బాలీవుడ్ నటి ప్రయాంక చోప్రా దగ్గర నుంచి పలువురు ప్రముఖ సెలబ్రిటీలంతా ఇష్టపడే షేషియల్ రోజ్ గోల్డ్ ఫేషియల్. మూడు పదులు వయసు దాటిని యవ్వనపు కాంతితో మేను ప్రకాశవంతంగా ఉంటుంది. ముడతలు లేని చక్కటి చర్మం, వృద్ధాప్య లక్షణాలు దాచేసి గ్లామరస్ కనిపించేలా చేస్తుంది. బహుశా అందువల్లే ఇంతలా సెలబ్రిటీలు ఈ ఫేషియల్‌ని లైక్ చేస్తున్నారు. ఈ ఫేషియల్‌తో ఎన్ని లాభాలో చూద్దామా..!
చాలామంది సెలబ్రిటీలు గ్లామరస్ ఇచ్చే ప్రాముఖ్యత అంత ఇంత కాదు. అందుకోసం ఎంత డభైనా ఖర్చు చేసేందుకు వెనకాడరు కూడా. వాళ్లంతా రోజ్ గోల్డ్ ఫేస్ మాస్క్‌కి ప్రాధాన్యత ఇస్తారు. రోజ్ గోల్డ్ ఆయిల్‌తో చేసిన రోజ్ గోల్డ్ ఆయిల్ ఫేషియల్ మాస్క్ వారి చర్మ సంరక్షణకు ఎంతలా ఉపయోగపడుతుందో వింటే ఆశ్చర్యపోతారు. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అలాగే పర్యవారణానికి ప్రభావితం కాకుండా ఉండేలా యాంటీ-ఆక్సిడెంట్ ప్రయోజనాలను కూడా అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇందులో ఉపయోగించే బంగారు పదార్దాలు లేదా అందులో ఉండే బంగారు రేణువులు చర్మంపై వచ్చే గీతలు, ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో హైలురోనిక్ యాసిడ్, విటమిన్ సీ, బొటానికల్ ఆయిల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా, పునరుజ్జీవింపజేయడంలో సహాయపడతాయి.
ఇక రోజ్ గోల్డ్ ఆయిల్..
చర్మాన్ని ఆరోగ్యంగా, హైడ్రేటెడ్‌గా ఉంచడానికి మాయిశ్చరైజర్‌గా పనిచేయడం నుంచి మేకప్‌కి సిద్దమయ్యేలా అందంగా మారుస్తుంది. ముఖ్యంగా పెదాలను హైడ్రేట్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. కంటి కింద పొడి ప్రాంతాల్లో అప్లై చేస్తే మృదువుగా కనిపిస్తాయి.
దేనితో తయారు చేస్తారంటే..
గుమ్మడికాయ గింజల నూన, ఇతర నూనెలతో కలిసి ఉంటుంది. గుమ్మడికాయ గింజల నూనె కణజాలాన్ని పునరుత్పత్తి చేస్తుంది. హైపర్పిగ్మెంటేషన్ రూపాన్ని తగ్గిస్తుంది. తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది, యవ్వన రూపాన్ని ప్రోత్సహిస్తుంది.
ఇందులో జింక్, విటమిన్ సీ ఉంటాయి. ఇవి చర్మాన్ని దృఢంగా, బిగుతుగా ఉంచడంలో సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నప్పటికీ, ఈ నూనె దాని ప్రత్యేకమైన ఫార్ములా కారణంగా జిడ్డుగల చర్మానికి అనుకూలంగా ఉంటుంది.
ప్రధాన పదార్థాలు బంగారు రేకులు, రోజ్‌షిప్ సీడ్ ఆయిల్..
బంగారు రేకులు కొల్లాజెన్ క్షీణతను నెమ్మదిస్తాయి. చర్మ స్థితిస్థాపకతను పెంచుతాయి. మేని ఛాయను కాంతివంతం చేయడమే గాక దృఢంగా ఉంచేలా కణాలను ప్రేరేపిస్తాయి. రోజ్‌షిప్ సీడ్ ఆయిల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్‌గానూ, టిష్యూ రీజెనరేటర్‌గా పనిచేస్తుంది. వాపును తగ్గించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రక్తప్రసరణలో మంచిగా ఉంటుంది.
అలాగే రోజ్‌గోల్డ్ ఆయిల్ మాస్క్‌లోనారింజ తొక్కలు ఉంటాయి.ఇవి చనిపోయిన చర్మ కణాలను ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి. ఇందులో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది. పైగా చర్మాన్ని బిగుతుగా చేసి మెరిసేలా చేస్తుంది.
ప్రయోజనాలు
ఇది యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను, తేమను అందిస్తుంది.
అన్ని రకాల చర్మాలకు తగినది
ఇది కణజాలాన్ని పునరుత్పత్తి చేయడం, ఫైన్ లైన్లు, హైపర్పిగ్మెంటేషన్‌ను తగ్గించడం వంటివి చేస్తుంది.
ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటమే గాక యవ్వన రూపాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది.
రోజ్ ఆయిల్ ఫేషియల్, షీట్ మాస్క్ లేదా మరేదైనా వారికి చర్మ అలెర్జీలు లేదా ఇతర చర్మ సమస్యలు ఉన్నట్లయితే వాటిని ఉపయోగించే ముందు జాగ్రత్తగా ఉండండి. వ్యక్తి గత చర్మ నిపుణుడి సలహాలు సూచనలు మేరకు ఉపయోగించటం మంచిది.
(చదవండి: ఒక హంతకుడి బాధితులు!)
Comments
Please login to add a commentAdd a comment