం ఫిదా.. వీడియో వైరల్
సాక్షి, ఢిల్లీ: హెల్మెట్ ధరించండి.. ప్రాణాలు కాపాడుకోండి అంటూ ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ ఒకరు పాడిన పాట అందరి ప్రశంసలను అందుకుంటోంది. రహదారి భద్రత గురించి ఉన్న ఈ పాట వైరల్‌గా మారింది. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటించిన గల్లీబాయ్ సినిమాలోని 'ఆప్నా టైమ్ ఆయేగా..' పాటను తన వెర్షన్లో పాడాడు. రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడుకోండంటూ సలహాలను చరణాలుగా మలిచాడు. 42 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో రోడ్డు భద్రతపై సందేశాన్నిచ్చే విధంగా సొంత లిరిక్స్నుపయోగించాడు సందీప్ సాహి అనే ట్రాఫిక్ పోలీస్. సందీప్ భార్య రోడ్డు ప్రమాదంలో మరణించింది. అప్పటినుంచి రోడ్డు భద్రతపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాడు. హెల్మెట్స్, సీట్‌బెల్ట్ ధరించండని ప్రస్తుత పాటలో వాహనదారులకు పిలుపునిస్తున్నాడు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించవద్దని కోరుకుంటున్నాడు. ‘నేను చెప్పేది పాటించండి.. హాయిగా జీవించండి’ అని తన వీడియో ద్వారా సందేశాన్నిచ్చాడు. అదే సమయంలో తాగి వాహనాలు నడిపే వారిని హెచ్చరించాడు. 'జై హింద్, జై భారత్' అంటూ పాట ముగించాడు. ఈ వీడియోకు నెటిజన్లు స్పందిస్తూ అతని పాటకు పూర్తిగా ఫిదా అయ్యామని, అందుకు 10కి 10 మార్కులు ఇవ్వొచ్చని ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి పోలీసులే మాకు కావాల్సింది అంటూ అతనికి సెల్యూట్ చేస్తున్నారు. మరి ఈ సాంగ్ రణవీర్ కూడా చూశాడో, లేదో తెలియాలి! -
నెత్తురోడిన రహదారులు
సాక్షి, నార్కట్‌పల్లి (నకిరేకల్) : రహదారులు మరో మారు నెత్తురోడాయి. ఉమ్మడి జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో శుక్రవారం చోటు చేసుకున్న వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. నార్కట్‌పల్లి, చివ్వెంల, రామన్నపేట, తిప్పర్తి మండలాల్లో చోటు చేసుకున్న ఈ ఘటనల వివరాలు.. నల్లగొండకు చెందిన మందడి సత్యపాల్‌రెడ్డి (30) తన స్నేహితుడి మేడి శ్రీనివాస్ సోదరి గ్రామం కట్టంగూర్ మండలం పామనగుండ్లకు కారులో వెళ్లారు. రాత్రి తిరిగి నల్లగొండకు బయలు దేరారు. అయితే నార్కట్‌పల్లి వద్ద వీరు ఫైఓవర్ దిగకుండా అలాగే ముందుకు వెళ్లారు. వారిజాల వేణుగోపాలస్వామి ఆలయానికి వెళ్లే ఆర్చి వద్ద యూటర్న్ తీసుకుంటుండగా సూర్యాపేట నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కామినేని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సత్యపాల్‌రెడ్డి మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపారు. సీటు బెల్ట్ పెట్టుకుని ఉంటే.. కారులో ప్రయాణిస్తున్న సత్యపాల్‌రెడ్డి సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే మృతిచెందే వాడు కాదని ఘటనాస్థలిని పరిశీలిస్తే అవగతమవుతోంది. శ్రీనివాస్ సీట్ బెల్ట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తుండడంతో ప్రమాదం జరిగినప్పుడు బెలూన్స్ ఓపెన్ కావడంతో అతడు గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి కారణమైన మరో కారులో ప్రయాణిస్తున్న వారు సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్ల బెలున్స్ ఓపెన్ కావడంతో స్వల్పగాయాలతో బయటపడినట్టు పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని.. చివ్వెంల (సూర్యాపేట) : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఆళ్లగడప గ్రామానికి చెందిన నిమ్మల సోమ య్య (45) తన కుమారుడి పెళ్లి కార్డులు పంచేందుకు కోదాడ వెళ్లి తిరిగి సూర్యాపేటవైపు మోపెడ్‌పై వస్తున్నాడు. మార్గమధ్యలో గుంజలూరు గ్రామ స్టేజి వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న గుర్తుతెలియన వాహనం వెనుకనుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సోమయ్య కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బం ధువులకు అప్పగించారు. మృతుడి కుమారుడు నరేశ్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ లవకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు – లారీ ఢీ.. ఒకరు.. రామన్నపేట (నకిరేకల్) : నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జునకాలనీకి చెందిన తల్లం నవీన్(33) శుక్రవారం రామన్నపేటలో నివాసం ఉంటున్నతన స్నేహితుడిని కలువడానికి వచ్చాడు. అనంతరం స్నేహితుడి కారు తీసుకుని భువనగిరి వైపు వెళ్తుండగా ఇంద్రపాలనగరం శివారులోని సబ్‌స్టేషన్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నవీన్‌ను 108 వాహనంలో రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం అతడిని నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందాడు. మృతుడి బాబాయి ప్రకాష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సీహెచ్ సాయిలు తెలిపారు. మినీగూడ్స్ బోల్తా ..ఇద్దరు.. తిప్పర్తి (నల్లగొండ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లురు జిల్లా లింగసముద్రం మండలానికి చెందిన మహేష్‌బాబు(30)మినీ గూడ్స్ డ్రైవర్‌గా,షేక్ నజీర్(35) ఇదే వాహనానికి క్లినర్‌గా పనిచేస్తున్నాడు. సింగరాయకొండ నుంచి కూల్ బాక్స్‌లను లోడ్ చేసుకుని జహీరాబాద్‌లో ఆన్లోడ్ చేసి తిరిగి నెల్లురు వెళ్తున్నారు. మార్గమధ్యలో మండల పరిధిలోని రామలింగాలగూడెం వద్ద ఒక్కసారిగా ముందు టైర్ పగలడంతో అదుపుతప్పి మినీగూడ్స్ డివైడర్ దాటి అటు వైపు నుంచి వస్తున్న లారీని ఢీకొట్టి డివైడర్‌పై పడింది. దీంతో మినీగూడ్స్లో ఉన్న డ్రైవర్, క్లినర్ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు మృతుల బందువులకు సమాచారం అందజేశారు. మృతదేహాలను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధు తెలిపారు. -
పల్లెల్లో.. హెల్మెట్లు
శంకరపట్నం: హెల్మెట్ కొనాలంటే పట్టణాలకు పరుగులు తీయాల్సిన పని లేదు. జాతీయ రహదారి వెళ్లే పల్లెల్లోనూ లభ్యమవుతున్నాయి.శంకరపట్నం మండలంలో హెల్మెట్ విక్రయాలు ఊపందుకున్నాయి. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెల్మెట్ చట్టం అమలుకావడంతో ద్విచక్రవాహనదారులు హెల్మెట్లు ధరిస్తున్నారు. హెల్మెట్ లేకుండా రోడ్డెక్కితే కేసులు నమోదు చేస్తున్నారు. గతంలో మాదిరిగా వాహనాలు తనిఖీచేసి కేసులు పెట్టేవారు. ఇప్పుడు ఈ పెట్టి కేసులు పెడుతుండడంతో ద్విచక్రవాహనదారుడు హెల్మెట్ ధరించకుంటే ఫోటోతీసి అప్లోడ్ చేస్తున్నారు. కారు నడుపుతున్న వ్యక్తి సీటుబెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తే సీసీ కెమెరల్లో నమోదవుతున్న పుటేజీల ఆధారంగా కేసులు నమోదుచేస్తున్నారు. ఈ చలాన్ విధానం అమల్లోకి రావడంతో పోలీసులు జాతీయరహాదారిపై రోజుకో ప్రాంతంలో నిఘా పెంచుతున్నారు. మండలంలోని కేశవపట్నంలోనే మూడు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డుపక్కన విక్రయిస్తున్నారు. ఒక్కో హెల్మెట్ రూ.300నుంచి రూ.1000 వరకు ధరల్లో లభ్యమవుతున్నాయి. హెల్మెట్ ధరించండి కరీంనగర్– వరంగల్ జాతీయ రహాదారి ని త్యం రద్దీగా ఉంటుంది. వాహనాల రాకపోకల తో అప్రమత్తంగా డ్రైవింగ్ చేయకుంటే ప్రమాదాల బారిన పడుతున్నారు. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తే సురక్షతంగా గమ్యానికి చేరుకుంటారు. హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపితే ఈ పెట్టి కేసులు నమోదు చేస్తున్నాం. – సత్యనారాయణ, ఎస్సై -
సీటు బెల్టు..చిన్నచూపు!
కార్లు.. ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న వారు సీటు బెల్టు పెట్టుకోవడం.. హెల్మెట్ వాడడం తప్పనిసరి. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం..ఇవి పోలీసు..రవాణాశాఖాధికారులు తరచూ చెబుతున్న మాటలు.. చేస్తున్న హెచ్చరికలు. కానీ ఇవేవీ వాహనదారుల చెవులకు ఎక్కడం లేదు. సీటు బెల్టు.. హెల్మెట్ అన్నా చాలామంది చిన్నచూపు చూస్తున్నారు. వీటిని పెట్టుకోవడమంటే ఏదోలా భావిస్తున్నారు.– లాల్‌జాన్ బాషా.. టీడీపీ సీనియర్ నాయకుడు. నందమూరి హరికృష్ణ.. సినీ నటుడు, స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కుమారుడు. వీరిద్దరూ వారు ప్రయాణిస్తున్న కార్లు బోల్తాపడడంతోనే చనిపోయారు. సీటు బెల్టు పెట్టుకోకపోవడంతోనే వీరు మృత్యువు ఒడికి చేరారు. అదే సీటు బెల్టు వాడి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేదికాదనే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరే కాదు చాలామంది పరిస్థితి ఇదే. సీటు బెల్టు పెట్టుకోకుండానే వాహనాలను డ్రైవ్ చేస్తుంటారు. అనుకోని రీతి లో ప్రమాదాలబారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. శ్రీకాకుళం సిటీ: రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ద్విచక్రవాహనాలు, కార్లు, లారీలు వంటి భారీ వాహనాలు నడిపే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన ప్రమాదాలు బారిన పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రధానంగా ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ ధరించకపోవడం, కార్లు నడిపే సమయంలో సీటుబెల్ట్ పెట్టుకోకపోవడం వలన జరిగే ప్రమాదాలు పెను విషాదానికి కారణమవుతున్నాయి. జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాలలో ఎక్కువగా ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ పెట్టుకోకపోవడం, కార్లు నడిపేవారు తమ సీటు బెల్ట్ ధరించకపోవడం వల్లే 10 శాతం వరకూ ప్రమాదాల బారిన పడుతూ మృత్యువాత పడుతున్నట్లు గణాంకాలు చెబు తున్నాయి. ఇందుకు ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రమాదాల బారిన పడడం శోచనీ యం. దీనికి తోడు మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం, జాతీయ రహదారులపై పరిమితికి మిం చిన వేగంతో ప్రయాణించడం వంటి కారణాలు కూడా ప్రమాదాలకు తోడవుతున్నాయి. ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితులపై తీసుకోవా ల్సిన చర్యల గురించి క్షేత్రస్థాయిలో సంబంధిత శాఖల యంత్రాంగం ప్రజలకు అప్రమత్తం, అవగాహన కల్పించాల్సి ఉన్నప్పటికీ అవి తూతూ మంత్రంగానే సాగుతుండడంతో ప్రమాదాల శాతం ఏమాత్రం తగ్గడం లేదు సరికదా మరింతగా పెరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో ప్రతి ఏటా వేల సంఖ్యలో ప్రమాదాల బారిన పడుతూ క్షతగాత్రులుగా మారుతుండడం, పదుల సంఖ్యలో మృత్యువాత పడడం కూడా ఒకింత ఆందోళన కలిగిస్తున్నప్పటికీ ఇటీవల కాలంలో పోలీసులు, రవాణాశాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలు వలన కొంతమేర సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పవచ్చు. ఇంటి వద్దనుంచి బయలుదేరిన వాహనదారులు సక్రమంగా తిరిగి వచ్చే వరకూ వారి కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ కాకుండా గుండెలమీద చేయి వేసుకునేలా ఉండాలంటే వాహనదారుడు వేగనియంత్రణ, ట్రాఫిక్ నిబంధనలు కూడా తప్పనిసరిగా పాటించల్సిందేనని సంబంధిత శాఖాధికారులు చెబుతున్నారు. ఒక్క క్షణం ఆలోచించండి: ప్రతి వాహనదారుడు వారి వాహనం నడిపే సమయంలో ఒక్కక్షణం ఆలోచించాలి. ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ఒక కుటుంబం తనపై ఆధారపడి ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సెక్షన్ 177 ప్రకారం ప్రతి వాహనదారుడు నిబంధనలను కచ్చితంగా పాటించినట్లైతే ప్రమాదాల శాతం చాలా వరకూ అరికట్టవచ్చు. ద్విచక్రవాహనదారుడు హెల్మెట్ ధరించకపోతే రూ.100, కార్డు నడిపే సమయంలో సీటు బెల్ట్ ధరించకపోతే రూ.100 అపరాధ రుసుంగా అధికారులు ప్రస్తుతం వసూలు చేస్తున్నారు. అయితే కొత్త నిబంధనల ప్రకారం వీటి రుసుం రూ. 1000 వరకూ పెంచారు. ఇవి ఇంకా అమలు కావాల్సి ఉంది. జాతీయ రహదారిపై ప్రయాణించే ప్రతి వాహన దారుడు మితిమీరిన వేగంతో కాకుండా పరిమితికి లోబడి ప్రయాణిస్తే ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదని అధికారులు, నిపుణులు చెబుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం వలన కూడా ఎంతో ప్రమాదం ఉంది. తనకు జరిగే ప్రమాదంతోపాటు ఎదుటివ్యక్తులు కూడా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి ప్రయాణం చేస్తే వాహనదారునికి ఇన్సూరెన్స్ రాయితీలు కూడా వర్తించే అవకాశాలు ఉండవు. పలుమార్లు చలానాల రూపంలో వాహనదారుడు చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైతే వారి డ్రైవింగ్ లైసెన్స్ కోల్పోవాల్సి వస్తుంది. వాహనాలను కూడా కొన్ని సందర్భాల్లో సీజ్ చేసే అవకాశం ఉంది. -
మితిమీరిన వేగం ప్రమాదాలకు కారణం
నల్లగొండ : ‘మితిమీరిన వేగం ప్రమాదాలకు ప్రధాన కారణం. కారు నడిపే వ్యక్తితో పాటు కారులో ఉన్న అందరూ ఖచ్చితంగా బెల్ట్ పెట్టుకోవాలి. అదే ప్రాణానికి రక్షణ కవచం లాంటిది’ అంటున్నారు నల్ల గొండ ఎంవీఐ శ్రీనివాస్‌రెడ్డి. రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు హరికృష్ణ మృతిచెందిన నేపథ్యంలో ఆయన బుధవారం పలు విషయాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే.. ‘ఇంటర్నేషనల్ సెప్టీ టెస్టింగ్’ సంస్థలు నిర్వహించిన సర్వేల ప్రకారం ఏ కారైన 64 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తేనే మంచిది. ఆ సమయంలో ప్రమాదం జరిగినా కారులో రక్షణ కోసం ఉన్న ఎయిర్ బ్యాగ్స్ పనిచేస్తాయి. ప్రమాదం నుంచి బయటపడవచ్చు. అంతకంటే వేగం మించితే వారు వెళ్లే వేగాన్ని బట్టి ఎంత రక్షణ ఉంటుదనేది చెప్పలేని పరిస్థితి. ప్రధానంగా ప్రమాదం అనేది మానవ తప్పిదంగానే ఎక్కువ శాతం ఉంటుంది. ప్రస్తుతం అత్యంత సాంకేతికతతో కూడిన వాహనాలు తయారవుతున్నాయి. కారును స్టార్ట్ చేయడానికి కీ పెట్టగానే అన్ని లైట్లు వస్తాయి. ఆన్ చేయగానే ఆ లైట్లన్ని పోతాయి. ఒక వేళ లైట్లు కొన్ని వెలుగుతున్నాయంటే అందులో ఏదో ఒక ప్రాబ్లం ఉందని వాహనచోదకుడు తెలుసుకోవాల్సిందే. కానీ చాలా మంది పట్టించుకోకుండా అలానే నడిపి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. బెల్ట్ పెట్టుకోకుంటే శబ్ధం వస్తుంది. అది కొంతదూరం వెళ్లే వరకే వస్తుంది. కానీ చాలా మంది సీటు బెల్టు పెట్టుకోవడం లేదు. ఇంజన్అయిల్ మార్చుకోవాల్సిన సమయం వచ్చినా, టైర్లో గాలి తక్కువగా ఉన్నా సిగ్నల్స్ వస్తాయి. పట్టించుకోవడం లేదు. టైర్ల కంపెనీలు లక్ష కిలోమీటర్ల వరకు మన్నిక ఉంటాయని చెప్పుతున్నాయి. కానీ నడిపే వ్యక్తికి బ్రేక్ వేసిన సందర్భంలో టైర్ జారీపోతున్నట్లుగా ఉంటే దానిని వెంటనే మార్చుకోవాల్సిందే. సెల్ప్ఫోన్ మాట్లాడుతూ కారు నడపడం మంచిది కాదు. చోదకుడు ఎప్పుడూ వాహనం ఎంత వేగంలో ఉందో చూసుకుంటూ, ప్రయాణం మీదనే దృష్టి సారిం చాలి. ఏదైనా అవసరమైతే ఆగాలి. తప్ప కారు నడుపుతూ ఫోన్ మాట్లాడటం, వాటర్ తాగడం లాంటి పనులు చేయడం మంచిది కాదు. ఎన్ని కోట్ల రూపాయల వాహనమైనా నిబంధనల ప్రకారం నడిపితేనే రక్షణ. లేదంటే ప్రమాదాలను కొని తెచ్చుకున్నవాళ్లమే అవుతాము. సీటు బెల్ట్‌తో ప్రాణానికి రక్షణ నల్లగొండ క్రైం : సీటు బెల్ట్‌తో ప్రాణానికి లింక్ ఉంది. కారులో సీటు బెల్ట్ ధరించి వాహనాన్ని నడిపే వారంతా సురక్షితంగా గమ్యానికి చేరుకుంటున్నారు. ఎంతటి ప్రమాదం జరిగినా సీటు బెల్ట్ ఉంటే ప్రాణాపాయం నుంచి బయటపడతారని నల్లగొండ టూటౌన్ సీఐ భాష తెలిపారు. హరికృష్ణ సీటు బెల్ట్ ధరించకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయాడని స్పష్టం చేశారు. సీటుబెల్ట్ ధరిస్తే ఎంతటి రోడ్డు ప్రమాదమైన ప్రాణాలు సురక్షితం. వాహన మోడల్‌ను బట్టి కొన్ని కిలోమీటర్ల వేగం వరకే హెయిర్ బెల్లూన్స్ ఓపెన్ అవుతాయి. సీటుబెల్ట్ పెట్టుకుంటేనే బెల్లూన్స్ ఓపెన్ అవుతాయి. సీటు బెల్ట్ వల్ల గుండె, ఊపిరితిత్తులు, చాతి ఎముకలకు, తలకు గాయాలు కావు. స్టీరింగ్ తగలకపోగా, కుడి, ఎడమ వైపు కూడా గాయాలు కావు. బలంగా ఇసుకలారీ వేగంగా గుద్దితే సీటు బెల్ట్ పెట్టుకున్నా ప్రయోజనం ఉండదు. గత అనేక సంఘటనల్లో 95 శాతం సీటు బెల్ట్ పెట్టుకున్న వారు ప్రమాదాల నుంచి బయటపడ్డారు. వాహనం నడిపేటప్పుడు బెల్ట్ పెట్టుకోకపోతే చిన్న ప్రమాదమైనా తల, స్టీరింగ్‌కు తగిలి మృతి చెందుతారు. వాహనం నడిపేటప్పుడు ప్రతిఒక్కరూ సీటు బెల్ట్ పెట్టుకునేలా అలవాటు చేసుకోవాలి. వాహనం నడిపేటప్పుడు ముందుచూపు, పరిమిత వేగం మాత్రమే ఉండాలి. ఇక్కడి రహదారులలో 80 నుంచి 90 కిలోమీటర్ల లోపు వేగమే సురక్షితం. -
సీటు బెల్టు ప్రాణదాతే!
సాక్షి, హైదరాబాద్: ద్విచక్ర వాహనానికి హెల్మెట్.. తేలికపాటి వాహనానికి సీటుబెల్టు.. నిబంధనల ప్రకారం కచ్చితం. ఎయిర్‌బ్యాగ్స్‌తో సంబంధం లేకుండా సీటుబెల్టు పెట్టుకోవాల్సిందే. ఇది అనేక సందర్భాల్లో ప్రాణదాతగా మారింది. ఏటా దేశంలో చోటు చేసుకుంటున్న తేలికపాటి వాహనాలకు సంబంధించిన ప్రమాదాల్లో 60 శాతం మంది సీటుబెల్టు వాడని కారణంగానే మృత్యు వాతపడుతున్నారని పలు అధ్యయనాల్లో తేలింది. ప్రాణాలు కాపాడిన సీటుబెల్టు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి సహా నలుగురు ప్రయాణిస్తున్న కారు 2011 డిసెంబర్ 21న హైదరాబాద్ శివార్లలోని మెదక్ జిల్లా కొల్లూరు వద్ద ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఈ ప్రమాదంలో ప్రతీక్‌తో పాటు సుజిత్‌కుమార్, చంద్రారెడ్డి ఘటనాస్థలిలోనే మరణించారు. వెనుక సీట్లో కూర్చున్న ఆరవ్‌రెడ్డి సీటు బెల్టు పెట్టుకోవడంతో మృత్యుంజయుడు అయ్యాడు. 2016 మే 17న ఏపీ మాజీ మంత్రి, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వర్రావు ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్ రెయిలింగ్‌ను ఢీకొట్టిన ఘటనలో ఆయన భార్య సాహిత్యవాణి, డ్రైవర్ స్వామిదాసు కన్నుమూశారు. సీటుబెల్టు పెట్టుకోవడంతో వెంకటేశ్వర్రావు ప్రాణాలతో బయటపడ్డారు. సీటుబెల్టు, ఎయిర్ బ్యాగ్స్‌కు లింక్.. అన్ని హైఎండ్ కార్లలో సీటు బెల్టుకు, ఎయిర్‌బ్యాగ్స్‌కు మధ్య లింకు ఉంటుంది. బెల్టు పెట్టుకోకుంటే ఎయిర్‌బ్యాగ్స్ యాక్టివ్ కావు. వాహనం ప్రమాదానికి లోనైనప్పుడు ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవాలంటే దానికి సంబంధించిన సెన్సర్లు యాక్టివేట్ కావాలి. డ్రైవింగ్సీటులో ఉన్న వ్యక్తి కచ్చితంగా సీటుబెల్టు పెట్టుకుంటేనే ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్ యాక్టివేట్ అవుతుంది. వాహనం బయల్దేరిన తర్వాత డ్రైవర్, పక్క వ్యక్తి సీటుబెల్టు పెట్టుకోకపోతే గుర్తు చేసేందుకు బీప్ శబ్దం కూడా వచ్చేలా తాజా వాహనాలకు ఏర్పాట్లు చేశారు. -
ప్రాణాలు కాపాడిన సీటు బెల్టు
పెనుకొండ రూరల్: జాతీయరహదారిపై వేగంగా వెళుతున్న కారు కుక్క అడ్డురావడంతో బోల్తాపడింది. కారు నుజ్జునుజ్జయినప్పటికీ అందులో ప్రయాణిస్తున్న దంపతులు సీటుబెల్టు ధరించడం వల్ల ఎటువంటి గాయాలు కాకుండా ప్రాణాలతో బయటపడ్డారు. పెనుకొండ ఎస్ఐ జనార్ధన్ తెలిపిన మేరకు... బెంగళూరుకు చెందిన సంతోష్ తన భార్య ప్రశాంతితో కలసి ఆదివారం ఉదయం గుంతకల్లుకు కారులో బయల్దేరాడు. పెనుకొండ మండలం హరిపురం జాతీయ రహదారిపై కుక్క అడ్డురావడంతో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. వాహనం పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ సీటు బెల్టు ధరించడంతో లోపల ఉన్న వారికి ప్రాణాపాయం తప్పింది. స్థానికులు, వాహనదారులు గమనించి దంపతులను బయటకు తీశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన సీటు బెల్టు
ఆ యువకుడు తనకు నచ్చిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. శ్రీవారి మొక్కు తీర్చుకు నేందుకు భార్య, తల్లి, సమీప బంధువులతో కలిసి సంతోషంగా బయలుదేరారు. ఆ సం తోషం ఎంతో సేçపు నిలవలేదు. విధి చిన్న చూపు చూడడంతో భార్యను, తల్లిని పోగొట్టు కున్నాడు. తాను కూడా ప్రాణాలతో కొట్టుమి ట్టాడుతున్నాడు. నారాయణవనం మండలం తుంబూరు సమీపంలో సోమవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. నారాయణవనం: భద్రతకోసం పెట్టుకున్న సీటు బెల్ట్ నవ వధువు అముదవళ్లి, డ్రైవర్ మృతికి మృతికి కారణమైంది. నారాయణవనం మండలం తుంబూరు వద్ద సోమవారం ఉదయం బస్సు, జైలో వాహనం ఢీకొనడంతో వాహనం డోర్లు తెరచుకోవడంతో సతీష్, శకుంతల, ఉలగనాథన్, తమిళరసి విసురుగా రోడ్డుపైకి పడిపోయారు. సీటు బెల్ట్ ఉన్న కారణంతో అముదవళ్లి బయటపడలేక పోయింది. ముందుభాగం పూర్తిగా దెబ్బతినడంతో డ్రైవర్ కన్నదాసన్తో పాటు అముదవళ్లి వాహనంలోనే ప్రాణాలు వదిలారు. లేనిపక్షంలో డోరు ఓపెన్ కాగానే అందరూ బయట పడిపోయి తీవ్ర గాయాలతో బయటపడేవారని స్థానికులు పేర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. మృతదేహాలను బయటకు తీస్తున్న స్థానికులు, పోలీసులు దేవుడే కాపాడాడు జైలో వాహనం వెనుకనే మోటార్ సైకిల్‌పై పుత్తూరుకు వస్తున్న నిండ్ర మండలం ఎలకాటూరు దళితవాడకు చెందిన వెంకటేష్, కృష్ణమూర్తి ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. వేగంగా వెళుతున్న బస్సు, జైలో వాహనాలు ఢీకొనడంతో బస్సు రోడ్డుకు ఎడమ వైపునకు వెళ్లి ఆగిపోయిందన్నారు. జైలో వాహనం రోడ్డుపై తిరుగుతూ వెనుకనే వస్తున్న తమను ఢీకొందని తెలిపారు. తాము ప్రమాదాన్ని ఊహించి పక్కనే ఉన్న వ్యవసాయ పొలాల్లోకి దూకేశామన్నారు. -
ప్రాణాలు నిలబెట్టిన సీటుబెల్ట్
పెనుకొండ రూరల్: సీటుబెల్టు ధరించడం వల్ల ముగ్గురు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. ఆదివారం ఉదయం 11 గంటలకు అనంతపురం నుంచి బెంగళూరు వైపు 150 కిలోమీటర్ల వేగంతో వస్తున్న కారు పెనుకొండ మండలం గోనిపేట వద్ద జాతీయరహదారిపై అదుపుతప్పింది. పల్టీలు కొట్టుకుంటూ వెళ్లి పక్కనే ఉన్న ముళ్లపొదల్లో బోల్తాపడింది. కారు నుజ్జునుజ్జయ్యి రెండు ముక్కలైంది. కారులో ప్రయాణిస్తున్న బెంగళూరులోని హెబ్బాల్‌కు చెందిన రెస్టారెంట్ నిర్వాహకులు అవినాష్.జె, అవినాష్.బి, ఆదిత్‌లు స్వల్పగాయాలతో బయటపడ్డారు. సీటుబెల్టు పెట్టుకోవడం వల్ల వీరికి ప్రాణాపాయం తప్పిందని పెనుకొండ ఎస్ఐ జనార్ధన్ తెలిపారు. -
విస్మయం: బైక్ నడిపినా సీట్ బెల్ట్ పెట్టుకోవాలట..!
సాక్షి, చెన్నై: డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా, మద్యం తాగి వాహనం నడిపినా.. సీటు బెల్టు ధరించకుండా కారు నడిపినా జరిమానా విధించటం సర్వసాధారణంగా జరిగేదే. కానీ, తమిళనాడులో మాత్రం సీటు బెల్ట్ పెట్టుకోకుండా మోటారు బైక్‌ను నడిపాడంటూ పోలీసులు ఓ యువకునికి జరిమానా విధించేశారు. ఈ ఘటన పలువురిని విస్మయపరిచింది. తంజావూరులో సోమవారం పోలీసులు వాహన తనిఖీలు జరిపారు. ఆ సమయంలో తంజావూరుకు చెందిన పాండ్యరాజన్ మోటార్ బైక్‌పై అటుగా వచ్చాడు. అతన్ని ఆపిన పోలీసులు సీటు బెల్డ్ ధరించకుండా వస్తున్నావంటూ జరిమానా విధించారు. తనది మోటారుసైకిల్ సీటు బెల్ట్ ఎలా ఉంటుందని అతడు మొత్తుకున్నా పోలీసులు వినిపించుకోలేదు. దీంతో పాండ్యరాజ్ మంగళవారం తంజావూరు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. రోజువారీ కూలి పనులు చేసుకునే తాను మోటారు సైకిల్‌పై వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని.. హెల్మెట్ ధరించటంతోపాటు తన వద్ద ఉన్న ఒరిజినల్ పత్రాలన్నింటినీ చూపించినా పోలీసులు మాత్రం.. సీటు బెల్ట్ ధరించలేదని చెప్పి రూ.500 జరిమానా వసూలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు స్వీకరించిన అధికారి శక్తివేల్ సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
సీటు బెల్ట్ ప్రాణదాతే!
కార్లలో దీని వినియోగం తప్పనిసరి అనేక ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడిన వైనం సిటీబ్యూరో: ద్విచక్ర వాహనానికి హెల్మెట్... తేలికపాటి వాహనానికి సీటుబెల్ట్... నిబంధనల ప్రకారం ఇవి కచ్చి తం. కేవలం అనేక హైఎండ్ కార్లలో సీటుబెల్ట్కు–ఎయిర్బ్యాగ్కు ఉన్న లింకు కారణంగానే కాదు... ఎయిర్‌బ్యాగ్స్ లేని వాహనాల్లోనూ సీట్‌బెల్ట్ వాడటం తప్పనిసరి. ఇది అనేక సందర్బాల్లో ప్రాణదాతగా మారింది. ఏటా దేశంలో చోటు చేసుకుంటున్న కార్లు వంటి తేలికపాటి వాహనాలకు సంబంధించిన ప్రమాదాల్లో 60 శాతం మంది సీటుబెల్ట్ వాడని కారణంగానే మృత్యువాతపడుతున్నారని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రయాణిస్తున్న కారులో ఉన్న ప్రయాణికులు కూర్చుని ఉన్నప్పటికీ... వాహనంతో పాటు అదే వేగంతో ముందుకు వెళ్తున్నట్లే లెక్క. అలా వెళ్తున్న వాహనం దేన్నైనా గుద్దుకున్నా... హఠాత్తుగా వేగాన్ని కోల్పోయినా... అందులో ప్రయాణిస్తున్న వారు మాత్రం అదే వేగంతో ముందుకు వెళ్తారు. ఫలితంగా డ్యాష్ బోర్డ్స్ (ముందు సీట్లో వారు), ముందు సీట్లు (వెనుక కూర్చు న్న వారు) తదితరాలను అత్యంత వేగంగా ఢీ కొడతారు. ఒక్కోసారి వాహనం పల్టీలు కొడితే అద్దాల్లోంచి, డోర్ ఊడిపోయి అందులోంచి బయటకు వచ్చి పడిపోతారు. కాబట్టి సీట్‌బెల్ట్ వాడితే కేవలం పెద్ద ఎత్తున కుదుపు మాత్రమే ఉండి గాయాలతో బయటపడచ్చు. ...వారి ప్రాణాలు కాపాడిన ‘బెల్ట్’... మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి సహా నలుగురు ప్రయాణిస్తున్న కారు 2011 డిసెంబర్ 21న హైదరాబాద్ శివార్లలోని మెదక్ జిల్లా కొల్లూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రమాదానికి లోనైంది. ఆ సమయంలో కారు గంటకు 150 కిమీ వేగంతో ప్రయాణిస్తోంది. ఈ ప్రమాదంలో ప్రతీక్‌తో పాటు సుజిత్‌కుమార్, చంద్రారెడ్డి ఘటనాస్థలిలోనే మరణించారు. వెనుక సీట్లో కూర్చున్న ఆరవ్‌రెడ్డి సీట్ బెల్ట్ పెట్టుకోవడంతోనే మృత్యుంజయుడు అయ్యాడు. ప్రమాదం కారణంగా ఏర్పడిన కుదుపు ప్రభావంతో తలభాగం ఒక్కసారిగా ముందుకు దూసుకువచ్చింది. భుజం పైనుంచి సీట్‌బెల్ట్ ఉండటంతో ఆ ఒత్తిడి మెడపై పడింది. ఈ కారణంగానే ఆరవ్ రెడ్డికి ఆ భాగంలోనే గాయమైంది. అతడి శరీరంలో మరెక్కడా ఫ్యాక్చర్స్ సైతం ఏర్పడలేదు. 2016 మే 17న ఏపీ మాజీ మంత్రి, ఏపీ ఆప్కాబ్ ఛైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు ఓఆర్ఆర్ రెయిలింగ్‌ను బోల్తా కొట్టిన ఘటనలో ఆయన భార్య సాహిత్యవాణిì , డ్రైవర్ స్వామిదాసు అక్కడికక్కడే కన్నుమూశారు. సీటుబెల్ట్ పెట్టుకున్న నేపథ్యంలోనే వెంకటేశ్వరరావు ప్రాణాలతో బయటపడ్డారు. -
గులాబీ తీసుకో..సీటు బెల్టు పెట్టుకో
కర్నూలు : ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర చాలా ముఖ్యమని, సీటు బెల్టు ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచిస్తూ గులాబీ పూలు ఇచ్చి ఎస్పీ ఆకే రవికృష్ణ, రవాణా శాఖ ఉపకమిషనర్ ప్రమీల అవగాహన కల్పించారు. వీరి నేతృత్వంలో పోలీసులు, రవాణా శాఖ అధికారులు శనివారం సాయంత్రం కర్నూలు శివారులో వాహనాల తనిఖీ చేపట్టారు. సీటు బెల్టుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వమించారు. జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలను తనిఖీ చేస్తూ ప్రతి ఒక్క వాహనదారుడు సీటు బెల్టు ధరించి ప్రయాణించాలని సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ రామచంద్ర, నాల్గో పట్టణ సీఐ నాగరాజ రావు పాల్గొన్నారు. -
సుమారు 7లక్షల ఫోర్డ్ కార్లు...
ప్రముఖ కార్ల సంస్థ ఫోర్డ్ మోటార్ భారీ ఎత్తున సెడాన్ కార్లను రీకాల్ చేస్తోంది. సీట్ బెల్ట్ ఫంక్షనింగ్ లో సమస్య కారణంగా అమెరికా, ఉత్తర అమెరికాలో సుమారు 680,000 వాహనాలు వెనక్కి తీసుకుంటున్నట్టు శుక్రవారంవెల్లడించింది. ప్రమాదంలో సంభవించినపుడు సీటు బెల్టులు సరిగా పనిచేయకపోవడంతో ఈనిర్ణయం తీసుకున్నట్టుతెలిపింది. 2013-16 ఫోర్డ్ ఫ్యూజన్, 2015-16 ఫోర్డ్ మోండో, మరియు 2013-15 లింకన్ ఎంకేజే మోడల్ కార్లు ఉన్నట్టు కంపెనీ చెప్పింది. సాంకేతిక లోపం కారణంగా అధిక ఉష్ణోగ్రతల్లో సరిగా పనిచేయని సీటు బెల్టు సమస్యను పరిష్కరించేందుకు ఈ కార్లను రీకాల్ చేసింది. ప్రమాదం సమయంలో సీటు బెల్ట్, ఎయిర్ బ్యాగ్ సమన్వయం లోపం కారణంగా రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయన్నారు. -
విద్యార్థులను కాపాడిన సీటు బెల్టు
' కేఎల్‌యూ వద్ద కారు అదుపు తప్పి బోల్తా ' ఐదుగురికి గాయాలు .. ఒకరి పరిస్థితి విషమం వడ్డేశ్వరం (తాడేపల్లి రూరల్): తాడేపల్లి మండల పరిధిలోని వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీ సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువతులు, ఇద్దరు యువకులు గాయపడ్డారు. వీరంతా ఒకే కుంటుంబంలోని అన్నదమ్ముల పిల్లలు. ఇందులో ఒక యువకుడి పుట్టిన రోజు సందర్భంగా పార్టీ చేసుకున్నారు. అనంతరం యూనివర్సిటీని చూద్దామని వచ్చి ప్రమాదానికి గురయ్యారు. కారులో ఉన్న ఐదుగురిలో ముగ్గురు సీటు బెల్టు పెట్టుకోవడంతో చిన్న చిన్న గాయాలయ్యాయి. సీటు బెల్టు పెట్టుకోని ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరొకరికి కాలు విరిగినట్టు వైద్యులు తెలిపారు. సేకరించిన వివరాల ప్రకారం... జయసూర్య కేఎల్‌యూలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. పెదనాన్న కొడుకు మణికంఠ పుట్టిన రోజు కావడంతో సోదరిలు లక్ష్మీ తులసి, జయదుర్గ, మోహనకుమారిలను తీసుకుని ఓ హోటల్లో పార్టీ చేసుకున్నారు. అనంతరం జయసూర్య కాలేజీ చూడాలని సోదరిలు కోరడంతో మణికంఠ కారులో బయలు దేరారు. బకింగ్‌హామ్ కరకట్టపై వడ్డేశ్వరం వద్ద మూడు స్తంభాల సెంటర్‌కు వచ్చే సరికి పంట పొలాల నుంచి ఓ శునకం పరిగెత్తుకుంటూ రావడంతో దాన్ని తప్పించబోయి కారు అదుపు తప్పి, కరకట్ట కిందకు దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో సీటు బెల్టు పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్న మణికంఠకు స్వల్పగాయాలు కాగా, పొట్టకు స్టీరింగ్ ఒత్తుకు పోవడంతో చిన్నపాటి సర్జరీ నిర్వహించారు. అయితే జయసూర్య సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో తలకు తీవ్ర గాయమై చెవుల వెంట, ముక్కు వెంట రక్తం రావడంతో తలకు బలమైన గాయమైనట్టు వైద్యులు తెలిపారు. కాగా, లక్ష్మీ తులసి, మోహనకుమారిలు సీటు బెల్టు పెట్టుకోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. జయదుర్గ వీరి మధ్య కూర్చోవడంతో కారు బోల్తా పడినప్పుడు ఎడమ కాలు విరిగింది. సీటు బెల్టు పెట్టుకోవడం వల్లే ఒకరిపై ఒకరు పడకుండా ప్రమాదం తప్పిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనను చూసైనా ప్రతి ఒక్కరూ సీటు బెల్టు పెట్టుకుని డ్రైవింగ్ చేయాలని, టూ వీలర్‌పై వెళ్లేవారు హెల్మెట్ ధరించాలని మంగళగిరి రూరల్ సీఐ సురేష్‌బాబు విజ్ఞప్తి చేశారు. -
సీటు బెల్టు కాపాడింది..!
కొలనుకొండ (తాడేపల్లి రూరల్): జాతీయ రహదారిపై తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద ఇద్దరు యువతులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తూ పల్టీ కొట్టి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. అయితే సీటు బెల్టులు పెట్టుకున్న కారణంగా వారిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సేకరించిన వివరాల ప్రకారం... గుంటూరు వైపు నుంచి విజయవాడ వెళుతున్న మారుతి ఆల్టో కారులో ఇద్దరు యువతులు ప్రయాణిస్తున్నారు. అతి వేగంగా కారు నడపడంతో, కారు అదుపు తప్పి ముందు వెళుతున్న మరో కారును ఢీకొట్టి, జాతీయ రహదారి నుంచి 30 అడుగుల దూరంలో పంట పొలాల్లో పడిపోయింది. మూడు పల్టీలు కొట్టి, వెనుక, ముందు అద్దాలు పగలడంతోపాటు కారు క్యాబిన్ కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఓ యువతికి స్వల్ప గాయాలు కాగా, మరో యువతి తలకు గాయమైంది. ఇద్దరూ సీటు బెల్టు పెట్టుకోవడం వల్లే పెద్దగా గాయపడలేదని వారు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి ప్రమాదానికి కారణమైన ఇద్దరు యువతులు బస్సులో విజయవాడ వెళ్లిపోయారు. -
సీటు బెల్టే శ్రీరామ రక్ష
కారు ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడేది అదే.. తేలికపాటి వాహనాల ప్రతి మూడు ప్రమాదాల్లో రెండూ సీటు బెల్ట్ ధరించకపోవడంతోనే.. పిన్నమనేని కారు ప్రమాదమే ఇందుకు తాజా ఉదాహరణ లాల్‌జాన్ బాషా, శోభానాగిరెడ్డిల మృతికీ సీటు బెల్ట్ ధరించకపోవడమే కారణం సీటు బెల్ట్ విషయంలో వాహన చోదకులు చూపుతున్న చిన్న నిర్లక్ష్యం తమ విలువైన ప్రాణాలను హరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా తేలికపాటి వాహనాలకు జరుగుతున్న ప్రతి మూడు ప్రమాదాల్లో రెండూ సీటు బెల్ట్ ధరించకపోవడం వల్లేనని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కార్లు డ్రైవ్ చేస్తున్నప్పుడు, వాటిలో ప్రయాణిస్తున్నప్పుడు సీటు బెల్ట్ ధరిస్తే కలిగే లాభం, ధరించకపోతే కలిగే నష్టాలకు సోమవారం అర్ధరాత్రి ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై ఏపీ ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు వాహన ప్రమాదమే ఉదాహరణ. గంటకు 120 కి.మీ పైగా వేగంతో వెళ్తున్న ఆ వాహనం రెయిలింగ్‌ను (క్రాష్ బారియర్) ఢీకొట్టింది. ఈ ఘటనలో సీటు బెల్ట్ ధరించిన పిన్నమనేని సురక్షితంగా బయటపడగా, సీటు బెల్ట్ ధరించని ఆయన భార్య సాహిత్యవాణి, డ్రైవర్ స్వామిదాసు అక్కడిక్కడే మృతి చెందారు. - సాక్షి, సిటీబ్యూరో ఆ రెండు ఘటనల్లోనూ.. టీడీపీ ఉపాధ్యక్షుడు లాల్‌జాన్ బాషా, వైఎస్సార్సీపీ నేత శోభానాగిరెడ్డి ఇద్దరూ సీటు బెల్ట్ ధరించకపోవడం వల్లే కారు ప్రమాదాల్లో మృతి చెందారు. 2013 ఆగస్టు 15న హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తున్న లాల్‌జాన్ బాషా ఇన్నోవా వాహనం 150 కి.మీ వేగంతో వెళ్తూ జాతీయ రహదారి 65పై నార్కెట్‌పల్లి మండల కేంద్రం సమీపంలోని కామినేని ఆస్పత్రి జంక్షన్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. సీటు బెల్ట్ ధరించకపోవడంతో బాషా ఎగిరి బయటపడ్డారు. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. 2014 ఏప్రిల్ 24న ఆళ్లగడ్డ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శోభానాగిరెడ్డి మరణించారు. వేగంగా వెళ్తున్న ఈ వాహనం వరికుప్పను తప్పించే ప్రయత్నంలో పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. శోభా సైతం సీటు బెల్ట్ ధరించకపోవడంతో కారులో నుంచి ఎగిరి బయటపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సీటు బెల్ట్ ఎలా కాపాడుతుంది.? కారులో ప్రయాణిస్తున్న వారు అందులో కూర్చున్నప్పటికీ ఆ వాహన వేగంతో ముందుకు వెళ్తున్నట్లే లెక్క. అలా వేగంగా వెళ్తున్న వాహనం దేనినైనా ఢీకొట్టినా లేదా హఠాత్తుగా వేగం కోల్పోయినా అందులోని ప్రయాణికులు అదే వేగంతో ముందుకు వెళ్తారు. ఫలితంగా ముందు సీట్లో వారు డ్యాష్ బోర్డ్స్‌ను, వెనుక కూర్చున్న వారు ముందు సీట్లను అత్యంత వేగంగా ఢీకొడతారు. ఒక్కోసారి వాహనం పల్టీలు కొడితే అద్దాల్లోంచి, డోర్ ఊడిపోయి ఎగిరి బయట పడతారు. లాల్‌జాన్ బాషా విషయంలో కారులో ఉండగానే ఆయన కుడి కాలుకి డివైడర్ రాడ్ గుచ్చుకుంది. పల్టీల ప్రభావంతో ఆయన బయటపడేప్పుడు కాలు తెగిపోయింది కూడా. ఇలా పడటం ఫలితంగానే తల, ముఖం తదితర చోట్ల తీవ్రగాయాలై మృతి చెందారు. సీటు బెల్ట్ ధరిస్తే కేవలం పెద్ద ఎత్తున కుదుపు మాత్రమే ఉండి గాయాలతో బయటపడతారు. ఆరవ్రెడ్డిని కాపాడింది సీటు బెల్టే.. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి సహా నలుగురు ప్రయాణిస్తున్న కారు 2011 డిసెంబర్ 21న మెదక్ జిల్లా కొల్లూర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్‌పై ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారు గంటకు 150 కి.మీ వేగంతో ప్రయాణిస్తోంది. ఈ ప్రమాదంలో ప్రతీక్, సుజిత్‌కుమార్, చంద్రారెడ్డి ఘటనా స్థలిలోనే మరణించారు. వెనుక సీట్లో కూర్చున్న ఆరవ్‌రెడ్డి సీటు బెల్ట్ ధరించడంతో బతికి బయటపడ్డాడు. ప్రమాదం కారణంగా ఏర్పడిన కుదుపుతో తలభాగం ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చింది. అయితే భుజం పైనుంచి సీట్‌బెల్ట్ ఉండటంతో ఆ ఒత్తిడి మెడపై పడింది. అందుకే ఆరవ్రెడ్డికి ఆ భాగంలోనే గాయమైంది. కేవలం సీటు బెల్ట్ ధరించడం వలనే అతనికి మరెక్కడా గాయాలు కాలేదు. సీటు బెల్ట్, ఎయిర్‌బ్యాగ్స్‌కు లింకు.. కార్ల లాంటి వాహనాల్లోని భద్రతా ప్రమాణాలు సర్వకాల సర్వ వ్యవస్థల్లోనూ చోదకులు, ప్రయాణికులకు రక్షణ కల్పించేవిగా ఉండాలి. దేశంలో ఉన్న కార్లలో 70 శాతం లోఎండ్ మోడల్స్ కావడంతో ఎయిర్‌బ్యాగ్స్ సౌకర్యం ఉండదు. ఈ నేపథ్యంలో వాహన చోదకులు, అందులోని వారు కచ్చితంగా సీటు బెల్ట్ ధరించాలి. కొన్ని కంపెనీలకు చెందిన హైఎండ్ కార్లలో సీటు బెల్ట్, ఎయిర్‌బ్యాగ్స్‌కు మధ్య లింకు ఉంటుంది. డ్రైవర్ సీటు బెల్ట్ పెట్టుకోకపోతే ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్ యాక్టివేట్ కాదు. ఫలితంగా ప్రమాదం జరిగినా బ్యాగ్స్ ఓపెన్ కావు. ఏదేమైనా సీటు బెల్ట్ నిత్యం వాడటం మంచిది. - ఫెరోజ్, ఆటో కన్సల్టెంట్ -
సీట్‌బెల్ట్ వాడకే మృత్యువాత
సాక్షి, హైదరాబాద్: సీట్ బెల్ట్ పెట్టుకునే విషయంలో చూపుతున్న అశ్రద్ధే అనేక మంది పాలిట శాపంగా మారుతోంది. సీట్ బెల్ట్ వినియోగించని కారణంగానే ఔటర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో పిన్నమనేని భార్య , డ్రైవర్ మృతిచెందారు. పిన్నమనేని సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. గతంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లాల్‌జాన్ బాషా, వైఎస్సార్సీపీ నేత శోభానాగిరెడ్డి మృత్యువాతపడటానికీ సీట్ బె ల్ట్ ధరించకపోవడమే కారణం. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి కారు ఔటర్‌పై ప్రమాదానికి గురైనప్పుడు ఆయనతో పాటు మరో ఇద్దరు మరణించినా..సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండటంతో ఆరవ్‌రెడ్డి బయటపడ్డారు. సీట్ బెల్ట్ ఎందుకంటే..:కారులో ప్రయాణికులు కూర్చుని ఉన్నప్పటికీ.. వాహనంతో పాటు అదే వేగంతో వారూ ముందుకు వెళ్తున్నట్లే లెక్క. అలా వెళ్తున్న వాహనం హఠాత్తుగా వేగాన్ని కోల్పోయినా.. అందులో ప్రయాణిస్తున్న వారు మాత్రం అదే వేగంతో ముందుకు వెళ్తారు. దీంతో ముందు సీట్లో వారు డ్యాష్ బోర్డ్స్‌ను, వెనుక కూర్చున్న వారు ముందు సీట్లు తదితరాలను వేగంగా ఢీ కొడతారు. ఒక్కోసారి వాహనం పల్టీ కొడితే.. అద్దాల్లోంచి, డోర్ ఊడిపోయి అందులోంచి బయటకు వచ్చి పడిపోతారు. ఇలా పడటం వల్ల తీవ్రగాయాలపాలై మృత్యువాతపడుతుంటారు. అదే సీట్ బెల్ట్ వాడితే పెద్ద కుదుపునకు మాత్రమే గురై గాయాలతో బయటపడచ్చు. సీట్ బెల్ట్‌కు.. ఎయిర్ బ్యాగ్స్‌కు లింకు..! - పిన్నమనేని కారు ప్రమాదంలో తెరుచుకోని ఎయిర్‌బ్యాగ్స్ సాక్షి, హైదరాబాద్: ఔటర్‌పై ప్రమాదానికి గురైన ఏపీ ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ప్రయాణిస్తున్న వాహనం మిత్సుబిషి కంపెనీ పజేరో స్పోర్ట్ ఏటీ బీఎస్-4 మోడల్‌కు చెందింది. ఈ వాహనానికి ముందు సీట్లకు ఎదురుగా రెండు ఎయిర్‌బ్యాగ్స్ ఉంటాయి. వాహనం ప్రమాదానికి లోనైనప్పుడు తక్షణం అవి తెరుచుకుని డ్రైవర్‌తో పాటు పక్క సీటులో కూర్చున్న వారికీ ముప్పును తగ్గిస్తాయి. అయితే పిన్నమనేని ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైనా ఇవి తెరుచుకోలేదని, దీనికి కారణం ఏమిటనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ వీవీ చలపతి ‘సాక్షి’కి తెలిపారు. వాహనరంగ నిపుణులు మాత్రం లేటెస్ట్ మోడల్‌కు చెందిన ఈ తరహా కారుల్లో డ్రైవర్ సీటుబెల్ట్ ధరిస్తేనే ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ అయ్యేలా తయారీదారులు రూపొందించారని చెప్తున్నారు. పిన్నమనేని డ్రైవర్ ‘బెల్ట్’ పెట్టుకోకపోవడంతో... పిన్నమనేని ప్రయాణిస్తున్న కారులో ఆయన డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నారు. ఆయన సీట్ బెల్ట్ ధరించగా.. డ్రైవర్ స్వామిదాసుతో పాటు వెనుక కూర్చున్న భార్య సాహిత్యవాణి సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. పజేరో స్పోర్ట్ ఏటీ బీఎస్-4 మోడల్లో సీట్ బెల్ట్‌కు, ఎయిర్‌బ్యాగ్స్‌కు లింకు ఉంటుందని వాహనరంగ నిపుణులు చెప్తున్నారు. డ్రైవింగ్సీటులో ఉన్న వ్యక్తి కచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్ యాక్టివేట్ అవుతుందని అంటున్నారు. స్వామిదాస్ సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే.. ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రాణ నషం్ట తగ్గేదని వ్యాఖ్యానిస్తున్నారు. వాహనానికి సంబంధించి ఎయిర్‌బ్యాగ్స్ అంశాన్ని నిత్యం పరీక్షించుకోవడం కూడా ఉత్తమమని నిపుణులు చెప్తున్నారు. -
రేపటి నుంచి హెల్మెట్ ధారణ తప్పనిసరి
విశాఖ రేంజి డీఐజీ రవిచంద్ర చోడవరం: ఆగస్టు ఒకటో తేదీ నుంచి విశాఖ కార్పొరేషన్, అన్ని మున్సిపాలిటీలు, మేజర్ పంచాయతీల్లో వాహనచోదకులు విధిగా హెల్మెట్, సీట్ బెల్టు ధరించాలని విశాఖ రేంజి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఎ.రవిచంద్ర పేర్కొన్నారు. చోడవరం పోలీసు సర్కిల్ కార్యాలయాన్ని గురువారం పరిశీలించారు. సర్కిల్ పరిధిలోని చోడవరం, బుచ్చెయ్యపేట, మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు మండలాల పోలీసు అధికారులతో నేరాలు, ఇతర అంశాలపై సమీక్షించారు. అనంతరం డీఐజీ విలేకరులతో మాట్లాడుతూ తన పరిధిలోని మూడు జిల్లాల్లో కొత్తగా పోలీసు స్టేషన్ల ఏర్పాటు ప్రతిపాదన లేదని, ఉన్న వాటిని బలోపేతానికి కృషిచేస్తున్నామన్నారు. సిబ్బంది కొరత ఉందని, వచ్చే సెప్టెంబరులో 68మంది ఎస్ఐలు, 25మంది ఆర్ఎస్ఐలు ట్రైనింగ్‌పూర్తిచేసుకొని కొత్తగా విధుల్లోకి రానున్నారన్నారు. వారిని అవసరమైన పోలీసు స్టేషన్లకు కేటాయిస్తామన్నారు.ప్రతి పోలీసు స్టేషన్లో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను నియమించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. యలమంచిలి సర్కిల్ పరిధి పెద్దదిగా ఉందని, దీనిని యలమంచిలి, నక్కపల్లిలా రెండుగా విభజించే ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపామని డీఐజీ చెప్పారు. గిరిజనుల నాశనమే పోరాట సిద్ధాంతమా? గిరిజనుల అభివృద్ధిని అడ్డుకోవడమే మావోయిస్టుల పోరాట సిద్ధాంతమా అని డీఐజీ ప్రశ్నించారు. గిరిజనులు పోలీసులకు ఇన్ఫార్మర్లు కాదని, మావోయిస్టులకు అన్ని విధాలా ఆశ్రయం ఇస్తున్నారన్నారు. గిరిజనులనే మావోయిస్టులు చిత్రహింసలకు గురిచేస్తూ కిడ్నాప్‌లు, కాల్చేయడాలు చేస్తున్నారన్నారు. అమాయక గిరిజనుల అభివృద్ధిని అడ్డుకోవడమే మావోయిస్టుల పోరాట లక్ష్యమా అని ప్రశ్నించారు. అభివృద్ధి పనుల కోసం వినియోగించే యంత్రాలను తగులబెట్టడం సరికాదన్నారు. ఇటీవల చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌కు ఏ ఇన్ఫార్మర్ సాయం లేదని, పోలీసుల సాధారణ కూబింగ్‌లో మావోయిస్టులు ఎదురైనప్పుడు జరిగిన కాల్పులు మాత్రమేనని ఆయన చెప్పారు. గంజాయి స్మగర్లతో పోలీసు అధికారులు కుమ్మక్కవుతున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నది మావోయిస్టులే అన్నారు. నిజంగా ఏజెన్సీలో గంజాయిని నిర్మూలించాలనే లక్ష్యం మావోయిస్టులకు ఉంటే వారి సమీపంలో ఉన్న తోటలను వారే ధ్వంసం చేయాలని డీఐజీ కోరారు. సమావేశంలో అనకాపల్లి డీఎస్పీ పురుషోత్తం,చోడవరం సీఐ కిరణ్‌కుమార్ ఉన్నారు. -
సీట్‌బెల్ట్, ఎయిర్‌బ్యాగ్‌లతో మరో లాభం
నోఫియర్ విత్ బ్యాగ్ ఆఫ్ ఎయిర్ కారు డ్రైవింగ్ చేసే సమయంలో పెట్టుకునే సీట్‌బెల్ట్ యాక్సిడెంట్స్‌లో డ్రైవర్ ప్రాణాలు కాపాడుతుందన్న విషయం తెలిసిందే. దీనికి తోడు యాక్సిడెంట్ జరిగిన మరుక్షణం ఎయిర్‌బ్యాగ్ తెరచుకొని, అది వాహనం నడిపే వ్యక్తి జీవితాన్ని రక్షిస్తుందన్న విషయమూ తెలిసిందే. ఒక అంచనా ప్రకారం... ఈ ఎయిర్‌బ్యాగ్ వ్యాకోచించి డ్రైవర్ ఛాతీని, తలను ఆవరించి, వాటిని రక్షిస్తుంది కాబట్టి, కీలకమైన ఈ అవయవాలకు రక్షణ దొరకడంతో ప్రాణగండం తప్పుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ డ్రైవింగ్ చేసే వ్యక్తి మూత్రపిండాలనూ కాపాడుతుంది ఈ ఎయిర్‌బ్యాగ్. ఈ విషయాన్ని అమెరికన్ యూరలాజికల్ అసోసియేషన్‌కు చెందిన అధ్యయన వేత్తలు నిరూపించారు. 2,87,174 మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ సంగతి తెలిసింది. ఇందులో యాక్సిడెంట్ కాగానే ఎయిర్‌బ్యాగ్ విచ్చుకోవడం వల్ల 2,580 మంది కిడ్నీలకు రక్షణ లభించింది. -
కుర్ర చేష్టలతో వీక్ ఎండ్ లో పెను ప్రమాదాలు
నగర ట్రాఫిక్ అసలే నరకాన్ని తలపిస్తుంది. వీకెండ్ సమయాల్లోనైతే పరిస్థితి మరీ దారుణం. వారాంతపు సరదాల కోసం కుర్రకారంతా తమ వాహనాలను కళ్లాలు విడిచిన గుర్రాల్లా యథేచ్ఛగా పరుగులు తీయిస్తారు. బిజీబిజీగా ఉండే గజిబిజి రోడ్లపై సైతం రకరకాల విన్యాసాలు సాగిస్తారు. కనీసం హెల్మెట్లయినా ధరించకుండా, బైకులతో శరవేగంగా దూసుకుపోతారు. సీటు బెల్టులైనా పెట్టుకోకుండానే కార్లతో రేసులాడతారు. ఇలాంటి చేష్టలే పెను ప్రమాదాలకు దారితీస్తున్నాయి. పలువురి ప్రాణాలను బలిగొంటున్నాయి. కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. కుర్ర చేష్టలతో పెను ప్రమాదాలు 4,230 గత ఐదున్నరేళ్లుగా వీకెండ్ ప్రమాదాలు .వీరిలో యువతే అధికం.. ట్రాఫిక్ ఉల్లంఘనలు షరామామూలే 2,949 ఆరేళ్లలో నగరంలో రోడ్డు ప్రమాద మృతులు 15,295 మూడేళ్లలో డ్రంకెన్ డ్రైవ్‌లో చిక్కిన యువత బిరుద రాజు వాసుదేవ రాజు/హైదరాబాద్ హాలిడేను ఇంటిల్లిపాదితో కలసి జాలిడేగా గడపాలనుకున్న సిటిజన్ల ఆశలను రోడ్డు ప్రమాదాలు చిదిమేస్తున్నాయి. చాలీచాలని రహదారులు... పెరుగుతున్న వాహనాలు.. ప్రమాదకరమైన డ్రైవింగ్.. మితిమీరిన వేగం... వెరసి నగర రహదారులు నిత్యం నెత్తురోడుతున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే వారాంతాలైన శని, ఆదివారాల్లో ప్రమాదాల సంఖ్య ఏటేటా పెరుగుతున్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీకెండ్ సరదాకు మిత్రులతో కలసి ఔటర్‌పై రయ్‌మని దూసుకుపోయే కుర్రకారు క్షణాల్లో సమిధలుగా మారుతుండడంతో కన్నవారికి పుట్టెడు శోకం మిగులుతోంది. రోడ్డు ప్రమాదాల్లో అసువులు బాసిన వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకుంటున్నాయి. గత ఐదున్నరేళ్లుగా శని, ఆదివారాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 4,230 మంది మృత్యువాత పడ్డారంటే వీకెండ్ ప్రమాదాల తీవ్రత ఎంతుందో అర్థం చేసు కోవచ్చు. ఇక ప్రమాదకర డ్రైవింగ్ కేసులు గత నాలుగున్నరేళ్లుగా 40,325 నమోదయ్యాయంటే... భాగ్యనగరంలో రహదారి భద్రత తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా మరోవైపు నగర శివార్లలో వందలాదిగా విస్తరించిన వృత్తివిద్యా కళాశాలలు, ఇంజనీరింగ్, ఫార్మా, మేనేజ్మెంట్, ఎంసీఏ కాలేజీల విద్యార్థులకు... వారి తల్లిదండ్రులు మార్కెట్లోకి వస్తున్న కొత్తకొత్త వాహనాలను కొనిస్తున్నారు. ఈ ఆధునిక వాహనాలే ఇప్పుడు విద్యార్థుల పాలిట యమపాశాలవుతున్నాయి. కనీస భద్రతా చర్యలు విస్మరిస్తుండడం, హెల్మెట్లను భారంగా భావిస్తుండడం.. ప్రమాదం జరిగిన వెంటనే (గోల్డెన్ అవర్- 30 నిమిషాల్లోగా) వారిని ట్రామా కేర్ సెంటర్లకు తరలించకపోవడంతో యువకుల జీవితాలు అర్ధంతరంగా చితికిపోతున్నాయి.శివారు ప్రాంతాలకు సరైన ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడం, ఆ దిశగా పాలకులెవరూ చర్యలు తీసుకోకపోవడంతో... విద్యార్థులు సొంత వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి. రహదారులపై ప్రమాదాలు పెరగడానికి ఇదీ ఓ ముఖ్య కారణం. యూత్ ఉల్లంఘనలు ఇవే.. ► సిగ్నల్ జంపింగ్ ► ఓవర్‌స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ ► సెల్‌ఫోన్ మాట్లాడుతూ ► డ్రంకన్ డ్రైవింగ్ ► రాంగ్‌సైడ్ డ్రైవింగ్ ► ట్రిపుల్ రైడింగ్ ► ప్రమాణాలకు విరుద్ధంగా ఉండే హారన్లతో సౌండ్ పొల్యూషన్ లైన్ డిసిప్లిన్‌పై దృష్టి... రాజధానిలోని రోడ్లపై లైన్ డిసిప్లిన్‌ను అమలు చేయడం ద్వారా వాహనాల ప్రయాణ వేగాన్ని పెంచి, గమ్యం చేరే సమయాన్ని తగ్గించవచ్చు. ముంబైలో ఈ విధానం మంచి ఫలితాలనిచ్చింది. ట్రాఫిక్ ఉల్లంఘనులను కట్టడి చేయడం వల్ల కూడా ప్రమాదాలు, ప్రాణ నష్టాన్ని అరికట్టవచ్చు. ఇప్పుడు గ్రీన్‌లైట్-రెడ్‌లైట్ మధ్య సిగ్నల్‌ను 100 వాహనాలు దాటితే...లైన్ డిసిప్లేన్ అమలుతో 150కి పైగా దాటేలా చేయవచ్చు. ఫలితంగా వాహనాల ప్రయాణ వేగం పెరిగి, గమ్య స్థానాలకు చేరడానికి పట్టే సమయాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. లైన్ డిసిప్లేన్ విధానాన్ని పరిచయం చేయడానికి ముందు కొన్ని మౌలిక వసతుల్ని మెరుగుపర్చడంతో పాటు ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాల్సి ఉంది. - ట్రాఫిక్ చీఫ్ జితేందర్ డ్రంకెన్ డ్రైవ్ 26,047 పోలీసులకు చిక్కిన యువత తనిఖీలు ప్రారంభం : 2011 నవంబర్ నేటి వరకు నమోదైన మొత్తం కేసులు : 32,125 జైలు శిక్ష పడింది(వీరిలో మహిళలు 46 మంది) : 1,759 బైక్‌పై వెళ్తూ పట్టుబడినవారు : 23071 ఆటో డ్రైవర్లు : 1384 కారు డ్రైవర్లు : 7403 ఇతర వాహనాలు : 267 వసూలైన మొత్తం జరిమానా : రూ.5,78,05,552 పట్టుబడిన వారిలో... ఏజ్ గ్రూప్ నమోదైన కేసులు 18-20 625 21-30 15295 31-40 10752 41-50 4178 51-60 1127 61-70 146 కేసులివీ... ఏడాది కేసులు జైలుశిక్ష జరిమానా 2011 1700 - రూ.31,15,600 2012 10813 27 రూ.2,21,25,000 2013 13476 1234 రూ.2,37,71,420 2014 6136 498 రూ.78,58,733 ప్రముఖులూ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు - 488 ప్రయివేటు ఉద్యోగులు - 10756 న్యాయవాదులు - 185 డాక్టర్లు - 213 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు - 837 ప్రెస్ -127 డ్రైవర్లు -3574 బ్లూకాలర్స్ - 8279 వ్యాపారులు - 5618 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు - 92 విద్యార్థులు - 1720 బ్యాంకు ఉద్యోగులు - 144 టీచర్లు - 29 మాజీ పోలీసులు - 63 మార్గదర్శకాలు... → హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి → ఫ్యూయల్ ట్యాంకుపై పిల్లలను కూర్చోపెట్టవద్దు → స్కూటర్ల వంటి వాహనాల్లో ముందు వైపు ఖాళీగా ఉండేచోట పిల్లలను నిలబెట్టవద్దు → డ్రైవింగ్ లెసైన్స్ సహా ముఖ్యమైన పత్రాలను మరచిపోవద్దు → మద్యం సేవించి వాహనాన్ని నడపొద్దు → డ్రైవింగ్ చేస్తుండగా మొబైల్ ఫోన్లో మాట్లాడొద్దు → పరిమితిని మించిన వేగంతో పోవద్దు → ట్రాఫిక్ సిగ్నల్స్‌ను, బోర్డులను, సంకేతాలను గమనించి, వాటికి అనుగుణంగా వాహనాలు నడపండి → రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులు ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకుని, వాటికి అనుగుణంగా ముందుకు సాగండి → ట్రాఫిక్ జామ్ అయినప్పుడు, నెమ్మదిగా ముందుకు సాగుతున్నప్పుడు దూసుకుపోయే ప్రయత్నాలు చేయొద్దు. → జీబ్రా క్రాసింగ్స్ వద్ద వాహన వేగం తగ్గించండి. → రోడ్డుపై వాహనాన్ని పార్క్ చేయవద్దు. పే అండ్ పార్క్ సేవలను ఉపయోగించుకోండి. → మితిమీరిన లగేజీ, ప్రయాణికులతో వాహనాన్ని ఓవర్‌లోడ్ చేయకండి. → అకస్మాత్తుగా బ్రేకులు వేయడాన్ని, దూకుడుగా వేగం పెంచడాన్ని నివారించండి. → డ్రైవింగ్ చేస్తున్నప్పుడు క్లచ్‌ను ఫుట్రెస్ట్గా ఉపయోగించుకోవద్దు. రాత్రివేళే ఎక్కువ... జనవరి 1, 2014 నుంచి ఏప్రిల్ 30 వరకు ఘోరమైనవి జూన్ 20, 2010 నటుడు కోట శ్రీనివాసరావు కుమారుడు కోట ప్రసాద్ దుర్మరణం సెప్టెంబర్ 11, 2011 మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ కుమారుడు అయాజుద్దీన్ దుర్మరణం నవంబర్ 23, 2011 సైబరాబాద్ ఎస్ఓటీ ఎస్సై వీసీ విజ్జు దుర్మరణం డిసెంబర్ 20, 2011 మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు సహా ముగ్గురి మృత్యువాత మే 9, 2012 సీడ్స్ కంపెనీ డెరైక్టర్ పిచ్చిరెడ్డి దుర్మరణం స్కూల్/కాలేజ్ జోన్స్ పరిధిలో... గడిచిన ఆరేళ్లలో 3786 ప్రమాదాలు, 3786 మంది క్షతగాత్రులు ఔటర్ రింగ్‌రోడ్డుపై గడిచిన మూడేళ్లలో 137 ప్రమాదాలు, మృతులు 173 ట్రాఫిక్ ఉల్లంఘనలు ఇలా... రాష్ డ్రైవింగ్ 2012 ⇒ కేసులు : 7,594 జరిమానా : 75,94,000 2013 ⇒ కేసులు : 11,126 జరిమానా : 1,11,26,000 ఓవర్ స్పీడ్ 2012 ⇒ కేసులు : 4843 జరిమానా : 48,43,000 2013 ⇒ కేసులు : 12,770 జరిమానా : 1,27,70,000 సిగ్నల్ జంపింగ్ 2012 ⇒ కేసులు : 66,260 జరిమానా : 6,62,60,000 2013 ⇒ కేసులు : 75,323 జరిమానా : 7,53,23,000 ట్రిపుల్ రైడింగ్ 2012 ⇒ కేసులు : 10,720 జరిమానా : 1,07,20,000 2013 ⇒ కేసులు : 12,472 జరిమానా : 1,24,72,000 నో పార్కింగ్ 2012 ⇒ కేసులు : 4,16,956 జరిమానా : 41,69,56,000 2013 ⇒ కేసులు : 4,57,899 జరిమానా : 45,78,99,000 సీటు బెల్టు లేకుండా.. 2012 ⇒ కేసులు : 348 జరిమానా : 3,48,000 2013 ⇒ కేసులు : 345 జరిమానా : 3,45,000 హెల్మెట్ లేకుండా.. 2012 ⇒ కేసులు : 812 జరిమానా : 8,12,000 2013 ⇒ కేసులు : 503 జరిమానా :5,03,000 సెల్‌ఫోన్ డ్రైవింగ్ 2012 ⇒ కేసులు: 15,058 జరిమానా : 1,50,58,000 2013 ⇒ కేసులు : 24607 జరిమానా : 2,46,07,000 -
సీటు బెల్టు ధరిస్తే ముండేకి ప్రాణాపాయం తప్పేది
సాక్షి, న్యూఢిల్లీ: సీటు బెల్టు ధరిస్తే గోపీనాథ్ ముండేకి ప్రాణాపాయం తప్పేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు. వాహన ప్రయాణం చేసేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు తమ మంత్రిత్వశాఖ త్వరలో ప్రచార ఉద్యమం చేపట్టనుందన్నారు. ముండే అంత్యక్రియల్లో పాల్గొనడం కోసం బుధవారం మహారాష్ట్రలోని బీడ్‌కు బయల్దేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. సీటు బెల్టు ధరించి ఉన్నట్టయితే ముండే ప్రాణాలు దక్కేవని, సీటు బెల్టు అలంకారప్రాయమేనన్న అపోహ కారణంగా తాను మంచి స్నేహితుడిని కోల్పోయానన్నా రు. వెనుక సీట్లలో ఉండేవారు బెల్టులు కేవలం అలంకారప్రాయమేనని చాలామంది అనుకుంటారని, అయితే నిజానికి ముందు సీట్లలో ఉన్న సీటు బెల్టు ధరించడం ఎంత ముఖ్యమో వెనుక సీట్లలో ప్రయాణించేవారు కూడా ధరించడం అంతే ముఖ్యమని ఆయన చెప్పారు. ఇందుకోసం స్వయంసేవా సంస్థల సహకారంతో ప్రచారం చేసే అంశాన్ని పరిశీ లిస్తున్నట్లు ఆయన చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో చిన్నారుల మరణాలు, తల్లిదండ్రుల మరణం వల్ల అనాథలుగా మారే చిన్నారుల గురించి ప్రధానంగా ప్రచారం చేస్తామన్నారు. పిల్లలు సరైన వ్యక్తులను ఆదర్శంగా తీసుకోరని, అయితే వాహనాలను నిర్లక్ష్యంగా నడిపేవారిని ఆరాధించేలా చూడడానికి బదులు సరైన జీవన శైలిని గురించి వారికి తెలియజెప్పాలని ఆయన అభిప్రాయపడ్డారు. ముండేవిషాద, అకాల మర ణం వాహన చోదకులకు మేల్కొలుపు కావాలని ఆయన చెప్పారు. సీటు బెల్టు ప్రాధాన్యాన్ని గుర్తించకపోవడంవల్ల జరిగే ప్రమాదాల్లో మరణించిన వ్యక్తుల ఆప్తులు అనుభవించే బాధ ఎలాంటిదనే విషయం తనకు ముండే మరణంతో తెలిసొచ్చిం దని ఆయన చెప్పారు. సీటు బెల్టు ధరించినట్లయితే డయానా, సాహెబ్ సింగ్ వర్మ ప్రాణాలకు ముప్పు వాటిల్లేదికాదని ఆయన గుర్తుచేసుకున్నారు. -
'సీటు బెల్ట్ పెట్టుకుంటే బతికేవారు'
న్యూఢిల్లీ: కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీటు బెల్ట్ పెట్టుకునివుంటే గోపీనాథ్ ముండే బతికేవారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ అభిప్రాయపడ్డారు. సీటు బెల్ట్ ప్రాణాలను కాపాడుతుందా అనే నిర్లక్ష్య భావన వల్లే తన స్నేహితుడు ముండేను కోల్పోయానని చెప్పారు. కారు వెనుక సీటుకు ఉండే బెల్టులు అలంకారప్రాయయని చాలా మంది భావిస్తుండడం దురదృష్టకరమని అన్నారు. కారులో ప్రయాణించే వారందరూ సీటు బెల్ట్ పెట్టుకోవడం అవసరమని గట్టిగా చెప్పారు. సీటు బెల్ట్ పెట్టుకోవడం ద్వారా కొన్ని ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయటపడొచ్చని పేర్కొన్నారు. వాహనాల్లో ప్రయాణించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై త్వరలో చైతన్య కార్యక్రమాలు చేపడతామని హర్షవర్థన్ తెలిపారు. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే వైఎస్ఆర్ సీపీ నాయకురాలు శోభా నాగిరెడ్డి, టీడీపీ నేత లాల్ జాన్ భాషా మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అయినా.. ‘కిక్కు’ డ్రైవింగే...!
= జైలు శిక్షలు పడుతున్నా మారని వాహనదారుల ధోరణి = ఈ ఏడాది ఇప్పటి వరకు ‘డ్రంకన్ డ్రైవ్’ కేసుల నమోదు 11,767 = 1010 మందికి జైలు శిక్ష సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరిగి పోతోంది. వీటిలో 80 శాతం ప్రమాదాలు మానవ తప్పిదం వల్లే జ రుగుతున్నాయి. అతివేగం వల్ల కొందరు.. డ్రై వింగ్‌పై సరైన అవగాహన లేకపోవడంతో మ రికొందరు.. మద్యం మత్తులో వాహనాలు నడి పి ఇంకొందరు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదకరస్థాయిలో మద్యం తాగి వాహనాలు నడిపే వా రికి చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు ‘డ్రం కన్ డ్రైవ్’ తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసులకు చిక్కిన వారికి న్యాయస్థానాలు జైలుశిక్ష, జరిమానా విధిస్తున్నాయి. అయినా వాహనదారుల ధోరణిలో మాత్రం మార్పు రావడంలేదు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నమోదైన 11,767 డ్రంకన్ డ్రైవ్ కేసులే ఇందుకు నిందర్శనం. వీరిలో 1010 మందికి కోర్టు జైలు శిక్ష విధించడం గమనార్హం. మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ బి.చెంగల్రాయనాయుడు ఈ మంగళవారం 18 మందికి మూడు రోజుల చొప్పున శిక్ష విధించారు.దీంతో జైలు శిక్షపడిన ‘నిషా’ చరుల సంఖ్య వెయ్యికి పెరిగింది. ‘ఆర్ఎస్-10’లో భాగంగా ‘డ్రంకన్ డ్రైవ్’.. ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆర్ఎస్-10 పేరిట ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. తక్కువ, మధ్య తరగతి ఆదాయం కలిగిన 10 దేశాలను ఎంపిక చేసుకుని అక్కడ ఈ ప్రాజెక్టుఅమలు చేస్తోంది. హెల్మెట్ వినియోగం పెంచడం, సీట్ బెల్ట్ తప్పనిసరి చేయడం, డ్రంకన్ డ్రైవింగ్ (తాగి వాహనం నడపడం) నియంత్రణ, స్పీడ్ మేనేజ్మెంట్, ట్రామా కేర్, డేటా సిస్టమ్స్ అభివ ృద్ధి ఈ ప్రాజెక్ట్ లక్ష్యాలు. మన దేశంలో ఈ పెలైట్ ప్రాజెక్ట్ హైదరాబాద్‌తో పాటు జలంధర్ (పగ్వారా టౌన్)లో అమలవుతోంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యల ఆధారంగా కొన్ని అంశాలకు ప్రాధాన్యం ఇస్తోంది. హైదరాబాద్‌లో డ్రంకన్ డ్రైవింగ్‌పై ద ృష్టి పెట్టింది. ఈ ప్రాజెక్ట్ నిధులతో అత్యాధునిక బ్రీత్ అనలైజర్లతో 2011 నవంబర్ 4 నుంచి నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ‘డ్రంకన్ డ్రైవ్’ తనిఖీలు మొదలెట్టారు. తొలినాళ్లల్లో కోర్టులో హాజరుపరచగా కేవలం జరిమానా విధించేవారు. ఆ తర్వాత జైలు శిక్షలు వేయడం ప్రారంభమైంది. 2011 నవంబర్ 4-డిసెంబర్ 31 మధ్య 1677 కేసులు నమోదు కాగా... జైలు శిక్షలు లేవు. 2012లో 10813 కేసులు నమోదు కాగా... కేవలం 27 మందికే జైలు శిక్ష పడింది. మార్పు రాకపోవడంతో... వాహనచోదకుల ధోరణిలో మార్పు రాకపోవడంతో న్యాయస్థానం ఈ ఏడాది కఠిన వైఖరి అవలంభించడం ప్రారంభించింది. మోటారు వాహనాల చట్ట ప్రకారం ప్రతి 100 మిల్లీలీటర్ల రక్తంలో 30 మిల్లీగ్రాములు, అంతకంటే ఎక్కువ ఉంటేనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో 100 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ కౌంట్ వచ్చిన వారిని జైలుకు పంపడం ప్రారంభించారు. దీంతో ఈ ఏడాది జనవరి 1 నుంచి మంగళవారం (నవంబర్ 27) వరకు 11,767 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడగా... వీరిలో 1010 మందికి జైలు శిక్ష విధించారు. ఈ చట్ట ప్రకారం వాహన చోదకుడు అత్యంత ప్రమాదకర స్థాయిలో మద్యం తాగినట్టు నిర్ధారణ అయితే న్యాయమూర్తి భావిస్తే 2 నెలల వరకు జైలు శిక్ష వేసే అవకాశం ఉంది. రెండోసారీ ఇదే రకమైన ఉల్లంఘన/నేరం చేసి చిక్కితే... రూ.3 వేల ఫైన్ లేదా రూ.రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది. వాహనచోదకుడు తాగిన మద్యం స్థాయిని బట్టి ఒక రోజు నుంచి 15 రోజల వరకు జైలు శిక్ష పడుతోంది. ట్రాఫిక్ ఠాణాల వద్ద 450 వాహనాలు... మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారిలో ఎక్కువ మోతాదు కౌంట్ చూపించిన వారికి న్యాయస్థానం జైలు శిక్ష విధిస్తుండటంతో భయపడిన కొందరు ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే కౌన్సెలింగ్‌కు వెళ్లకపోవడమే కాకుండా తమ వాహనాలకు పోలీసుల వద్దే వదిలేస్తున్నారు. గడిచిన రెండేళ్ల కాలంలో ఈ కోవకు చెందిన దాదాపు 450 కార్లు/ద్విచక్ర వాహనాలు, ఆటోలు ఆయా ట్రాఫిక్ ఠాణాల్లో పడి ఉన్నాయి. ఇలా చేస్తే ఉత్తమం... ‘‘మద్యం తాగినా తాము కంట్రోల్లో ఉన్నామని అనేక మంది వాదిస్తున్నారు. ఏదేమైనా ఆ సం దర్భంలో ఎట్టిపరిస్థితుల్లోనూ డ్రైవింగ్ చేయొద్దు. కొంత మంది కలిసి ఫంక్షన్‌కు వెళ్తే వారిలో ఒకరు డ్రైవిం గ్ చేసేందుకు వీలుగా మద్యం తాగరాదు. వాహనం నడిపేందుకు గంటల లెక్కన డ్రైవర్ల నియమించుకోవాలి. ఆటోరిక్షాలు, క్యాబ్స్‌ను ఆశ్రయించడం ఉత్తమం’’ - ఎం.శ్రీనివాసులు, టీటీఐ ఇన్స్పెక్టర్