Jayasurya
-
ప్రభాత్ స్పిన్... శ్రీలంక విన్
గాలే: లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య (4/136; 5/68) స్పిన్ మాయాజాలంతో శ్రీలంకను గెలిపించాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టడంతో తొలి టెస్టులో ఆతిథ్య జట్టు 63 పరుగుల తేడాతో న్యూజిలాండ్ జట్టుపై గెలిచింది. ఆఖరి రోజు లాంఛనం ముగిసేందుకు 3.4 ఓవర్లే సరిపోయాయి. ప్రభాత్ తన వరుస ఓవర్లలోనే మిగతా రెండు వికెట్లను పడేయడంతో కివీస్ ఐదోరోజు ఆటలో కేవలం 4 పరుగులే చేయగలిగింది. దీంతో ఓవర్‌నైట్ బ్యాటర్ రచిన్ రవీంద్ర సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 275 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు సోమవారం 207/8 ఓవర్‌నైట్ స్కోరుతో చివరిరోజు ఆటకొనసాగించిన కివీస్ ఆలౌట్ అయ్యేందుకు ఎంతోసేపు పట్టలేదు. 70వ ఓవర్ వేసిన ప్రభాత్ జయసూర్య స్పిన్‌ను ఎదుర్కోలేక రచిన్ రవీంద్ర (168 బంతుల్లో 92; 9 ఫోర్లు, 1 సిక్స్) తన క్రితం రోజు స్కోరుకు కేవలం పరుగు మాత్రమే జోడించి వికెట్ల ముందు దొరికిపోయాడు. మళ్లీ తన తదుపరి ఓవర్లో ప్రభాత్... ఆఖరి వరుస బ్యాటర్ విలియమ్ ఓ రూర్కే (0)ను బౌల్డ్ చేయడంతో 71.4 ఓవర్లలో 211 పరుగుల వద్ద న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌కు తెరపడింది. తొలి ఇన్నింగ్స్‌లో లంక 305 పరుగులు చేయగా, కివీస్ 340 పరుగులు చేసి స్వల్ప ఆధిక్యం సంపాదించింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు (309) మూడొందల పైచిలుకు పరుగులు చేయడంతో ఉపఖండపు స్పిన్ పిచ్‌లపై 275 పరుగుల లక్ష్యం న్యూజిలాండ్‌కు అసాధ్యమైంది. ఇదే వేదికపై చివరి రెండో టెస్టు ఈ నెల 26 నుంచి 30 వరకు జరుగుతుంది. -
నిజం గెలుస్తుంది: జయసూర్య
మలయాళ నటుడు జయసూర్యపై లైంగిక దాడి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఆయనపై రెండు కేసులు నమోదు అయ్యాయి. ఆగస్టు 31న జయసూర్య పుట్టినరోజు. ఈ సందర్భంగా తనపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ ఓ నోట్‌ను రిలీజ్ చేశారు జయసూర్య. ‘‘నాపై ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. మనస్సాక్షి లేనివారికి తప్పుడు ఆరోపణలు చేయడం సులభం.చేయని వేధింపులను చేశానని చెప్పడం, ఆ ఆరోపణలు మోయడం కూడా ఓ వేధింపులాంటిదే. నిజం కన్నా అబద్ధం వేగంగా ప్రయాణం చేస్తుందంటారు. అయినా నాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. నిజం గెలుస్తుంది. ఇక నా వ్యక్తిగతమైన కారణాల దృష్ట్యా ప్రస్తుతం యూఎస్‌లో ఉన్నాను. నా పనులు పూర్తి కాగానే కేరళకు వస్తాను’’ అని ఆ నోట్లో పేర్కొన్నారు జయసూర్య. దీంతో జయసూర్యపై ఫిర్యాదు చేసిన నటి సోనియా మల్హర్ మరోసారి స్పందించారు. ‘‘నావి తప్పుడు ఆరోపణలని ఆయన (జయసూర్యను ఉద్దేశించి) అంటున్నారు. కానీ నా మాటల్లో నిజం ఉంది. ఆయనపై కామెంట్స్ చేయడానికి నేను లంచం తీసుకున్నట్లుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. హేమా కమిటీ రిపోర్ట్ వైరల్ అయిన నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చి, హీరో పేరును బయటపెట్టాను. న్యాయపోరాటం విషయంలో వెనక్కి తగ్గను’’ అని సోనియా మల్హర్ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. -
తనపై లైంగిక ఆరోపణలు.. చట్టపరంగానే ఎదుర్కొంటా: నటుడు జయసూర్య
మలయాళ సినీ ఇండస్ట్రీలో హేమ కమిటీ నివేదిక సంచలనంగా మారింది. పలువురు నటులు, డైరెక్టర్లపై ఫిర్యాదులు రావడంతో ఇప్పటికే పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే తాజాగా తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై మలయాళ నటుడు జయసూర్య స్పందించారు. ఇలాంటి ఆరోపణలు తన కుటుంబాన్ని తీవ్రంగా బాధించాయని అన్నారు. తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని జయసూర్య ఖండించారు. ప్రస్తుతం తాను యూఎస్‌లో ఉన్నానని.. త్వరలోనే కేరళకు వస్తానని చెప్పారు.ఆగస్టు 31న తన బర్త్ డేను జయసూర్య సెలబ్రేట్ చేసుకున్నారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణలపై చట్టపరంగా ముందుకెళ్తానని స్పష్టం చేశారు. ఈ విషయంలో నాకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తప్పుడు ఆరోపణలు చేయడం చాలా సులభమని.. అబద్ధం ఎల్లప్పుడూ నిజం కంటే వేగంగా ప్రయాణిస్తుందని అన్నారు. కానీ చివరికీ నిజం గెలుస్తుందని జయసూర్య ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తిగా నమ్మకముందన్నారు. నా పుట్టినరోజును ఇలాంటి సమయంలో జరుపుకోవాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని విచారం వ్యక్తం చేశారు.కాగా.. జయసూర్య తనను లైంగికంగా వేధించారంటూ ప్రముఖ మలయాళ నటి మిను మునీర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆయనపై రెండు కేసులు నమోదయ్యాయి. హేమ కమిటీ నివేదిక మలయాళ ఇండస్ట్రీని కుదిపేసింది. ఇప్పటికే మలయాళ ఆర్టిస్టుల సంఘ సభ్యులు మోహన్‌లాల్‌తో సహా అందరూ రాజీనామాలు చేశారు. -
ప్రముఖ నటులపై అత్యాచార కేసు నమోదు
లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో మలయాళ నటుడు, సీపీఎం ఎమ్మెల్యే ముకేశ్, నటుడు జయసూర్యలపై కేరళ పోలీసులు అత్యాచార కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా నటి మిను మునీర్ తనకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు. పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. తనను వేధించిన ముకేశ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అతడికి ఏ రాజకీయ పార్టీ కూడా మద్దతు ఇవ్వకూడదని కోరారు.మోహన్‌లాల్ రాజీనామా.. మంచి నిర్ణయంఅమ్మ (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్టుల)కు మోహన్‌లాల్ రాజీనామా చేయడంపై స్పందిస్తూ.. ఇది మంచి నిర్ణయమేనన్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్‌కు అమ్మ బాధ్యతలు చేపట్టే అర్హత పుష్కలంగా ఉందన్నారు. కాగా ముకేశ్, మణ్యంపిల్లరాజు, ఇడవెల బాబు, జయసూర్య తనను వేధించారంటూ మిను మునీర్ సంచలన ఆరోపణలు చేసింది. డబ్బు కోసం బ్లాక్మెయిల్వీరి వేధింపుల వల్ల మలయాళ ఇండస్ట్రీని వదిలేసి చెన్నైకి వెళ్లిపోయానంది. హేమ కమిటీ నివేదిక వెలువడిన సమయంలో ఈమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే ముకేశ్, జయసూర్యపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. మరో ఐదుగురిపైనా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అయితే తనపై వస్తున్న ఆరోపణలను ముకేశ్ కొట్టిపారేశాడు. డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించాడు. ఎప్పటికైనా నిజం బయటకు వస్తుందని చెప్తున్నాడు.చదవండి: అలాంటివారిని చెప్పు తీసుకుని కొట్టండి: విశాల్ -
ఆ హీరోతో మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న మిస్ శెట్టి!
సినిమా ఇండస్ట్రీలో స్వీటీ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు అనుష్కనే. ఇటీవలే మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో అలరించారు. ఈ బెంగళూరు భామ మొదట్లో యోగా టీచర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సూపర్ అనే తెలుగు చిత్రంలో నాగార్జునకు జంటగా నటించే అవకాశం వరించింది. అలా తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్ని తన అందాలతో కొల్లగొట్టిన అనుష్క ఆ తర్వాత రెండు అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రంలో మరింతగా గ్లామరస్‌గా నటించి తడితడి అందాలతో తమిళ ప్రేక్షకులను గిలిగింతలు పెట్టించారు. ఇంకేముంది ఈ రెండు భాషల్లోనూ వరుసగా అవకాశాలు రావడంతో స్టార్ హీరోయిన్గా ఎదిగారు. అలాంటి గ్లామరస్ నటిని అరుంధతి చిత్రంతో అద్భుతమైన నటనతో మెప్పించింది. ఆ చిత్రం తమిళంలోనూ అనువాదమై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత భాగమతి చిత్రాలతో తనలోని నట దాహాన్ని తీర్చుకున్న అనుష్క, బాహుబలి చిత్రంతో నటిగా మరో అంతస్తుకు చేరుకుంది. అలా తెలుగు, తమిళం భాషల్లో ప్రముఖ హీరోలందరి సరసన నటించిన ఈ భామ సైజ్ జీరో అనే చిత్రంలో నటించడానికి ఏ హీరోయిన్ చేయని సాహసం చేశారు. అందులోని పాత్ర కోసం బరువును విపరీతంగా పెంచుకున్నారు. అయితే ఆ తర్వాత బరువు తగ్గడానికి ఇప్పటి వరకు నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం మాత్రం శూన్యంగా మారింది. దీంతో అవకాశాలు ఆమెకు దూరమయ్యాయనే అనే చెప్పాలి. ఇటీవలే రిలీజైన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం అనుష్కకు మంచి కమ్ బ్యాక్‌గా నిలిచింది. దీంతో నూతన ఉత్సాహంతో మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్ధమయ్యారు తాజాగా ఒక మలయాళ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. హోమ్ చిత్రం ఫేమ్ రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జై సూర్యకు జంటగా అనుష్క నటిస్తున్నారు. ఇది చారిత్రక కథ చిత్రంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా రెండు భాగాలుగా రూపొందుతున్నట్లు తెలిసింది. తన పాత్ర కొత్తగా ఉండకపోతే అనుష్క ఇందులో నటించడానికి సమ్మతించి ఉండరని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. -
మురళీధరన్ అదే చేశాడు! – సచిన్ టెండూల్కర్
‘‘1993లో మురళీధరన్‌ని కలిశాను. అప్పట్నుంచి మా స్నేహం అలాగే ఉంది. ఎంతో సాధించినా సాధారణంగా ఉంటాడు. అతను ఏదైనా అడిగితే కుదరదని చెప్పడం కష్టం.. అందుకే పిలవగానే ఈ వేడుకకి వచ్చాను’’ అన్నారు భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘800’. మురళీధరన్ పాత్రలో మధుర్ మిట్టల్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో వివేక్ రంగాచారి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ముంబైలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ‘800’ ట్రైలర్‌ని సచిన్ టెండూల్కర్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఆటలో గెలు పోటములు ఉంటాయి. మళ్లీ నిలబడి పోటీ ఇవ్వడమే నిజమైన ఆటగాడి లక్షణం. మురళీధరన్ అదే చేశాడు.. అతని జీవితం గురించి ప్రజలు తెలుసుకోవాలి’’ అన్నారు. ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ– ‘‘నేను సచిన్ ఫ్యాన్‌ని. మరో వందేళ్ల తర్వాత కూడా సచిన్ లాంటి క్రికెటర్, వ్యక్తి రాలేరు’’ అన్నారు. ‘‘ఈ సినిమాను విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు శివలెంక కృష్ణప్రసాద్. ‘‘800’ మానవత్వంతో కూడిన కథ’’ అన్నారు ఎంఎస్ శ్రీపతి. ‘‘మురళీధరన్గారి పాత్ర చేయడం ఓ పెద్ద బాధ్యత’’ అన్నారు మధుర్ మిట్టల్. -
అర్ధరాత్రి తమిళుల ఊచకోత.. అసలేంటి 'వైట్ వ్యాన్ స్టోరీ'!
శ్రీలంకలోని తమిళులపై ఆ దేశ సైన్యం జరిపిన యుద్ధ కాండ గురించి ఇప్పటికే పలు చిత్రాలు రూపొందాయి. వాటికి మరో కోణంలో తెరకెక్కిన చిత్రం పెరల్ ఇన్ ది బ్లెడ్. దీన్ని దర్శకుడు కెన్ కందయ్య రూపొందిస్తున్నారు. లండన్‌లో నివసిస్తున్న శ్రీలంక తమిళుడైన ఈయన ఇంతకు ముందు రోమిమో రొమాన్స్ అనే ఆంగ్ల చిత్రానికి దర్శకత్వం వహించారు. దీనికి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ విదేశీ చిత్రం, ఉత్తమ రొమాంటిక్ డ్రామా కేటగిరీలో అమెరికా దేశ అవార్డులను గెలుచుకుందని దర్శకుడు చెప్పారు. (ఇది చదవండి: ఆయన వల్లే కొత్త ప్రపంచాన్ని చూస్తున్నా.. కంటతడి పెట్టుకున్న హీరోయిన్) ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ.. 'శ్రీలంకలో తమిళుల ఊచకోత గురించి ఇంతకు ముందు చాలా చిత్రాలు రూపొందాయన్నారు. వాటిలో కొన్ని విజయవంతం అయినా, చాలా చిత్రాలు విడుదలే కాలేదని అన్నారు. కారణం అనేక రకాల సమస్యలేనని అన్నారు. తాను తెరకెక్కించిన పెరల్ ఇన్ ది బ్లెడ్ చిత్రం ఇంతకు ముందు ఎవరూ టచ్ చేయని అంశాలతో ఉంటుందన్నారు. ఇది శ్రీలంకలోని తమిళ ప్రజల వేదనలను ఆవిష్కరించే కథాంశంతోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న జాతి సమస్యలను తెలిపే కథా చిత్రంగా ఉంటుందన్నారు. అక్కడ జరిగే వైట్ వ్యాన్ స్టోరీని ఈ చిత్రంలో చెప్పినట్లు తెలిపారు. అర్ధరాత్రుల్లో ఎలాంటి నెంబర్లు లేని అనధికారిక వ్యానుల్లో దుండగులు వచ్చి శ్రీలంకలోని తమిళ ప్రజలను తీసుకుపోయి కర్కశంగా చంపే సంఘటనలే వైట్ వ్యాన్ స్టోరి అని తెలిపారు. వారు ఎవరూ? ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు? వంటివి ఎక్కడా నమోదు కావన్నారు. (ఇది చదవండి: హీరోయిన్గా డైరెక్టర్ కూతురు.. మరీ ఇంత చీప్ రెమ్యునరేషనా?) ఇందులో నటుడు సంపత్‌రామ్ శ్రీలంక మిలటరీ అధికారిగా నటించారని.. ఆయనే ఈ చిత్రానికి బలం అని పేర్కొన్నారు. అదే విధంగా నటుడు జయసూర్య ముఖ్య పాత్రలో నటించినట్లు చెప్పారు. కాగా సెవెన్హిల్ పిక్చర్స్ యూనివర్శల్ మూవీ టోన్ పతాకంపై ఈయన నిర్మించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో ఒక ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్కు రెడీ అవుతోంది. -
ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చి వెళ్లిపోయావు
కోయంబత్తూరు: షూటింగ్ సెట్స్‌లో గుండెపోటుతో కుప్పకూలిన మలయాళ దర్శకుడు నారానీపుజ షానవాస్(37) కన్నుమూశారు. కేరళలోని పాలక్కడ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న 'గంధీరాజన్' సినిమా సెట్స్‌లో డిసెంబర్ 21న షానవాస్‌కు గుండెపోటు వచ్చింది. వెంటనే అతడిని చిత్రయూనిట్ కోయంబత్తూరులోని కేజీ ఆస్పత్రికి తరలించింది. అక్కడ ఆయన పరిస్థితి మరింత విషమించగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు బుధవారం వెల్లడించారు. ఏదైనా మిరాకిల్ జరిగి బతుకుతాడేమోనన్న ఆశతో అతడిని వెంటిలేటర్‌పైనే ఉంచినప్పటికీ అదే రోజు సాయంత్రం మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పలువురు సెబబ్రిటీలు ఆయన మరణానికి చింతిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. (చదవండి:కూరగాయలమ్ముతున్న ప్రముఖ డైరెక్టర్) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) "ఆయన కథల్లాగే షాన్వాస్ కూడా ఎంతో మంచివారు, సున్నిత హృదయం కలవారు. ఆయన ఆత్మకు శాంతికి చేకూరాలి" అంటూ హీరోయిన్ అదితి రావు సోషల్ మీడియా వేదికగా దర్శకుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నటుడు జయ సూర్య సెట్స్‌లో అతడితో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. 'ఎన్నో కథలను చెప్పావు, మరెన్నో జ్ఞాపకాలను మిగిల్చి వెళ్లిపోయావు..' అంటూ నిర్మాత విజయ్ బాబు ఫేస్బుక్లో ఎమోషనల్ పోస్ట్ చేశారు. కాగా నారానీపుజ షానవాస్ 2015లో 'కేరీ' చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కొంత కాలం గ్యాప్ తర్వాత అదితిరావు హైదరీ, జయసూర్య, దేవ్ మోహన్ నటీనటులుగా 'సూఫియమ్ సుజాతయుమ్' చిత్రాన్ని తెరకెక్కించారు. గతేడాది అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రం అతడికి మంచి పేరు తెచ్చి పెట్టింది. (చదవండి: కమెడియన్‌ను పెళ్లి చేసుకున్న నటి) View this post on Instagram A post shared by actor jayasurya (@actor_jayasurya) -
పార్లమెంటు భేటీకి సిరిసేన అంగీకారం
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పార్లమెంటును వచ్చే వారం సమావేశపర్చే అవకాశముందని స్పీకర్ కరు జయసూర్య కార్యాలయం తెలిపింది. దేశంలో నెలకొన్న రాజ్యాంగ సంక్షోభానికి ప్రజాస్వామ్య పద్ధతిలోనే పరిష్కారం కనుగొనాలని చేసిన సూచనకు అధ్యక్షుడు ఓకే చెప్పారు. శ్రీలంక కొత్త ప్రధానిగా రాజపక్స నియామకంపై అటార్నీ జనరల్ జె.జయసూర్య న్యాయసలహా ఇచ్చేందుకు నిరాకరించారు. రాజ్యాంగంలోని 19వ అధికరణ ప్రకారం అధికారం లేకపోయినప్పటికీ ప్రధాని విక్రమసింఘేను పదవి నుంచి సిరిసేన తప్పించడాన్ని ఆయన తప్పుపట్టారు. మరోవైపు రాజపక్సను కొత్త ప్రధానిగా చైనా, బురుండి తప్ప మరేదేశాలు అంగీకరించకపోగా, సిరిసేనపై అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి పెరిగింది. -
విక్రమ సింఘేనే ప్రధాని
కొలంబో: శ్రీలంక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. రణిల్ విక్రమ సింఘేనే దేశ ప్రధానిగా గుర్తిస్తున్నట్లు పార్లమెంట్ స్పీకర్ జయసూర్య ప్రకటించారు. విక్రమ సింఘేను తొలగించి మహింద రాజపక్సను దేశ ప్రధానిగా నియమించడంతోపాటు పార్లమెంట్‌ను సుప్తచేతనావస్థలో ఉంచుతూ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న నిర్ణయం తీవ్ర అనూహ్య విపరిణామాలకు దారి తీస్తుందన్నారు. రాజపక్స నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం నేడు బాధ్యతలు స్వీకరించే అవకాశముందని తెలుస్తోంది. రాజపక్స అధికార పగ్గాలు చేబడితే పౌరులు, హక్కుల సంస్థలపై తిరిగి వేధింపులు మొదలవుతాయని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న హ్యూమన్ రైట్స్ వాచ్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధాని విక్రమసింఘేను తొలగించి రాజపక్సను నియమించడంతోపాటు, పార్లమెంట్‌ను నవంబర్ 16 వరకు సస్పెండ్ చేస్తూ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తీసుకున్న నిర్ణయాలను స్పీకర్ జయసూర్య ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం సిరిసేనకు ఆయన ఒక లేఖ రాశారు. పార్లమెంట్ సస్పెన్షన్ దేశంలో తీవ్ర, అనూహ్య విపరిణామాలకు దారితీస్తుందని పేర్కొన్నారు. స్పీకర్‌తో చర్చించిన తర్వాతే అధ్యక్షుడు పార్లమెంట్‌ను సుప్తచేతనావస్థలో ఉంచుతూ ఆదేశాలిచ్చే సంప్రదాయాన్ని గుర్తు చేశారు. ఆయన అహంకారి..అందుకే..: సిరిసేన రణిల్ విక్రమసింఘే అహంకార పూరిత మనస్తత్వమే ఆయన్ను అధికారం నుంచి తొలగించేందుకు కారణమైందని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తెలిపారు. రాజ్యాంగ బద్ధంగానే రాజపక్స కొత్త ప్రధానిగా నియమితులయ్యారని పేర్కొన్నారు. విక్రమసింఘేను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆదివారం ఆయన మొదటిసారిగా దేశప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘దేశ భవిష్యత్తును, సామాన్యుడిని గురించి పట్టించుకోని తన అనుచరులకు ఆయన అధికారాన్ని అప్పగించారు. ఆయన అహంభావి. ఉమ్మడి బాధ్యతలను పరిహాసం చేస్తూ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు. నాపై హత్యాయత్నం చేయించారు. మా మధ్య ఉన్న సాంస్కృతిక, విధానపరమైన విభేదాలే ప్రస్తుత రాజకీయ, ఆర్థిక సంక్షోభానికి కారణం’ అని పేర్కొన్నారు. తక్షణమే ఎన్నికలు జరపాలి: రాజపక్స దేశ ప్రస్తుత ఆర్థిక, రాజకీయ సంక్షోభానికి ముగింపు పలికేందుకు తక్షణం పార్లమెంట్ ఎన్నికలు జరపాలని నూతన ప్రధాని రాజపక్స డిమాండ్ చేశారు. రాజపక్సకు జిన్‌పింగ్ అభినందనలు శ్రీలంకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతుండగానే కొత్త ప్రధాని రాజపక్సేకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అభినందనలు తెలిపారు. చైనా రాయబారి చెంగ్ ఆదివారం తనను కలిసి జిన్‌పింగ్ తరఫున అభినందనలు తెలిపారని రాజపక్స ట్విట్టర్లో పేర్కొన్నారు. సంప్రదాయంగా శ్రీలంక విదేశాంగ విధానం భారత్, జపాన్‌లకు అనుకూలంగా చైనాకు దూరంగా ఉంటుంది. అయితే, రాజపక్స ప్రభుత్వం చైనాకు దగ్గరైంది. ఫలితంగా శ్రీలంకలో చైనా వేల కోట్ల పెట్టుబడులు పెట్టింది. రాజధానిలో కాల్పులు అధికార సంక్షోభం నేపథ్యంలో ఆదివారం కొలంబోలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. మాజీ క్రికెటర్, పెట్రోలియం శాఖ మంత్రి అర్జున రణతుంగను అడ్డుకోవడంతోపాటు ఆయన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు రాజపక్స అనుకూల వ్యక్తులు కొందరు ప్రయత్నించారు. దీంతో రణతుంగ భద్రతా సిబ్బందితోపాటు విక్రమసింఘే మద్దతుదారు జరిపిన కాల్పుల్లో ఒకరు చనిపోగా మరొకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి ఇద్దరు భద్రతా సిబ్బందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. -
రోడ్డుపై ఆ ఘటన చూసి చలించిపోయిన హీరో!
వానాకాలం వచ్చిందంటే చాలు.. రోడ్లనిండా ఎటుచూసినా గుంతలే.. ఇక వాటిపై ప్రయాణించాలంటే వాహనదారులకు నరకమే కనిపిస్తుంది. ఇలాంటి రోడ్లను ప్రత్యక్షంగా చూసి ఓ నటుడు చలించిపోయాడు. రోడ్డు మీద గుంతల కారణంగా తన ముందే ఓ యువకుడు బైకు మీద నుంచి పడి గాయాలపాలు కావడం ఆయనను కలిచివేసింది. వెంటనే ఫేస్బుక్ వేదికగా ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తూ ఆయన ఓ వీడియో పెట్టాడు. ఈ వీడియోను 11 లక్షలమంది చూశారు. 35వేలమంది షేర్ చేశారు. దీంతో ముఖ్యమంత్రి కూడా స్పందించారు. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ వీడియోను పెట్టింది మలయాళం హీరో జయసూర్య. తాను చూసిన ఘటనను హృద్యంగా వివరిస్తూ.. అస్తవ్యస్తమైన రోడ్ల కారణంగా పన్నుచెల్లింపుదారులైన సామాన్యులు బలి అవుతున్నారని జయసూర్య ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రోడ్లు బాగుచేసి.. ప్రజలను రోడ్డుప్రమాదాల నుంచి కాపాడాలని ఆయన సీఎంకు విన్నవించారు. ఈ వీడియోపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. ప్రతి ఏడాది రోడ్లు చెడిపోతుంటాయని, వాటిని మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంటుందని సీఎం విజయన్ ఫేస్బుక్లో తెలిపారు. రోడ్లను బాగుచేసి.. ప్రజలకు మంచి రవాణా అవకాశాలను కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. -
జయసూర్య
కొత్త సినిమా గురూ! పోలీస్ స్టోరీస్ అంటే... కామన్‌గా ఉండే పాయింట్ ‘అవినీతిపరులను అంతం చేయడం’. ఈ కామన్ పాయింట్‌తో ఓ కొత్త రకం కథను క్రియేట్ చేయడం, దాన్ని జనరంజకంగా తెరకెక్కించడంలోనే దర్శకుడి సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. పోలీస్ పాత్రలో హీరో ఎంతగా విజృంభిస్తే అంతగా ప్రేక్షకులకు ఆ పోలీస్ కథ నచ్చుతుంది. తాజాగా పోలీస్ స్టోరీతో తెరపైకి దూసుకొచ్చిన ‘జయసూర్య’ ఎలా ఉంటుంది? పవర్ఫుల్ క్యారెక్టర్స్‌ని పర్ఫెక్ట్గా చేసే విశాల్, పవర్ఫుల్ చిత్రాలు తీయడంలో తనకు తానే సాటి అనిపించుకున్న సుశీంద్రన్కాంబినేషన్లో వచ్చిన ఈ పోలీస్ భేష్ అనిపించుకుంటాడా? చూద్దాం... కథేంటంటే... అది గుంటూరు. భవానీ గ్యాంగ్ లేకపోతే అంతా ప్రశాంతంగానే ఉండేదేమో. కానీ, ఈ గ్యాంగ్ గుంటూరుని గడగడ వణికిస్తుంది. బడా వ్యాపారవేత్తలను కోట్లు ఇవ్వమని బెదిరించి, వాళ్లు ఇవ్వకపోతే నిర్దాక్షిణ్యంగా హత్య చేసేస్తుంది. వీళ్లని పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగుతారు. ఈ నేపథ్యంలో ఆల్బర్ట్ (హరీష్ ఉత్తమన్) అనే పోలీసాఫీసర్ని ఆ గ్యాంగ్ చంపేస్తుంది. కొడుకు చనిపోయిన బాధలో ఎలాగైనా భవానీ గ్యాంగ్‌ని అంతం చేయాలని సూసైడ్ నోట్ రాసి, అతని తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్కు సవాల్‌గా నిలిచిన ఈ గ్యాంగ్‌ని ఏరిపారేయడానికి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జయసూర్య (విశాల్)ను వైజాగ్ నుంచి గుంటూరు రప్పిస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. అక్కడ జయసూర్యకు సౌమ్య (కాజల్ అగర్వాల్) తారసపడుతుంది. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. మరో పది రోజుల్లో బాధ్యతలు తీసుకోవాల్సిన జయసూర్య అండర్ కవర్ కాప్‌గా వ్యవహరిస్తూ, భవానీ గ్యాంగ్‌లోని ఒక్కొక్కర్ని చంపేస్తుంటాడు. చివరికి భవానీని చంపే స్తాడు. అతను చనిపోతూ ‘మా ముఠాని అంతం చేశాననుకుంటున్నావేమో.. మా వెనకాల ఓ పెద్ద తలకాయ ఉంది’ అని చెప్పి, చనిపోతాడు. ఆ తర్వాత జయసూర్య అఫీషియల్‌గా బాధ్యతలు తీసుకుంటాడు. ఆ పెద్ద తలకాయ ఎవరనేది అతనికి పెద్ద సవాల్‌గా నిలుస్తుంది. ఇదిలా ఉంటే, పెద్దల సమ్మతంతో జయసూర్యకు, సౌమ్యకు పెళ్లి నిశ్చయమవుతుంది. కానీ, సౌమ్య తండ్రి హత్యకు గురవుతాడు. ఆ హత్య వెనకాల ఉన్నది ఎవరు? అనేది జయసూర్యకు మరో సవాల్. తీవ్రంగా ప్రయత్నించిన మీదట భవానీ గ్యాంగ్ వెనక ఉండి నడిపించిన ఆ వ్యక్తి ఎవరో జయసూర్యకు తెలిసిపోతుంది. కానీ, నీరసపడిపోతాడు.. షాకవుతాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి? జయసూర్య ఎందుకు నీరసపడ్డాడు? అతనికీ, జయసూర్యకు ఉన్న లింక్ ఏంటి? అతన్ని జయసూర్య ఏం చేశాడు? అనేది మిగతా కథ. నిజజీవిత కథ ఆధారంగా... ఆల్విన్ సుదన్ అనే సబ్ ఇన్స్పెక్టర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకునిదర్శకుడు సుశీంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జయసూర్య పాత్రలో విశాల్‌కి మల్టిపుల్ షేడ్స్ చూపించే అవకాశం దక్కింది. యాక్షన్, ఇంటెలిజెన్స్, కామెడీ, రొమాన్స్... వీటిని సమర్థవంతంగా క్యారీ చేయడంతో పాటు ఎమోషన్స్‌ని కూడా విశాల్ బాగా హ్యాండిల్ చేయగలిగారు. టూ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ని సముద్రఖని బాగా చేశారు. కాజల్ అగర్వాల్ గ్లామరస్‌గా ఉన్నారు. డి. ఇమామ్ స్వరపరచిన పాటలకన్నా అతను చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్స్‌ని, సెంటిమెంట్ సీన్స్‌ని బాగా ఎలివేట్ చేసింది. వేల్రాజ్ కెమెరా వండర్స్ చేసిందనే చెప్పాలి. థ్రిల్‌కి గురి చేసే ట్విస్ట్‌తో... రెండేళ్ల క్రితం విశాల్‌తో ‘పాండియనాడు’ (తెలుగులో ‘పల్నాడు’)వంటి హిట్ చిత్రం తీసిన సుశీంద్రన్ మళ్లీ విశాల్‌తో తీసిన చిత్రం కావడంతో భారీ అంచనాల నడుమ విడుదలైంది. అందుకే మొదట్నుంచీ చివరి వరకూ థ్రిల్‌కి గురి చేసేలా తీయాలని దర్శకుడు అనుకుని ఉంటారు. ఫస్ట్ హాఫ్ స్టోరీలోకి ప్రేక్షకులను ఇన్వాల్వ్ చేయడానికి కొంచెం పేస్ తగ్గించారు. ఇంటర్వెల్‌కి వచ్చేసరికి ఊహించని ఓ ట్విస్ట్ ఇచ్చి, సెకండాఫ్ చూసే తీరాలని ప్రేక్షకులను ప్రిపేర్ చేశారు. ఫస్టాఫ్ మొత్తం భవానీ గ్యాంగ్ అరాచకాలు, వాళ్లని పోలీసులు వెంటాడటం, హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్, రిలీఫ్ కోసం అన్నట్లు కొంత కామెడీ, పాటలు లేకపోతే డాక్యుమెంటరీ అనుకునే ప్రమాదం ఉందని పాటలు.. లాంటి వాటితో ఇంటర్వెల్‌కి థ్రిల్లింగ్ క్లోజర్ ఇచ్చారు. సెకండాఫ్‌లో విలన్ ఎవరో ప్రేక్షకులకు తెలిసిపోతుంది. ఒక్కసారిగా థ్రిల్ అవుతారు. అతన్ని హీరో ఎలా తెలుసుకుంటాడు? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరుగుతుంది. విలన్ ఎవరో హీరో తెలుసుకున్నాక ఎలా అంతం చేస్తాడు? అనేది ఇంకా ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. అతన్ని చంపడానికి హీరో తన ఎమోషన్‌ను కూడా చంపుకోవాల్సి వస్తుంది. ఆ ఎమోషన్ ప్రేక్షకులను టచ్ చేస్తుంది. ఇప్పటివరకూ వచ్చిన చిత్రాల్లోని సన్నివేశాలను పోలినవి ఈ చిత్రంలో కొన్ని ఉన్నప్పటికీ... ఆ పోలికలతో చూడకుండా ఒక ఎక్స్‌పీరియన్స్‌గా చూస్తే మాత్రం సినిమా బాగున్నట్లనిపిస్తుంది. -
‘జయసూర్య’ ఏం చేశాడు?
జయసూర్య నిజాయితీపరుడైన పోలీసాఫీసర్. వరుసగా జరుగుతున్న హత్యలు అతనికి సవాలుగా నిలుస్తాయి. ఆ హత్యల వెనక మిస్టరీని ఎలా ఛేదించాడు? అనే కథాంశంతో తెరకెక్కిన తమిళ చిత్రం ‘పాయుమ్ పులి’. విశాల్, కాజల్ జంటగా రూపొందిన ఈ చిత్రాన్ని జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి, ఎస్. నరసింహ ప్రసాద్ ‘జయసూర్య’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సుశీంద్రన్ దర్శకుడు. ఈ శుక్రవారం తమిళ, తెలుగు వెర్షన్లు రిలీజ్ కానున్నాయి. ‘‘ఇందులో విశాల్ లుక్, బాడీ లాంగ్వేజ్ సూపర్బ్. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే చిత్రం ఇది’’ అని నిర్మాతలు చెప్పారు. -
వీలు కుదిరితే విశాల్‌తో సినిమా చేస్తా : కొరటాల శివ
‘‘సుశీంద్రన్ చాలా మంచి దర్శకుడు. విశాల్ నాకు ఇష్టమైన హీరో. జయాపజయాలతో సంబంధం లేకుండా ముందుకెళుతూ ఉంటాడు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలవుతున్న ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా’’ అని హీరో గోపీచంద్ ఆకాంక్షించారు. సుశీంద్రన్ దర్శకత్వంలో విశాల్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందిన చిత్రం ‘జయసూర్య’. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో జి. నాగేశ్వరరెడ్డి, ఎస్. నరసింహ ప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. డి. ఇమాన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ద ర్శకుడు కొరటాల శివ హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ వేడుకలో గోపీచంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ- ‘‘యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన సినిమా ఇది. సుశీంద్రన్ చాలా మంచి స్క్రీన్‌ప్లే ఇచ్చారు. తెలుగులో త్వరలో ఓ స్ట్రయిట్ సినిమా చేయనున్నా’’ అని చెప్పారు. కొరటాల శివ మాట్లాడుతూ- ‘‘సుశీంద్రన్ రూపొందించిన ‘నా పేరు శివ’ సినిమా చూసే నా రెండు సినిమాలకు మదిని సినిమాటోగ్రాఫర్‌గా పెట్టుకున్నాను. అన్నీ కుదిరితే విశాల్‌తో సినిమా చేస్తాను’’ అని అన్నారు. ‘‘ ‘పల్నాడు’ తర్వాత నేను విశాల్‌తో చేసిన సినిమా ఇది. చాలా మంచి కాన్సెప్ట్‌తో రూపొందించాం’’ అని సుశీంద్రన్ అన్నారు. ఈ వేడుకలో నటి కుష్బూ, హీరోలు నాని, కార్తీ, దర్శకుడు వంశీ పైడిపల్లి, కథానాయిక కాజల్ అగర్వాల్, నిర్మాతలు జవ్వాజి రామాంజనేయులు, జి. నాగేశ్వరరెడ్డి, నరసింహ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
జయసూర్య ఫస్ట్ లుక్ విడుదల!
-
రైతు బతుకు గాలిలో దీపం!
సందర్భం వ్యవసాయం లాభసాటి వృత్తికాదని తేలిపోయింది. కుటుంబమంతా రెక్కలు ముక్కలు చేసుకొన్నా కనీస అవసరా ల కోసం కూడా రైతాంగ కుటుంబాలు నానా అగచాట్లు పడవలసి వస్తోంది. శతకకారుడు ఎన్నడో సూచించినట్లు ‘అప్పిచ్చువాడి’ కోసం వెతుక్కొని ప్రాధేయపడవలసి వస్తోంది. జాతీయస్థాయిలో, వ్యవసాయం జీవనా ధారంగా జీవించే రైతు కుటుంబాలు మృత్యు సంక్షోభంలో చిక్కుకొం టున్నాయి. రైతుల ఆత్మహత్యల పరం పరలు జాతి సిగ్గుతో తల దించుకొనే పరిస్థి తిని కల్పిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దశాబ్దాల తరబడి ప్రదర్శిస్తూ వస్తున్న తీవ్ర నిర్లక్ష్యమే రైతుల ఆత్మహత్యలకు కారణం. రైతు కష్టపడి పండించే తిండి గింజలతో, విలాసవం తంగా కడుపు నింపుకొనే సంపన్న నగర ప్రపంచా నికి, ఎక్కడో మారుమూల బలవన్మరణాలకు పాల్ప డే అభాగ్య జీవుల గురించి ఆలోచించే తీరిక, అవకా శం లేకపోవచ్చు. కానీ ప్రజల ప్రభుత్వంగా గొప్ప లు చెప్పుకొనే అధికార రాజకీయ నేతలు, ఈ విప త్కర పరిణామాలు శ్రుతిమించినా చేతులు దులిపే సుకోవటమే ఘోరం. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభు త్వం, తక్షణం స్పందించి ఈ మృత్యుహేలను అరిక ట్టే చర్యలు చేపట్టకపోతే మానవతా ధర్మాన్ని మంట కలిపినట్టే. సహజంగానే, ఏ మనిషికైనా చావాలనిపిం చదు. సుదీర్ఘకాలం జీవితాన్ని ఆస్వాదించాలనే ఉంటుంది. మనుషులు తమను తాము చంపుకో వటం కేవలం బలహీనత వల్లనే కాదు. ఋణ భారంతో కృంగి కృశించి, ఇక అప్పులు తీర్చటం తమ వల్ల కాదనే తీవ్ర నిరాశ, భార్యాపిల్లల పట్ల నైతిక బాధ్యత, ఇరుగుపొరుగులో ఆత్మాభిమానం, తాను బతికినా ఏమీ చేయలేని నిస్సహాయత ప్రపం చం నుంచి ఇక నిష్ర్కమించే దృఢ నిర్ణయాన్ని అమలు చేసేటట్లు ప్రేరేపిస్తుంది. ఏదో విధంగా అప్పు తీర్చాలనే తపన ఉన్న అభిమానవంతులు, ఇబ్బడిముబ్బడిగా పంట చేతికి వచ్చి ఆర్థిక దైన్యా న్ని పోగొడుతుందనే కొండంత ఆశతో ఉన్నప్పటికీ, అకాల వర్షాలు, అతివృష్టి, అనావృష్టి, కరెంటు కో త, వరదలు, తుపానుల వైపరీత్యాల సందర్భాల్లో గుండె కోతకు గురవుతుంటారు. దీపావళి నాడూ విషాద హేల ప్రభుత్వం గుర్తించిన అధికారిక బలవన్మరణాల తాజా వివరణ 2014 ప్రకారం, 2001 నుంచి విదర్భ లో కొనసాగుతున్న ఆత్మహత్యల పరంపరను యూ పీఏ అరికట్టలేకపోయింది. 2014లో యావద్దేశం దీపావళి సంబరాలలో ఉన్న రోజున అక్కడ యావ త్మల్, అకోలా, అమరావతి ప్రాంతాలలో ఒకేరోజు న ఆరుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ సంఖ్య ఏడాది మొత్తంలో 906కు చేరింది. అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలోను వ్యవసాయమే ప్రాణాధారంగా బతికే లక్షలాది కౌ లు రైతులు, అతివృష్టి, అనావృష్టి, ఇటీవల సంభ వించిన హుద్‌హుద్ తుపాన్ కన్నెర్ర, కరెంటు అల భ్యం, గిట్టుబాటు ధర లభించని పంటలు, నడ్డి విరగ్గొట్టే పెట్టుబడుల కారణంగా ఋణ వేదనతో జీవన్మరణ సంక్షోభం ఎదుర్కొంటున్నారు. ఈ దీపావళి మర్నాటి శనివారం తెలంగాణలోని మెదక్, ఖమ్మం, మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామా బాద్ జిల్లాలో ఒకే రోజున 8 మంది రైతులు ఉరి, పురుగు మందులతో ప్రాణాలు వదిలారు. ప్రభుత్వ తాజా నివేదిక ప్రకారం ఈ నెల 27వ తేదీ వరకు మొత్తం 148 రోజులలో 79 మంది రైతులు బలవన్మ రణం చెందారు. నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభు త్వపరంగా వ్యవసాయశాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులు 2011 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో 457 మంది ఆత్మహ త్యలు చేసుకున్నట్లు పేర్కొన్నారు. భారతీయ రైతుకు పెట్టుబడి వ్యయం ఏటికి ఏడు తడిసి మోపెడవటం, దానికి తోడు నోటికంది న పంట అక్కరకు రాకపోవటం, గిట్టుబాటు ధర మాట అటుంచి కనీస మద్దతు ధర కూడా లేకపో వటంతో బతుకు గాలిలో దీపంలా ఉంది. స్వామి నాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం రైతు పెట్టుబడి ఖర్చుల మొత్తానికి 50 శాతం లాభం జోడించి కనీస మద్దతు ధర ప్రకటించాలనే సిఫార్సు పార్లమెంటులో బుట్టదాఖలైంది. డిజి టల్ ఇండియాతో భారతా వనిని సుసంపన్నం చేయనున్న ప్రధాని మోదీ, రైతు బతుకుకు భరోసా ఇవ్వవలసి ఉంది. ఆహార భద్రతకు తిండి గింజలు 2013 సెప్టెంబర్ 10న, జాతీయ ఆహార భద్రతా బిల్లు చట్టంగా రూపొందింది. జనాభాలో 75 శా తం అర్హులకు ప్రతీనెల ఆహార ధాన్యాలు అందిం చడం చట్ట ప్రకారం హక్కు అయింది. తిండి గింజ లు సమృద్ధిగా నిల్వలుంటేనే, కోట్లాది ప్రజానీకానికి ప్రభుత్వం ఆహార భద్రతను సమకూర్చగలదు. వ్యవసాయం లాభసాటి వృత్తికాదని, దేశవ్యాప్తంగా వ్యవసాయరంగంపై కమ్ముకొన్న సంక్షోభం స్పష్టం చేస్తోంది. కుటుంబంలోని సభ్యులందరూ రెక్కలు ముక్కలు చేసుకొన్నా కనీస అవసరాలు, విద్యా వైద్య సౌకర్యాలకు రైతాంగ కుటుంబాలు నానా అగ చాట్లు పడవలసి వస్తోంది. శతకకారుడు ఎన్నడో సూచించినట్లు ‘అప్పిచ్చువాడి’ కోసం వెతుక్కొని ప్రాధేయప డవలసి వస్తోంది. ప్రస్తుత దుస్థితి గ్రామాలలోని రైతుల్ని పొలం గట్ల నుంచి తరిమేస్తోంది. రైతు కుటుంబాలలోని యువతరం ఉద్యోగ ఇతర ఉపాధి రంగాల వైపు నగరాలకు అసంఖ్యాకంగా తరలి వెళ్తున్నారు. గత రెండు దశాబ్దాలలో సగటున రెండు వేల మందికి పైగా రోజూ వ్యవసాయానికి, వ్యవసాయ పనులకు స్వస్తి పలుకు తున్నట్లు అంచనా. స్వాతంత్య్రానంతరం హరిత విప్లవం పేరిట తిండి గింజల్లో దేశం అధికోత్పత్తి సాధించినప్పటికీ, ప్రకృతి వైపరీత్యాల కారణంగా భారతావని భవిష్యత్తులో భిక్షాపాత్రతో దేవురించే పరిస్థితులు దాపురించేలా తీవ్రమైన పర్యావరణ దుష్పరి ణామాలు తలెత్తుతున్నాయి. నాటి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జైకిసాన్ నినాదంతో, రైతు జీవన విలువలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, అన్నదాతను ఎలా ఆదుకొంటారో! జయసూర్య -వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
స్టార్ హీరో: మే..మే..మేక!
జంతువులు ప్రధాన పాత్రగా సినిమాలు తీయడం ఇటీవల చాలా తగ్గిపోయింది. గతంలో ఏనుగు, పొట్టేలు, శునకం, ఆవు...ఇలా అనేక జంతువులు కీలక పాత్ర పోషించిన చిత్రాలు చాలా వచ్చాయి. అయితే ఇటువంటి చిత్రాలు నిర్మించడం చాలా కష్టంతో కూడుకున్న పని. జంతువులను తమకు కావలసిన విధంగా మలచుకోవడం, నటింపజేయడం దర్శకుని నైపుణ్యంమీద ఆధారపడి ఉంటుంది. దర్శకుడు ఎన్నో తిప్పలు పడాలి. ప్రయోగాలు చేయగల సత్తా ఉన్నవారే ఇటువంటి చిత్రాలు నిర్మిస్తారు. ప్రయోగాలు చేయడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. సూపర్‌స్టార్స్ నుంచి యువ హీరోల వరకూ, సీనియర్ దర్శకుల నుంచి యువ దర్శకుల వరకు అక్కడ అందరూ ప్రయోగాత్మక చిత్రాలు నిర్మించడానికి ప్రాధాన్యత ఇస్తారనేది జగమెరిగిన సత్యం. మలయాళ సూపర్‌హిట్ సినిమా 'ఓమ్ శాంతి ఓషానా'కు స్క్రిప్ట్ రాసిన మిథున్ మ్యానుయల్ థామస్, మలయాళ హీరో జయసూర్య ఇప్పుడు అటువంటి ప్రయోగం చేయనున్నారు. థామస్ దర్శకత్వం వహించే 'ఆడు ఓరు భీకర జీవి ఆను' అనే చిత్రంలో ఓ మేక ప్రధాన పాత్ర పోషిస్తోంది. మలయాళంలో ఆడు అంటే మేక. ఈ చిత్రాన్ని పూర్తిగా హాస్యంతో నింపేస్తున్నారు. ఇందులో నటించే మేక స్టార్ హీరోలకు ధీటుగా, భీకరంగా నటిస్తుందని చెబుతున్నారు. ఆ మేక సత్తా చూడాలంటే థియేటర్లకు వెళ్లవలసిందేనని అంటున్నారు. ఓ గ్రామంలో జరిగే ఆటల పోటీలు ఇతివృత్తంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. కథ మొత్తం ఆ మేక చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మేక లీడ్ రోల్లో మలయాళంలో ఓ సినిమా రూపొందడం ఇదే మొదటిసారి. ఈ సినిమా షూటింగ్ మొత్తం కేరళలోని అత్యంత సుందరమైన ప్రదేశం ఇడుక్కిలో జరుపనున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ నాటికి పూర్తి చేసి డిసెంబర్లో విడుదల చేయాలన్నది నిర్మాతల ఆలోచన. మేక నటన, హావభావాల ప్రదర్శన, పోరాటాలు... చూడటం కోసం ఎదురుచూద్దాం. తెలుగులో కూడా ఓ పెంపుడు కుక్క యథార్థగాథ ఆధారంగా ఓ సినిమా నిర్మిస్తున్నారు. సీనియర్ నిర్మాత, రాజకీయవేత్త చేగొండి హరిరామ జోగయ్య నిర్మాతగా రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో ప్రముఖ హాస్యహీరో రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో దీనిని రూపొందిస్తున్నారు. - శిసూర్య -
‘పోలవరం’ మీద ఎందుకు సమరం?
అంతర్రాష్ట్ర వివాదాల కారణంగా ఇప్పటికే తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున సిరిసంపదలు కోల్పోతున్నారు. విభజన అనివార్యమైనందున పరస్పరం ప్రాంతీయాభివృద్ధికీ, తెలుగు జాతి సౌభాగ్య సాధనకీ సుహృద్భావ ధోరణితో నేతలు వ్యవహరించాలి. తెలుగు ప్రజల జీవన రేఖ పోలవరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ఆలోచన దశాబ్దాల నాటిది. అయినా ఇంతకాలం ఆలస్యం కావ డం దురదృష్టం. ఇప్పుడు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ప్రభావం, కేంద్రం ఇచ్చిన హామీ లు, కొత్త ప్రభుత్వం ఈ హామీలను గౌరవించడం వంటి అంశాలు చర్చకు ఆస్కారం కల్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో రెండు రాష్ట్రాలను సౌభాగ్యవంతం చేయగల బహుళార్ధ సాధక ప్రాజెక్టుగా, గోదావరీ జలా ల వినియోగం ప్రధాన అంశంగా అది ప్రాధాన్యం సంతరించుకుంది. పోలవరం ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్ర నేతలు ఆమోదించినట్లేనని రాష్ట్ర విభజన బిల్లులోని 91వ క్లాజులో స్పష్టం చేశారు. డాక్టర్ వైఎస్ ఆరంభించిన జలయజ్ఞంలో భాగమే పోలవరం నిర్మాణం. పునర్ వ్యవస్థీకరణ తరువాత ఆలోచన ప్రకారం గోదావరి జల బోర్డు తెలంగాణలో, కృష్ణా రివర్ బోర్డు సీమాంధ్ర ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ప్రధాని మన్మోహన్సింగ్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014 చర్చ ముగింపు సందర్భంగా రాజ్యసభలో ప్రకటించిన ఆరు సూత్రాల అభివృద్ధి ప్యాకేజీలో, నాలుగవ సూత్రంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన హామీ ఉంది. పోలవరం ప్రాజెక్టు పరిధిలో పూర్తి స్థాయిలో పునరావాస, పునరాశ్రయ చర్యలు సంపూర్ణంగా చేపట్టి, అవసరమైతే మరిన్ని సవరణలు చేస్తామని కూడా భరోసా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును కేం ద్ర ప్రభుత్వమే చేపడుతుందని, ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని ప్రధాని ప్రకటించారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేశ్ ఫిబ్రవరి నెలాఖరులో, ప్రధాని ఇచ్చిన హామీలను ఉదహరిస్తూ ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల గ్రామాలలో ఈ ప్రాజె క్టు కారణంగా సంభవించనున్న ముంపు సమస్యను పరిష్కరిం చవలసి ఉందని, రూ.600 కోట్లు వినియోగించి ముంపు నివారణకు అడ్డుగోడ నిర్మించటానికి సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు 90 శాతం నిధులు తామే భరిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిపోయింది. ఇంత వరకు తెలంగాణ రాష్ట్ర సాధనను మాత్రమే ఎజెండాగా చేసుకొన్న రాజకీయ పార్టీలకు ఒక కొత్త సమస్య ఆదిలోనే ఎదురవుతోంది. పోలవరం ప్రాజెక్టు కింద ముంపునకు గురయ్యే ఖమ్మం జిల్లాలో గ్రామాలు సీమాంధ్రలో కలపవద్దన్న డిమాండ్ ఆరంభమైంది. ఇది వివాదాస్పదం కాకతప్పదు. భద్రాచలం మినహా ఏడు మండలాలను సీమాంధ్రలో కలపటానికి ఆర్డినెన్స్ తెస్తామం టూ కేంద్ర మంత్రి జైరాం రమేశ్ చేసిన ప్రకటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం కావడమే ఇందుకు నిదర్శనం. తొలుత, పోల వరం ముంపు కింద 134 గ్రామాలే సీమాంధ్రకు ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఏడు మండలాలను చేర్చటం అప్రజాస్వామికమని న్యాయపోరాటం చేస్తామంటున్నారు. తెలంగాణ ఐకాస, భాజపా, కాంగ్రెస్ నేతలలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొండరెడ్లు, గుత్తి కోయలు వంటి ఆదివాసీల గ్రామాలను, పోలవరం కోసం ముంచి వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎప్పటినుంచో ఖమ్మం, భద్రాచలం, చింతూరు, కూనవరం ప్రాంత ఆదివాసీ సంక్షేమ, విద్యార్థి యువజన, పౌరహక్కుల సంఘాలు, వామపక్షాలు ప్రతిఘటిస్తున్నాయి. లక్షలాది ఆదివాసీలు తమ ఇళ్లు, భూములు జీవనోపాధి కోల్పోయి జీవన సంక్షోభంలో చిక్కుకొంటారని, కాబట్టి ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వలన ముంపుకు గురయ్యే ఏడు మండలాలను సీమాంధ్రలో కలిపే ఆర్డినెన్స్ నిలిచిపోవటం హర్షణీయమని, ఇప్పుడు తెలంగాణలోని 137 గ్రామాలను మాత్రమే ప్రాజెక్టు పరిధిలో చూపిం చారని గిరిజనులను పునాదులుగా చేసుకొని ప్రాజెక్టు కట్టవద్దని, తెరాస అగ్రనేత కేసీఆర్ ఇప్పటికే హెచ్చరించారు. గోదావరి జలాల సద్వినియోగానికి పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులు, తెలుగు రాష్ట్రాలు రెండూ కొనసాగించవలసినదే. 1942లో ప్రతిపాదించబడిన ఈ ప్రాజెక్టు 2014లో కూడా నిర్మాణ దశలో బాలారిష్టాలను ఎదుర్కొంటుండటం తెలుగువారి దౌర్భాగ్యం. ప్రాజెక్టు డిజైన్ సరిచేయాలని, ఎత్తు తగ్గించి ముంపు నివారించాలని ప్రస్తుతం వాదన బలంగా వినపడుతోంది. సీమాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో అపారమైన సహజవాయువు, ఖనిజ సంపదలు ఉన్నాయి. అంతర్రాష్ట్ర వివాదాల కారణంగా ఇప్పటికే తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున సిరిసంపదలు కోల్పోతున్నారు. విభజన అనివార్యమైనందున పరస్పర ప్రాంతీయాభివృద్ధి, తెలుగుజాతి సౌభాగ్య సాధనలో సుహృద్భావ ధోరణులతో నేతలు వ్యవహరించాలి. లేని పక్షంలో రెండు ప్రాంతాలు నష్టపోతాయి. (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్) జయసూర్య -
సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : దాళ్వాకు అనుమతినివ్వాలని కోరుతూ మంగళవారం వందలాదిమంది రైతులు రోడ్డెక్కారు. స్థానిక ఉండి రోడ్డులోని లోసరి కాలువ వద్ద ఇరిగేషన్ అధికారులు వేసిన అడ్డుకట్టను తొలగించి, నీటిని విడుదల చేశారు. అక్కడే రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. ఈలోగా అక్కడ పోలీస్ బలగాలను మోహరింపజేశారు. టూటౌన్ సీఐ జయసూర్య, ఎస్సై విష్ణుమూర్తి ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన విరమించాలని రైతులను కోరగా అధికారులు వచ్చి దాళ్వాకు నీరిస్తామని ప్రకటించేవరకు ఆందోళనను విరమించేదిలేదని బీష్మించారు. ఈ సందర్భంగా రైతుసంఘం జిల్లా కార్యదర్శి బి.బలరాం మాట్లాడుతూ లోసరి మెయిన్ ఛానల్‌కు నీరిచ్చి దిగువ గ్రామాల్లోని 10 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు, మూడేళ్ల నుంచి వరుస తుపానులతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇప్పుడు దాళ్వాకు అనుమతినివ్వకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనాలకోసం నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు. పెసర, మినుము పంటలు వేసుకోమని అధికారులు చెబుతున్నా చౌడు భూముల్లో అపరాలు వంటివి పండవన్నారు. అనంతరం నరసాపురం ఆర్డీవో వసంతరావు రైతులతో మాట్లాడారు. భీమవరం మండలంలో చాలా మంది నారుమళ్లు వేసుకున్నారని, ఇప్పుడు దాళ్వా వేయవద్దని చెప్పడం సమంజసంకాదని, వెంటనే దాళ్వాకు నీరివ్వాలని రైతులు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆర్డీవో వసంతరావు రైతులతో పాటు భీమవరం మండలం గొల్లవానితిప్ప వెళ్లి పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడారు. కలెక్టర్‌కు పరిస్థితిని నివేదిస్తానని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన సద్ధుమణిగింది. నాయకులు జేఎన్వీ గోపాలన్, కొప్పర్తి వెంకట రామారావు, గుద్దటి రవికుమార్, బొమ్మిడి శ్రీనివాస్, రేవు రామకృష్ణ, గుద్దటి చంద్రరావు, రామాయణం ఏడుకొండలు, భూసారపు అమ్మిరాజు, ఆరేటి సత్యనారాయణ, బోడపాటి రామకృష్ణ, జడ్డు పెదకాపు, ఆకుల నరసింహమూర్తి, ముత్యాలరావు, ఇంటి రామకృష్ణ, కొప్పర్తి భాస్కరరావు, రైతులు పాల్గొన్నారు. -
ఉత్తర ధ్రువంపై రగులుతున్న చిచ్చు
వనరులను దుర్వినియోగపరచే జీవన శైలిని వ్యసనంగా మార్చుకున్న సంపన్న దేశాలన్నీ ఇంధన నిక్షేపాల కోసం బరితెగిస్తున్నాయి. అతి సున్నితమైన ఆర్కిటిక్ ప్రాంతంలో చమురు తెట్టులు, పారిశ్రామిక కాలుష్యం మరింతగా భూతాపాన్ని పెంచుతాయని, ఓజోన్ పొరకు తీవ్ర హానిని కలిగిస్తాయని శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనిషిలోని స్వీయ విధ్యంసక శక్తి ఉత్తర ధ్రువ ప్రాంతంలో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోం ది. మంచు ఖండంగా భ్రమింపజేసే ఆర్కిటిక్ సముద్రం అతి వేగంగా కరిగిపోతున్నా, పెను ఉపద్రవాలు ముంచుకొస్తున్నా పట్టింపు లేకుండా లాభాల వేటలో మునిగిపోవడం ‘మనిషి’కే చెల్లింది. ఐదు మహా సముద్రాల్లోకెల్లా అతి చిన్న సముద్రమైన ఆర్కిటిక్ విస్తీ ర్ణం 54.27 లక్షల చదరపు మైళ్లు. ఏటి పొడవునా గడ్డకట్టి పోయి ఉండే ఏకైక హిమ సము ద్రంలో 2020 నాటికి వేసవిలో మంచన్నదే కనిపించకుండా పోతుంది. 2040 నాటికి సాధారణ జల సముద్రంగా మారిపోతుందని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞుల అంచనా. ఆర్కిటిక్ కరిగిపోవడం వల్ల సంభవించే ప్రకృ తి వైపరీత్యాల గురించి, అంతరించిపోతున్న జీవరాశి గురించి ఆందోళనే లేకుండా ప్రధాన ప్రపంచ శక్తులన్నీ ఆర్కిటిక్ కరిగి బయటపడే భూభాగాలపై ఆధిపత్యం కోసం పరుగులు తీస్తున్నాయి. అక్కడ ఉన్న అపారమైన ఖనిజ నిక్షేపాల కోసం పోటీకి దిగుతున్నాయి. ఆర్కిటిక్ మరింత వేగంగా కరిగిపోయేలా విధ్వం సాన్ని సృష్టిస్త్నునాయి. తీవ్ర ఇంధన వనరుల కొరతను ఎదుర్కొంటున్న కారణంగా ప్రపంచ దేశాలు, బహుళజాతి చమురు కంపెనీలు ఆర్కిటిక్పైకి దృష్టిని సారించాయి. మిగతా ప్రపంచం అం తటా ఉన్న ఇంకా గుర్తించని మొత్తం చము రు, సహజవాయు నిక్షేపాల కంటే 25 శాతం ఎక్కువ నిక్షేపాలు ఆ ప్రాంతంలో ఉన్నాయని శాస్త్రజ్ఞుల అంచనా. రష్యా, కెనడా, అమెరికా, ఐస్‌ల్యాండ్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్‌లు ఆర్కిటిక్ తీర దేశాలు. అయితే రష్యా ప్రధానంగా ఈ ప్రాంతంపై ఆధిపత్యం వహిస్తోంది. 2007లో రష్యా శాస్త్రజ్ఞుల బృందం తూర్పు ఆర్కిటిక్ సముద్ర ఆంతర్భాగంలోని ‘లామొనొసోవ్ రిడ్జి’ను కనుగొంది. అది రష్యా భూభాగంతో అనుసంధానమై ఉంది. నేటి అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం దానిపై హక్కులు రష్యాకే దఖలు పడాల్సి ఉంటుంది. దీంతో రష్యా ఆ హక్కుల కోసం ఐస్‌ల్యాండ్, కెనడాలతో కయ్యానికి దిగుతోంది. లామొనొసోవ్ రిడ్జిలో ఉన్న సహజవాయువు, చమురు నిక్షేపాలు కనీసం 10,000 కోట్ల టన్నులు! దీంతో రష్యా ప్రిచోరాలో ఎంతటి హిమపాతాలనైనా తట్టుకొనే ఆయిల్ రిగ్ ప్లాట్‌ఫాం ‘ప్రిరాజ్లొమన్య’ను 2012లో నిర్మించడం ప్రారంభించింది. ప్రపంచంలోనే అది అలాంటి మొట్టమొదటి రిగ్ అవుతుంది. ఆర్కిటిక్ అలాస్కా, అమెరాసియా బేసిన్, తూర్పు గ్రీన్‌ల్యాండ్, రిఫ్టీ బేసిన్లలోని 25 భారీ చమురు, సహజవాయు క్షేత్రాలను అమెరికా భూగర్భ సర్వే కనుగొంది. అమెరికా, బ్రిటన్ల చమురు గుత్త సంస్థ ‘షెల్’ ఆర్కిటిక్ హిమసముద్రానికి తూట్లు పొడ వటాన్ని నిరసిస్తూ ‘గ్రీన్ పీస్’ పర్యావరణ కార్యకర్తలు ఆం దోళన సాగిస్తున్నారు. కాలిఫోర్నియా న్యాయస్థానంలో వారి కేసు పెండింగ్‌లో ఉంది. ఈ కేసులో షెల్‌కు అనుకూలంగా తీర్పు రావడమే తర్వాయి, ఇతర చమురు కార్పొరేషన్లు కూడా రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాయి. అత్యంత సున్నితమైన జీవ పర్యావరణ వ్యవస్థలకు నిలయమైన అర్కిటిక్ ప్రాంతం లో చమురు వెలికితీత కార్యకలాపాలు ఇప్పటికే విషమించిన అక్కడి వాతావరణాన్ని మరింతగా పాడు చేస్తాయని పర్యావరణ వేత్తలు గగ్గోలు పెడుతున్నారు. అమెరికా నుంచి నైజీరియా వరకు ప్రతి దేశంలోనూ చమురు, వాయు క్షేత్రాలలో తరచుగా ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. భారీ ఎత్తున పచ్చటి పంట చేలు, హరితారణ్యాలు నాశమమైపోతున్నాయి, సముద్రజలాలు కలుషితమై జీవ, పర్యావరణ వ్యవస్థలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికే ఆర్కిటిక్ తిమింగ లం వంటి జీవరాశి ముప్పను ఎదుర్కొం టోంది. ఇక ధ్రువ ప్రాంతపు ఎలుగుబంటి కూడా అంతరించిపోతుందని భావిస్తున్నారు. వనరుల దుర్వినియోగ జీవన శైలిని వ్యసనం గా మార్చుకున్న సంపన్న దేశాలన్నీ ఇంధన నిక్షేపాల కోసం ఎంతకైనా బరితెగిస్తున్నాయి. అతి సున్నితమైన ఆర్కిటిక్ ప్రాంతంలో చమురు తెట్టులు, పారిశ్రామిక కాలుష్యం మరింతగా భూతాపాన్ని పెంచుతాయని, ఓజోన్ పొరకు తీవ్ర హాని కలిగిస్తాయని శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్కిటిక్ ఆధిపత్యపు పోరులో తలమునకలై ఉన్న అమెరికా, రష్యా, కెనడా, నార్వే, డెన్మా ర్క్ తదితర దేశాలు విచ్చలవిడిగా చమురు, వాయు బావుల తవ్వకానికి దిగుతున్నాయి. భవిష్యత్ తరాలకు వారసత్వంగా సంక్రమిం చాల్సిన వనరులను కూడా కొల్లగొడుతున్నా యి. పైగా భావి తరాల మనుగడకే ముప్పును కలుగజేస్తున్నాయి. అన్నిటికీ మించి ఆర్కిటిక్ ప్రాంతంలో ఉద్రిక్తతలను రేకెత్తిస్తున్నాయి. నవనాగరిక సమాజం ఆర్కిటిక్ ఇంధన వనరులపై, ఖనిజసంపదపై ఆధారపడటం తప్పనిసరే అయినా అందుకు మార్గం ఆధిపత్యవా దం, యుద్ధం కారాదు. సమానత్వం, సామరస్యాలపై ఆధారపడిన ఒప్పందాలపై ఆధారపడి శాంతియుతంగా వనరుల పంపకానికి కృషి చేయడం ఉత్తమం. - జయసూర్య సీనియర్ జర్నలిస్టు