కోయంబత్తూరు: షూటింగ్ సెట్స్‌లో గుండెపోటుతో కుప్పకూలిన మలయాళ దర్శకుడు నారానీపుజ షానవాస్(37) కన్నుమూశారు. కేరళలోని పాలక్కడ్‌లో షూటింగ్ జరుపుకుంటున్న 'గంధీరాజన్' సినిమా సెట్స్‌లో డిసెంబర్ 21న షానవాస్‌కు గుండెపోటు వచ్చింది. వెంటనే అతడిని చిత్రయూనిట్ కోయంబత్తూరులోని కేజీ ఆస్పత్రికి తరలించింది. అక్కడ ఆయన పరిస్థితి మరింత విషమించగా బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు బుధవారం వెల్లడించారు. ఏదైనా మిరాకిల్ జరిగి బతుకుతాడేమోనన్న ఆశతో అతడిని వెంటిలేటర్‌పైనే ఉంచినప్పటికీ అదే రోజు సాయంత్రం మరణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పలువురు సెబబ్రిటీలు ఆయన మరణానికి చింతిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. (చదవండి:కూరగాయలమ్ముతున్న ప్రముఖ డైరెక్టర్)
"ఆయన కథల్లాగే షాన్‌వాస్ కూడా ఎంతో మంచివారు, సున్నిత హృదయం కలవారు. ఆయన ఆత్మకు శాంతికి చేకూరాలి" అంటూ హీరోయిన్ అదితి రావు సోషల్ మీడియా వేదికగా దర్శకుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నటుడు జయ సూర్య సెట్స్‌లో అతడితో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. 'ఎన్నో కథలను చెప్పావు, మరెన్నో జ్ఞాపకాలను మిగిల్చి వెళ్లిపోయావు..' అంటూ నిర్మాత విజయ్ బాబు ఫేస్‌బుక్‌లో ఎమోషనల్ పోస్ట్ చేశారు. కాగా నారానీపుజ షానవాస్ 2015లో 'కేరీ' చిత్రంతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కొంత కాలం గ్యాప్ తర్వాత అదితిరావు హైదరీ, జయసూర్య, దేవ్ మోహన్ నటీనటులుగా 'సూఫియమ్ సుజాతయుమ్' చిత్రాన్ని తెరకెక్కించారు. గతేడాది అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రం అతడికి మంచి పేరు తెచ్చి పెట్టింది. (చదవండి: కమెడియన్‌ను పెళ్లి చేసుకున్న నటి)
Comments
Please login to add a commentAdd a comment