పాలనురుగు చీరలో పాలరాతి శిల్పం!..మూత్యాల బ్లౌజ్‌ ధర ఏకంగా..! | Shilpa Shetty Radiates In Chiffon Draped Saree With Pearl Blouse | Sakshi
Sakshi News home page

పాలనురుగు చీరలో పాలరాతి శిల్పం!..మూత్యాల బ్లౌజ్‌ ధర ఏకంగా..!

Published Wed, Sep 25 2024 4:59 PM | Last Updated on Wed, Sep 25 2024 5:49 PM

Shilpa Shetty Radiates In Chiffon Draped Saree With Pearl Blouse

బాలీవుడ్‌ హీరోయిన్‌ శిల్పాశెట్టి ఒకప్పటి యూత్‌ కలల దేవత. టాలీవుడ్‌లో సాగరకన్యలా మెరిసి తెలుగు అభిమానుల మన్నలను పొందిన శిల్పా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐదుపదుల వయసులో కూడా యువ హీరోయిన్లకు తీసిపోని విధంగా గ్లామర్‌గా పేరుకు తగ్గట్టు శిల్పంలా ఉంటుంది. ఏ ఉలి ఈమెను ఇంత అందంగా చెక్కాడో అన్నట్లు ఉంటుంది ఆమె శరీరాకృతి. 

ఫ్యాషన్‌పరంగా కూడా ఆమె తనదైన శైలిలో ఉంటుంది. ఆమె ధరించే ప్రతి డిజైనర్‌ వేర్‌ అద్భుతం అన్నంతగా క్రేజీగా ఉంటాయి. వాటి ధర కూడా కళ్లబైర్లు కమ్మే రేంజ్‌లో పలుకుతాయి. తాజాగా శిల్పా "సౌదీ సెలబ్రేటింగ్ ది హార్ట్ ఆఫ్ అరేబియా" ఈవెంట్‌లో పాలరాతి శిల్పంలా మెరిసింది. పాల నురుగు షిఫాన్‌ చీరలో దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్య మాదిరిగా ఆమె ఆహార్యం ఉంది. 

ఆ తెల్లటి చీరకు తగ్గట్టు ముత్యాలతో డిజైన్‌ చేసిన చీర శిల్ప లుక్‌ని మరింత ప్రకాశవంతంగా కనిపించేలా చేసింది. ఈ డిజైనర్‌ వేర్‌ ఆమె ఫ్యాషన్‌ శైలి ఏంటన్నది చెబుతోంది. శిల్ప ధరించిన ముత్యాల బ్లౌజ్‌ ధర  ఏకంగా రూ.139,000 పలుకుతోంది. ఈ ఖరీదు బ్లౌజ్‌ డిజైనింగ్‌లోని క్లిష్టమైన హస్తకళా నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తోంది. అందుకు తగ్గట్టు మంచలాంటి మేకప్‌, ముత్యాల బ్రాస్‌లెట్‌, పాపిడి బొట్టుతో ఫ్యాషనికి ఐకాన్‌గా నిలిచింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.

(చదవండి: 'స్లీప్‌మాక్సింగ్‌': నిద్రను కూడా కొనుక్కునే దుస్థితా..?)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement