pearl
-
మాల్దీవులు బీచ్‌లో హన్సిక అందాల హోయలు (ఫోటోలు)
-
అసలైన ముత్యాలను గుర్తించండి : ఇలా భద్రపర్చుకోండి!
ముత్యాల పేరుతో మనకు మార్కెట్లో దొరికేవి మూడు రకాలు. నాచురల్ ఫార్మ్డ్ పెరల్స్, కల్చర్డ్ పెరల్స్, ఇమిటేషన్ పెరల్స్. నాచురల్ ఫార్మ్డ్ పెరల్స్, కల్చర్డ్ పెరల్స్ రెండూ ఆయెస్టర్లోనే తయారవుతాయి. ఇమిటేషన్ పెర్ల్ అంటే గాజు పూస లేదా ప్లాస్టిక్ పూస మీద ముత్యంలా కనిపించడానికి కోటింగ్ వేసినవి. ఇవి మన్నిక ఉండవు. ఫ్యాన్సీగా ధరించాలనే సరదాతో వాటిని కొనుక్కోవచ్చు. కానీ ముత్యాలని భ్రమ పడవద్దు. ప్రాచీన కాలంలో నాచురల్‌గా వాటంతట అవి ఉత్పత్తి అయ్యే ముత్యాలే మనకు తెలుసు. సముద్రంలో ఉండే ఆయెస్టర్ (ముత్యపు చిప్ప) లోపల ఇసుక రేణువు కానీ మరేదైనా ఫారిన్‌బాడీ చేరినప్పుడు, దాని చుట్టూ క్యాల్షియం పొరలను కోటింగ్‌గా ఏర్పరుచుకుంటుంది ముత్యపుచిప్ప. అలాంటి ముత్యాల లభ్యత చాలా తక్కువ. ఒక నెక్లెస్‌కు అవసరమైన ముత్యాలను సేకరించడం కూడా ప్రాచీన కాలంలో చాలా పెద్ద పని అయ్యేది. గడచిన కొన్ని దశాబ్దాలుగా సముద్రం నుంచి ముత్యపు చిప్పలను సేకరించి నీటి కొలనుల్లో పెంచుతున్నారు. ముత్యపు చిప్ప అంటే ఒక ప్రాణి. ముత్యపుచిప్పలోపల చిన్న బీడ్ను ఇంజెక్ట్ చేస్తారు. ఇక ఆ బీడ్ చుట్టూ క్యాల్షియం పొరలను ఏర్పరుచుకుంటుంది ఆ ప్రాణి. బీడ్ షేప్‌ను బట్టి ముత్యం ఆకారం ఉంటుంది. ఇలా తయారు చేయడం మొదలైన తర్వాత ముత్యాలు విరివిగా లభిస్తున్నాయి. కల్చర్డ్ పెరల్స్ కూడా నిజమైన ముత్యాలేనని గమనించాలి. ఎక్స్ రే ద్వారా పరీక్షించి నిజమైన ముత్యాన్ని గుర్తించాలి. ఇక ముత్యం రంగు ఆయెస్టర్ జీవించిన నీటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. చల్లటి నీరు, ఒక మోస్తరు వెచ్చటి నీరుని బట్టి రంగు మారుతుంది. అలాగే ఆస్ట్రేలియాలో దొరికే ముత్యాలను సౌత్ సీ పెరల్స్ అంటారు. జూన్ నుంచి వచ్చిన వాటిని ఫ్రెష్ వాటర్ పెరల్స్ అంటారు. ముత్యాలకు గాలి తగలాలి. కాబట్టి ముత్యాల దండలను జిప్‌లాక్ కవర్లలో భద్రపరచరాదు. కుషన్ బాక్సులు లేదా వెల్వెట్ బాక్సుల్లో పెట్టాలి. గాలి ధారాళంగా అందడం కోసం కనీసం నెలకోసారయినా బీరువా లో నుంచి బయటకు తీస్తుండాలి. ముత్యాల ఆభరణాలను ధరించకపోతే పాడవుతాయనే మాట అందుకే చెబుతారు. --విశేషిణి రెడ్డి, జిఐఏ జెమాలజిస్ట్ -
పాలనురుగు చీరలో పాలరాతి శిల్పం!..మూత్యాల బ్లౌజ్ ధర ఏకంగా..!
బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి ఒకప్పటి యూత్ కలల దేవత. టాలీవుడ్లో సాగరకన్యలా మెరిసి తెలుగు అభిమానుల మన్నలను పొందిన శిల్పా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐదుపదుల వయసులో కూడా యువ హీరోయిన్లకు తీసిపోని విధంగా గ్లామర్‌గా పేరుకు తగ్గట్టు శిల్పంలా ఉంటుంది. ఏ ఉలి ఈమెను ఇంత అందంగా చెక్కాడో అన్నట్లు ఉంటుంది ఆమె శరీరాకృతి. ఫ్యాషన్‌పరంగా కూడా ఆమె తనదైన శైలిలో ఉంటుంది. ఆమె ధరించే ప్రతి డిజైనర్ వేర్ అద్భుతం అన్నంతగా క్రేజీగా ఉంటాయి. వాటి ధర కూడా కళ్లబైర్లు కమ్మే రేంజ్లో పలుకుతాయి. తాజాగా శిల్పా "సౌదీ సెలబ్రేటింగ్ ది హార్ట్ ఆఫ్ అరేబియా" ఈవెంట్లో పాలరాతి శిల్పంలా మెరిసింది. పాల నురుగు షిఫాన్ చీరలో దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్య మాదిరిగా ఆమె ఆహార్యం ఉంది. ఆ తెల్లటి చీరకు తగ్గట్టు ముత్యాలతో డిజైన్ చేసిన చీర శిల్ప లుక్‌ని మరింత ప్రకాశవంతంగా కనిపించేలా చేసింది. ఈ డిజైనర్ వేర్ ఆమె ఫ్యాషన్ శైలి ఏంటన్నది చెబుతోంది. శిల్ప ధరించిన ముత్యాల బ్లౌజ్ ధర ఏకంగా రూ.139,000 పలుకుతోంది. ఈ ఖరీదు బ్లౌజ్ డిజైనింగ్‌లోని క్లిష్టమైన హస్తకళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తోంది. అందుకు తగ్గట్టు మంచలాంటి మేకప్, ముత్యాల బ్రాస్లెట్, పాపిడి బొట్టుతో ఫ్యాషనికి ఐకాన్‌గా నిలిచింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.(చదవండి: 'స్లీప్‌మాక్సింగ్': నిద్రను కూడా కొనుక్కునే దుస్థితా..?) -
Rashmika Mandanna: డిజైనర్ డ్రస్‌లో వజ్రంలా మెరిసిపోతున్న రష్మిక (ఫొటోలు)
-
ముత్యాల హారాలతో గ్లామర్ డోస్ పెంచిన కృతి శెట్టి (ఫోటోలు)
-
రాయల్ కరీబియన్ ‘పర్ల్’.. స్పెషల్ ఏంటంటే?
పైనున్న ఫొటోపై తీరికగా ఓ లుక్కేయండి! ఏంటబ్బా ఇది అని ముక్కున వేలేసుకుంటున్నారా? ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కైనెటిక్ కళా శిల్పమట. అంటే ఏమిటి అనేనా మీ డౌట్! అక్కడికే వస్తున్నాం. కైనెటిక్ అంటే కదిలేది అని అర్థం! కళా శిల్పం అంటే ఏమిటో మీకు తెలుసు. రెండింటినీ కలిపేయండి. ఇప్పటికీ అర్థం కాలేదా? అయితే మీకు వివరంగా చెప్పాల్సిందే. చదివేయండి!. ‘రాయల్ కరీబియన్’ సంస్థ సిద్ధం చేసిన సరికొత్త క్రూయిజ్ షిప్లో ఓ భాగమీ నిర్మాణం. పేరు ‘పర్ల్’. పేరులో ఉన్నట్లే ముత్యం ఆకారంలోనే గుండ్రంగా కనిపిస్తోంది. దాదాపు 45 అడుగుల ఎత్తు, 53 అడుగుల వ్యాసమూ ఉంటుంది ఈ ‘పర్ల్’. మధ్యలో ఉన్న మెట్లను చూశారా? రెండు అంతస్తులను కలిపే ఈ మెట్లకు రెండు వైపులా పలకలు ఉన్నాయి చూశారా? అక్కడుంది అసలు విశేషమంతా! నిత్యం కదులుతూ అందమైన ఆకృతులను సృష్టిస్తూంటాయి ఈ పలకలు. అంతేనా అని పెదవి విరిచేయొద్దు. ఇంకా ఉంది.. పలకలన్నీ ఫెబినాకీ సిరీస్ (1, 1, 2, 3, 5, 8.. ప్రతీ అంకె ముందున్న రెండు అంకెల మొత్తం) ప్రకారం అమర్చడం ఒక విశేషం. రెండో విశేషం.. ఎక్కడో కరేబియన్ సముద్ర ప్రాంతంలో గాలి వేగం, అలల కదలికలకు తగ్గట్టుగా ఈ పలకలు కూడా కదులుతూంటాయి. దూరంగా పుట్టిన అల తాలూకూ ప్రశాంతత.. తీరాన్ని తాకే సమయంలో ఉండే ఉధృతి అన్నీ ఈ కదలికల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయన్నమాట. నాలుగేళ్లపాటు కష్టపడి దీన్ని తయారు చేశామని, ‘పర్ల్’లోని మొత్తం మూడు వేల పలకలను లీనియర్ ఆక్చుయేటర్తో అనుసంధానించి అన్ని దిక్కులకూ కదిలేలా చేశామని బ్రేక్‌ఫాస్ట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కరీబియన్ సముద్ర ప్రాంతపు వాతావరణ సమాచారం ఆధారంగా పలకల కదలికలను నియంత్రించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. పలకల కదలికలకు తగ్గట్టుగా లైటింగ్ కూడా మారుతూంటుందని వివరించారు. ‘పర్ల్’ ఎలా ఉంటుందో ఒక్కసారి చూడాలని అనిపిస్తోందా? అయితే కింది వీడియో మీ కోసమే! -
ముత్యమే.. కదులుతూంటుంది!
-
ఆల్చిప్పల సాగులో తక్కువ పెట్టుబడి అధిక ఆదాయం..
-
అర్ధరాత్రి తమిళుల ఊచకోత.. అసలేంటి 'వైట్ వ్యాన్ స్టోరీ'!
శ్రీలంకలోని తమిళులపై ఆ దేశ సైన్యం జరిపిన యుద్ధ కాండ గురించి ఇప్పటికే పలు చిత్రాలు రూపొందాయి. వాటికి మరో కోణంలో తెరకెక్కిన చిత్రం పెరల్ ఇన్ ది బ్లెడ్. దీన్ని దర్శకుడు కెన్ కందయ్య రూపొందిస్తున్నారు. లండన్‌లో నివసిస్తున్న శ్రీలంక తమిళుడైన ఈయన ఇంతకు ముందు రోమిమో రొమాన్స్ అనే ఆంగ్ల చిత్రానికి దర్శకత్వం వహించారు. దీనికి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ విదేశీ చిత్రం, ఉత్తమ రొమాంటిక్ డ్రామా కేటగిరీలో అమెరికా దేశ అవార్డులను గెలుచుకుందని దర్శకుడు చెప్పారు. (ఇది చదవండి: ఆయన వల్లే కొత్త ప్రపంచాన్ని చూస్తున్నా.. కంటతడి పెట్టుకున్న హీరోయిన్) ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ.. 'శ్రీలంకలో తమిళుల ఊచకోత గురించి ఇంతకు ముందు చాలా చిత్రాలు రూపొందాయన్నారు. వాటిలో కొన్ని విజయవంతం అయినా, చాలా చిత్రాలు విడుదలే కాలేదని అన్నారు. కారణం అనేక రకాల సమస్యలేనని అన్నారు. తాను తెరకెక్కించిన పెరల్ ఇన్ ది బ్లెడ్ చిత్రం ఇంతకు ముందు ఎవరూ టచ్ చేయని అంశాలతో ఉంటుందన్నారు. ఇది శ్రీలంకలోని తమిళ ప్రజల వేదనలను ఆవిష్కరించే కథాంశంతోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న జాతి సమస్యలను తెలిపే కథా చిత్రంగా ఉంటుందన్నారు. అక్కడ జరిగే వైట్ వ్యాన్ స్టోరీని ఈ చిత్రంలో చెప్పినట్లు తెలిపారు. అర్ధరాత్రుల్లో ఎలాంటి నెంబర్లు లేని అనధికారిక వ్యానుల్లో దుండగులు వచ్చి శ్రీలంకలోని తమిళ ప్రజలను తీసుకుపోయి కర్కశంగా చంపే సంఘటనలే వైట్ వ్యాన్ స్టోరి అని తెలిపారు. వారు ఎవరూ? ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు? వంటివి ఎక్కడా నమోదు కావన్నారు. (ఇది చదవండి: హీరోయిన్గా డైరెక్టర్ కూతురు.. మరీ ఇంత చీప్ రెమ్యునరేషనా?) ఇందులో నటుడు సంపత్‌రామ్ శ్రీలంక మిలటరీ అధికారిగా నటించారని.. ఆయనే ఈ చిత్రానికి బలం అని పేర్కొన్నారు. అదే విధంగా నటుడు జయసూర్య ముఖ్య పాత్రలో నటించినట్లు చెప్పారు. కాగా సెవెన్హిల్ పిక్చర్స్ యూనివర్శల్ మూవీ టోన్ పతాకంపై ఈయన నిర్మించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో ఒక ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ అవుతోంది. -
30 ఏళ్లకే బీపీ, షుగర్.. ఒక్కపూట అన్నానికే పరిమితం.. కోటీశ్వరులు మెచ్చిన తిండి..
సాక్షి, విశాఖపట్నం: ప్రస్తుతం అన్ని వయసుల వారిలోనూ ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఆహారంలోనూ మార్పులు వస్తున్నాయి. ఎలాంటి పురుగు మందులు, రసాయనాలు వేయకుండా, సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలతో చేసిన పంటలనే కోరుకుంటున్నారు. అందుకు అనుగుణంగా చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, బియ్యం, గోధుమలు, అపరాలు వంటి ఆహారోత్పత్తులకు నగరంలో ఏటేటా అనూహ్య ఆదరణ లభిస్తోంది. ఆహార ప్రియుల ‘స్వచ్ఛమైన అభిరుచికి అనుగుణంగానే వందల కొద్దీ చిన్న, పెద్ద సంస్థలు, కార్పొరేట్ దిగ్గజాలు, రైతు సహకార సంఘాలు సైతం మార్కెట్లో పోటీపడతున్నాయి. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఏటా సుమారు రూ.వెయ్యి కోట్ల ఆర్గానిక్ ఆహార పదార్థాల విక్రయాలు జరుగుతుండగా, ఒక్క విశాఖలో సుమారు రూ.20 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. ఒక అంచనా మేరకు సుమారు 30 వేల కుటుంబాలు నిత్యం సహజంగా పండిన ఆహార పదార్థాలను తీసుకుంటుండగా, మరో 15 వేల కుటుంబాలు ఆర్గానిక్ రుచులను మాత్రమే ఆస్వాదిస్తున్నాయి. ఏటా ఆర్గానిక్ ఆహార ప్రియుల సంఖ్య పెరుగుతోంది. నగర జీవనంలో పెరుగుతున్న ఒత్తిళ్లు, రకరకాల అనారోగ్య సమస్యల నుంచి శాశ్వత విముక్తిని, ఊరట పొందాలంటే అత్యధికంగా పిండి పదార్థాలు ఉండే బియ్యం కంటే, పోషక విలువలు, పీచు పదార్థాలు సమృద్ధిగా ఉండే మిల్లెట్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. చదవండి: పసి మనసుకు ఎందుకింత కష్టం.. లోపం తల్లిదండ్రులదా? చిన్నారులదా? డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): ఒకప్పుడు నిరుపేదల ఆకలి తీర్చిన ‘చిరు ధాన్యాలు’ ఇప్పుడు కోటీశ్వరుల నిత్య జీవితంలో ఆహారమయ్యాయి. ఫాస్ట్‌ఫుడ్ యుగంలో ఈ చిరుధాన్యాలేంటనుకుంటున్నారా..! నగరంలో చాలా మంది వీటినే ఆరాధిస్తున్నారు. ఆహారంగా ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే.. అనేక రకాల జీవనశైలి వ్యాధుల నుంచి ఊరటనిస్తున్నాయి. ఆరోగ్య సిరులు కురిపిస్తున్నాయి. రెండు పూటలా వరి అన్నమే ప్రధాన ఆహారంగా తీసుకునే నగర వాసులు.. ఇప్పుడు ఒక్క పూట అన్నానికే పరిమితమవుతున్నారు. చదవండి: బరువు తగ్గాలనుకుంటున్నారా? కడుపు నిండా తింటూనే ఆ పనిచేయండి ఉదయం, సాయంత్రం కొర్రలు, రాగులు, అరికెలు, ఊచలు, జొన్నలు, వరిగెలు వంటి వాటితో చేసిన ఆహార పదార్థాలను మాత్రమే భుజిస్తున్నారు. ముప్పై ఏళ్ల వయసులోనే ఉప్పెనలా వచ్చిపడుతున్న బీపీ, షుగర్, ఆర్థరైటీస్ వంటి వివిధ రకాల వ్యాధులు నగరవాసుల ఆహారపు అలవాట్లను సమూలంగా మార్చేలా చేస్తున్నాయి. రోగాలు వచ్చినప్పుడు మందు బిళ్లలు మింగే బదులు..అవి రాకుండా చూసుకోవడమే ఉత్తమమని భావిస్తున్నారు. అందుకే చిరుధాన్యాల ఆహారమే ఉత్తమమంటున్నారు. నగరంలో పెరుగుతున్న మిల్లెట్స్ వినియోగంపై సాక్షి ప్రత్యేక కథనం.. సహజ ఆహారమే ఎందుకు ప్రస్తుత కాలంలో బియ్యం నుంచి పప్పులు, వంట నూనెల వరకు అన్నింటా కల్తీయే రాజ్యమేలుతోంది. 36 ఏళ్ల కిందటే నిషేధించిన ఇతియాన్, డీడీటీ, బీహెచ్‌సీ వంటి ప్రమాదకరమైన పురుగు మందుల అవశేషాలు ఇప్పటికీ బయటపడతున్నట్టు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం వంటి వ్యాధులకు నగరాల్లో ఇలాంటి కల్తీ ఆహారాలు ప్రజలను మరింత అనారోగ్యం బారిన పడేస్తున్నాయి. చిన్న వయస్సులోనే అనేక రోగాలు దరిచేరుతున్నాయి. ఎదుగుతున్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి క్షీణిస్తోంది. కల్తీ ఆహారం మేధో వికాసానికి సైతం బ్రేకులు వేస్తోంది. ఇలాంటి అనర్థాల నుంచి బయటపడేందుకు ప్రజలు ఇప్పుడు ఆర్గానిక్, మిల్లెట్స్ ఆహారాన్ని కోరుకుంటున్నారు. వ్యాధులకు గురై రకరాల మందులు మింగుతూ రోగులుగా బతకడం కంటే సహజ ఆహారంతో అసలు వ్యాధులే రాకుండా ఉంటాయనే నమ్మకం ప్రజల్లో బాగా పెరిగింది. ఒకప్పుడు ముడి బియ్యం అన్నమంటే చాలా మందికి తెలిసేది కాదు. పుష్కలమైన పీచుపదార్థాలు, పోషక విలువలు ఉన్న ముడిబియ్యం తీసుకొనే వారి సంఖ్య ఇటీవల అధికమైంది. ఇదొక్కటే కాదు. అన్ని ఆహార ఉత్పత్తులు రైతు క్షేత్రాల నుంచి నేరుగా నగరానికి వస్తున్నాయి. ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండడంతో చాలా మంది అటువైపే చూస్తున్నారు. పాతవైపు..కొత్త చూపు.. ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్స్, నోరూరించే రకరకాల వంటకాలు, బిరియాని ఘుమఘుమలు, వెరైటీ వెజ్, నానవెజ్‌తో రోజూ పసందైన విందు భోజనాలు ఆరగించే నగర వాసులు ఇప్పుడు ‘పాత’ తరం ఆహరమే ముద్దు అంటున్నారు. ఇప్పుడు ప్రధాన ఆహారంగా ఉన్న సజ్జలు, కొర్రలు, వరిగెలు, ఊదలు, సామలు, జొన్నలు, రాగులు, వరిగెలు వంటి చిరు ధాన్యాలకు అనూహ్యామైన డిమాండ్ పెరిగింది. కాల్షియం బాగా ఉండి అనేక రకాల జీవన శైలి వ్యాధుల నుంచి విముక్తి కల్పించడంలో దోహదం చేసే రాగులకు స్థూలకాయాన్ని అదుపులో ఉంచే కొర్రలకు నగరవాసులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంటికి.. ఒంటికి కూడా.. సహజమైన జీవన విధానంలో కేవలం ఆహార పదార్థాలే కాకుండా కూరగాయలు, ఆకుకూరలు, సబ్బులు, షాంపులు, వంట నూనెలు, కాస్మోటిక్స్ కూడా చేరాయి. పలు వ్యాపార దిగ్గజాలు నగరవాసుల అభిరుచికి తగ్గట్టుగా ఆర్గానిక్ ఉత్పత్తులను అందజేస్తున్నాయి. ఇక దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ, రైతునేస్తం, సహజ ఆహారం, ధరణి నేచురల్స్, గ్రామీణ్‌మాల్ వంటి సంస్థలు, రైతు సహకార సంఘాలు సేంద్రీయ ఎరువులతో పండించిన పంటలతో మహా నగరానికి పల్లెకు, మధ్య బాటలు వేశాయి. సూపర్ మార్కెట్లలో ఇప్పుడు బ్రౌన్‌రైస్, జొన్నలు, రాగులు తప్పనిసరి విక్రయ వస్తువులయ్యాయి. ఆన్లైన్ అమ్మకాలు సైతం జోరందుకున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. సాత్విక ఆహారంతో పాటు చిరుధాన్యాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. తద్వారా బీపీ, షుగర్లను నియంత్రణలో ఉంచుకుంటున్నారు. వాటితో పాటు శారీరక వ్యాయామానికి ప్రాధాన్యమిస్తున్నారు. –గట్రెడ్డి రమాదేవి, గృహిణి ఒత్తిడితో ఉన్నవారికి చిరుధాన్యాలు అవసరం నిత్యం పని ఒత్తిడిలో ఉన్న వారికి బీపీ, షుగర్ వచ్చే అవకాశం ఉంది. దీంతో రాగి అంబలి, దంపుడు బియ్యం, కొర్రలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో చిరుధాన్యాల ప్రాధాన్యం కోసం విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వాటి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. –బి.అరుణ రాజేశ్వరి, ఆర్టీసీ ఉద్యోగి, మధురవాడ -
మహిళను కోట్లకు అధిపతి చేసిన ‘నత్త’
బ్యాంకాక్: అదృష్టం ఎవరిని ఏ రూపంలో వరిస్తుందో చెప్పలేం. ఇందుకు ఉదాహరణలుగా నిలిచే సంఘటనల గురించి ఇప్పటికే చాలా సార్లు విన్నాం. తాజాగా ఇదే కోవకు చెందిన సంఘటన ఒకటి థాయ్‌లాండ్‌లో చోటు చేసుకుంది. కూర చేయడం కోసం తీసుకువచ్చిన నత్త ఓ మహిళ తల రాతను మార్చింది. కేవలం 160 రూపాయల ఖర్చుతో ప్రస్తుతం ఆమె కోటీశ్వరాలు కాబోతుంది. ఇదెలా సాధ్యమో తెలియాలాంటే ఇది చదవాల్సిందే. కొడ్చకార్న్ తాంతివిట్కుల్ అనే థాయ్ మహిళ రెండు నెలల క్రితం రాత్రి భోజనం నిమిత్తం స్థానిక చేపల మార్కెట్ నుంచి నత్తలను కొనుగోలు చేసింది. వీటి ఖరీదు 163 రూపాయలు. వాటిని ఇంటికి తీసుకెళ్లి శుభ్రం చేసి కట్ చేస్తుండగా.. ఓ నత్త కడుపులో ఆమెకు ఆరెంజ్ కలర్లో ఉన్న రాయి లాంటి పదార్థం కనిపించింది. దాన్ని చేతులోకి తీసుకుని చూసి షాక్ అయ్యింది. దాన్ని తల్లికి చూపించింది. తల్లి చెప్పిన విషయం విని కొడ్చకార్న్ సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఇక తన దరిద్రం తీరిపోతుందని సంబరపడింది. ఇంతకు ఆమె చేతిలో ఉన్న ఆ పదార్థం ఏంటంటే ముత్యం. ఆరు గ్రాముల బరువుతో 1.5 సెంటిమీటర్ల వ్యాసార్థం గల ఆ ముత్యం అరుదైన మెలో జాతికి చెందినది. క్వాలిటీని బట్టి దాని ధర ఉంటుంది. ఈ ముత్యం కోట్ల రూపాయల ఖరీదు ఉంటుందని భావిస్తుంది. ఈ సందర్భంగా కొడ్చకార్న్ మాట్లాడుతూ.. ‘‘నత్తలు శుభ్రం చేస్తుండగా దొరికిన వస్తువును మా అమ్మకు చూపించాను. ఆమె దాన్ని పరీక్షగా చూసి.. ఇది మెలో ముత్యం.. కోట్ల రూపాయలు ఖరీదు చేస్తుందని తెలిపింది. ప్రస్తుతం దీన్ని కొనే వారి కోసం చూస్తున్నాను. వచ్చే డబ్బుతో మా అమ్మకు వైద్యం చేపించాలి. తను క్యాన్సర్‌తో బాధపడుతుంది. ఆమె వైద్యం కోసం 23.34 లక్షల రూపాయలు అవసరం అవుతాయి’’ అని తెలిపింది. చదవండి: కాలికి తగిలిన అదృష్టం.. ఏకంగా రూ.1.8 కోట్లు పెరట్లో ముత్యాల పంట! -
పెరట్లో ముత్యాల పంట!
ప్రొఫెసర్ మతాచన్ చిత్రమైన మనిషి. ఆయన ప్రత్యేకత ఏమిటంటే.. తన మనసుకు నచ్చిన పనే చేస్తాడు. ఎవరేమనుకున్నా పట్టించుకోడు. కేరళలో పుట్టి పెరిగాడు. ఫిషరీస్ మీద ఆసక్తి ఉంది. అయితే, టెలికాం ఇంజనీరింగ్ చదువుకోవడం వల్ల ప్రొఫెసర్ అయ్యాడు. సౌదీ అరేబియాలోని కింగ్ ఫహ్ద్ పెట్రోలియం–మినరల్స్ యూనివర్సిటీలో టెలికమ్యూనికేషన్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా కొన్నేళ్లు ఉద్యోగం చేశాడు. ఆ కాలంలోనే ఓ సౌదీ చమురు కంపెనీ అధికారులతోపాటు దుబాసీగా చైనాలో పర్యటించాల్సి వచ్చింది. ఆ పర్యటన అనుకోకుండా అతని ఆత్మను తట్టి లేపింది. వృత్తినే మార్చేసింది. చైనా వుక్సిలో గల దాన్షూయి మత్స్య పరిశోధనా స్థానాన్ని ఆయన సందర్శించాడు. అక్కడ కంటపడిన ముత్యాల సాగు మీద మనసు పారేసుకున్నాడు. వెళ్లిన పని చూసుకొని తిరిగి సౌదీ చేరుకున్న ప్రొఫెసర్ మతాచన్ మనసు మనసులో లేదు. ముత్యాల సాగే మనసంతా నిండిపోయి ఉంది. కొద్ది వారాల్లోనే ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి చైనా వెళ్లి ముత్యాల పెంపకం నేర్చుకున్నాడు. పెరట్లోనే బక్కెట్లలో.. ఆర్నెల్ల తర్వాత 1999లో కేరళలోని ఇంటికి చేరుకొని పెరట్లోనే పని ప్రారంభించాడు. ఆ విధంగా ప్రొఫెసర్ మతాచన్ కాస్తా.. ముత్యాల రైతు మతాచన్గా మారిపోయాడు. నదుల్లో దొరికే ఆల్చిప్పలను తెచ్చి పెంచాడు. 18 నెలల్లో 50 బక్కెట్లలో పెంచిన ముత్యాలను రూ. 4.5 లక్షలకు అమ్మాడు. రూ. 3 లక్షలు లాభం వచ్చింది. 21 ఏళ్లుగా తన ఇంటి మడుగులోని బక్కెట్లలో ముత్యాలు పెంచుతూ ఉన్నాడు. పేరుకు పేరు, డబ్బుకు డబ్బూ సంపాదిస్తున్నాడు. ‘నేను ఉద్యోగం మానేసినప్పుడు అందరూ తిట్టిపోశారు. అయినా నేను పట్టించుకోలేదు. ముత్యాల పెంపకం గురించి అప్పట్లో పెద్దగా ఎవరికీ తెలీదు. కానీ, నాకు మాత్రం గట్టి నమ్మకమే. ఉద్యోగంలోనే ఉంటే మా వూళ్లో అందరిలో ఒకడిగానే ఉండే వాడిని. ఇప్పుడు నాకు డబ్బుతోపాటు ప్రతిష్ట కూడా పెరిగింది’ అంటున్నాడు మతాచన్ సంతృప్తిగా. 18 నెలల పంట ముత్యాల సాగు జపాన్‌లో ప్రారంభమైంది. ముత్యాలు మూడు రకాలు. కృత్రిమంగా తయారు చేసేవి.. నదులు, సరస్సుల్లో ఆల్చిప్పల్లో సహజంగా పెరిగేవి.. పెంచేవి. సాగైన ముత్యాలకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. నదులు, సరస్సుల నుంచి తెచ్చిన ఆల్చిప్పల లోపలికి గుండ్రటి న్యూక్లియస్‌ను చొప్పిస్తారు. ఇది కొంచెం నైపుణ్యం అవసరమయ్యే పని. అలా చొప్పించిన న్యూక్లియస్ చుట్టూ కాల్షియం 540 పొరలు పేరుకుంటాయి. ఆ క్రమంలోనే చక్కని ముత్యం రూపుదాల్చుతుంది. న్యూక్లియస్ ఏ ఆకారంలో ఉంటే ముత్యం ఆ ఆకారంలో తయారవుతుంది. ఆల్చిప్పలను బక్కెట్లలో, ట్రేలలో పెట్టి నీటి తొట్టె/చెరువు నీటిలో ఉంచుతారు. స్పైరులిన, నాచు, వృక్ష ప్లవకాలను ఆహారంగా తీసుకుంటూ ఆల్చిప్పలు పెరుగుతాయి. ఇచ్చిన ఆహారాన్ని బట్టి 12 నుంచి 18 నెలల్లో ముత్యాల పంట చేతికి వస్తుంది. ఇలా సాగు చేసిన ముత్యాలను మతాచన్ ఆస్ట్రేలియా, కువైట్, సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్‌కు ఎగుమతి చేసి భారీగా డబ్బు గడిస్తున్నారు. ముత్యాలను సేకరించిన తర్వాత మిగిలే ఆల్చిప్పలతో కూడా వివిధ కళాకృతులను తయారు చేస్తుండటం విశేషం. ‘మన దేశపు మార్కెట్లలో అమ్మేవి కృత్రిమంగా తయారు చేసినవి. ఒరిజినల్ ముత్యాల్లాగ కనపడటినికి సింథటిక్ పెర్ల్ కోటింగ్ వేస్తారు. అందుకే చవక. సాగు చేసినవే నికార్సయినవి. వీటికి విదేశాల్లో క్యారెట్‌కు రూ. 360 పలుకుతుంది. అంటే గ్రాము రూ. 1,800. కిలో రూ. 18 లక్షలు..’ అంటారు మతాచన్. కేరళలోని కాసర్గాడ్ జిల్లా (మలక్కల్లు పోస్టు) కడుతోడిల్ గ్రామంలో మతాచన్ ముత్యాల సాగు క్షేత్రం ఉంది. కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా అధికారులు, శాస్త్రవేత్తలు సైతం సందర్శనకు వస్తుంటారు. తన ఫామ్‌లో రైతులకు ముత్యాల సాగులో 26 రోజుల కోర్సు ద్వారా ప్రతి మెలకువనూ నేర్పిస్తున్నారు. ప్రస్తుతం వాట్సప్ ద్వారా ఆంగ్లంలో 26 రోజులపాటు రోజూ అర గంట సేపు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ అనంతరం ముత్యాల సాగు ప్రారంభించగలుగుతారని, అందుకు అవసరమైన వస్తువులను తాను సమకూర్చుతానని ఆయన ‘సాక్షి’తో చెప్పారు. శిక్షణ పొందగోరేవారు రూ. పది వేలు సర్వీస్ చార్జి చెల్లించాల్సి ఉంటుందని మతాచన్ (94460 89736) అన్నారు. ఆయన 21 ఏళ్లుగా నడుస్తున్న ఈ సరికొత్త సాగుబాట ఇప్పటికీ మేలిమి ముత్యమే! https://genuinepearl13.weebly.com మంచినీటిలో ముత్యాల పెంపకంపై ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలోని కౌశల్యగంగలో గల కేంద్రీయ మంచినీటి ఆక్వాకల్చర్ సంస్థ (సిఐఎఫ్ఎ–సిఫా) 6 రోజుల పాటు శిక్షణ ఇస్తోంది. మాధ్యమం ఆంగ్లం. చేపలు/ ఆల్చిప్పలు/ రొయ్యల సాగులో అనుభవం ఉన్న రైతులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ శాస్త్రవేత్తలు అర్హులు. బ్యాచ్‌కు 20 మందికి మాత్రమే అవకాశం. ముత్యాల సాగు చేపట్టాలనుకునే మహిళలకు 20% సీట్లు కేటాయిస్తారు. ఒక్కొక్కరికి ఫీజు రూ. 8 వేలు. సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు శిక్షణా శిబిరం జరుగుతుంది. అయితే, దీనిలో చేరడానికి గడువు ఇప్పటికే ముగిసింది. తదుపరి బ్యాచ్‌లో చేరే ఆసక్తి గల వారు ‘సిఫా’ సీనియర్ సైంటిస్ట్ డా. శైలేష్ సౌరబ్‌ను సంప్రదించవచ్చు. Email: ssaurabh02@rediffmail.com పెరటి కోళ్ల పెంపకంలో 2 రోజుల ఆన్లైన్ శిక్షణ పెరటి కోళ్ల పెంపకం గ్రామీణ ప్రాంతాల వారికి అదనపు ఆదాయాన్ని అందించే ఓ ముఖ్యమైన వ్యవసాయ అనుబంధ వ్యాపకం. తిరిగి గ్రామాలకు చేరిన వలస జీవులకు మంచి ఆదాయ వనరుగా పెరటి కోళ్ల పెంపకం ఉపకరిస్తుందని ఆం.ప్ర. ప్రభుత్వ అనుభవం చెబుతోంది. ఈ నేపథ్యంలో పెరటి కోళ్ల పెంపకంలో లోతైన మెళకువలు అందించేందుకు ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ‘వాసన్’ సెప్టెంబర్ 4–5 తేదీల్లో (రోజుకు 4 గంటల చొప్పున 8 గంటలు) ఆన్లైన్లో శిక్షణ ఇవ్వనుంది. ఫీజు రూ. వెయ్యి. వివరాలకు... anupriya@wassan.org ప్రకృతి వ్యవసాయంపై 3 నెలల ఆన్లైన్ కోర్సు కోల్‌కతా యూనివర్సిటీ, జర్మనీకి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా ప్రకృతి వ్యవసాయంపై 3 నెలల ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సును సెప్టెంబర్ 2020 – జనవరి 2021 మధ్య నిర్వహించనుంది. గత ఐదేళ్లుగా నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి ఆచరణాత్మక కోర్సును ఈ ఏడాది ఆన్లైన్ కోర్సుగా అందించనున్నారు. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను వివిధ కోణాల్లో లోతుగా అర్థం చేసుకోవడం, విశ్లేషించడం, నిర్మించడంపై ఆసక్తి కలిగిన రైతులు, రైతు శిక్షకులు, నిపుణులు, నిపుణులు కాగోరేవారికి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పలువురు నిష్ణాతులు అందిస్తున్న ఈ కోర్సు ఎంతో ఉపకరిస్తుంది. ఆసక్తి గల వారు సెప్టెంబర్ 10 లోగా దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు.. ఫోన్/వాట్సప్ 8017063944, agroecology.cps@gmail.com -
8 వేల ఏళ్ల నాటి ముత్యం
అబుధాబి: యూఏఈలోని మరవాహ్ ద్వీపంలో జరిపిన తవ్వకాల్లో అత్యంత ప్రాచీన ముత్యం బయల్పడింది. ఇది 8 వేల ఏళ్ల నాటి నియోలిథిక్ కాలానికి చెందిందని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అక్టోబర్ 30 నుంచి ప్రారంభం కానున్న లౌవ్రె అబుధాబి ఎగ్జిబిషన్లో ఈ ముత్యాన్ని ప్రదర్శించనున్నారు. ముత్యపు పొరలపై జరిపిన కార్బన్ డేటింగ్లో ఇది క్రీ.పూ 5800–5600 కాలానికి సంబంధించిందిగా తేలినట్లు అధికారులు వెల్లడించారు. యూఏఈలో దొరికిన అత్యంత ప్రాచీన వస్తువు కూడా ఇదే కావడం గమనార్హం. -
రెండున్నర కోట్ల ముత్యం...!
ముత్యాల దండలో ఒదిగి పోయే ముత్యం అదేనండి పెరల్...మహా అయితే సింగిల్ ముత్యానికి వెయ్యి రూపాయిలో అంతగా కాకపోతే మరీ ప్రత్యేకమైనదైతే లక్ష రూపాయలు ఉంటుంది అని అనుకోవడం సహజమే... అయితే ఈ ముత్యానికి మాత్రం ఏకంగా రెండున్నర కోట్లకు పైగానే (3.2 లక్షల యూరోలు) పలికింది. ఇంత పెద్దమొత్తంలో ధర పలకడానికి దానికెవో ప్రత్యేకతలుంటాయని భావించడం సహజమే. విలక్షణమైన ఆకృతి కలిగిన ఈ ముత్యం ‘ద స్లీపింగ్ లయన్ పెరల్’గా గుర్తింపు పొందింది. దాదాపు 300 ఏళ్ల క్రితం చైనా జలాల్లో (మరీ ముఖ్యంగా పెరల్ రివర్‌లో) ఇది రూపుదిద్దుకుని ఉంటుందని భావిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద తాజానీటి ముత్యంగా పరిగణిస్తున్న దీనిని గతంలో కేథరీన్ ది గ్రేట్ ఆధీనంలో ఉండేది. ఇటీవల నెథర్లాండ్లోని హేగ్‌లో నిర్వహించిన వేలంలో దానిని రూ.రెండున్నర కోట్లకు పైగా రికార్డ్ మొత్తానికి విక్రయించారు. 120 గ్రాముల బరువు. దాదాపు ఏడు సెంటీమీటర్లు (2.7 అంగుళాలు) పొడవైనది. ప్రపంచంలోనే మూడు అతిపెద్ద ముత్యాల్లో ఇదొకటి. 1765 ప్రాంతంలో యునైటెడ్ ఈస్ట్ ఇండీస్ కంపెనీకి చెందిన ఓ డచ్ వ్యాపారి దీనిని బతావియా (జకార్తా)కు తీసుకొచ్చాడు. ఆ తర్వాత కంపెనీ అకౌంటెంట్ హెండ్రిక్ శాండర్స్ దానిని సొంతం చేసుకున్నాడు. శాండర్స్ మరణం తర్వాత 1778లో ఆ ముత్యాన్ని అమ్‌స్టర్‌డామ్‌లో వేలం వేశారు. దానిని రష్యా రాణి కేథరీన్ ది గ్రేట్ కొనుగోలు చేశారు.సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని తన నివాసంలో 1796 వరకు దీనిని ప్రదర్శనలో పెట్టారు. ఆమె మరణం తర్వాత అక్కడి నుంచి ఈ ముత్యం మాయమై పోలండ్‌లో తేలింది. దీనిని పొందేందుకు ఎన్నో ప్రయత్నాల అనంతరం 1865లో డచ్ స్వర్ణకారుడి వద్దకు చేరుకుంది. నాలుగుతరాల పాటు ఆ కుటుంబసభ్యుల వద్దే ఉండిపోయింది. దీనిపై పరిశోధనకు, దీనితో ముడిపడిన చరిత్రను వెలికితీసేందుకు 1979లో అమ్‌స్టర్‌డామ్ పెరల్ సొసైటీ ఈ ముత్యాన్ని కొనుగోలు చేసింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
భోజనంలో ముత్యం..
ఓ అమెరికన్‌ను అదృష్టం ఈ అరుదైన ముత్యం రూపంలో వరించింది. వాషింగ్టన్‌లోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన లిండ్సే హాస్జ్ అనే మహిళకు సీఫుడ్‌లో ఇది దొరికింది. దాన్ని తీసుకెళ్లి రత్నాల నిపుణుడికి చూపించగా అది కువాహాగ్ జాతి ముత్యమని,రూ.41 వేల ధర పలుకుందని చెప్పాడు. -
పీవీపీ ఇంట్లో సినీ తారల సందడి
-
పూసలు గుసగుసలాడే...
రాతికి ప్రాణం పోసే సుగుణం... లోహాలకు లాలిత్యం అద్దే నేర్పు అతివకు సొంతం. గాజు, ప్లాస్టిక్, ముత్యం... పూసలేవైనా.. రంగులెన్నయినా... పడతుల మెడలో చేరితే అవి చెప్పే ఊసులెన్నో..! చెప్పకుండానే ఒలికే భాషలెన్నో..! వర్ణాలన్నీ ఒద్దికగా జట్టు కట్టి... శంఖమంటి మెడలో హారమై రూపుకడితే దివిలోన తారకలను మించిన మెరుపులతో పూసలు నిత్యం తళుక్కుమంటూనే ఉంటాయి. గిరిజన స్త్రీ నుండి ఆధునిక యువతి వరకు పూసల హారాలను ధరించడం తెలిసిందే! పూసలను ఎక్కువగా గాజు, ప్లాస్టిక్, రాళ్లతో తయారుచేస్తారు. కొన్ని పూసలు ఎముక, కొమ్ము, దంతం, లోహాలు, ముత్యాలు, మట్టి, పింగాణీ, లక్క, కర్ర, విత్తనాలతోనూ తయారుచేస్తారు. పూసలను గుచ్చడానికి నైలాన్ లేదా ప్లాస్టిక్ దారాన్ని ఉపయోగించి గుచ్చుతారు. ఆభరణాలలో అయితే బంగారు లోహపు తీగతో గుచ్చి రాలిపోకుండా ముడివేస్తారు. బంగారు తీగ స్థానంలో రాగి, ఇత్తడి.. కట్టు తీగలను కూడా ఉపయోగిస్తుంటారు. దుస్తులకు తగిన ఎంపిక: డ్రెస్ కలర్, ప్రింట్, పాశ్చాత్యం, సంప్రదాయం.. ఇలా అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బీడ్స్‌ను ఎంచుకోవాలి ప్లెయిన్ రంగుల దుస్తుల మీదకు మల్టీకలర్ బీడ్స్ బాగా కనిపిస్తాయి ఎక్కువ ప్రింట్లున్న దుస్తుల మీదకు మల్టీకలర్ కాకుండా, దుస్తుల్లోని ఏదో ఒక సెంటర్ కలర్ బీడ్స్ తీసుకొని హారాలను, లోలాకులను తయారుచేసుకోవచ్చు టెంపుల్ జువెల్రీ అయితే కంచిపట్టు, ఉప్పాడ.. వంటి సంప్రదాయ తరహా దుస్తుల మీదకు బాగుంటాయి కెంపులు, ముత్యాలు సాధారణంగా అన్ని రకాల దుస్తుల మీదకు బాగా నప్పుతాయి పచ్చలు మాత్రం మ్యాచింగ్ డ్రెస్సుల మీదకు బాగుంటాయి జీన్స్ వంటి ఆధునిక వస్త్రాలంకరణకు పూసలు ఎక్కువగా ఉన్న ఆభరణాలను ఎంచుకోవద్దు. పూసలు లేకుండా ఒక పెద్ద లాకెట్ ఉన్న చైన్స్, లోలాకులు బాగుంటాయి. సాయంకాలపు వేడుకలకు ముత్యాలు సంద ర్భోచితంగా ఉంటాయి లాకెట్లో ఉన్న రంగును పోలిన పూసలను హారం తయారీకి ఉపయోగిస్తే మరింత ఆకర్షణీయంగా ఆభరణం కనిపిస్తుంది చెక్క పూసలు, రాయి, స్ఫటికం.. ఇతర పెద్ద పెద్ద పూసలు మోడ్రన్ దుస్తుల మీదకు బాగా నప్పుతాయి. పూసల నాణ్యతను బట్టి ఖరీదు ఉంటుంది. తగినవి: నచ్చిన పూసలు(బీడ్స్), బాల్స్, లోహపు తీగ /దారం/ నైలాన్ వైర్, రౌండ్నోస్ ప్లైర్, కటర్, ప్లాట్ ప్లైర్. తయారీ: పూసల బరువును బట్టి లోహపు తీగ(సన్నం/లావు) ను తగినంత కట్ చేసి, తీసుకోవాలి. తీగ చివరల్లో రౌండ్నోస్ ప్లైర్తో ఒక రౌండ్ మెలితిప్పి, పూసకు గుచ్చి, పై భాగంలోనూ ముడిలా తిప్పాలి. ఇలాగే తీగకు ఒక్కో పూసను గుచ్చుతూ, తగినంత పరిమాణంలో హారాన్ని తయారుచేసుకోవాలి. ఇలాగే జూకాలనూ తయారుచేసుకోవచ్చు. ఎప్పటికీ...: సాధారణంగా చెమట, ఉప్పునీరు ఆభరణం అందాన్ని దెబ్బతీస్తాయి. కొనుగోలు చేసినదైనా, సొంతంగా తయారుచేసుకున్నదైనా.. ఆభరణం ఎప్పటికీ ఆకర్షణను కోల్పోకుండా ఉండాలంటే... ప్లాస్టిక్, గాజు, చెక్క.. పూసలు, గవ్వలు, శంఖులు, నవరత్నాలు.. ఏ తరహా ఆభరణం అయినా ధరించిన తర్వాత దూది ఉండతో లేదా కాటన్ క్లాత్‌తో తుడిచి, గాలి చొరబడని ప్లాస్టిక్ బ్యాగ్/బాక్స్‌లలో భద్రపరుచుకోవాలి. పెర్ఫ్యూమ్స్, రసాయనాలు ఆభరణాలకు తగలకూడదు. సుధా రెడ్డి ఆభరణాల నిపుణురాలు, హైదరాబాద్ www.facebook.com/jewelpatterns మోడల్: సంధ్య; ఫొటోలు: శివ మల్లాల -
రికార్డులను కడిగేసిన ముత్యం...
ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ముత్యం. కృత్రిమమైనది కాదు.. సహజసిద్ధమైనది. 33.15 క్యారెట్ల ఈ ముత్యం వ్యాసం 0.7 అంగుళాలు. దీన్ని గురువారం బ్రిటన్‌కు చెందిన వూలీ అండ్ వాలిస్ సంస్థ వేలం వేయగా.. ఏకంగా రూ.8.2 కోట్లకు అమ్ముడుపోయింది. ఇదో ప్రపంచ రికార్డట. దీనికి రూ.2.5 కోట్లు వస్తుందని వేలం సంస్థ అంచనా వేయగా.. దాన్ని మించిన ధర రావడం విశేషం. లండన్‌కు చెందిన ప్రఖ్యాత ఆభరణాల సంస్థ డేవిడ్ మోరిస్ ఈ ముత్యాన్ని కొనుగోలు చేసింది. హాంకాంగ్‌కు చెందిన ఓ కోటీశ్వరుడి కోసం తయారుచేస్తున్న నెక్లెస్‌లో దీన్ని అమరుస్తారట. -
ముత్యాల ఫేసియల్...
ముఖ నిగారింపు కోసం బ్యూటీపార్లర్‌కి వెళితే ఫ్రూట్, పెర్ల్, గోల్డ్, డైమండ్... ఫేసియల్స్ అంటూ ఓ జాబితా ముందుంచుతారు. ఏ ఫేసియల్‌కు ఎంత ఖర్చు అవుతుందో రాసుంటుంది. చర్మతత్త్వానికి ఏ ఫేసియల్ నప్పుతుందో తెలియకపోయినా ఖర్చును బట్టి నిగారింపు వస్తుంది అని ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. అలా కాకుండా చర్మతత్త్వానికి తగ్గ ఫేసియల్ ఎంచుకోవాలంటే... నిపుణుల సలహా తీసుకోవాలి. పెర్ల్ ఫేసియల్: ముత్యాల పొడిని ఈ తరహా ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. ముత్యాల పొడిలో ఉండే సుగుణాలు చర్మం పైభాగంలో ఉండే మెలనిన్‌ను ప్రభావితం చేస్తాయి. ఫలితంగా ఎండ వల్ల దెబ్బతిన్న చర్మం (ట్యాన్) సాధారణ స్థితికి వస్తుంది. అంతేకాదు ముత్యాలలో బలమైన పోషకాలు, అమినో యాసిడ్స్, మినరల్స్, ప్రొటీన్లు ఉండి చర్మకణాలను శక్తిమంతం చేస్తాయి. ఫలితంగా చర్మగ్రంథులు చురుగ్గా పనిచేస్తాయి. అందుకే ముత్యాల పొడిని సౌందర్య ఉత్పాదనలలో ఉపయోగిస్తుంటారు. ముత్యాల ఫేసియల్ జిడ్డు చర్మం గలవారికి మంచి ఫలితాన్ని ఇస్తుంది. నోట్: ఫేసియల్‌కు ఏ ఉత్పత్తులను వాడుతున్నారో నిపుణులను డిమాండ్ చేయవచ్చు. ఎందుకంటే నాణ్యమైన ఉత్పత్తులు వాడితేనే తీరైన ఫలితం.