ముత్యాల ఫేసియల్... | Pearls facials in beauty parlor | Sakshi
Sakshi News home page

ముత్యాల ఫేసియల్...

Jan 16 2014 1:33 AM | Updated on Sep 2 2017 2:38 AM

ముత్యాల ఫేసియల్...

ముత్యాల ఫేసియల్...

ముఖ నిగారింపు కోసం బ్యూటీపార్లర్‌కి వెళితే ఫ్రూట్, పెర్ల్, గోల్డ్, డైమండ్... ఫేసియల్స్ అంటూ ఓ జాబితా ముందుంచుతారు. ఏ ఫేసియల్‌కు ఎంత ఖర్చు అవుతుందో రాసుంటుంది.

ముఖ నిగారింపు కోసం బ్యూటీపార్లర్‌కి వెళితే ఫ్రూట్, పెర్ల్, గోల్డ్, డైమండ్... ఫేసియల్స్ అంటూ ఓ జాబితా ముందుంచుతారు. ఏ ఫేసియల్‌కు ఎంత ఖర్చు అవుతుందో రాసుంటుంది. చర్మతత్త్వానికి ఏ ఫేసియల్ నప్పుతుందో తెలియకపోయినా ఖర్చును బట్టి నిగారింపు వస్తుంది అని ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. అలా కాకుండా చర్మతత్త్వానికి తగ్గ ఫేసియల్ ఎంచుకోవాలంటే... నిపుణుల సలహా తీసుకోవాలి.
 పెర్ల్ ఫేసియల్: ముత్యాల పొడిని ఈ తరహా ఉత్పత్తిలో ఉపయోగిస్తారు.

ముత్యాల పొడిలో ఉండే సుగుణాలు చర్మం పైభాగంలో ఉండే మెలనిన్‌ను ప్రభావితం చేస్తాయి. ఫలితంగా ఎండ వల్ల దెబ్బతిన్న చర్మం (ట్యాన్) సాధారణ స్థితికి వస్తుంది. అంతేకాదు ముత్యాలలో బలమైన పోషకాలు, అమినో యాసిడ్స్, మినరల్స్, ప్రొటీన్లు ఉండి చర్మకణాలను శక్తిమంతం చేస్తాయి. ఫలితంగా చర్మగ్రంథులు చురుగ్గా పనిచేస్తాయి. అందుకే ముత్యాల పొడిని సౌందర్య ఉత్పాదనలలో ఉపయోగిస్తుంటారు. ముత్యాల ఫేసియల్ జిడ్డు చర్మం గలవారికి మంచి ఫలితాన్ని ఇస్తుంది.


 నోట్: ఫేసియల్‌కు ఏ ఉత్పత్తులను వాడుతున్నారో నిపుణులను డిమాండ్  చేయవచ్చు. ఎందుకంటే నాణ్యమైన ఉత్పత్తులు వాడితేనే తీరైన ఫలితం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement