గులాబీ తీసుకో..సీటు బెల్టు పెట్టుకో
గులాబీ తీసుకో..సీటు బెల్టు పెట్టుకో
Published Sat, May 6 2017 10:06 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
కర్నూలు : ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర చాలా ముఖ్యమని, సీటు బెల్టు ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచిస్తూ గులాబీ పూలు ఇచ్చి ఎస్పీ ఆకే రవికృష్ణ, రవాణా శాఖ ఉపకమిషనర్ ప్రమీల అవగాహన కల్పించారు. వీరి నేతృత్వంలో పోలీసులు, రవాణా శాఖ అధికారులు శనివారం సాయంత్రం కర్నూలు శివారులో వాహనాల తనిఖీ చేపట్టారు. సీటు బెల్టుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వమించారు. జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలను తనిఖీ చేస్తూ ప్రతి ఒక్క వాహనదారుడు సీటు బెల్టు ధరించి ప్రయాణించాలని సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ రామచంద్ర, నాల్గో పట్టణ సీఐ నాగరాజ రావు పాల్గొన్నారు.
Advertisement