శ్రీలంకలోని తమిళులపై ఆ దేశ సైన్యం జరిపిన యుద్ధ కాండ గురించి ఇప్పటికే పలు చిత్రాలు రూపొందాయి. వాటికి మరో కోణంలో తెరకెక్కిన చిత్రం పెరల్ ఇన్ ది బ్లెడ్. దీన్ని దర్శకుడు కెన్ కందయ్య రూపొందిస్తున్నారు. లండన్‌లో నివసిస్తున్న శ్రీలంక తమిళుడైన ఈయన ఇంతకు ముందు రోమిమో రొమాన్స్ అనే ఆంగ్ల చిత్రానికి దర్శకత్వం వహించారు. దీనికి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ విదేశీ చిత్రం, ఉత్తమ రొమాంటిక్ డ్రామా కేటగిరీలో అమెరికా దేశ అవార్డులను గెలుచుకుందని దర్శకుడు చెప్పారు.
(ఇది చదవండి: ఆయన వల్లే కొత్త ప్రపంచాన్ని చూస్తున్నా.. కంటతడి పెట్టుకున్న హీరోయిన్)
ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ.. 'శ్రీలంకలో తమిళుల ఊచకోత గురించి ఇంతకు ముందు చాలా చిత్రాలు రూపొందాయన్నారు. వాటిలో కొన్ని విజయవంతం అయినా, చాలా చిత్రాలు విడుదలే కాలేదని అన్నారు. కారణం అనేక రకాల సమస్యలేనని అన్నారు. తాను తెరకెక్కించిన పెరల్ ఇన్ ది బ్లెడ్ చిత్రం ఇంతకు ముందు ఎవరూ టచ్ చేయని అంశాలతో ఉంటుందన్నారు. ఇది శ్రీలంకలోని తమిళ ప్రజల వేదనలను ఆవిష్కరించే కథాంశంతోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న జాతి సమస్యలను తెలిపే కథా చిత్రంగా ఉంటుందన్నారు.
అక్కడ జరిగే వైట్ వ్యాన్ స్టోరీని ఈ చిత్రంలో చెప్పినట్లు తెలిపారు. అర్ధరాత్రుల్లో ఎలాంటి నెంబర్లు లేని అనధికారిక వ్యానుల్లో దుండగులు వచ్చి శ్రీలంకలోని తమిళ ప్రజలను తీసుకుపోయి కర్కశంగా చంపే సంఘటనలే వైట్ వ్యాన్ స్టోరి అని తెలిపారు. వారు ఎవరూ? ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు? వంటివి ఎక్కడా నమోదు కావన్నారు.
(ఇది చదవండి: హీరోయిన్‌గా డైరెక్టర్ కూతురు.. మరీ ఇంత చీప్ రెమ్యునరేషనా?)
ఇందులో నటుడు సంపత్‌రామ్ శ్రీలంక మిలటరీ అధికారిగా నటించారని.. ఆయనే ఈ చిత్రానికి బలం అని పేర్కొన్నారు. అదే విధంగా నటుడు జయసూర్య ముఖ్య పాత్రలో నటించినట్లు చెప్పారు. కాగా సెవెన్‌హిల్ పిక్చర్స్ యూనివర్శల్ మూవీ టోన్ పతాకంపై ఈయన నిర్మించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో ఒక ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment