rose
-
World Rose Day 2024: క్యాన్సర్‌ను జయించాలని కోరుకుంటూ..
రోజ్ డే అనగానే ఎవరికైనా సరే ప్రేమ జంటలకు సంబంధించిన వాలంటైన్స్ వీక్ గుర్తుకువస్తుంది. అయితే ప్రపంచ రోజ్ డేకు ఒక ప్రత్యేకత ఉంది. సెప్టెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా రోజ్‌డే జరుపుకుంటారు. ప్రజలకు క్యాన్సర్ వ్యాధిపై మరింతగా అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు.క్యాన్సర్ రోగులకు అంకితం చేసిన నేటి రోజున క్యాన్సర్ బాధితులకు గులాబీలను అందజేసి, వారిలో మానసిక ధైర్యాన్ని కల్పిస్తారు. ప్రపంచ గులాబీ దినోత్సవం ఎప్పుడు ప్రారంభమయ్యింది? దీనివెనుక ఎవరు ఉన్నారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.కెనడాకు చెందిన మెలిండా అనే బాలిక జ్ఞాపకార్థం ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు. 12 ఏళ్ల వయసుకే బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆ చిన్నారికి వైద్యులు ఎలాంటి వైద్య సహాయం అందించలేకపోయారు. ఆ చిన్నారి ఇక రెండు వారాలు మాత్రమే జీవించి ఉంటుందని తేల్చిచెప్పారు. అయితే మెలిండా ఎంతో ధైర్యంతో ఆరు నెలల పాటు క్యాన్సర్‌తో పోరాడింది. ఈ సమయంలో ఆ చిన్నారి ఇతర క్యాన్సర్ బాధితులతో గడిపింది. తోటి బాధితులు ఆమెకు కవితలు, కథలు చెబుతూ ఆమెను ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించారు.ఆరు నెలల పాటు క్యాన్సర్‌తో పోరాడిన ఆ చిన్నారి సెప్టెంబర్‌లో మృతి చెందింది. దీని తరువాత ప్రపంచ గులాబీ దినోత్సవాన్ని జరుపుకునే సంప్రదాయం ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం ఈ ప్రపంచ గులాబీ దినోత్సవాన్ని సెప్టెంబర్ నెలలో నాల్గవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ఈ రోజున కేన్సర్ బాధితులకు గులాబీ పూలు అందించి, వారికి ధైర్యం చెబుతూ ప్రపంచమంతా వారికి అండగా నిలుస్తుందనే సందేశాన్ని తెలియజేస్తారు. గులాబీని ప్రేమ, ఆనందాలకు గుర్తుగా పరిగణిస్తారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న వారెవరైనా మీకు తెలిస్తే, మీరు కూడా వారికి గులాబీని అందించి ధైర్యాన్ని చెప్పండి.ఇది కూడా చదవండి: టీనేజ్‌లో ముఖ్యం.. మానసిక ఆరోగ్యం -
సెలబ్రిటీలు ఇష్టపడే ఫేషియల్ మాస్క్...ఎన్ని ప్రయోజాలో తెలుసా..!
బాలీవుడ్ నటి ప్రయాంక చోప్రా దగ్గర నుంచి పలువురు ప్రముఖ సెలబ్రిటీలంతా ఇష్టపడే షేషియల్ రోజ్ గోల్డ్ ఫేషియల్. మూడు పదులు వయసు దాటిని యవ్వనపు కాంతితో మేను ప్రకాశవంతంగా ఉంటుంది. ముడతలు లేని చక్కటి చర్మం, వృద్ధాప్య లక్షణాలు దాచేసి గ్లామరస్ కనిపించేలా చేస్తుంది. బహుశా అందువల్లే ఇంతలా సెలబ్రిటీలు ఈ ఫేషియల్‌ని లైక్ చేస్తున్నారు. ఈ ఫేషియల్‌తో ఎన్ని లాభాలో చూద్దామా..!చాలామంది సెలబ్రిటీలు గ్లామరస్ ఇచ్చే ప్రాముఖ్యత అంత ఇంత కాదు. అందుకోసం ఎంత డభైనా ఖర్చు చేసేందుకు వెనకాడరు కూడా. వాళ్లంతా రోజ్ గోల్డ్ ఫేస్ మాస్క్కి ప్రాధాన్యత ఇస్తారు. రోజ్ గోల్డ్ ఆయిల్‌తో చేసిన రోజ్ గోల్డ్ ఆయిల్ ఫేషియల్ మాస్క్ వారి చర్మ సంరక్షణకు ఎంతలా ఉపయోగపడుతుందో వింటే ఆశ్చర్యపోతారు. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అలాగే పర్యవారణానికి ప్రభావితం కాకుండా ఉండేలా యాంటీ-ఆక్సిడెంట్ ప్రయోజనాలను కూడా అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఇందులో ఉపయోగించే బంగారు పదార్దాలు లేదా అందులో ఉండే బంగారు రేణువులు చర్మంపై వచ్చే గీతలు, ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో హైలురోనిక్ యాసిడ్, విటమిన్ సీ, బొటానికల్ ఆయిల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా, పునరుజ్జీవింపజేయడంలో సహాయపడతాయి.ఇక రోజ్ గోల్డ్ ఆయిల్.. చర్మాన్ని ఆరోగ్యంగా, హైడ్రేటెడ్‌గా ఉంచడానికి మాయిశ్చరైజర్‌గా పనిచేయడం నుంచి మేకప్‌కి సిద్దమయ్యేలా అందంగా మారుస్తుంది. ముఖ్యంగా పెదాలను హైడ్రేట్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. కంటి కింద పొడి ప్రాంతాల్లో అప్లై చేస్తే మృదువుగా కనిపిస్తాయి. దేనితో తయారు చేస్తారంటే..గుమ్మడికాయ గింజల నూన, ఇతర నూనెలతో కలిసి ఉంటుంది. గుమ్మడికాయ గింజల నూనె కణజాలాన్ని పునరుత్పత్తి చేస్తుంది. హైపర్పిగ్మెంటేషన్ రూపాన్ని తగ్గిస్తుంది. తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది, యవ్వన రూపాన్ని ప్రోత్సహిస్తుంది.ఇందులో జింక్, విటమిన్ సీ ఉంటాయి. ఇవి చర్మాన్ని దృఢంగా, బిగుతుగా ఉంచడంలో సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నప్పటికీ, ఈ నూనె దాని ప్రత్యేకమైన ఫార్ములా కారణంగా జిడ్డుగల చర్మానికి అనుకూలంగా ఉంటుంది.ప్రధాన పదార్థాలు బంగారు రేకులు, రోజ్‌షిప్ సీడ్ ఆయిల్..బంగారు రేకులు కొల్లాజెన్ క్షీణతను నెమ్మదిస్తాయి. చర్మ స్థితిస్థాపకతను పెంచుతాయి. మేని ఛాయను కాంతివంతం చేయడమే గాక దృఢంగా ఉంచేలా కణాలను ప్రేరేపిస్తాయి. రోజ్‌షిప్ సీడ్ ఆయిల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్‌గానూ, టిష్యూ రీజెనరేటర్గా పనిచేస్తుంది. వాపును తగ్గించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రక్తప్రసరణలో మంచిగా ఉంటుంది. అలాగే రోజ్‌గోల్డ్ ఆయిల్ మాస్క్లోనారింజ తొక్కలు ఉంటాయి.ఇవి చనిపోయిన చర్మ కణాలను ఎక్స్ఫోలియేట్ చేస్తాయి. ఇందులో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది. పైగా చర్మాన్ని బిగుతుగా చేసి మెరిసేలా చేస్తుంది. ప్రయోజనాలుఇది యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను, తేమను అందిస్తుంది.అన్ని రకాల చర్మాలకు తగినదిఇది కణజాలాన్ని పునరుత్పత్తి చేయడం, ఫైన్ లైన్లు, హైపర్పిగ్మెంటేషన్ను తగ్గించడం వంటివి చేస్తుంది. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటమే గాక యవ్వన రూపాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది.రోజ్ ఆయిల్ ఫేషియల్, షీట్ మాస్క్ లేదా మరేదైనా వారికి చర్మ అలెర్జీలు లేదా ఇతర చర్మ సమస్యలు ఉన్నట్లయితే వాటిని ఉపయోగించే ముందు జాగ్రత్తగా ఉండండి. వ్యక్తి గత చర్మ నిపుణుడి సలహాలు సూచనలు మేరకు ఉపయోగించటం మంచిది.(చదవండి: ఒక హంతకుడి బాధితులు!) -
రోజ్ హిప్స్‌తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా!
ఏంటీ రోజ్ హిప్స్.. ఎప్పుడూ వినలేదే? ఏంటవి? అని ఆశ్చర్యపోకండి. గులాబీ పూలు వికసించి, రాలిపోయిన తర్వాత.. గులాబీ మొక్కలకు ఇవి అభివృద్ధి చెందుతాయి. ఇవి గుండ్రని, బెర్రీ పండ్లలా ఉంటాయి. రోజ్ హిప్స్ సాధారణంగా ఎరుపు, నారింజ రంగులో ఉంటాయి. వీటిలో విత్తనాలు కూడా ఉంటాయి. అయితే వీటిలో పోషకాల అధికంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. వీటిని ఆయుర్వేద వైద్యంలో శతాబ్దాలుగా వినియోగిస్తున్నారు కూడా. అలాంటి ఈ రోజ్ హిప్స్ని మన ఆహారంలో భాగం చేసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటంటే.. ఈ రోజ్ హిప్స్‌లో విటమిన్ సి, ఏ, బి5, సి యాంటీఆక్సిడెంట్లు ఇతర ప్రయోజనకరమైన సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. రోజ్ హిప్స్‌లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీవైరల్, యాంటికాన్సర్ లక్షణాలు ఉంటాయి. అంతేగాదు దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది, ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది. బలుబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్లు, దగ్గు వంటి అనారోగ్యాలను నుంచి రక్షణ కల్పిస్తుంది. రోజ్ హిప్స్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని మంటను తగ్గించడానికి సహాయపడతాయి. హృదయనాళ వ్యవస్థను రక్షిస్తాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.రోజ్ హిప్స్‌లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది, ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌కు మద్దతు కల్పిస్తుంది. రోజ్ హిప్స్‌లో విటమిన్ ఏ, ఇ సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి, ముడతలను తగ్గించడానికి తోడ్పడతాయి. తద్వారా యవ్వన ఛాయను ప్రోత్సహిస్తాయి.రోజ్ హిప్స్‌లో లూటీన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తాయి. వయస్సు సంబంధిత మచ్చల క్షీణత ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.రోజ్ హిప్స్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్ నొప్పులు, కీళ్ల నొప్పులను తగ్గించడానికి తోడ్పడతాయి. ఇవి శరీరంలోని వాపును తగ్గించి.. నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తాయి.రోజ్ హిప్స్‌లో ఉండే ఫైబర్ కంటెంట్ మిమ్మల్ని ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. బరువు కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది. అతిగా తినకుండా నివారిస్తుంది. రోజ్ హిప్స్‌లో ఉండే.. యాంటీఆక్సిడెట్లు మెదడులోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. ఇది మానసికి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నిరాశ, ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ వంటి వాటిని దరిదాపుల్లోకి రానివ్వవు. ఎలా తీసుకోవాలి..? ఎండిన రోజ్ హిప్స్‌ను వేడి నీళ్లలో వేసి సుమారు 10 నిమిషాల పాటు నానబెట్టండి. ఆ తర్వాత దానిలో కొంచెం తేనె యాడ్ చేసుకుని తాగొచ్చు. స్మూతీస్‌లో ఎండిన రోజ్ హిప్స్ యాడ్ చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు. వాటిలోని పోషకాలు పెరుగుతాయి. చక్కెరతో కలిపి జామ్‌గా తయారు చేసుకోవచ్చు. మీరు మఫిన్లు, కేక్‌లు, కుకీలు లేదా బ్రెడ్ల కోసం ప్రత్యేకమైన, ఆరోగ్యకరమైన ట్విస్ట్‌ని అందించడానికి ఎండిన రోజ్ హిప్స్ యాడ్ చేస్తే టేస్ట్‌కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం పొందొచ్చు. (చదవండి: అత్యుత్తమమైన కాఫీల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉందో తెలుసా!) -
హీరోగా మారిన 'సార్పట్టా' నటుడు
కోలీవుడ్‌లో ఆర్య హీరోగా పా.రంజిత్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ మూవీ 'సార్పట్టా పరంపరై'. అందులో డాన్సింగ్ రోస్ అనే ముఖ్యమైన పాత్రలో షబ్బీర్ కల్లరాక్కల్ నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం 2021లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. తాజాగా డాన్సింగ్ రోస్ షబ్బీర్ కల్లరాక్కల్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి 'బర్త్ మార్క్' అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో నటి మీర్జా హీరోయిన్గా నటిస్తున్నారు. విక్రమ్ శ్రీధరన్ కథ, దర్శకత్వం వహిస్తున్నారు. (ఇదీ చదవండి: వరుణ్- లావణ్యల పెళ్లి.. ఎప్పుడో హింట్ ఇచ్చిన అల్లు అరవింద్, వీడియో వైరల్) 1990 ప్రాంతంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రమని డైరెక్టర్ చెప్పాడు. తమిళనాడు, కేరళ సరిహద్దుల్లోని మరైయూర్ అనే గ్రామంలో షూటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపాడు. మిస్టరీ డ్రామాగా సాగే ఈ చిత్రం కథ ముఖ్యంగా రెండు పాత్రల చుట్టూ తిరుగుతుందని పేర్కొన్నాడు. డేని అనే సిపాయి కార్గిల్ యుద్ధం అనంతరం తన భార్యను తీసుకుని సొంత గ్రామానికి వచ్చిన తర్వాత వారు ఎదుర్కొనే సమస్యలు, కష్టాలే చిత్ర ప్రధాన అంశం అని చెప్పాడు. సెంటిమెంట్, యాక్షన్‌తో పాటు భావోద్వేగాలతో కూడిన చిత్రం 'బర్త్ మార్క్' అని తెలిపాడు. (ఇదీ చదవండి: మళ్లీ తెరపైకి మీటూ కేసు.. మరో కొత్త ట్విస్ట్) -
'వీర సింహారెడ్డి' వైఫ్ హనీరోజ్ బ్యూటిఫుల్ ఫోటోలు
-
ఎనర్జీ స్టోరేజ్ రంగంలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఎనర్జీ స్టోరేజ్, స్మార్ట్ గ్రిడ్ రంగంలో అంతర్జాతీయంగా 2022 జనవరి–సెప్టెంబర్‌లో రూ.2.05 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ మొత్తం 66 శాతం పెరిగిందని స్వచ్ఛ ఇంధన కన్సల్టింగ్ కంపెనీ మెర్కామ్ క్యాపిటల్ నివేదిక వెల్లడించింది. ఎనర్జీ స్టోరేజ్ విభాగంలో 92 డీల్స్‌కుగాను రూ.1.8 లక్షల కోట్ల నిధులు వెల్లువెత్తాయి. మిగిలిన మొత్తం స్మార్ట్ గ్రిడ్, ఇంధన సామర్థ్యం విభాగాలు కైవసం చేసుకున్నాయి. ఇంధన నిల్వ సంస్థలు శిలాజ ఇంధనాల నుండి పునరుత్పాదక ఇంధనాలకు మారడంలో కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నందున పెట్టుబడులు పెరుగుతూనే ఉంటాయని మెర్కామ్ సీఈవో రాజ్ ప్రభు తెలిపారు. -
ఆగస్ట్‌లో విమాన ప్రయాణికుల్లో వృద్ధి
న్యూఢిల్లీ: దేశీ విమాన ప్రయాణికుల రద్దీ ఆగస్ట్‌లో 5 శాతం పెరిగింది. 1.02 కోట్ల మంది విమాన సేవలను వినియోగించుకున్నట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ఆగస్ట్ నెలకు సంబంధించి ఈ రంగంపై ఒక నివేదికను గురువారం విడుదల చేసింది. జూలై నెలలో విమాన ప్రయాణికుల సంఖ్య 97 లక్షలతో పోలిస్తే 5 శాతం పెరిగినట్టు పేర్కొంది. ఇక 2021 ఆగస్ట్ నెల గణాంకాలతో పోల్చి చూస్తే 52 శాతం పెరిగినట్టు తెలిపింది. ఇక కరోనా ముందు సంవత్సరం 2019 ఆగస్ట్ నెల గణాంకాల కంటే 14 శాతం తక్కువే ఉన్నట్టు వివరించింది. విమాన సర్వీసులు పూర్తి సాధారణ స్థాయికి చేరుకోవడంతోపాటు, కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిపోయినందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల రద్దీ వేగంగా పుంజుకోవచ్చని ఇక్రా అంచనా వేసింది. భారత ఎయిర్‌లైన్స్ సంస్థలకు సంబంధించి విదేశీ ప్రయాణికుల సంఖ్య ఆగస్ట్‌లో 19.8 లక్షలుగా ఉందని, కరోనా ముందు నాటితో పోలిస్తే ఇది 32 శాతం అధికమని తెలిపింది. 2022 మొదటి ఐదు నెలల్లో దేశీ విమాన ప్రయాణికుల సంఖ్య 5.24 కోట్లుగా ఉంటుందని, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 131 శాతం అధికమని ఇక్రా పేర్కొంది. విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు పెరిగిపోవడంతో ఎయిర్‌లైన్స్ ఆదాయం రికవరీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిదానంగా ఉంటుందని అంచనా వేసింది. దీనికితోడు పరిశ్రమపై ద్రవ్యోల్బణ ప్రభావం సైతం ఉంటుందని పేర్కొంది. -
మీ గార్డెన్లో గులాబీలు విరగ బూయాలంటే?
-
మీ గార్డెన్లో గులాబీలు విరగ బూయాలంటే?
ఉదయం లేవగానే బాల్కనీలోని మొక్కల పచ్చదనం చూస్తే భలే హాయిగా ఉంటుంది కదా. మరి అరవిచ్చిన మందారమో, విచ్చీవిచ్చని రోజా పువ్వు మొగ్గలు పలకరిస్తేనో.. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. పువ్వుల్లో రాణి స్థానం గులాబీదే. రెడ్, వైట్, ఎల్లో, పింక్, ఆరెంజ్, బ్లూ , గ్రీన్, బ్లాక్ రంగుల్లో గులాబీలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. గ్లాడియేటర్, సర్పంచ్, డబుల్ డిలైట్ కలర్, హైబ్రీడ్, మార్నింగ్ గ్లోరీ, సన్‌సెట్, కశ్మీర్, కాకినాడ, రేఖ, ముద్ద, తీగజాతి ఇలా పలు రకాల గులాబీలున్నాయి. అయితే నర్సరీనుంచి తెచ్చినపుడు మొగ్గలతో కళకళలాడుతూండే గులాబీ మొక్క మన గార్డెన్లో నాటిన తరువాత మొగ్గలు వేయడం మానేస్తుంది. ఆరోగ్యంగా ఎదగదు. ఒకవేళ మొక్క బాగా విస్తరించినా, పెద్దగా పూలు పూయదు. దీనికి కారణంగా మొక్కకు అవసరమైన పోషకాలు అందకపోవడమే. మరి ఏం చేయాలి. చక్కగా గుత్తులుగా గుత్తులుగా పూలతో మన బాల్కనీలోని గులాబీ మొక్క కళ కళలాడాలంటే ఏం చేయాలి. సేంద్రీయంగా ఎలాంటి ఎరువులివ్వాలి లాంటి వివరాలు తెలుసుకోవడం అవసరం. (Almonds Benefits: బాదాం ఎలా తింటే మంచిది? పోషకాలు పుష్కలంగా లభించాలంటే?) పెరటి తోటల్లో చిన్న చిన్న కుండీలలో పెంచే మొక్కలు ఏపుగా ఎదగాలన్నా, పువ్వులు విరగ బూయాలన్నా కిచెన్ కంపోస్ట్ ఎరువు, వర్మీ కంపోస్ట్ ఎక్కువగా ఉపయోగ పడతాయి. వీటితోపాటు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఫలితాలనిస్తాయి. ఫెర్మింటెడ్ ఫ్రూట్స్, బెల్లంతో కలిపి పులియ బెట్టిన పళ్లు, లేదా తొక్కలు ద్వారా తయారు చేసుకున్న లిక్విడ్ ఫెర్టలైజర్స్ వాడటం వల్ల వచ్చే ఫలితాలను గమనిస్తే ఆశ్చర్య పోక తప్పదు. మొక్కలకు నత్రజని, భాస్వరం, పొటాషియం మూడు పోషకాలలో చాలా. అవసరం. వీటన్నింటిలోకి రాణి లాంటిది ముఖ్యంగా గులాబీ మొక్కలకు బాగా ఉపయోగపడేది అరటి పళ్ల తొక్కలతో చేసే ఎరువు. ఈ లిక్విడ్‌ను మొక్కలకిచ్చిన వారంరోజుల్లోనే చక్కటి ఫలితం కనిపిస్తుంది. నైట్రోజన్ ఇతర రూపాల్లో లభించినప్పటికీ ముఖ్యమైన పొటాషియం అరటి తొక్కల ఫెర్టిలైజర్ ద్వారా లభిస్తుంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. బనానా పీల్ ఫెర్టిలైజర్ బాగా మగ్గిన అరటి పళ్ల తొక్కలను తీసుకోవాలి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని, గిన్నెలోకి తీసుకొని ముక్కలు మునిగేలా నీళ్లు పోసుకోవాలి. దీన్ని రెండు మూడు పొంగులు వచ్చే దాకా మరిగించుకోవాలి. బాగా చల్లారిన తరువాత ఆ మిశ్రమాన్ని వడపోసుకుని కుండీకి ఒక కప్పు చొప్పున గులాబీ మొక్క మొదట్లో పోసుకోవాలి. పెద్ద కుండీ అయితే కొంచెం ఎక్కువ పోసుకున్నా ప్రమాదమేమీలేదు. కానీ మొక్కకిచ్చిన ఫెర్టిలైజర్ బయటికి పోకుండా చూసుకోవాలి. అంటే మనం అందించిన పోషకం మొత్తం వృధాకా కుండా మొక్క కందేలా చూసుకోవాలన్నమాట. వారం రోజుల్లో కొత్త చిగుర్లు, చిగుర్లతోపాటు కొత్తబడ్స్ మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. మరొక విధానంలో ముక్కలుగా కట్ చేసిన అరటి పళ్ల తొక్కల్ని 24 గంటలపాటు నీళ్లలో నానబెట్టి, ఆ తరువాత ఆ నీరును మొక్కలకు వాడవచ్చు. ఏ మొక్కకైనా పూత పిందె దశలో ఈ ఫెర్టిలైజర్‌ను అందిస్తే చక్కటి ఫలితం ఉంటుంది. అలాగే అరటి తొక్కలను మొక్క మొదట్లో పాతిపెట్టినా ఉపయోగమే.సేంద్రీయంగా పండించిన అరటి పళ్ల తొక్కలను ఉపయోగిస్తే మరీ మంచిది. పొటాషియం మొక్కలు కాండాన్ని బలంగా చేయడమే కాదు, వ్యాధుల నుండి రక్షిస్తుంది. పుష్పించే ప్రక్రియ వేగవంతం చేస్తుంది. పండ్ల మొక్కల్లో పండ్ల నాణ్యతను మెరుగు పరుస్తుంది. కాల్షియం, పొటాషియం, మాంగనీసు లాంటివాటికి అద్భుతమైన మూలం అరటి తొక్కలు. ఇవి మొక్కలు ఎక్కువ నత్రజనిని తీసుకోవడానికి, కిరణజన్య సంయోగ క్రియకు సహాయపడతాయి. -
Video: ఈ నటుడి డెడికేషన్‌కి హ్యాట్సాఫ్.. మామూలు కష్టం కాదు!
తెరపై ఎంత సేపు కనిపించామన్నది కాదు.. ఆడియెన్స్-వ్యూయర్స్‌పై ఎంత ఇంపాక్ట్ చూపించామన్నది ముఖ్యం. ఫ్యామిలీ మ్యాన్ ‘చెల్లం’సర్ లాంటి కొన్ని క్యారెక్టర్లు ఈ విషయాన్ని ప్రూవ్ చేస్తూ వస్తున్నాయి. తాజాగా అలాంటి ఇంపాక్ట్ చూపించిన మరో క్యారెక్టర్.. డ్యాన్సింగ్ రోజ్. పా రంజిత్ డైరెక్షన్లో అమెజాన్ ప్రైమ్‌లో లేటెస్ట్గా రిలీజ్ అయ్యింది ‘సార్పట్ట పరంపర’(సార్పట్ట పరంబరై). ఈ సినిమాలో ఈ ‘డ్యాన్సింగ్ రోజ్’ అనే క్యారెక్టర్‌కి ప్రాధాన్యత పదిహేను నిమిషాలు ఉంటుంది. కానీ, ఆ క్యారెక్టర్‌ను ఎప్పటికీ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దాడు పా రంజిత్. స్లిమ్ ఫిట్ బాడీ, నుదుట రింగు, విచిత్రంగా మెలికలు తిరుగుతూ వేసే స్టెప్పులు. రింగ్‌లో ఊగిపోతూ ఓడిపోతున్నట్లుగా ప్రత్యర్థులను భ్రమపెట్టి, కాళ్ల వేగంతో కన్ఫ్యూజ్ చేసి బాక్సింగ్‌లో గెలుపు సాధించే క్యారెక్టర్ డ్యాన్సింగ్ రోజ్‌ది. అయితే డ్యాన్సింగ్ రోజ్కి ఓ క్యారెక్టర్ అంటూ ఉంటుంది. సమర(కబిలన్)తో ఓడినప్పటికీ, విలన్ బ్యాచ్‌లో ఉన్నప్పటికీ.. నీతి తప్పడు. పైగా క్లైమాక్స్ పోటీకి ముందు వేటపులి(వేంబులి)కి హితబోధ కూడా చేస్తాడు. అందుకే చాలామందికి ఈ పాత్ర బాగా కనెక్ట్ అయ్యింది. ఇంతకీ ఈ క్యారెక్టర్ చేసింది ఎవరంటే.. చెన్నై థియేటర్ ఆర్టిస్ట్ షబీర్ కళ్ళరక్కల్. మాంచి థియేటర్ ఆర్టిస్ట్ 2009 నుంచి నటన వైపు అడుగులేశాడు నటుడు షబీర్ కళ్ళరక్కల్. యాభైకి పైగా స్టేజ్ షోలతో థియేటర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఆపై ‘నెరుంగి వా ముథమిడతే’(2014) హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు షబీర్. కానీ, ఆ తర్వాత అవకాశాలే పెద్దగా రాలేదు. దీంతో ‘అడంగ మరు, పెట్టా, టెడ్డీ’ లాంటి పెద్దసినిమాల్లో చిన్నరోల్స్ చేశాడు. షబీర్ స్వతహాగా ఫిట్నెస్ ప్రియుడు. దీంతో కాస్టింగ్ డైరెక్టర్ నిత్య.. సార్పట్ట అడిషన్స్‌కు వెళ్లమని సలహా ఇచ్చింది. అలా క్యారెక్టర్ దక్కింది. ఫిట్నెస్ ఉన్నోడు కావడంతో మార్షల్ ఆర్ట్స్ కళలో శిక్షణ తీసుకోగలిగాడు. స్టంట్ మాస్టర్ తిరు నేతృత్వంలో.. రకరకాల కళలను సులువుగా అవపోసన పట్టగలిగాడు. అంత కష్టపడ్డాడు గనుకే డ్యాన్సింగ్ రోజ్ సీక్వెన్స్‌లన్నీ అంతగా పేలాయి. ఇక అతను పడ్డ కష్టం తాలుకా వీడియోను చూసేయండి. Shabeer Kallarakkal aka DANCING ROSE. pic.twitter.com/aCUSdfJwSN — LetsOTT GLOBAL (@LetsOTT) July 22, 2021 అన్నట్లు డ్యాన్సింగ్ రోజ్‌కు ఇన్స్పిరేషన్.. యూకే బాక్సింగ్ లెజెండ్ నసీమ్ హమెద్. ఆయన ఎంట్రీ దగ్గరి నుంచి రింగ్‌లో కదలికల దాకా అంతా విచిత్రంగా ఉంటుంది. 1992-2002 మధ్య ప్రొఫెసనల్ బాక్సర్‌గా కొనసాగిన నసీమ్.. 37 ఫైటింగ్ల్లో ఒక్కటంటే ఒక్కటి మాత్రమే ఓడిపోయాడు. ఐదున్నర అడుగుల ఎత్తుండే ప్రిన్స్.. క్యారెక్టర్ స్ఫూర్తితో జపనీస్ మాంగా సిరీస్ ‘హజెమె నో ఇప్పో’లో అమెరికన్ బాక్సింగ్ ఛాంపియన్ బ్రయాన్ హక్ క్యారెక్టర్‌ను సైతం తీర్చిదిద్దారు. -
ఆలూ, ఉల్లి షాక్: డబ్ల్యూపీఐ 2.59 శాతం
సాక్షి,న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం బాటలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) కూడా నడిచింది. డిసెంబరు నెల టోకు ధరల సూచీ మరింత ఎగిసింది. నవంబరు 0.58 శాతం శాతంతో పోలిస్తే డిసెంబరు మాసంలో 2.59 శాతంగా ఉంది. ప్రధానంగా ఆహార పదార్థాలు(ఆలూ, ఉల్లి) ఇంధన ధరలు సెగ డబ్ల్యూపీఐని ప్రభావితం చేసింది. ఆహార ద్రవ్యోల్బణం (డబ్ల్యుపిఐ ఫుడ్ ఇండెక్స్) 13.24 శాతం పెరిగింది. నవంబరులో ఇది 11 శాతం. నవంబరు మాసంలో 172.3 శాతంగా ఉన్న ఉల్లి ద్రవ్యోల్బణ రేటు డిసెంబరులో 455.8 శాతానికి చేరింది. రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబరులో 7.35 శాతం వద్ద ఐదున్నర సంవత్సరాల గరిష్ట స్థాయినికి చేరుకున్న సంగతి తెలిసిందే. -
గులాబీ/కత్తెర పురుగులపైముష్టి యుద్ధం!
పత్తి, మొక్కజొన్న పంటల్లో గులాబీ/ కత్తెర పురుగులకు ముష్టి ద్రావణంతో చెక్. తెలుగు రాష్ట్రాల్లో ఏటా పత్తి పంట సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఈ పంటకు ఇప్పుడు అంతో ఇంతో ఆశించిన మద్దతు ధరలు ఉండటంతో రైతులు ఈ ఏడాది బోరుబావుల కింద, నదీ తీరా ప్రాంతాల్లో అధికంగా సాగు చేశారు. అయితే ఈ పంటను మూడు నాలుగేళ్లుగా గులాబీ రంగు పురుగు నాశనం చేస్తోంది. పంట పూత దశలో ఈ పురుగు ఆశించి పూత, పిందెలను తినేసి ఏ మాత్రం దిగుబడి రాకుండా చేస్తోంది. ఈ పంటను రక్షించుకోవడానికి తెలుగు రాష్ట్రాల్లోని రైతులు రకరకాల మందులు పిచికారీ చేసినా ఆయా పురుగులు, తెగుళ్లు అదుపులోకి రాక పంటలను వదిలేయడం లేదా దున్నేయడం రైతుకు ఆనవాయితీగా మారింది. పత్తి, మొక్కజొన్న రైతులను కష్టనష్టాల నుంచి గట్టెక్కించే ‘ముష్టి ద్రావణా’న్ని వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం టి. వెలంవారిపల్లెకు చెందిన రైతు శాస్త్రవేత్త, సేంద్రియ వ్యవసాయ నిపుణుడు కొమ్ములూరి విజయకుమార్ రైతులకు సూచిస్తున్నారు. పొలాల గట్లపైన, బంజరు భూముల్లో లభించే కొన్ని మొక్కలను, కాయలు, పండ్లు తీసుకుని పలు రకాల ద్రావణాలను తయారు చేసి, పంటలపై పిచికారీ చేయించి అద్భుత ఫలితాలను రాబడుతున్నారు. ఈ కోవలోనే పత్తిలో గులాబీ రంగు పురుగు, మొక్కజొన్నలో లద్దె పురుగు(కత్తెర పురుగు) నివారణకు ‘ముష్టి ద్రావణం’ తయారు చేసి మంచి ఫలితాలు సాధించారు. ముష్టి పండ్లను అత్యధిక మోతాదులో వాడి దీన్ని తయారు చేస్తున్నందున దీన్ని ముష్టి ద్రావణం అని పిలుస్తున్నారు. ఆ ద్రావణం తయారీ, వినియోగం, పనితీరు విజయకుమార్ మాటల్లో తెలుసుకుందాం.. పత్తిని ఆశించే గులాబీ రంగు పురుగు, మొక్కజొన్న, వరి తదితర పంటలను ఆశించే కత్తెర పురుగుల నివారణకు ముష్టికాయలు, వెర్రి పుచ్చ, జముడు, నల్లేరు, సునాముఖి ఆకులు.. ఇవి పొలాల గట్ల మీద ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి. ముష్టి పండ్లు : గుట్టలు, కొండలపై ముష్టి చెట్లు విరివిగా ఉంటాయి. ఈ చెట్ల పండ్లు జూన్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్ వరకూ దొరుకుతాయి. బాగా మాగి పక్వానికి వచ్చిన ముష్టి కాయలు తీసుకుంటేనే రసం, గుజ్జు బాగా వస్తుంది. ఈ పండ్లు 10 కిలోలు తీసుకుని ప్లాస్టిక్ సంచిలో వేసి చితగ్గొట్టి ఒక పాత్రలో ఉంచుకోవాలి. వెర్రి పుచ్చకాయలు: చెరువులు, నదీ తీరాలు, వాగులు, వంకల వద్ద వెర్రిపుచ్చ కాయలు లభిస్తాయి. ఈ కాయలు పండుబారినవి 5 కిలోలు తీసుకుని బాగా దంచి నిల్వ చేయాలి. జముడు : జముడు చెట్టు అన్నీ ముళ్లతో కొమ్ములు కలిగి ఉంటుంది. ఈ కొమ్ములు రెండున్నర కిలోలు తీసుకొని ఆ కొమ్ములను కొడవలితో చిన్న ముక్కలుగా కోసి ఉంచాలి. నల్లేరు: నీటి పారుదల సదుపాయం ఉండే ఉద్యాన తోటల గట్లపైన, గుట్టల్లో, పొలాల వద్ద నల్లేరు మొక్కలు పెరుగుతూ ఉంటాయి. నల్లేరు కనుపులను రెండున్నర కిలోలు తీసుకొని ప్లాస్టిక్ సంచిలో వేసి దంచాలి. సునాముఖి : ఈ మొక్కలు రోడ్ల వెంట ఉంటాయి. పూలు పసుపు పచ్చగా ఉంటాయి. సునాముఖి ఆకులను, పూలను రెండున్నర కిలోలు తీసుకొని గ్రైండర్లో గానీ, రోలులో గానీ వేసి రుబ్బి నిల్వ చేసుకోవాలి. ద్రావణం తయారీ విధానం: 200 లీటర్ల డ్రమ్మును తీసుకుని ఆ డ్రమ్ములో దంచి ఉంచుకున్న ఆయా పదార్థాలు పోయాలి. ఇలా పోసిన వాటిని 12 రోజుల పాటు మురగబెట్టాలి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఒకే కర్రతోనే కలియబెట్టాలి. ద్రావణం డ్రమ్మును నీడలోనే ఉంచి, గోనె సంచిని కప్పి ఉంచాలి. పత్తి చేలలో పిచికారీ విధానం పత్తిని ఆశించే గులాబీ రంగు పురుగు నిర్మూలన కోసం పత్తి మొక్కలకు మొగ్గలు రాక ముందు రెండుసార్లు, మొగ్గ దశలో రెండుసార్లు, పూత నుంచి కాయలు తయారయ్యే సమయంలో ఒకసారి చెట్టు అంతా బాగా తడిచేలా పిచికారీ చేయాలి. మొదటిసారి పిచికారీకి ద్రావణం లీటరు తీసుకుని 10 లీటర్ల నీటికి కలుపుకోవాలి. రెండోసారి.. 10 లీటర్ల నీటికి ఒకటిన్నర లీటరు ద్రావణం, మూడోసారి 10 లీటర్ల నీటికి ఒకటిన్నర లీటరు ద్రావణం, నాలుగోసారి 10 లీటర్ల నీటికి ఒకటిన్నర లీటరు ద్రావణం కలుపుకొని పిచికారీ చేస్తే పురుగు నిర్మూలన జరగడమే కాకుండా అధిక దిగుబడి వస్తుంది. మొక్కజొన్నకు నాలుగైదు సార్లు.. మొక్కజొన్న పంట విత్తిన 15 రోజుల పంట నుంచి మొదళ్లు బాగా తడిచేలా.. నాలుగైదు సార్లు పిచికారీ చేస్తే కత్తెర పురుగు(మక్క లద్దె పురుగు) రానే రాదు. కర్ర చేదెక్కుతుంది కాబట్టి గుడ్లు పెట్టే పరిస్థితే ఉండదు. వరిలోనూ.. వరిలో కాండం తొలిచే పురుగుతోపాటు అగ్గి, ఉల్లికోడు తెగుళ్లను ఈ ద్రావణం పారదోలుతుంది. తీగజాతి, కూరగాయ, పండ్ల తోటలను పట్టి పీడించే పండుఈగ (బంగారు ఈగ)ను కూడా ఈ ముష్టి ద్రావణం మట్టుబెడుతుంది. రసం పీల్చే పురుగులను, రెక్కల పురుగులను, తెలుపు, పసుపు పచ్చ పురుగులను ఈ ద్రావణంతో నివారించవచ్చని విజయకుమార్ చెబుతున్నారు. మత్తు వచ్చి.. విరేచనాలై.. ముష్టి ద్రావణం పిచికారీతో పంటలపై పురుగులకు మత్తు రావటంతోపాటు విరేచనాలు అవుతాయని, బలహీనమైన పురుగులు మొక్క మీద నుంచి నేల రాలుతుందని, నేల రాలిన పురుగులను చీమలు తినేస్తాయని.. ఈ విధంగా విష రసాయనాలను వాడకుండానే పురుగులను ముష్టి ద్రావణంతో నివారించుకోవచ్చని, నిర్మూలించుకోవచ్చని విజయకుమార్ వివరించారు. పూత దశలో పవర్ స్ప్రేయర్లు వాడొద్దు ద్రావణాలను ఎండ వేళల్లో పిచికారీ చేయొద్దని చెబుతూ.. ఉదయం 5 గం. నుంచి 8 గం.లోగానే పిచికారీని పూర్తి చేయాలని విజయకుమార్(98496 48498) అన్నారు. పూత దశలో ద్రావణాలు పిచికారీ చేయకుండా ఉంటే పూత రాలకుండా ఉంటుందని రైతులు ముఖ్యంగా గమనించాలన్నారు. పూత దశలోనూ పిచికారీ అవసరమైతే.. పవర్ స్ప్రేయర్ల ద్వారా కాకుండా సాధారణ స్ప్రేయర్లను వినియోగించి నెమ్మదిగా పిచికారీ చేసుకుంటే పూత రాలకుండా ఉంటుందన్నారు. రైతులు గత ఏడాది నుంచి దోమ నివారణకు వివిధ పంటలపై వాడుతున్న ‘బమావె’ ద్రావణం వంటి ఏ ఇతర ద్రావణాలతోనైనా ముష్టి ద్రావణాన్ని కూడా కలిపి పిచికారీ చేయవచ్చునని ఆయన తెలిపారు. – మాచుపల్లె ప్రభాకరరెడ్డి, సాక్షి (అగ్రికల్చర్), వైఎస్సార్ జిల్లా -
గులాబీ పెదవుల కోసం...
♦ కొన్ని గులాబీ రెక్కలు, టీ స్పూన్ పాలు, టీ స్పూన్ వెన్న కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునేముందు పెదవుల పై అప్లై చేయాలి. తరచుగా ఈ విధంగా చేస్తే పెదవులు గులాబీరేకల్లా సుతిమెత్తగా తయరవుతాయి. ♦ అర టీ స్పూన్ నిమ్మరసంలో మూడు చుక్కల తేనె, కొద్దిగా గ్లిజరిన్ కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకని పెదవులపై మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే పెదవులు పగడాల్లా కాంతులీనుతాయి. గంధంపొడి మాస్క్ టొమాటో రసం – కొద్దిగా, కీరారసం – పావు టీ స్పూన్ నిమ్మర సం – పావు టీ స్పూన్ గంధం పొడి – రెండు టీ స్పూన్లు తయారి: గంధం పొడిలో టొమాటో రసం, నిమ్మరసం, కీరారసం కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేస్తే చర్మం తాజాగా కాంతులీనుతుంది. -
భారీగా పెరిగిన ఎయిర్‌లైన్ ట్రాఫిక్: పుంజుకున్న షేర్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు ఇండిగో, గో ఎయిర్ లాంటి విమాన యాన సంస్థలకు చెందిన విమానాలపై నిషేధం కొనసాగుతుండగా దేశీయ పాసింజర్ ఎయిర్ ట్రాఫిక్ పెరుగుదలను నమోదు చేసింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తన నెలవారీ దేశీయ ట్రాఫిక్ నివేదికలో పేర్కొన్న ప్రకారం ఫిబ్రవరిలో విమాన ప్రయాణికుల సంఖ్య(ఏవియేషన్ ట్రాఫిక్) 24 శాతం జంప్‌చేసింది. 24 శాతం వృద్ధితో 2018 ఫిబ్రవరి నాటికి దేశీయ దేశీయ విమాన ప్రయాణీకుల సంఖ్య 1.07 కోట్లకు పెరిగింది. మొత్తం దేశీయ విమాన ప్రయాణీకుల రద్దీ జనవరి నెలలో 1.14 కోట్లకు పెరిగింది. డిజిసిఎ ఇచ్చిన సమాచారం ప్రకారం జనవరి-ఫిబ్రవరి 2018 నాటికి ప్రయాణీకుల రద్దీ 21.80 శాతం పెరిగింది. 2017 నాటికి 86.55 లక్షల నుంచి పెరిగినట్లు సోమవారం వెల్లడించిన అధికారిక గణాంకాలు వెల్లడించాయి. దీంతో విమానయాన కంపెనీల కౌంటర్లు వెలుగులోకి వచ్చాయి. జెట్ ఎయిర్వేస్ 2 శాతం, స్పైస్‌జెట్ 1.2 శాతం, ఇంటర్‌గ్లోబ్(ఇండిగో) 0.75 శాతం లాభపడింది. -
విజయవాడలో గులాబీ పూల ప్రదర్శన
-
గులాబీ తీసుకో..సీటు బెల్టు పెట్టుకో
కర్నూలు : ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర చాలా ముఖ్యమని, సీటు బెల్టు ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచిస్తూ గులాబీ పూలు ఇచ్చి ఎస్పీ ఆకే రవికృష్ణ, రవాణా శాఖ ఉపకమిషనర్ ప్రమీల అవగాహన కల్పించారు. వీరి నేతృత్వంలో పోలీసులు, రవాణా శాఖ అధికారులు శనివారం సాయంత్రం కర్నూలు శివారులో వాహనాల తనిఖీ చేపట్టారు. సీటు బెల్టుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వమించారు. జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలను తనిఖీ చేస్తూ ప్రతి ఒక్క వాహనదారుడు సీటు బెల్టు ధరించి ప్రయాణించాలని సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ రామచంద్ర, నాల్గో పట్టణ సీఐ నాగరాజ రావు పాల్గొన్నారు. -
మార్కెట్లకు జైట్లీ బూస్ట్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఆర్థికమంత్రి అరుణ జైట్లీ ప్రకటన మంచి బూస్టప్ ఇచ్చింది. దీంతో వరుసగా రెండో రోజు లాభపడిన సెన్సెక్స్ 89 పాయింట్ల లాభంతో 29,421 వద్ద నిఫ్టీ 22 పాయింట్లు ఎగిసి 9,108 వద్ద స్థిరపడింది. ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్‌తో కలసి మొండిబకాయిల(ఎన్పీఏలు) పరిష్కారానికి పటిష్ట విధానాలు రూపొందిస్తున్నామన్న జైట్లీ ప్రకటన ప్రభుత్వ, ప్రయివేట్ బ్యాంకింగ్ కౌంటర్లలో జోష్ పెంచింది. దీంతోపాటు ఎఫ్ఎంసీజీ, రియల్టీ రంగాలు లాభపడగా, ఐటీ సెక్టార్ మాత్రం నష్టాలను మూటగట్టుకుంది. బీవోబీ, ఐసీఐసీఐ, స్టేట్‌బ్యాంక్, కొటక్ బ్యాంక్ టాప్ గెయినర్‌గా నిలిచాయి. అలాగే గెయిల్, బీపీసీఎల్, ఐటీసీ, ఆర్ఐఎల్, హిందాల్కో, విప్రో లాభపడ్డాయి. గ్రాసిమ్ టాప్ లూజర్‌గా నిలిచింది. టెక్ మహీంద్రా, జీ, టీసీఎస్, అంబుజా, ఇన్ఫోసిస్, ఇన్ఫ్రాటెల్, ఐడియా, లుపిన్, అదానీ పోర్ట్స్ నష్టపోయాయి. అటు డాలర్ మారకంలో రూపాయి 12 పైసలు లాభపడి రూ.65.41 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో మాత్రం పుత్తడి ధరల బలహీనత కొనసాగుతోంది. రూ.59 లుక్షీణించి పది గ్రా పుత్తడి 28,741 వద్ద ఉంది. -
గులాబీ మొక్కలో కరెంట్ నిల్వ
లండన్ : గులాబీ మొక్కను విద్యుత్‌ను నిల్వ చేసే సూపర్కెపాసిటర్గా మలచడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. రానున్న కాలంలో ఎలక్ట్రానిక్ పరికరాలకు ఈ గులాబీ మొక్క నుంచే విద్యుత్‌ను సరఫరా చేయవచ్చని వారు తెలిపారు. దీనికోసం పరిశోధకులు గులాబీ మొక్కలో పాలీమర్ ద్రావణాన్ని ప్రవేశపెట్టడంతో మొక్క కాండంలో ఏర్పడిన హైడ్రోజెల్ తీగలుగా మారిందని పేర్కొన్నారు. దీంతో తీగలకు ఇరు వైపులా ఎలక్ట్రోడ్లు, మధ్యలో ట్రాన్సిస్టర్ మాదిరిగా ఏర్పడ్డాయని చెప్పారు. తర్వాత మొక్కలో విద్యుత్‌ను నిల్వ చేయడంలో అనేకసార్లు విజయం సాధించామని స్వీడన్ లోని లింకోపింగ్ వర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలేని స్ట్రావిన్ డో తెలిపారు. -
148 శాతం పెరిగిన విద్యార్థుల ఆందోళన
న్యూఢిల్లీ: అడగంది అమ్మయిన అన్నం పెట్టదన్నట్లుగా ఈ దేశంలో ఆందోళన చేయంది ప్రజలు ఎదుర్కొంటున్న ఏ సమస్యా తీరదు. దేశంలో ఆందోళనలను రాజకీయ, ఆర్థిక, సామాజిక, కార్మిక, విద్యార్థుల ఆందోళనలంటూ పలు రకాలుగా విభజించవచ్చు. 2009 నుంచి 20014 వరకు ఆందోళనలకు సంబంధించిన డేటాను విశ్లేషించగా ఈ ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 4,20,000 ఆందోళనలు చోటుచేసుకున్నాయి. అంటే రోజుకు సరాసరి సగటున 200 ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనలు అంతకుముందు ఐదేళ్ల కాలంతో పోలిస్తే 55 శాతం పెరిగాయి. అన్నింటికన్నా ఎక్కువ పెరిగింది విద్యార్థుల ఆందోళనలు. ఏకంగా 148 శాతం పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా కాలేజీ యూనియన్లపై నిషేధం ఉన్నప్పటికీ కర్ణాటక రాష్ట్రంలోనే విద్యార్థుల ఆందోళనలు ఎక్కువగా చోటుచేసుకోవడం విశేషం. అక్షరాస్యత ఎక్కువగా ఉండడంతోపాటు విద్యాలయాలు కూడా ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. జాతీయ అక్షరాస్యత సరాసరి సగటు 74 శాతం కాగా, కర్నాటకలో 75.6శాతం ఉంది. దేశంలో ఏ నగరంలో లేనివిధంగా ఒక్క బెంగళూరు నగరంలోనే 911 కాలేజీలు ఉన్నాయి. ఆందోళనల్లో తమిళనాడు ఫస్ట్.... ఈ ఐదేళ్లకాలంలో విద్యార్థుల ఆందోళనలతోపాటు మతపరమైన ఆందోళనలు 92 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలు 71 శాతం, రాజకీయ ఆందోళనలు 42 శాతం, కార్మికుల ఆందోళలు 38 శాతం పెరిగాయి. అన్ని రకాల ఆందోళనల్లో 50 శాతం ఆందోళనలు తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్, మహారాష్ర్టలోనే జరిగాయి. తమిళనాడు మొదటి స్థానంలో, పంజాబ్ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ మినహా మిగతా అన్ని రాష్ట్రాలు అక్షరాస్యతలో ముందున్న రాష్ట్రాలే. మొత్తం ఆందోళనల్లో 25 శాతం ఆందోళనలు తమిళనాడులోనే చోటు చేసుకున్నాయి. స్వాతంత్య్రానికి ముందు నుంచి కూడా తమిళనాడులోనే ఆందోళనలు ఎక్కువ. హిందీ భాషా వ్యతిరేక ఆందోళనలు, ఎల్టీటీఈగా మద్దతుగా ఆందోళనలు, ఆ తర్వాత కూడంకుళం అణు విద్యుత్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగడమే దీనికి కారణం. దేశ రాజధాని ఢిల్లీలో.... మొత్తం ఆందోళనల్లో దేశరాజధాని ఢిల్లీ ఏడవ స్థానంలో నిలిచింది. పరిగణలోకి తీసుకొన్న ఐదేళ్ల కాలంలో నగరంలో మొత్తం 23,000 ఆందోళనలు చోటు చేసుకున్నాయి. ఈ ఆందోళనలకు జంతర్ మంతర్, రామ్‌లీలా మైదాన్, ఇండియా గేట్ ప్రధాన వేదికలయ్యాయి. అన్న హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఆందోళన, నిర్భయ రేప్ కేసులో ఆందోళనలు, వన్ ర్యాంక్ వన్ పెన్షన్ డిమాండ్‌తో మాజీ సైనికులు చేపట్టిన ఆందోళనలు ముఖ్యమైనవి. యూపీ, బీహార్‌లో ఒక శాతం మాత్రమే.... దేశంలోని జనాభాలో 25 జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్, బీహార్‌లో ఒక్క శాతానికి తక్కువగా ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ఈరెండు రాష్ట్రాల్లో అక్షరాస్యత శాతం చాలా తక్కువ. దేశంలోనే బీహార్ రాష్ట్రంలో అత్యల్పం. మొత్తం ఆందోళనల్లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ ఐదవ స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో అక్షరాస్యత 67 శాతం. రాష్ట్ర విభజనకు అనుకూలంగా, వ్యతిరేకంగానే ఎక్కువ ఆందోళనలు చేసుకున్నాయి. కేరళ, గోవా, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువ ఆందోళనలు చోటు చేసుకోక పోవడానికి, అక్షరాస్యతకు ప్రత్యక్ష సంబంధం లేకపోవడానికి ఇతర కారణాలున్నాయి. కేరళలో బంద్‌లను, ఆందోళనలకు ఆ రాష్ట్ర హైకోర్టు నిషేధించడం, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక సాయుధ బలగాల చట్టం అమల్లో ఉండడం లాంటివి అందుకు కారణం కావచ్చు. (బ్యూరో ఆఫ్ పోలీస్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ డాక్యుమెంట్ల ఆధారంగా చేసిన విశ్లేషణ) -
27న మరోసారి ‘మండలి’ కమిటీ భేటీ
-
27న మరోసారి ‘మండలి’ కమిటీ భేటీ
♦ డిసెంబర్ 22వ తేదీ జీరో అవర్ ♦ వీడియో క్లిప్పింగ్‌లను వీక్షించిన కమిటీ ♦ రోజా, అనిత వాదనలు వినే అవకాశం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గత నెల 22న జీరో అవర్‌లో సభ్యులు ప్రస్తావించిన అంశాలపై విచారణ జరిపి నివేదిక ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలోని కమిటీ సమావేశం మంగళవారం అసెంబ్లీ ఆవరణలో జరిగింది. ఈ నెల 27వ తేదీన మరోసారి కమిటీ సమావేశం కావాలని నిర్ణయించింది. కమిటీ సమావేశంలో సభ్యులు గడికోట శ్రీకాంతరెడ్డి, పి. విష్ణుకుమార్‌రాజు, తెనాలి శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు. 22వ తేదీన సభ జీరో అవర్‌లో విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత తనకు అన్యాయం జరిగిందని న్యాయం చేయాలని కోరారు. ఇదే అంశంపై పలువురు సభ్యులు మాట్లాడారు. వీరి ప్రసంగాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లను కమిటీ సుమారు మూడు గంటలపాటు వీక్షించింది. శాసనసభ నుంచి ఏడాదిపాటు సస్పెన్షన్‌కు గురైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాతో పాటు, ఆమెపై ఫిర్యాదు చేసిన టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనితలను కూడా పిలిపించి వారి వాదనలను వినాలని బీజేపీ ఎమ్మెల్యే, కమిటీ సభ్యుడు పి.విష్ణుకుమార్ రాజు సూచించినట్లు సమాచారం. ఈనెల 27వ తేదీన జరిగే కమిటీ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే సమావేశంలో పాల్గొన్న వైస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంతరెడ్డి తమ పార్టీ ఎమ్మెల్యే రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేయటాన్ని గట్టిగా ప్రశ్నించినట్లు తెలిసింది. 340వ నిబంధన ప్రకారం ప్రస్తుత సమావేశాల వరకే సభ్యురాలిని సస్పెండ్ చేయాల్సి ఉన్నా మెజారిటీ సభ్యుల అభిప్రాయం పేరుతో ఏడాదిపాటు సస్పెండ్ చేయటం సరికాద న్నట్లు సమాచారం. శాసనసభ లోపల జరిగిన అంశాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లు సోషల్ మీడియాలో ప్రసారం కావటాన్ని కూడా ఆయన ప్రస్తావించి అందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయటంతో పాటు చర్య తీసుకోవాలని సమావేశంలో అన్నట్లు తెలిసింది. -
తులసీదళం... ముఖ సౌందర్యం...
* గులాబి రేకుల్లా మృదువుగా ఉండాల్సిన ముఖం మొటిమలు, దద్దుర్లు, నల్ల మచ్చలతో నిండిపోయిందా? అయితే వాటిని దూరం చేసే ఔషధం మీ పెరట్లోనే ఉంది. 10-15 తులసి ఆకులను పేస్ట్‌లా చేసి, దాన్ని టమాటో గుజ్జుతో కలిపి ముఖానికి రాసుకోవాలి. అలా ఓ 15 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. *ఈ వర్షాకాలంలో వానకు తడిసీ తడిసీ జుట్టు తన సౌందర్యాన్ని కోల్పోతుంది. అలా కాకుండా కురులు నిగనిగలాడాలంటే తలంటు స్నానం చేసిన ప్రతిసారి రెండు టీ స్పూన్ల (శనగ పిండి), ఒక గుడ్డు తెల్ల సొన, ఒక టీ స్పూన్ పెరుగు, అర టీస్పూన్ నిమ్మరసం తీసుకొని వాటన్నింటిని కలపాలి. ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఆరిన తర్వాత చల్లటి నీటితో తల స్నానం చేయాలి. రెండు వారాల్లో కనీసం ఇలా నాలుగుసార్లు చేస్తే మేనితో సమానంగా మెరిసే కురులు మీ సొంతం. * చేతులు, పాదాల చర్మకాంతి పెరగాలంటే... మూడు స్పూన్ల బోరాక్స్ పౌడర్, రెండు స్పూన్ల గ్లిజరిన్, రెండు కప్పుల రోజ్ వాటర్‌ను బాగా కలిపాలి. దాన్ని కాళ్లకు, చేతులకు రాసుకొని ఓ 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే అది మంచి స్క్రబ్‌లా పని చేస్తుంది. * ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు అల్లం రసాన్ని తాగితే అది ముఖంపై మొటిమలను దూరం చేస్తుంది. అంతేకాదు ఆ రసాన్ని మాడుకు రాసుకుంటే రక్త ప్రసరణ బాగా జరగడంతో చుండ్రు మాయమవుతుంది. అలాగే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
ముంబై: దేశీయ మార్కెట్లు శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. బాంబే స్టాక్ఎక్సేంజ్ సెన్సెక్స్ 127 పాయింట్ల లాభంతో 27,633 దగ్గర, నిఫ్టీ 41 పాయింట్ల లాభంతో 8, 359దగ్గర ట్రేడవుతున్నాయి. మెటల్, ఐటి, బ్యాంకింగ్, రియాల్టీ సెక్టార్లో కొనుగోళ్లు సాగుతున్నాయి. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయ 5 పైసలు లాభపడి 63.75 దగ్గర ఉంది. -
లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
ముంబై: దేశీయ మార్కెట్లు గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. దాదాపు 95 పాయింట్ల లాభంతో స్టాక్ మార్కెట్లు మొదలయ్యాయి. ఆ తర్వాత కొద్దిగా నష్టపోయి బాంబే స్టాక్ఎక్సేంజ్ సెన్సెక్స్ 34 పాయింట్ల లాభంతో 27,599 దగ్గర, నిఫ్టీ 11 పాయింట్ల లాభంతో 8, 346 దగ్గర ట్రేడవుతున్నాయి. ఆటో ఐటి, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, రియాల్టీ సేర్లలో స్వల్ప కొనుగో్ళ్లు కనిపిస్తున్నాయి. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయ 8 పైసలు లాభపడి 63.93 దగ్గర ఉంది. -
పుష్పవిలాపం!
పతనమైన పూల ధరలు గిట్టుబాటుకాక తోటలోనే వదిలేస్తున్న రైతులు మార్కెట్లోనే పారబోస్తున్న వైనం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: బతుకు ‘పూల’బాటేనని భావించిన రైతాంగానికి ఈ ఏడాది నష్టాల మూటే మిగిలింది. మార్కెట్లో ఒక్కసారిగా ధరల పతనం కావడం.. అకాల వర్షాలు పంటను ముంచేశాయి. దీంతో రైతులు కష్టాల్లో కూరుకుపోయారు. ఒకవైపు పూలసాగు విస్తీర్ణం పెరగడం.. దిగుబడి గణనీయంగా ఉండడం ధరల పతనానికి కారణంగా కనిపిస్తోంది. ఈ సీజన్లో ఏ రకం పూలకయినా డిమాండ్ బాగా ఉండేది. అయితే, ప్రస్తుతం పరిస్థితులు తలకిందులయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 10 వేల ఎకరాల్లో చామంతి, బంతి, గులాబీ, కనకాంబర పూల తోటలు సాగవుతున్నాయి. నగర శివారు మండలాలైన శంషాబాద్, మొయినాబాద్, షాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, మహేశ్వరం, కందుకూరులో పూల పంట విరివిగా సాగుతోంది. ఇక్కడి నుంచి గుడిమల్కాపూర్ పూల మార్కెట్‌ను ఉత్పత్తులను తరలిస్తారు. ముహూర్తం కుదరక.. సాధారణంగా సంక్రాంతి నుంచి జూన్ వరకు మంచి ముహూర్తాలతో వివాహాలు, శుభకార్యాలు పెద్ద సంఖ్యలో జరుగుతుంటాయి. ఈ సీజన్‌ను దృష్టిలో పెట్టుకున్న రైతులు పుష్పాల సాగు చేపడతారు. గతేడాది చివర్లో అధికమాసం కారణంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఆశించిన స్థాయిలో జరగలేదు. ఈ క్రమంలో ప్రస్తుత ఏడాదిపై గంపెడాశలు పెట్టుకుని పూల రైతులు సాగు విస్తీర్ణాన్ని పెంచారు. చాందిని, బంతి, చామంతి తదితర పుష్పజాతులను వేశారు. జిల్లాలో రైతులు సాగు చేసిన పూబంతులతోపాటు కర్ణాటక నుంచి సుమాలు గుడిమల్కాపూర్ మార్కెట్‌ను ముంచెత్తుతుండడంతో ధరలు పడిపోయాయి. కొనేవారు లేక రైతులు మార్కెట్లోనే పారబోసి వెళుతున్నారు. పూల కట్ట ధర రూ.10:ఇంట్లో జరిగే చిన్నపాటి శుభకార్యం మొదలు పెళ్లి మండపాల వరకు ఎక్కువగా జర్బరా, కార్నేషన్ పూలను అలంకరణ కోసం వాడుతున్నారు. ఈ సారి వీటి ధరలు నేల చూపులు చూస్తుండడంతో ఈ పూల సాగు చేపట్టిన రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. సాధారణంగా ఈ సీజన్లో పది పూల కట్ట ధర రూ.50 నుంచి రూ.100 పలుకుతుంది. ఇవి ప్రస్తుతం పది రూపాయలకే అమ్ముడుపోతున్నాయి. అకాల వర్షాలతో అపార న ష్టం: అర ఎకరంలో హైబ్రీడ్ బంతి సాగుకు రూ.30 వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. దిగుబడి ఆశాజనకంగా ఉన్నా గిట్టుబాటు ధరలు లేక ఆదాయం రావడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ముహుర్తాల రోజున కొంత ధరలు పలుకుతుండగా మిగతా రోజుల్లో రైతుల పూలను మార్కెట్లో పారబోసి వెళ్తున్నారు. వారం రోజుల నుంచి అడపాదడపా కురుస్తున్న అకాల వర్షాలు పూల పంటలపై తీవ్రప్రభావం చూపుతున్నాయి. పెట్టుబడి 30 వేలు అయింది అర ఎకరంలో హైబ్రిడ్ బంతి సాగు చేశా. విత్తనాలు, కూలీలు, మందుల ఖర్చు రూ. 30 వేలు అయింది. ఇప్పటి వరకు పూలు అమ్మితే కేవలం రూ.2 వేలు వచ్చాయి. చేనులో నిండుగా పూలున్నాయి. ఏమి చేయాలో అర్థం కావడంలేదు. - తూర్పు జగన్‌రెడ్డి, అమ్డాపూర్ కూలీ ఖర్చులు రావడంలేదు.. పూలకు ధరలు లేక చాలా నష్టపోవాల్సి వస్తోంది. ఒక్కోసారి పూలు అమ్ముడుపోకుంటే మార్కెట్లోనే పారబోసి వస్తున్నాం. అర ఎకరంలో చాందిని సాగుచేస్తే కిలో రూ.10కి కూడా ఎవరూ అడగడంలేదు. వర్షాలకు పంట దెబ్బతిన్నది. పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చేలా లేవు. - కట్కూరి శ్రీశైలంగౌడ్, కె.బి.దొడ్డి, డిమాండ్ కంటే ఎక్కువ పంట డిమాండ్ కంటే ఎక్కువ దిగుబడి రావడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. పెళ్లిళ్లు, శుభకార్యాలకు చాందిని, బంతి పూల వాడకం తగ్గింది. జర్బరా, కార్నేషన్ పూల సాగు విస్తీర్ణం పెరిగి దిగుబడి బాగా ఉండడంతో ధరలు లేవు. - బూర్గు మహిపాల్‌రెడ్డి, వ్యాపారి,గుడిమల్కాపూర్ పూల మార్కెట్ ఒడిదుడుకులు సహజమే... ఇటీవల భారీగా పెరిగిన సాగు విస్తీర్ణంతో పూల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. అయితే, అంతమాత్రాన దిగాలు పడాల్సిన పనిలేదు. వారం రోజుల్లో ధరలకు మళ్లీ రెక్కలొచ్చే అవకాశముంది. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. అదే సమయంలో శుభకార్యాలు కూడా ఈ మధ్యకాలంలో తక్కువగా జరుగుతున్నాయి. రైతులు కుంగిపోవాల్సిన అవసరంలేదు. జూలై వరకు పూలకు గిరాకీ ఉంటుంది. - వేణుగోపాల్,జిల్లా ఉద్యానశాఖ సహాయసంచాలకులు