ఇలా కూడా బరువు తగ్గొచ్చా! విమానంలో వెళ్లాలని.. | Man Succeed After Losing 100Lbs Now He Can Fly In Flight | Sakshi
Sakshi News home page

ఇలా కూడా బరువు తగ్గొచ్చా! విమానంలో వెళ్లాలని..ట్వీట్‌ వైరల్‌

Published Fri, May 19 2023 9:24 PM | Last Updated on Fri, May 19 2023 9:39 PM

Man Succeed After Losing 100Lbs Now He Can Fly In Flight - Sakshi

చాలామంది బరువు తగ్గడానికి రకరకాల డైట్‌లు ఫాలో అవుతారు. కొన్ని రోజులు ఏదో సీరియస్‌గా చేసి వదిలేస్తాం. మరికొందరూ బరువు తగ్గడం కోసం డైట్‌ మార్చుకుని మరీ ఇష్టమైన ఫ్యాటీ ఆహార పదార్థాలను కూడా త్యాగం చేస్తారు. బరువు తగ్గడానికి ఇవి కాదు ముఖ్యం అంటున్నాడు ఇక్కడొక వ్యక్తి. కేవలం సీరియస్‌నెస్‌, నిబద్ధత అనేవి ఉంటే ఎవ్వరైన అవలీలగా కిలోలకిలోలకు తగ్గిపోవచ్చని నిరూపించాడు సదరు వ్యక్తి. అందుకు సంబంధించిన విషయం నెట్టింట తెగ హల్‌చల్‌  చేస్తోంది.

డేవ్‌ ఎదన్నా అనే ట్విట్టర్‌ వినియోగదారుడు అధిక బరువుతో బాధపడుతున్నాడు. డైట్‌ చేసినా తగ్గుతాడని అనుకోలేం అంత హెవీగా ఉంది శరీరం. ఆ శరీరమే అతన్ని విమానంలో ప్రయాణించేందుకు ఇబ్బందిపెట్టింది. అంత భారీకాయంతో విమానంలోని సీటులో కూర్చొ లేక సీటు బెల్ట్‌ పట్టక నానా ఇబ్బందులు పడ్డాడు. ఇక జీవితంలో విమానంలో ప్రయాణించడం కలేనేమో అనేంత భయం వేసింది డేవ్‌కి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బరువు తగ్గడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.

ఎలాగైన బరువు తగ్గి విమానంలో వెళ్లాలి అదే అతని జీవిత ‍ధ్యేయం అన్నంతగా అంకితభావంతో కష్టపడ్డాడు. ఏకంగా 10 నెలల్లో సుమారు 45 కేజీల బరువు తగ్గి ఔరా! అనిపించుకున్నాడు. ఈ మేరకు డేవ్‌ ట్విట్టర్‌ వేదికగా తాను బరువుగా ఉన్నప్పుడూ ఫోటోలు, తగ్గాక ఫోటోలు షేర్‌ చేస్తూ..నేను ఇప్పుడూ ఎగరగలను ఏమైనా చేయగలను అంటూ క్యాప్షన్‌ పెట్టి మరీ పోస్ట్‌ చేశాడు. అందుకు సంబంధిదంచిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతుండటంతో నెజిజన్లు నువ్వు గ్రేట్‌ స్వామి అంటూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు. ఏదీఏమైన మన చేయాలి అని బలంగా అనుకోవడం మాత్రమే గాదు ఆచరణ కూడా ఉంటే..సాధ్యం కానిది ఏది ఉండదని నిరూపించాడు డేవ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement