నిజం గెలుస్తుంది: జయసూర్య | Jayasurya responds to sexual harassment allegations | Sakshi
Sakshi News home page

నిజం గెలుస్తుంది: జయసూర్య

Published Mon, Sep 2 2024 12:50 AM | Last Updated on Mon, Sep 2 2024 12:50 AM

Jayasurya responds to sexual harassment allegations

మలయాళ నటుడు జయసూర్యపై లైంగిక దాడి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఆయనపై రెండు కేసులు నమోదు అయ్యాయి. ఆగస్టు 31న జయసూర్య పుట్టినరోజు. ఈ సందర్భంగా తనపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ ఓ నోట్‌ను రిలీజ్‌ చేశారు జయసూర్య. ‘‘నాపై ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. మనస్సాక్షి లేనివారికి తప్పుడు ఆరోపణలు చేయడం సులభం.

చేయని వేధింపులను చేశానని చెప్పడం, ఆ ఆరోపణలు మోయడం కూడా ఓ వేధింపులాంటిదే. నిజం కన్నా అబద్ధం వేగంగా ప్రయాణం చేస్తుందంటారు. అయినా నాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. నిజం గెలుస్తుంది. ఇక నా వ్యక్తిగతమైన కారణాల దృష్ట్యా ప్రస్తుతం యూఎస్‌లో ఉన్నాను. నా పనులు పూర్తి కాగానే కేరళకు వస్తాను’’ అని ఆ నోట్‌లో పేర్కొన్నారు జయసూర్య. 

దీంతో జయసూర్యపై ఫిర్యాదు చేసిన నటి సోనియా మల్హర్‌ మరోసారి స్పందించారు. ‘‘నావి తప్పుడు ఆరోపణలని ఆయన (జయసూర్యను ఉద్దేశించి) అంటున్నారు. కానీ నా మాటల్లో నిజం ఉంది. ఆయనపై కామెంట్స్‌ చేయడానికి నేను లంచం తీసుకున్నట్లుగా సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. హేమా కమిటీ రిపోర్ట్‌ వైరల్‌ అయిన నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చి, హీరో పేరును బయటపెట్టాను. న్యాయపోరాటం విషయంలో వెనక్కి తగ్గను’’ అని సోనియా మల్హర్‌ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement