అయినా.. ‘కిక్కు’ డ్రైవింగే...! | drunk driving in Hydrabad | Sakshi
Sakshi News home page

అయినా.. ‘కిక్కు’ డ్రైవింగే...!

Published Sat, Nov 30 2013 4:35 AM | Last Updated on Fri, May 25 2018 2:06 PM

రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరిగి పోతోంది. వీటిలో 80 శాతం ప్రమాదాలు మానవ తప్పిదం వల్లే జ రుగుతున్నాయి.

 = జైలు శిక్షలు పడుతున్నా మారని వాహనదారుల ధోరణి
 = ఈ ఏడాది ఇప్పటి వరకు ‘డ్రంకన్ డ్రైవ్’ కేసుల నమోదు 11,767
 = 1010 మందికి జైలు శిక్ష

 
సాక్షి, సిటీబ్యూరో: రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరిగి పోతోంది. వీటిలో  80 శాతం ప్రమాదాలు మానవ తప్పిదం వల్లే జ రుగుతున్నాయి. అతివేగం వల్ల కొందరు.. డ్రై వింగ్‌పై సరైన అవగాహన లేకపోవడంతో మ రికొందరు.. మద్యం మత్తులో వాహనాలు నడి పి ఇంకొందరు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రమాదకరస్థాయిలో మద్యం తాగి వాహనాలు నడిపే వా రికి చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు ‘డ్రం కన్ డ్రైవ్’ తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసులకు చిక్కిన వారికి న్యాయస్థానాలు జైలుశిక్ష, జరిమానా విధిస్తున్నాయి. అయినా వాహనదారుల ధోరణిలో మాత్రం మార్పు రావడంలేదు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నమోదైన 11,767 డ్రంకన్ డ్రైవ్ కేసులే ఇందుకు నిందర్శనం. వీరిలో 1010 మందికి కోర్టు జైలు శిక్ష విధించడం గమనార్హం.  మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ బి.చెంగల్రాయనాయుడు ఈ మంగళవారం 18 మందికి మూడు రోజుల చొప్పున శిక్ష విధించారు.దీంతో జైలు శిక్షపడిన ‘నిషా’  చరుల సంఖ్య వెయ్యికి పెరిగింది.
 
 ‘ఆర్‌ఎస్-10’లో భాగంగా ‘డ్రంకన్ డ్రైవ్’..

 ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆర్‌ఎస్-10 పేరిట ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.  తక్కువ, మధ్య తరగతి ఆదాయం కలిగిన 10 దేశాలను ఎంపిక చేసుకుని అక్కడ  ఈ ప్రాజెక్టుఅమలు చేస్తోంది. హెల్మెట్ వినియోగం పెంచడం, సీట్ బెల్ట్ తప్పనిసరి చేయడం, డ్రంకన్ డ్రైవింగ్ (తాగి వాహనం నడపడం) నియంత్రణ, స్పీడ్ మేనేజ్‌మెంట్, ట్రామా కేర్, డేటా సిస్టమ్స్ అభివ ృద్ధి ఈ ప్రాజెక్ట్ లక్ష్యాలు. మన దేశంలో ఈ పెలైట్ ప్రాజెక్ట్ హైదరాబాద్‌తో పాటు జలంధర్ (పగ్వారా టౌన్)లో అమలవుతోంది.

ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యల ఆధారంగా కొన్ని అంశాలకు ప్రాధాన్యం ఇస్తోంది. హైదరాబాద్‌లో డ్రంకన్ డ్రైవింగ్‌పై ద ృష్టి పెట్టింది. ఈ ప్రాజెక్ట్ నిధులతో అత్యాధునిక బ్రీత్ అనలైజర్లతో 2011 నవంబర్ 4 నుంచి నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ‘డ్రంకన్ డ్రైవ్’ తనిఖీలు మొదలెట్టారు. తొలినాళ్లల్లో కోర్టులో హాజరుపరచగా కేవలం జరిమానా విధించేవారు. ఆ తర్వాత జైలు శిక్షలు వేయడం ప్రారంభమైంది. 2011 నవంబర్ 4-డిసెంబర్ 31 మధ్య 1677 కేసులు నమోదు కాగా... జైలు శిక్షలు లేవు. 2012లో 10813 కేసులు నమోదు కాగా... కేవలం 27 మందికే జైలు శిక్ష పడింది.
 
 మార్పు రాకపోవడంతో...
 వాహనచోదకుల ధోరణిలో మార్పు రాకపోవడంతో న్యాయస్థానం ఈ ఏడాది కఠిన వైఖరి అవలంభించడం ప్రారంభించింది. మోటారు వాహనాల చట్ట ప్రకారం ప్రతి 100 మిల్లీలీటర్ల రక్తంలో 30 మిల్లీగ్రాములు, అంతకంటే ఎక్కువ ఉంటేనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీంతో 100 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువ కౌంట్ వచ్చిన వారిని జైలుకు పంపడం ప్రారంభించారు. దీంతో ఈ ఏడాది జనవరి 1 నుంచి మంగళవారం (నవంబర్ 27) వరకు 11,767 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడగా... వీరిలో 1010 మందికి జైలు శిక్ష విధించారు. ఈ చట్ట ప్రకారం వాహన చోదకుడు అత్యంత ప్రమాదకర స్థాయిలో మద్యం తాగినట్టు నిర్ధారణ అయితే  న్యాయమూర్తి భావిస్తే 2 నెలల వరకు జైలు శిక్ష వేసే అవకాశం ఉంది. రెండోసారీ ఇదే రకమైన ఉల్లంఘన/నేరం చేసి చిక్కితే... రూ.3 వేల ఫైన్ లేదా రూ.రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది. వాహనచోదకుడు తాగిన మద్యం స్థాయిని బట్టి ఒక రోజు నుంచి 15 రోజల వరకు జైలు శిక్ష పడుతోంది.
 
 ట్రాఫిక్ ఠాణాల వద్ద 450 వాహనాలు...
  మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారిలో ఎక్కువ మోతాదు కౌంట్ చూపించిన వారికి న్యాయస్థానం జైలు శిక్ష విధిస్తుండటంతో భయపడిన కొందరు ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే కౌన్సెలింగ్‌కు వెళ్లకపోవడమే కాకుండా తమ వాహనాలకు పోలీసుల వద్దే వదిలేస్తున్నారు. గడిచిన రెండేళ్ల కాలంలో ఈ కోవకు చెందిన దాదాపు 450 కార్లు/ద్విచక్ర వాహనాలు, ఆటోలు ఆయా ట్రాఫిక్ ఠాణాల్లో పడి ఉన్నాయి.
 
 ఇలా చేస్తే ఉత్తమం...
 ‘‘మద్యం తాగినా తాము కంట్రోల్‌లో ఉన్నామని అనేక మంది వాదిస్తున్నారు. ఏదేమైనా ఆ సం దర్భంలో ఎట్టిపరిస్థితుల్లోనూ డ్రైవింగ్ చేయొద్దు. కొంత మంది కలిసి ఫంక్షన్‌కు వెళ్తే వారిలో ఒకరు డ్రైవిం గ్ చేసేందుకు వీలుగా మద్యం తాగరాదు. వాహనం నడిపేందుకు గంటల లెక్కన డ్రైవర్ల నియమించుకోవాలి.  ఆటోరిక్షాలు, క్యాబ్స్‌ను ఆశ్రయించడం ఉత్తమం’’
 - ఎం.శ్రీనివాసులు, టీటీఐ ఇన్‌స్పెక్టర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement