వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలు
ఆ యువకుడు తనకు నచ్చిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. శ్రీవారి మొక్కు తీర్చుకు నేందుకు భార్య, తల్లి, సమీప బంధువులతో కలిసి సంతోషంగా బయలుదేరారు. ఆ సం తోషం ఎంతో సేçపు నిలవలేదు. విధి చిన్న చూపు చూడడంతో భార్యను, తల్లిని పోగొట్టు కున్నాడు. తాను కూడా ప్రాణాలతో కొట్టుమి ట్టాడుతున్నాడు. నారాయణవనం మండలం తుంబూరు సమీపంలో సోమవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
నారాయణవనం: భద్రతకోసం పెట్టుకున్న సీటు బెల్ట్ నవ వధువు అముదవళ్లి, డ్రైవర్ మృతికి మృతికి కారణమైంది. నారాయణవనం మండలం తుంబూరు వద్ద సోమవారం ఉదయం బస్సు, జైలో వాహనం ఢీకొనడంతో వాహనం డోర్లు తెరచుకోవడంతో సతీష్, శకుంతల, ఉలగనాథన్, తమిళరసి విసురుగా రోడ్డుపైకి పడిపోయారు. సీటు బెల్ట్ ఉన్న కారణంతో అముదవళ్లి బయటపడలేక పోయింది. ముందుభాగం పూర్తిగా దెబ్బతినడంతో డ్రైవర్ కన్నదాసన్‌తో పాటు అముదవళ్లి వాహనంలోనే ప్రాణాలు వదిలారు. లేనిపక్షంలో డోరు ఓపెన్ కాగానే అందరూ బయట పడిపోయి తీవ్ర గాయాలతో బయటపడేవారని స్థానికులు పేర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు.
మృతదేహాలను బయటకు తీస్తున్న స్థానికులు, పోలీసులు
దేవుడే కాపాడాడు
జైలో వాహనం వెనుకనే మోటార్ సైకిల్‌పై పుత్తూరుకు వస్తున్న నిండ్ర మండలం ఎలకాటూరు దళితవాడకు చెందిన వెంకటేష్, కృష్ణమూర్తి ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. వేగంగా వెళుతున్న బస్సు, జైలో వాహనాలు ఢీకొనడంతో బస్సు రోడ్డుకు ఎడమ వైపునకు వెళ్లి ఆగిపోయిందన్నారు. జైలో వాహనం రోడ్డుపై తిరుగుతూ వెనుకనే వస్తున్న తమను ఢీకొందని తెలిపారు. తాము ప్రమాదాన్ని ఊహించి పక్కనే ఉన్న వ్యవసాయ పొలాల్లోకి దూకేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment