- వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎమ్మెల్యే ఆర్కేరోజా
- పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్ రెడ్డి
- తిరుపతి లోక్‌సభ పార్టీ పరిశీలకులుగా ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, చిత్తూరు లోక్‌సభకు పి.రవీంద్రనాథరెడ్డి, రాజంపేట పరిశీలకులుగా దేవగుడి నారాయణరెడ్డి నియామకం
- జిల్లా బాధ్యులుగా జంగా కృష్ణమూర్తి
- నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- అనంతపురం, కర్నూలు జిల్లా పార్టీ బాధ్యతలు భూమనకు అప్పగింత
- హిందూపురం పార్లమెంటు పరిశీలకులుగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీని తిరుగులేని రాజకీయశక్తిగా బలోపేతం చేయడానికి ఆపార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళిక రచించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో జిల్లాకు పెద్దపీట వేశారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడానికి పటిష్ఠ ప్రణాళికను రూపొదించారు. ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్‌సీపీ ఎనిమిది శాసనసభ స్థానాలను.. రెండు లోక్‌సభ స్థానాలను చేజిక్కించుకుని సత్తా చాటిన విషయం విదితమే.
జిల్లాలో వైఎస్సార్‌సీపీని తిరుగులేని రాజకీయశక్తిగా మలిచేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళిక రచించారు. నగరి శాసనసభ స్థానం నుంచి ఎన్నికైన ఆర్కే రోజాను వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించారు. వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా బాధ్యులుగా ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తిని నియమించారు. నెల్లూరు పార్లమెంట్ పరిశీ లకులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియమితుల య్యారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి అనంతపురం, కర్నూలులో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను అప్పగించారు.
తిరుపతి లోక్‌సభ స్థానం వైఎస్సార్‌సీపీ పరిశీలకులుగా ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, చిత్తూరు లోక్‌సభ స్థానం పరి శీలకులుగా పి.రవీంద్రనాథ్‌రెడ్డి, రాజంపేట లోక్‌సభ స్థానం పరిశీలకులుగా దేవగుడి నారాయణరెడ్డిలను ని యమించారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డిలను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులుగా నియమించా రు. హిందూపురం పార్లమెంటు పరిశీలకులుగా రాజం పేట ఎంపీ మిథున్‌రెడ్డిని నియమించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యవర్గంలో జిల్లాకు పెద్దపీట వేశారు.