ఏంటీ రోజ్ హిప్స్.. ఎప్పుడూ వినలేదే? ఏంటవి? అని ఆశ్చర్యపోకండి. గులాబీ పూలు వికసించి, రాలిపోయిన తర్వాత.. గులాబీ మొక్కలకు ఇవి అభివృద్ధి చెందుతాయి. ఇవి గుండ్రని, బెర్రీ పండ్లలా ఉంటాయి. రోజ్ హిప్స్ సాధారణంగా ఎరుపు, నారింజ రంగులో ఉంటాయి. వీటిలో విత్తనాలు కూడా ఉంటాయి. అయితే వీటిలో పోషకాల అధికంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. వీటిని ఆయుర్వేద వైద్యంలో శతాబ్దాలుగా వినియోగిస్తున్నారు కూడా. అలాంటి ఈ రోజ్ హిప్స్‌ని మన ఆహారంలో భాగం చేసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటంటే..
- ఈ రోజ్ హిప్స్‌లో విటమిన్ సి, ఏ, బి5, సి యాంటీఆక్సిడెంట్లు ఇతర ప్రయోజనకరమైన సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. రోజ్ హిప్స్‌లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీవైరల్, యాంటికాన్సర్ లక్షణాలు ఉంటాయి. అంతేగాదు దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది, ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది. బలుబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్లు, దగ్గు వంటి అనారోగ్యాలను నుంచి రక్షణ కల్పిస్తుంది.
- రోజ్ హిప్స్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని మంటను తగ్గించడానికి సహాయపడతాయి. హృదయనాళ వ్యవస్థను రక్షిస్తాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.రోజ్ హిప్స్‌లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది, ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌కు మద్దతు కల్పిస్తుంది.
- రోజ్ హిప్స్‌లో విటమిన్ ఏ, ఇ సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి, ముడతలను తగ్గించడానికి తోడ్పడతాయి. తద్వారా యవ్వన ఛాయను ప్రోత్సహిస్తాయి.రోజ్ హిప్స్‌లో లూటీన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తాయి.
- వయస్సు సంబంధిత మచ్చల క్షీణత ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.రోజ్ హిప్స్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్ నొప్పులు, కీళ్ల నొప్పులను తగ్గించడానికి తోడ్పడతాయి. ఇవి శరీరంలోని వాపును తగ్గించి.. నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తాయి.రోజ్ హిప్స్‌లో ఉండే ఫైబర్ కంటెంట్ మిమ్మల్ని ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. బరువు కంట్రోల్‌లో ఉంచడానికి సహాయపడుతుంది. అతిగా తినకుండా నివారిస్తుంది.
- రోజ్ హిప్స్‌లో ఉండే.. యాంటీఆక్సిడెట్లు మెదడులోని ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. ఇది మానసికి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నిరాశ, ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ వంటి వాటిని దరిదాపుల్లోకి రానివ్వవు.
ఎలా తీసుకోవాలి..?
- ఎండిన రోజ్ హిప్స్‌ను వేడి నీళ్లలో వేసి సుమారు 10 నిమిషాల పాటు నానబెట్టండి. ఆ తర్వాత దానిలో కొంచెం తేనె యాడ్ చేసుకుని తాగొచ్చు.
- స్మూతీస్‌లో ఎండిన రోజ్ హిప్స్ యాడ్ చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు. వాటిలోని పోషకాలు పెరుగుతాయి. చక్కెరతో కలిపి జామ్‌గా తయారు చేసుకోవచ్చు.
- మీరు మఫిన్‌లు, కేక్‌లు, కుకీలు లేదా బ్రెడ్‌ల కోసం ప్రత్యేకమైన, ఆరోగ్యకరమైన ట్విస్ట్‌ని అందించడానికి ఎండిన రోజ్ హిప్స్ యాడ్ చేస్తే టేస్ట్‌కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం పొందొచ్చు.
(చదవండి: అత్యుత్తమమైన కాఫీల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉందో తెలుసా!)
Comments
Please login to add a commentAdd a comment