Beauty parlor
-
శోభతో చేతన్ 8 నెలలుగా సహజీవనం...
కర్ణాటక: ముగళూరు దక్షిణ పినాకిని నదిలో గతనెల 26న హత్యకు గురైన చేతన్(26) అనే యువకుడి కేసులో బ్యూటీపార్లర్ మహిళతో పాటు ముగ్గురిని సర్జాపుర పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నగరానికి చెందిన శోభ, కోలారు జిల్లా మాలూరు తాలూకా చిక్కతిరుపతికి చెందిన సతీశ్, స్నేహితుడు శశి పట్టుబడారు. పరారీలో ఉన్న మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కృష్ణరాజపురంలో బ్యూటీపార్లర్ నిర్వహిస్తున్న శోభతో చేతన్ 8 నెలలుగా సహజీవనం చేస్తున్నాడు. అతను కృష్ణరాజపురంలోని అయ్యప్పనగర రియల్ఎస్టేట్ కార్యాలయంలో పనిచేస్తున్నారు. అయితే శోభకు చిక్కతిరుపతికి చెందిన సతీశ్ అనే వ్యక్తితో పరిచయమైంది. సతీశ్ భూ విక్రయ వ్యవహారంలో రూ.40 లక్షలకు పైగా డబ్బు సంపాదించగా శోభ కోరిక మేరకు రూ.25 లక్షలు ఖర్చుచేసి బ్యూటీపార్లర్ పెట్టించాడు. సతీశ్ తన స్నేహితులైన మధు, శశితో కలిసి చేతన్‌ను చిక్కతిరుపతి సమీపంలోని బార్‌కు పిలిపించి మద్యం తాపించి హత్యచేసి దక్షిణ పినాకినిలో మృతదేహం పడేసి ఉడాయించారు. ఈ ఘటనపై సర్జాపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని బార్ వద్ద అమర్చిన సీసీటీవీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టి హత్యకేసులో నిందితులను ఆదివారం అరెస్ట్‌చేశారు. -
తెల్లారితే ముహూర్తం.. వరుడికి వధువు షాక్..!
తిరువొత్తియూరు: ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తెల్లారితే ముహూర్తం. బుధవారం సాయంత్రం రిసెప్షన్ కోసం బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన వధువు అదృశ్యం కావడంతో వరుడి బంధువులు వివాహం తాలూకు ఫ్లెక్సీలు చించివేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నై శివారు నగరం పూందమల్లి సమీపాన చెంబరంపాక్కంకు చెందిన యువకుడికి మధురాంతకం ప్రాంతానికి చెందిన యువతితో పెద్దలు వివాహం కుదిర్చారు. గురువారం ఉదయం నసరత్‌పేటలోని ఓ కల్యాణమండపంలో వివాహానికి ఏర్పాట్లు ఘనంగా చేశారు. బుధవారం సాయంత్రం ఆ కల్యాణ మండపంలో అట్టహాసంగా ఏర్పాటు చేసిన రిసెప్షన్‌కు వరుడు వచ్చాడు. కానీ ఎంతసేపైనా వధువు, ఆమె బంధువులెవరూ రాకపోవడంతో వరుడు కంగారు పడ్డాడు. రిసెప్షన్‌కు రావడానికి గాను అలంకరణ నిమిత్తం బ్యూటీపార్లర్‌కు వెళ్లిన వధువు ఉద్దేశపూర్వకంగా అదృశ్యమైందని, ఆమె కోసం ఆమె బంధువులు గాలిస్తున్నారని తెలుసుకున్న వరుడు, అతని బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. కల్యాణ మండపంలోని వివాహం తాలూకు ఫ్లెక్సీలు, బ్యానర్లను చించివేశారు. నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ నసరత్‌పేట పోలీస్ స్టేషన్లో వరుడు కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. చదవండి: ‘నువ్వు నాకు తెలుసు.. వ్యభిచారం చేస్తావా’ పొదల్లోకి ఈడ్చుకెళ్లి.. బండరాయితో -
తప్పుడు పనులు చేయిస్తున్నారు..
అమీర్‌పేట: బ్యూటీ పార్లర్లో ఉద్యోగం ఇస్తామని చెప్పి తప్పుడు పనులు చేయిస్తున్నారని, వేతనం అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఇద్దరు యువతులు పశ్చిమ మండలం డీసీపీ సుమతికి ఫిర్యాదు చేశారు. డీసీపీ ఆదేశాల మేరకు ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే..అమీర్‌పేట ధరంకరం రోడ్డులో ప్రకాష్ అనే వ్యక్తి జయశ్రీ ఆయుర్వేదిక్ స్పా (మసాజ్) సెంటర్ నిర్వహిస్తున్నాడు. బ్యూటీ పార్లర్లో పనిచేసేందుకు యువతులు కావాలని ఓఎల్ఎక్స్లో ప్రకటనలు ఇచ్చాడు. అందుకు ఆసక్తి చూపిన ఇద్దరు యువతులకు నెలకు రూ.18 వేలు వేతనం ఇస్తామని చెప్పి పనిలో పెట్టుకున్నాడు. వారితో క్రాస్ మసాజ్ చేయించి రూ. 500 మాత్రమే ఇచ్చేవాడు. దీనిపై నిలదీయగా తప్పుడు పనులు చేస్తే రోజుకు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు ఇస్తామని చెప్పాడు. అందుకు బాధితులు అంగీకరించకపోవడంతో గతంలో తీసిన ఫొటోలను మీ కుటుంబ సభ్యులకు పంపిస్తామని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు వాపోయారు. తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు డీసీపీకి ఫిర్యాదు చేశారు. తమ కుటుంబ పరిస్థితులు సరిగా లేనందునే ఉద్యోగం చేయాల్సి వచ్చిందని, అతడి బారి నుంచి తమకు విముక్తి కల్పించాలని కోరారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిర్వాహకుడు ప్రకాష్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు. పెళ్లి పేరుతో మోసం నిందితుడి అరెస్ట్ మల్కాజిగిరి: ఓ యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన వ్యక్తిని మల్కాజిగిరి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ మన్మోహన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాచారం, మల్లాపూర్‌కు చెందిన శ్రీపాద సాయినాథ్ ఉప్పల్‌లోని హెచ్‌పీసీఎల్ పెట్రోల్ పంపులో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. గండిపేట్‌లోని ఓ రిసార్ట్‌లో ఈవెంట్ మేనేజర్‌గా పని చేస్తున్న మల్కాజిగిరికి చెందిన యువతితో ఏడాది కిత్రం అతడికి పరిచయం ఏర్పడింది. ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమె కుటుంబ సభ్యులను కూడా పరిచయం చేసుకుని తరచూ ఇంటికి వచ్చి వెళ్లేవాడు. పెళ్లి చేసుకోవాలని బాధితురాలు ఒత్తిడి చేయడంతో గత కొన్ని రోజులుగా ఆమెను దూరం పెడుతున్నాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు సాయినాథ్ , అతని సోదరుడిని పిలిచి మాట్లాడగా, ఈ ఏడాది మార్చి నెలలో చేసుకుంటానని చెప్పాడు. అదే నెలలో సాయినాథ్ పుట్టినరోజు సందర్బంగా అతడి ఇంటికి వెళ్లిన బాధితురాలు అతను మరో యువతితో చనువుగా ఉండటాన్ని గుర్తించి సాయినాథ్‌ను నిలదీసింది. దీంతో సాయినాథ్, అతని సోదరులు ఆమెకు నచ్చజెప్పి పంపారు. ఆమె క్రెడిక్ కార్డు వాడుకొని డబ్బులు తిరిగి ఇవ్వకపోగా, ఆమె సెల్‌ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్ట్‌లో ఉంచడంతో బాధితురాలు అతడి ఆఫీసుకు వెళ్లి నిలదీయగా స్పందించలేదు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితురాలు ఈ నెల 21న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం నిందితుడు శ్రీపాద సాయినాథ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఎత్తుకు పైఎత్తు
అర్ధరాత్రి కావస్తున్నా కూతురు సునీత ఇంటికి రాకపోవడంతో డాక్టర్ శేఖర్ ఆందోళన చెందాడు. పేషెంట్లు ఎవరూ లేకపోవడంతో రాత్రి పది గంటలకే శేఖర్ తన నర్సింగ్ హోమ్ నుంచి ఇంటికొచ్చేశాడు. కానీ తొమ్మిదిన్నరకే రావాల్సిన సునీత ఇంతవరకు రాలేదు. ఆమె ఫోన్ కూడా స్విచాఫ్ అని వస్తోంది. సునీత తన ఫోన్‌ని ఎప్పుడూ స్విచాఫ్ చెయ్యదు. నగరంలో ఒక బ్యూటీ పార్లర్ నడిపే సునీత రోజూ తొమ్మిదిన్నరకల్లా ఇంటికి చేరుకుంటుంది. కానీ ఈ రోజు అర్ధరాత్రి కావస్తున్నా రాలేదు. శేఖర్ బ్యూటీ పార్లర్లో పనిచేసే వారికి కూడా ఫోన్లు చేశాడు. ఎప్పటిలాగే రాత్రి తొమ్మిదికి పార్లర్ మూసేశాక సునీత తన కారులో ఇంటికి వెళ్లిపోయిందని వారు చెప్పారు. కొంపదీసి సునీత కారు ప్రమాదానికి గురైందా అనే అనుమానంతో పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చెయ్యబోయాడు. అప్పుడే శేఖర్ సెల్ మోగింది. స్క్రీన్‌పై సునీత నంబర్ కనిపించగానే ఆత్రంగా ‘‘ఏమ్మా! ఎక్కడున్నావ్?’’ అని అడిగాడు. అవతల నుంచి సునీతకు బదులు ఇంకెవరో మాట్లాడారు.‘‘డాక్టర్ శేఖర్! మీ కూతురు ప్రస్తుతం మా బందీగా ఉంది. ఆమె ప్రాణాలతో దక్కాలంటే మీరు మేం చెప్పినట్లు చెయ్యాలి’’ అన్నాడు ఫోన్లో మాట్లాడిన వ్యక్తి కటువుగా.‘‘ఎవరు మీరు? మీకేం కావాలి? నా కూతుర్ని క్షేమంగా విడిచిపెట్టండి. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను’’ ఆందోళనగా అన్నాడు.‘‘మాకు డబ్బు అక్కర్లేదు. నువ్వు మాకొక చిన్న పని చేస్తే చాలు. మావాడికి భుజంలో బుల్లెట్ దిగింది. బుల్లెట్ బయటకు తీసి కట్టు కట్టాలి. ఆ పని ఇప్పుడే చెయ్యాలి. నీ వంటి సర్జన్కి ఇదొక పెద్ద పని కాదు. సర్జరీకి కావలసిన పరికరాలు తీసుకొని నువ్వు ఇప్పుడే కారులో నేరుగా గాంధీనగర్ వచ్చెయ్. ఆలోగా మేం నీకు మళ్లీ ఫోన్ చేస్తాం. ఈ విషయం పోలీసులకు చెప్పవంటే నీ కూతురు శవం కూడా నీకు దొరకదు’’ అంటూ ఫోన్ కట్ చేశాడా వ్యక్తి.డాక్టర్ శేఖర్ ఇంటి పక్కనే ఉన్న తన నర్సింగ్‌హోమ్ లోంచి సర్జరీకి కావలసిన పరికరాలు, మత్తుమందు, బ్యాండేజీ సామగ్రిని ఒక బ్యాగులో వేసుకుని కారులో బయల్దేరాడు. అతను గాంధీనగర్‌లోకి ప్రవేశించగానే ఫోన్ మోగింది. కిడ్నాపర్ మాట్లాడాడు. ‘నీ కారును రేమండ్ షోరూమ్ ముందు పార్క్ చేసి, దానికి ఎదురుగా ఉన్న సందులోకి నడుచుకుంటూ రా’’ అని ఆదేశించాడు.శేఖర్ అతను చెప్పినట్టే చేశాడు. ఫోన్లో సూచనల ద్వారా కిడ్నాపర్ శేఖర్ని నాలుగైదు సందులు తిప్పి, చివరకు నిర్మానుష్యంగా ఉన్న ఒక చీకటి ప్రదేశంలో ఆగమన్నాడు. అక్కడొక కారు నిలిపి ఉంది. కారు పక్కనే ఒక ముసుగు వ్యక్తి శేఖర్ చేతిలోని బ్యాగుతో పాటు అతని సెల్‌ఫోన్ కూడా తీసుకున్నాడు. సెల్‌ఫోన్ స్విచాఫ్ చేసి, బ్యాగును కారులో పెట్టాడు. తర్వాత శేఖర్ కళ్లకు గంతలు కట్టి కారు వెనుక సీట్లో కూర్చోబెట్టాడు. తాను డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. కారు వేగంగా ముందుకు ఉరికింది. పావుగంట ప్రయాణం తర్వాత ఒక చోట ఆగింది. ముసుగు వ్యక్తి శేఖర్ చెయ్యి పట్టుకొని కొంత దూరం తీసుకెళ్లాడు. గమ్యం చేరాక శేఖర్ కళ్లకు కట్టిన గంతలను తీసేశాడు. తానొక గదిలో ఉన్నానని గ్రహించాడు శేఖర్. గదిలోని మంచం మీద భుజానికి తూటా దెబ్బ తగిలిన వ్యక్తి ఉన్నాడు. అతని పక్కనే మరో వ్యక్తి ఉన్నాడు. వారిద్దరి ముఖాలకు కూడా ముసుగులు ఉన్నాయి. గాయపడ్డ వ్యక్తి బాధకు విలవిల్లాడుతున్నాడు. డాక్టర్ శేఖర్ వెంటనే పని మొదలుపెట్టాడు. గాయపడ్డ వ్యక్తికి మత్తుమందు ఇచ్చి అతని భుజంలో దిగిన తూటాను చాకచక్యంగా బయటకు తీశాడు. తర్వాత గాయానికి మందు రాసి, కుట్టు కుట్టి కట్టు కట్టాడు. తర్వాత పేపర్ మీద కొన్ని మందులు రాసిచ్చాడు. ‘‘తూటా చాలా లోపలకు దిగబడింది. పైగా చాలాసేపు లోపలే ఉండిపోవడం వల్ల అక్కడ ఇన్ఫెక్షన్ ఏర్పడింది. వెంటనే ఈ మాత్రలు వాడండి. వాడకపోతే ఇన్ఫెక్షన్ ఎక్కువై ప్రాణం మీదకు వస్తుంది. అందువల్ల నిర్లక్ష్యం చెయ్యవద్దు’’ అని ఆ ముసుగు వ్యక్తులతో చెప్పాడు.తర్వాత కిడ్నాపర్లు శేఖర్ని గాంధీనగర్ వరకు కళ్లకు గంతలతో తీసుకెళ్లారు. అక్కడ అతన్ని దించి, సెల్‌ఫోన్ ఇచ్చి వెళ్లిపోయారు. శేఖర్ కారులో ఇంటికి చేరుకున్నాడు. అప్పటికి వేకువ జాము నాలుగు గంటలైంది. తెలతెలవారుతుండగా సునీత ఇంటికి వచ్చింది. తనను ఎవరో దుండగులు కిడ్నాప్ చేసి, కళ్లకు గంతలు కట్టి ఎక్కడికో తీసుకెళ్లారని, రాత్రంతా ఒక గదిలో బంధించి కొద్దిసేపటి కిందటే విడిచిపెట్టారని చెప్పింది. శేఖర్ రాత్రి జరిగినదంతా కూతురికి చెప్పాడు.సునీత క్షేమంగా ఇంటికి తిరిగొచ్చింది గనుక ఇప్పుడు కిడ్నాపర్ల గురించి పోలీసులకు చెప్పడం ధర్మం అనుకున్నాడు శేఖర్. వెంటనే ఇన్స్పెక్టర్ విజయ్‌కుమార్‌కి ఫోన్ చేసి, జరిగినదంతా వివరంగా చెప్పాడు. అప్పుడు విజయ్ ఆ కిడ్నాపర్లు ఎవరో శేఖర్‌కి చెప్పాడు. ‘‘మీ అమ్మాయిని కిడ్నాప్ చేసిన ఈ దుర్మార్గులే నిన్న సాయంత్రం హైవేలో ఒక వజ్రాల వ్యాపారి కారును అటకాయించి, కోటి రూపాయల విలువైన వజ్రాలు దోచుకెళ్లారు. ఆ వ్యాపారి ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో దుండగుల్లో ఒకడు గాయపడ్డాడు. దుండగులు ఆ వజ్రాల వ్యాపారిని చంపి, తమ సహచరుణ్ణి కారులో ఎక్కించుకుని పరారయ్యారని మాకు తెలిసింది. వారు గాయపడ్డ తమ వ్యక్తిని నేరుగా ఆస్పత్రికి తీసుకెళితే పట్టుబడిపోతామనే భయంతో మీ కూతుర్ని కిడ్నాప్ చేసి, మీ ద్వారా అతనికి చికిత్స చేయించారని ఇప్పుడర్థమవుతోంది నాకు. నిన్న రాత్రి కిడ్నాపర్లు మిమ్మల్ని కారులో తీసుకెళ్లిన రూటును మీరు చెప్పగలిగితే మేం వారి స్థావరాన్ని కనుక్కొని వారిని అరెస్టు చేస్తాం’’ అన్నాడు విజయ్.‘‘సారీ ఇన్స్పెక్టర్. ఆ సమయంలో నా కళ్లకు గంతలు కట్టడం వల్ల నేనేమీ చూడలేకపోయాను. అయితే, వారి ఆచూకీ తెలుసుకోవడానికి నేనొక ట్రిక్కు ప్రయోగించాను. పేషెంటుకి ఇన్ఫెక్షన్ తగ్గడానికి నేను రాసిచ్చిన మాత్రలు నెహ్రూ రోడ్డులోని అపోలో ఫార్మసీ మెడికల్ షాపులో మాత్రమే దొరుకుతాయి. నగరంలో ఇంకెక్కడా ఆ మందుల స్టాక్ లేదు. ఒక డాక్టర్‌గా నాకీ విషయం బాగా తెలుసు. ఆ మెడికల్ షాపు రోజూ ఉదయం తొమ్మిది గంటల తర్వాత తెరుస్తారు. మీరు ఆ అంగడి వద్ద మాటు వేసి, ఆ మందుల చీటీ తెచ్చిన వ్యక్తిని పట్టుకుంటే చాలు మిగిలిన వారు కూడా దొరికిపోతారు’’ ధీమాగా చెప్పాడు శేఖర్.‘‘థాంక్యూ డాక్టర్. మా పోలీసుల బుర్ర కన్నా మీ బుర్రే తెలివైనది. ఆ మందుల పేర్లు చెప్పండి చాలు. ఆ దుర్మార్గుల్ని ఇట్టే పట్టుకుంటాను.’’ హుషారుగా అన్నాడు విజయ్ రాసుకున్నాడు.తర్వాత విజయ్ అపోలో ఫార్మసీ షాపు తెరవగానే షాపు ఓనరుతో మాట్లాడి తన సిబ్బందితో కలసి మఫ్టీలో షాపు బయట మాటు వేశాడు. ఊహించినట్టే కాసేపట్లో ఒక కిడ్నాపర్ శేఖర్ రాసిచ్చిన మందుల చీటీతో అంగడికి వచ్చాడు. షాపు ఓనర్ సైగ చెయ్యగానే విజయ్ ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాడు. తర్వాత అతని ద్వారా అతని సహచరులను కూడా అరెస్టు చేసి, వజ్రాలను స్వాధీనం చేసుకున్నాడు. - డి.మహబూబ్ బాషా -
మృతి కేసు మాఫీకి రూ.2.5 లక్షలు!
రేపల్లె: ఓ బ్యూటీపార్లర్‌లో చనిపోయిన యువతి మృతి కేసు మాఫీ కోసం టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఆమె మృతదేహం వద్దే వేలంపాట నిర్వహించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. గుంటూరు జిల్లా రేపల్లెలోని డూ అండ్ డై బ్యూటీపార్లర్‌లో తెలంగాణలోని యాదాద్రి జిల్లా రెడ్లరేపాలెంకు చెందిన జి.సిరి(19) అనే యువతి బుధవారం మృతిచెందిన సంగతి తెలిసిందే. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని.. ఆమె మరణంపై అనుమానాలున్నాయని సిరి తల్లిదండ్రులు చెబుతున్నా.. వారిని బెదిరిస్తూ.. కేసును మాఫీ చేసేందుకు వేలంపాట నిర్వహించారు. హైదరాబాద్‌లో ఉంటున్న సిరి బుధవారమే ఈ బ్యూటీపార్లర్‌లో ఉద్యోగంలో చేరింది. ఉరిపోసుకున్నట్లు చెబుతున్నా.. ఆమె గదిలోని దుస్తులన్నీ చెల్లాచెదురుగా పడి ఉండటం సందేహాలను రేకెత్తిస్తోంది. బ్యూటీపార్లర్‌లో జరుగుతున్న ‘వ్యవహారాలకు’ ఒప్పుకోకపోవడం లేదా బయటకు చెబుతానని బెదిరించడం వల్లే ఆమెను నిర్వాహకులే హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే తాను ప్రేమించిన యువకుడు మృతిచెందటంతో మనస్తాపానికి గురై.. యువతి ఉరి వేసుకుని మృతిచెందిందంటూ బ్యూటీపార్లర్ నిర్వాహకులు కొత్త కథనం తెరపైకి తీసుకొచ్చారు. ప్రేమ వ్యవహారమే మృతికి కారణం అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఇంత జరుగుతున్నా... బ్యూటీ పార్లర్ అసలు నిర్వాహకురాలి జాడలేకపోవడం గమనార్హం. కాంగ్రెస్ నేత సమక్షంలో.. కేసు మాఫీ కోసం బ్యూటీపార్లర్ నిర్వాహకుల స్థానంలో అంతా తానై ఓ కాంగ్రెస్ పార్టీ నేత రాజీ ప్రయత్నాలు చేశారు. సిరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందంటూ విలపిస్తున్న ఆమె తల్లిదండ్రులు ఉర్మిళ, యాదయ్యలను, బంధువులను బెదిరిస్తూ.. మృతదేహం ఉన్న గదిలోనే ఆమె మృతి కేసు మాఫీకి పాట నిర్వహించారు. నిర్వాహకుల తరఫున రూ.2.50 లక్షలకు మధ్యవర్తిత్వం చేశారు. అనంతరం సిరి తల్లిదండ్రులు, బంధువులను బయటకు పంపించారు. అలాగే టీడీపీ నియోజకవర్గ ముఖ్య ప్రతినిధి ఒకరు ఓ పోలీసు అధికారికి ఫోన్ చేసి కేసు మాఫీ చేయాలని సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇంత తంతు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించటంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ బ్యూటీపార్లర్ నిర్వాహకురాలి తండ్రి 2001లో పట్టణంలో జరిగిన ఆషా అనే యువతి హత్య కేసులో ప్రధాన నిందితుడు. హత్య కేసు అనంతరం వడ్రంగి పనిచేసే వ్యక్తి చిన్నచిన్నగా కలప వ్యాపారం ప్రారంభించి ప్రస్తుతం రూ. కోట్లలో వ్యాపారం చేస్తున్నాడు. బ్యూటీపార్లర్‌కు మహిళల కన్నా పురుషులే ఎక్కువగా వస్తున్నారని, రాత్రి సమయాల్లోనూ పురుషుల రాకపోకలు అధికంగా ఉంటాయని చుట్టుపక్కలవారు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. -
మసాజ్ పేరుతో యువతులతో వ్యాపారం
-
బ్యూటీపార్లర్ ముసుగులో వ్యభిచారం
చందానగర్: స్పా అండ్ బ్యూటీపార్లర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఎనిమిది మందిని చందానగర్ ఎస్ఓటీ పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. గంగారంలోని సన్‌షైన్ స్పా అండ్ బ్యూటీపార్లర్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడిలో నలుగురు యువకులు, నలుగురు యువతులు పట్టుపడ్డారు. వారి నుంచి రూ.15 వేల నగదు, 8 మొబైల్ ఫాన్లను స్వాధీనం చేసుకున్నారు. -
అవర్ హీరో
అవర్ హీరో సినిమాల్లో గాల్లోకి దూకి పదిమందిని ఒక్కవేటుతో వందమందిని ఒక్క ఊపుతో వెయ్యిమందిని ఒక్క ఫైటుతో చితక్కొట్టేసే హీరోలను చూశారు. మాకైతే ఈ హీరోయే నచ్చింది. గద్దలు తన్నుకుపోతున్నఇద్దరి బాల్యాన్నిసింగిల్ హ్యాండ్‌తో కాపాడింది!! షీ ఈజ్ అవర్ హీరో. మార్చి 4, 2018. ఆదివారం. ముంబైలోని వర్సోవా. ఎప్పటిలాగే తెల్లవారింది. ఉదయం పది గంటలు. అప్పుడే టీ తాగి బద్దకంగా అలా సోఫాలో కూర్చుండిపోయింది 27 ఏళ్ల ప్రీతి సూద్.. సెలవు తీరికను మనసారా ఆస్వాదించేందుకు. సెల్ ఫోన్ మోగింది. ‘‘అబ్బా.. మొదలైందా’’ అని విసుక్కుంటూ ఫోన్‌ను చేతులోకి తీసుకుంది. క్లోజ్ ఫ్రెండ్ నంబర్ అది. లిఫ్ట్ చేసింది. ‘‘హలో’’ అంది. అవతల నుంచి వినపడ్డ విషయంతో ప్రీతికి బద్దకం వదిలింది. గబగబా తయారై తన ఫ్లాట్‌కు దగ్గర్లో ఉన్న బ్యూటీపార్లర్‌కు పదిహేను నిమిషాల్లో చేరుకుంది. ‘‘మాటలు తిన్నగా రానియ్’’.. ప్రీతిని బెదిరించాడు ఆగంతకుడు. ఆ తీవ్రతకు బ్యూటీపార్లర్లోనిసిబ్బంది అదిరిపడ్డారు. ఆ ఇద్దరు చిన్న పిల్లలు కూడా బిక్కమొహం వేశారు. ఇంకోవైపు ప్రీతి ఫ్రెండ్ విమెన్ ప్రొటెక్షన్ సెల్‌కు పదే పదే ఫోన్ చేస్తోంది. టీమ్‌ను పంపిస్తాం అన్నారు కాని ఆ జాడే లేదు! పార్లర్లో ఇద్దరు బాలికలు! ఓ కస్టమర్లాగే లోపలికి వెళ్లింది. అక్కడ తన ఫ్రెండ్ ఉంది. ఆమె ఎవరో తెలియనట్టే నటిస్తూ ఆ పక్కనే ఉన్న ఇద్దరు అమ్మాయిల పక్కన కూర్చుంది. వాళ్ల వయసు ఏడూ పదకొండేళ్ల మధ్య ఉంటుంది. ‘‘క్యా హోనా మేడం?’’ అడిగింది పార్లర్లో అమ్మాయి. ‘‘క్లీనప్’’ చెప్పింది ప్రీతి. ‘‘థోడా టైమ్ లగేగా’’ ఆ పక్కనే ఉన్న ప్రీతి ఫ్రెండ్‌కు థ్రెడింగ్ చేయడానికి దారాన్ని పంటి కింద పెట్టుకుని సిద్ధమవుతూ చెప్పింది పార్లర్ అమ్మాయి. ‘‘కోయి బాత్ నహీ.. వెయిట్ కరూంగీ’’ అంది ప్రీతి తన ఫ్రెండ్ మొహం చూస్తూ. ఇద్దరూ అపరిచితుల్లా ఉండాలని కళ్లతోనే చెప్పుకున్నారు. ఆదివారం అవడంవల్ల పార్లర్లో వర్కర్స్ తక్కువగా ఉన్నారు. కస్టమర్స్ కూడా పెద్దగా లేరు. ప్రీతి, తన ఫ్రెండ్, ఆ ఇద్దరు అమ్మాయిలు. అంతే.అదే అనుకూలమైన సమయం అనుకొని ఆ పిల్లలిద్దరితో మాట్లాడ్డం మొదలుపెట్టింది ప్రీతి.‘‘పన్నెండేళ్లు కూడా లేవు.. దేనికోసం వచ్చారు మీరు?’’ అడిగింది. ‘‘మేకప్ కోసం’’ చెప్పారు పిల్లలు.‘‘ఏదైనా ఫంక్షనా?’’ అడిగింది. ‘‘పెళ్లి’’.. ‘‘అమెరికా వెళ్తున్నాం’’ ఇద్దరి నుంచి ఒకేసారి.. సంబంధం లేని జవాబులు వచ్చాయి. ఏదో అర్థమైంది ప్రీతికి. ‘‘ఎక్కడుంటారు మీరు?’’ ‘‘మాది గుజరాత్’’ చెప్పింది ఇద్దరిలోకి కాస్త పెద్దపిల్ల. ఇద్దరూ అమాయకంగా, వినయంగా ఉన్నారు. ‘‘మీ వెంట వచ్చినవాళ్లెవరు?’’.. మాటల్లేకుండా తన వెనక విజిటర్స్ లాంజ్‌లో కూర్చున్న వాళ్లవైపు బిగించిన పిడికిలిలోని బొటనవేలును చూపిస్తూ అడిగింది. ఆ పిల్లలిద్దరూ మొహాలు చూసుకుని మౌనంగా ఉండిపోయారు. అయితే తన ఫ్రెండ్ ఫోన్లో వ్యక్తం చేసిన అనుమానం నిజమేనన్నమాట. ప్రొటెక్షన్ టీమ్ కోసం నిరీక్షణ ఇంకేవో వివరాలు అడగడానికి ప్రయత్నించింది ప్రీతి. లాంజ్‌లో ఉన్న మగవాళ్లిద్దరూ అసహనంగా కదలసాగారు. గొంతు పెంచి‘‘ ఔర్ కిత్నా టైమ్ లగేగా? జల్దీ కరో... ఫంక్షన్కా టైమ్ హోరారాహై’’ అరిచాడు ఒకడు పార్లర్ అమ్మాయి మీదకు. ఈలోపు తన ఫ్రెండ్‌కు మెసేజ్ పెట్టింది ప్రీతి. ‘‘నేను వీళ్లను మాటల్లో పెడ్తా.. నువ్వు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌కు కాల్ చెయ్’’ అని. పిల్లల వైపు తిరిగి ఏదో అడగబోతుంటే ఆ ఇద్దరు మగవాళ్లు విసురుగా దగ్గరకొచ్చారు. ‘‘ఇందాకటి నుంచి చూస్తున్నా.. ఏంటీ ఆరాలు తీస్తున్నారు. మీకెందుకు వివరాలు?’’ అన్నాడు ఒక వ్యక్తి. ‘‘పిల్లలు కదా.. ముచ్చటనిపించి పలకరిస్తున్నా.. మీకెందుకు అంత ఉలుకు?’’అన్నది ప్రీతి. ‘‘మాటలు తిన్నగా రానియ్’’ ప్రీతిని బెదిరించాడు ఇంకో వ్యక్తి. ఆ తీవ్రతకు బ్యూటీపార్లర్‌లోని సిబ్బంది బెదిరారు. ఆ ఇద్దరు చిన్న పిల్లలు కూడా బిక్క మొహం వేశారు. ఇంకోవైపు ప్రీతి ఫ్రెండ్ విమెన్ ప్రొటెక్షన్ సెల్‌కు ఫోన్ చేస్తోంది. టీమ్‌ను పంపిస్తాం అన్నారు కాని ఆ జాడే లేదు. ఈలోపు ఆ ఇద్దరు వ్యక్తులు పిల్లలిద్దర్నీ తీసుకుని పార్లర్ బయటకు వెళ్లబోయారు. ప్రీతి అడ్డుకుంది. ‘‘ఈ పిల్లలు మీకేమవుతారు?’’ అంటూ. ‘‘నీకు చెప్పాల్సిన అవసరం లేదు’’ అని తోసి ముందుకెళ్లబోయారు. తూలిపడబోయిన ప్రీతి తమాయించుకుని, వాళ్లను వెళ్లనివ్వకుండా దారికి అడ్డంగా నిలబడింది. ఈ పిల్లలు మీకు సంబంధించిన వాళ్లే అయితే.. పదండి పోలీస్‌స్టేషన్‌కు వెళ్దాం. నాకెందుకో మీ మీద డౌట్‌గా ఉంది’’ అంది. ‘‘ఏం రుజువులు కావాలి? డీఎన్ఏనా?’’ అంటూ గారపట్టిన పళ్లను బయటపెడుతూ నవ్వాడు ఆ ఇద్దరిలో ఒకడు. ‘‘పోలీసులు అడుగుతారు ఏం వివరాలు కావాలో’’ అంటూ ఇంకోవైపు తన స్నేహితురాలికి సైగ చేసింది.. ఏౖమైంది? అంటూ. నో రెస్పాన్స్ అన్నట్టుగా ఆమె ప్రతిసైగతో ఆన్సర్ ఇచ్చింది, ఆందోళనగా. ట్రాఫికింగ్ నుంచి విముక్తి ‘‘పదండి దగ్గర్లో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు’’ అని ఇద్దరు మగవాళ్లతో అంటోంది ప్రీతి, ఇన్‌డైరెక్ట్‌గా తన ఫ్రెండ్‌కు పోలీస్‌కు ఫోన్ చెయ్ అనే హింట్ ఇస్తూ. వాళ్లను వెళ్లనివ్వకుండా కాలయాపన చేయడంలో భాగంగా వాళ్లతో సంభాషణ పొడిగిస్తోంది. ‘‘భయ్యా.. మీ పిల్లలే కావచ్చు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లడంలో తప్పు లేదుగా. ఒకవేళ మీ పిల్లలే అని తేలితే నేను క్షమాపణ కూడా చెప్తా. ఒక్కసారి పదండి’’ అని ప్రీతి బతిమాలుతుంటే బయట నుంచి ఇంకెవరో దారికి అడ్డంగా ఉన్న ప్రీతిని తోసేస్తూ ఆ పిల్లలిద్దరినీ తీసుకుని వెళ్లిపోయాడు. ఆ పరిణామానికి హతాశురాలైంది ప్రీతి. ‘‘పోలీసులకు ఫోన్ చెయ్’’ గట్టిగా అరిచింది తన స్నేహితురాలిని ఉద్దేశించి. మళ్లీ ఒకసారి ఫోన్ కలపబోతుంటే పోలీస్ వ్యాన్ వచ్చింది. అది చూసి పారిపోబోయారు ఆ ఇద్దరు మగవాళ్లు. వాళ్లను పట్టుకొమ్మని పోలీసులను వారించింది ప్రీతి.పట్టుకున్నారు. ప్రీతి స్నేహితురాలు అనుకున్నట్టుగానే ఆ ఇద్దరు చిన్నపిల్లలిద్దరినీ ట్రాఫికింగ్ చేయబోతున్నారు. పిల్లలను తీసుకుని వెళ్లిపోయిన వ్యక్తిని దాదాపు 45 నిమిషాలు చేజ్ చేసి పట్టుకున్నారు పోలీసులు. ఆ పిల్లల్లో పెద్దమ్మాయి వయసు పదకొండేళ్లు. చిన్నమ్మాయి వయసు ఏడేళ్లు. ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. వాళ్లు చెప్పినట్టుగానే.. గుజరాత్ నుంచి వచ్చారు. ఆడపిల్లలని వాళ్ల అమ్మానాన్న ఆ పిల్లలను లక్షరూపాయలకు అమ్మేశారు. వీళ్లు ఇంకో లక్షకు ఈ పిల్లలను ఇంకో వ్యక్తికి అమ్మేశారు. ఆ కొన్న అతను ఆ రాత్రి ఈ పిల్లలను అమెరికా తీసుకెళ్లబోతున్నాడు. ప్రీతి అడ్డు పడటంతో వీళ్ల ప్రయత్నాలు ఫలించలేదు. నాకెందుకులే అని ఊరుకోకండి ఇంతగా ధైర్యసాహసాలు కనబర్చిన ప్రీతీ సూద్.. సినిమా, టెలివిజన్ నటి. ఆమె చొరవతో ఆ పిల్లల కథ సుఖాంతం అయింది. ‘‘తర్వాత ఈ విషయం తెలిసి మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్.. అందరూ తిట్టారు. ముంబైలో ఒంటరిగా ఉంటున్నావ్. ఇలాంటి పనులెందుకు నీకు? అలాంటి వాళ్లకు ముఠా ఉంటుంది. నీ మీద దాడి చేస్తే? అని భయపడ్డారు. ఒక్క క్షణం భయమేసినా.. పర్వాలేదు అనుకున్నా. నేను మాత్రమే బాగుండాలి అని అనుకోవడంలేదు. నా చుట్టూ ఉన్న అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నా. ముఖ్యంగా అమ్మాయిల రక్షణ కావాలి. కళ్ల ముందు అన్యాయం జరుగుతుంటే నాకెందుకులే అని ఊరుకోవడం నాకు చేతకాదు. అడ్డుకుంటే వాళ్లు రేప్పొద్దున నన్నేమైనా చేస్తారని భయపడ్డం మరింత అన్యాయం. అందుకే భయపడకుండా కళ్లముందు ఇలాంటి అనుమానాస్పద సంఘటనలు ఏవి ఎదురైనా వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేయండి. ఆడపిల్లలను రక్షించండి’’ అని అంటోంది ప్రీతి సూద్. – శరాది -
ఫోన్లో మహిళలను వేధిస్తున్న వ్యక్తి అరెస్టు
►200 మందికి పైగా ‘కాల్స్’ ► బాధితుల్లో బ్యూటీషియన్లు, ► డాక్టర్లు,లేడీ టైలర్లు చిలకలూరిపేటటౌన్: మహిళల సెల్ఫోన్లకు ఫోన్ చేసి అసభ్యపదజాలంతో వేధిస్తూ మెసేజ్‌లు పెడుతున్న వ్యక్తిని పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నూతన మోడల్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ సీఐ బి.సురేష్‌బాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలో బ్యూటీపార్లర్ నిర్వహిస్తున్న ఓ మహిళ ఈ నెల 17వ తేదీన తనకు ఓ వ్యక్తి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడడంతో పాటు అసభ్యకరమైన మెసేజ్‌లు పెడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటికే పలువురు మహిళల నుంచి ఇదే రకమైన మౌఖిక ఫిర్యాదులు అందుకున్న పోలీసులు ఈ విషయాన్ని సవాలుగా తీసుకొని దర్యాప్తు చేపట్టారు. వారి విచారణలో నిందితుడి ఆచూకీ తెలిసింది. రేపల్లెకు చెందిన కౌతరపు చిరంజీవిరావు అనే వ్యక్తి ప్రస్తుతం నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని ఓ స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తూ అదే క్వార్టర్సలో నివాసం ఉంటున్నాడు. తనకు దొరికిన ఓ సిమ్‌కార్డుతో పాటు ఐడీ ప్రూఫ్‌లు సమర్పించని మరో సిమ్‌కార్డును ఉపయోగిస్తూ మహిళలకు ఫోన్లు, మెసేజ్‌లు పంపసాగాడు. బ్యూటీపార్లర్ల బోర్డులపై, ఆసుపత్రి బోర్డులు, లేడీటైలర్ల బోర్డులపై ఉన్న సెల్ ఫోన్ నంబర్లను సేకరించి స్థానిక మహిళలతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన మహిళలను వేధించసాగాడు. పోలీసు విచారణలో ఇతను సుమారు 200 మంది మహిళలను వేధించినట్లు బయటపడింది. రెండు నంబర్ల ద్వారా కేవలం మహిళలకు మాత్రమే ఫోన్ చేస్తూ ఇతరులకు ఆ నంబర్ల ద్వారా ఫోన్ చేయకుండా జాగ్రత్త పడేవాడు. పోలీసులు బాధిత మహిళలతో ట్రాపింగ్ చేసి నిందితుడిని పట్టుకున్నట్లు సమాచారం. నిందితుడిని పట్టుకొన్న ఎస్ఐ ఎం.ఉమామహేశ్వరరావుతో పాటు సిబ్బంది ఎస్. షాబుద్దీన్, బి.రమేష్‌లకు సీఐ అభినందనలు తెలియజేశారు. ఎస్పీ పంపిన క్యాష్ రివార్డును ఇద్దరు సిబ్బందికి అందజేశారు. నిందితుడిని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. సమావేశంలో పట్టణ ఎస్ఐలు షేక్ నఫీస్బాషా, పి కోటేశ్వరరావు, ఎం.ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలి ఎవరైనా మహిళలకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడినా, మెసేజ్‌లు పంపినా, ఫేస్బుక్, వాట్సప్ ద్వారా వేధించినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సురేష్‌బాబు తెలిపారు. ఫిర్యాదు చేసిన మహిళల వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. -
బ్యూటీ పార్లర్లో వ్యభిచారం
బంజారాహిల్స్ (హైదరాబాద్): బ్యూటీ పార్లర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మాదాపూర్‌కు చెందిన కోట సంపత్‌కుమార్(36) వనస్థలిపురంకు చెందిన మరో మహిళ (30) బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఎమ్మెల్యేకాలనీ సమీపంలో లోటస్ ఫ్యామిలీ సెలూన్ పేరుతో కొంత కాలంగా బ్యూటీ పార్లర్ నడిపిస్తున్నారు. కాసులకు కక్కుర్తిపడ్డ వీరిద్దరూ ఎన్బీటీ నగర్‌కు చెందిన రఘు అనే బ్రోకర్‌తో పరిచయం పెంచుకొని సెలూన్లో పనిచేసే యువతులను వ్యభిచారం కూపంలోకి దింపారు. పార్లర్లో వ్యభిచారం చేయిస్తున్నారని సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు శనివారం రాత్రి సిబ్బందితో కలిసి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించడంతో గుట్టురట్టయింది. వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకొని పునరావాస కేంద్రానికి తరలించారు. నిర్వాహకులను, బ్రోకర్‌ను ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
ముఖానికి ఆవిరి ఎంత సేపు?
బ్యూటిప్స్ బ్యూటీపార్లర్లలో ఫేసియల్ చేసేటప్పుడు ముఖానికి ఆవిరిపట్టడం (స్టీమ్) చూస్తుంటాం. అయితే ఆవిరి ఎంత సమయం పట్టాలి? ఎలా పట్టాలి? అసలు ఆవిరిపట్టడం వల్ల ఉపయోగాలేమిటో ముందు తెలుసుకుంటే మనకు ఉన్న సందేహాలన్నీ తొలగిపోతాయి. మరీ ముఖచర్మానికి దగ్గరగా ఆవిరి వేడి తగలకూడదు. షవర్ బాత్ చేసేటప్పుడు నీరు ఎంత దూరం నుంచి పడుతున్నాయో అంత దూరం నుంచి ఆవిరి చర్మానికి తగలాలి. లేదంటే చర్మం తన సహజత్వాన్ని కోల్పోవడానికి ఆవిరి ప్రధాన కారణం అవుతుంది.ఐదు నిమిషాలకు మించి ఆవిరి పట్టకూడదు. అన్ని చర్మతత్వాలూ ఒకేలా ఉండవు. అందుకని అందరికీ ఒకేవిధంగా ఆవిరిపట్టడం సరైన విధానం కాదు. దీని వల్ల చర్మంలోని పోర్స్ తెరుచుకుని, సహజసిద్ధంగా నూనె స్రవించే గ్రంథులు పొడిబారుతాయి. దీనివల్ల చర్మం త్వరగా ముడతలు రావడానికి ఆస్కారం అవుతుంది. ఆవిరి పట్టిన తర్వాత క్లెన్సర్‌తో ముఖాన్ని ఒకసారి శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల పోర్స్‌లో ఉన్న మలినాలు తొలగిపోతాయి. తర్వాత... పొడిగా ఉన్న మెత్తని టవల్‌తో ముఖాన్ని తుడుచుకోవాలి. ఆవిరిపట్టిన తర్వాత కొంతమంది చర్మం మరీ పొడిబారినట్టుగా అనిపిస్తుంది. అందుకని ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ వాడాలి. ఆవిరిపట్టడం అనేది సున్నితమైన ప్రక్రియ. ముందుగా చర్మతత్వాన్ని తెలుసుకుని, దానికి తగిన విధంగా ట్రీట్మెంట్ ఇచ్చే నిపుణుల చేతనే ఫేసియల్ చేయించుకోవడం, స్టీమ్ పట్టడం మేలు. -
బ్యూటీపార్లర్ ముసుగులో వ్యభిచారం
సీతంపేట: బ్యూటీపార్లర్ ముసుగులో వ్యభిచా రం నిర్వహిస్తున్న పార్లర్ నిర్వాహకురాలు, వి టుడు, ఆనందపురం మాజీ ఎంపీపీ కోరాడ రా జబాబు పోలీసులకు పట్టుబడ్డారు. ద్వారకా పో లీస్‌స్టేషన్ సీఐ పి.వి.వి.నర సింహారావు తెలిపిన వివరాల ప్రకారం సీతమ్మధార టీపీటీ కాలనీలో ఓ మహిళ ఫ్లోరా పేరుతో బ్యూటీపార్లర్ నిర్వహిస్తోంది. వ్యభిచారం జరుగుతోందన్న స్థానికుల సమాచారంతో సీఐ నరసింహారావు, ఎస్ఐ భా స్కర్ సిబ్బందితో కలసి పార్లర్‌పై దాడి చేశారు. పార్లర్ కింద గ్రిల్స్ లాక్ చేసి ఉండటంతో పోలీ సులు గ్రిల్స్ ఎక్కి పార్లర్‌లోకి వెళ్లారు. పోలీసులను చూసి పారిపోతున్న నిర్వాహకురాలు, మరో ముగ్గురు మహిళా సిబ్బంది, విటుడు కోరాడ రాజబాబును అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.2,040ల నగదు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పార్లర్లో మూడు గదులు ఉండగా, కేవలం ఒక్క గదిలో మాత్రమే ఎక్విప్మెంట్ ఉంది. మిగతా రెండు గదుల్లో నేలపై పరుపులు వేసి ఉన్నాయి. పార్లర్ నిర్వహణకు అనుమతులు, పనిచేస్తున్న సిబ్బందికి గుర్తింపు లేదని పోలీసుల విచారణలో బయటపడింది. -
బ్యూటీపార్లర్‌కు వెళితే ముఖం కాల్చేశారు!
♦ ఫేషియల్ చేయడంతో ముఖంపై కాలిన మచ్చలు ఏర్పడ్డ వైనం ♦ జీజీహెచ్ వైద్యులను ఆశ్రయించిన బాధిత మహిళ ♦ నాలుగు నెలలపాటు ముఖానికి ఎండ తగలకూడదన్న వైద్యులు ♦ జూన్‌లో జరగాల్సిన కుమార్తె వివాహం వాయిదా సాక్షి, గుంటూరు : అందానికి మెరుగులు దిద్దుకునేందుకు బ్యూటీ పార్లర్లో ఫేషియల్ చేయించుకోవడానికి వెళితే అది కాస్తా వికటించి ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడ్డాయి. వెలుగును సైతం చూడలేని పరిస్థితి దాపురించింది. చివరకు ఈ నెలలో జరగాల్సిన కుమార్తె వివాహాన్ని సైతం వాయిదా వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. బాధితురాలు, ఆమె భర్త విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు నగరంలోని గౌతమినగర్ 4వలైనులో నివాసం ఉంటున్న ఓ వివాహిత మహిళ కుటుంబంతో కలిసి ముస్సోరి యాత్రకు వెళ్లే సందర్భంలో గతనెల 13వ తేదీన అదే ప్రాంతంలో ఉన్న ఓ బ్యూటీపార్లర్‌కు వెళ్లి ఫ్రూట్ ఫేషియల్ చేయమని కోరగా గోల్డ్ ఫేషియల్ అయితే బాగుంటుందని నిర్వాహకురాలు చెప్పింది. అయితే ఫేషియల్ చేస్తున్న క్రమంలో ముఖమంతా మంటగా ఉందని చెప్పినా మొదట్లో అలాగే ఉంటుందని, తరువాత తగ్గిపోతుందని చెప్పి ఫేషియల్ చేసి స్టీమ్ పెట్టి రూ. 400 చార్జి చేసింది. ఆ మరుసటి రోజుకు కూడా మంట తగ్గకపోగా మొఖంలో తేడా గమనించి బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలికి చెప్పగా, ఆమె ఏదో మాయిశ్చరైజర్ వాడితే తగ్గిపోతుందని చెప్పింది. మరుసటిరోజు ముస్సోరికి బయలుదేరి హైదరాబాద్ వెళ్లేసరికి మహిళ ముఖం మరింత నల్లగా మారడం గమనించిన భర్త ఆమె ముఖాన్ని ఫొటో తీసి వాట్సాప్ ద్వారా బ్యూటీ పార్లర్ నిర్వాహకులకు మెసేజ్ చేశారు. నిర్వాహకురాలు విషయాన్ని ఓ చర్మవ్యాధుల వైద్యునికి చెప్పి ఆయన ఇచ్చిన ప్రిక్సిప్షన్ను తిరిగి వాట్సాప్‌లో పెట్టారు. ముస్సోరి పర్యటన ముగించుకుని గుంటూరుకు వచ్చిన బాధితురాలు మరో వైద్యుడిని కలిసి తన ముఖాన్ని చూపించగా, ఆయన వైద్యం మొదలు పెట్టడంతోపాటు, వేడి, ధూళి, ఎండ పడకుండా ముఖానికి గుడ్డకట్టుకుని నాలుగు నెలలపాటు ఉండాలని చెప్పారు. ఈ విషయాన్ని బ్యూటీపార్లర్ నిర్వాహకురాలికి తెలియజేయగా, ఆమె తన తప్పేమీ లేదన్నట్టు మాట్లాడింది. బాధితురాలు బుధవారం జీజీహెచ్‌లో చర్మ వ్యాధి నిపుణురాలు డాక్టర్ నాగేశ్వరమ్మను చికిత్స నిమిత్తం కలిశారు. అక్కడ విలేకరులకు తన ఆవేదన తెలియజేశారు. బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు చేసిన తప్పుకు తాను శారీరకంగా, మానసికంగా, ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నానని బాధిత మహిళ వాపోయారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. తన మాదిరిగా మరే మహిళకు ఇలాంటి పరిస్థితి రాకుండా బ్యూటీ పార్లర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. విచ్చిలవిడిగా బ్యూటీ పార్లర్లు గుంటూరు నగరంలో బ్యూటీ పార్లర్లు విచ్చలవిడిగా సాగుతున్నాయి. వీటిపై ఏ శాఖకు స్పష్టమైన నియంత్రణ లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్లాస్టిక్ సర్జరీ, కాస్మోటిక్ వంటి వాటిపై తమకు నియంత్రణ ఉందే తప్ప, బ్యూటీ పార్లర్‌పై నియంత్రణ లేదని, ఈ విషయాన్ని కలెక్టర్‌కు విన్నవించి వీటిపై ఫిర్యాదు చేస్తామని డీఎంహెచ్ఓ డాక్టర్ పద్మజారాణి తెలిపారు. -
కన్నకూతుర్నే అతికిరాతకంగా హతమార్చింది
ఆస్తి తగదాలే కారణం చిన్నకూతుళ్లతో కలిసి దారుణం బంజారాహిల్స్: పేగు బంధాన్ని మరిచిన తల్లి ఆస్తి కోసం కన్నకూతుర్నే అతికిరాతకంగా పొడిచి చంపింది. ఇందుకు ఆమె చిన్నకూతుర్ల సహాయం తీసుకోవడం గమనార్హం. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... యూసఫ్‌గూడ సమీపంలోని ఎల్‌ఎన్‌నగర్‌లో నివసించే శ్వేత కళ్యాణి(29) శ్రీకృష్ణానగర్‌లోని బ్యూటీపార్లర్‌లో పని చేస్తోంది. ఆమె తల్లి సిద్ధాంతం సాయిలక్ష్మి (45), చెల్లెల్లు దివ్యజ్యోతి (25), విజయలక్ష్మి(21)లు వెంకటగిరిలో ఉంటున్నారు. అందరూ కలిసి ఎల్‌ఎన్‌నగర్‌లో ఐదేళ్ల క్రితం ఓ ఇంటిని కొనుగోలు చేశారు. అయితే ఆ ఇంటిని కళ్యాణి ఒక్కతే అ నుభవిస్తూ తమకు అద్దె కూడా రాకుండా చేస్తోందని తల్లి, సోదరులు కొన్నేళ్లుగా ఘర్షణ పడుతున్నారు. ఇదిలా ఉండగా.. తల్లి సాయిలక్ష్మి తనతో వ్యభిచా రం చేయిస్తోందని కళ్యాణి గతంలో కేసు పెట్టగా పోలీసులు తల్లిని రిమాండ్‌కు తరలించారు. సాయిలక్ష్మి మూడేళ్లు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చింది. అప్పటి నుంచి కళ్యాణితో తల్లి, సోదరులు తరచూ ఘర్షణకు దిగుతున్నారు. ఆస్తి తగదాతో పాటు జైలుకు పంపిందనే కక్షతో రగిలిపోతున్న తల్లి సాయిలక్ష్మి, చెల్లెళ్లు దివ్యజ్యోతి, విజయలక్ష్మి శుక్రవారం ఉదయం ఎల్ఎన్నగర్లోని తన ఇంటి నుం చి స్కూటీపై బయటకు వెళ్తున్న కళ్యాణిపై ఒక్కసారిగా దాడి చేశారు. తమతో పాటు తెచ్చుకున్న కత్తి తో తల్లి సాయిలక్ష్మి.. కళ్యాణిపై విచక్షణారహితంగా దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన కళ్యాణి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులు ముగ్గురినీ అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేపట్టారు. -
బ్యూటీఫుల్ కోర్సు
భూదాన్‌పోచంపల్లి :నేడు యువతులు, విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగస్తులు, మహిళలు ఎవరైనా సరే మేకప్ లేకుండా ఏ శుభకార్యానికి రావడంలేదంటే అతిశయోక్తి కాదు. తమ అందాలను మరింత ద్విగుణీకృతం చేసుకోవడానికి మేకప్ సర్వసాధారణమైంది. దీంతో మారుమూల గ్రామాల్లో సైతం బ్యూటీపార్లర్లు వెలుస్తున్నాయి. స్వయం ఉపాధి కల్పిస్తున్న బ్యూటీషియన్ కోర్సుకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని జలాల్పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ(ఎస్ఆర్టీఆర్ఐ) ‘కాస్మటాలజీ అండ్ బ్యూటీషియన్’ కోర్సులో నిరుద్యోగ విద్యార్థినులు, యువతులకు ఉచితంగా శిక్షణ ఇస్తోంది. నేర్పించే అంశాలు... బ్యూటీషియన్ కోర్సులో ముఖ్యంగా ఫేసిషియల్, మేకప్, థ్రెడ్డింగ్, బ్లీచింగ్, మసాజ్, హెయిర్ డై, హెయిర్ కటింగ్, వాక్సింగ్, మెహందీ డిజైన్స్, పార్టీ అండ్ పెండ్లికుమార్తె మేకప్ తదితర అంశాలలో శిక్షణ ఇస్తున్నారు. ఉదయం థియరీ క్లాసులు, మధ్యాహ్నం ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. కాగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏ రోజుకు ఆ రోజు నోట్స్ రాయిస్తున్నారు. అందరికి అర్థమయ్యేలా సరళమైన విధానంలో బోధిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి.. ఎస్ఆర్టీఆర్ఐ జాతీయ సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమల సంస్థ సౌజన్యంతో నెల రోజుల కాలవ్యవధి గల ఈ కోర్సులో ఉచితంగా శిక్షణ ఇస్తోంది. టెన్త్ పాస్ లేదా ఫెయిల్ కనీస విద్యార్హత కల్గిన వారికి అవకాశం కల్పిస్తున్నారు. ప్ర స్తుతం మన జిల్లా నుంచే కాకుండా రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన 25 మంది విద్యార్థినులకు మొదటి సారిగా ఈ కోర్సులో శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే వారం రోజుల శిక్షణ పూర్తి చేసుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇక్క డ హాస్టల్ వసతి కూడా కల్పిస్తున్నారు. స్వయం ఉపాధికి ఢోకాలేదు బ్యూటీషియన్ కోర్సు పూర్తి చేసిన వారికి స్వయం ఉపాధికి ఢోకా లేదు. ఉన్న ఊర్లోనే తక్కువ పెట్టుబడితో సొంతంగా బ్యూటీపార్లర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా ఎస్ఆర్టీఆర్ఐ సంస్థ కూడా హైదరాబాద్ వంటి నగరాల్లో పేరుగాంచిన పెద్ద పెద్ద బ్యూటీపార్లర్లలో బ్యూటీషియన్‌గా ప్లేస్మెంట్ అవకాశం కల్పిం చేందుకు చర్యలు చేపట్టారు. జాబ్ కంటే ఈ కోర్సు బెటర్ ఎస్సెస్సీ వరకు చదువుకున్నా. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని బ్యూటీషియన్ కోర్సును నేర్చుకొంటున్నా. నేర్చుకొన్న తరువాత ఇంట్లోనే స్వయం ఉపాధి పొందవచ్చు. ఎక్కడో జాబ్ చేసేకంటే ఈ కోర్సు నేర్చుకొంటే బెటర్. ఇక్కడ ఉచిత హాస్టల్ వసతి కూడా కల్పించారు. -పి.విజయలలిత, సూర్యాపేట ఇంట్లో ప్రాక్టిస్ చేస్తున్నా.. ఇంటర్ పూర్తి చేసిన తరువాత మా ఇంట్లో చదువు మాన్పించారు. గతంలో ఇదే సంస్థలో ఎంఎస్ ఆఫీస్ కంప్యూటర్ కోర్సు నేర్చుకొన్నాను. నాకు బ్యూటీషియన్ కోర్సు అంటే చాలా ఇష్టం. అందుకే ఈ కోర్సును ఇష్టంతో నేర్చుకొంటున్నాను. ఇక్కడ నేర్చుకొన్న అంశాలను మా ఇంటి వద్ద ప్రాక్టిస్ చేస్తున్నా. - బిల్లబాలమణి, పోచంపల్లి ఉచితంగా నేర్పిస్తున్నాం మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని నిమిస్మే సంస్థ సౌజన్యంతో మొదటిసారిగా బ్యూటీషియన్ కోర్సును ప్రవేశపెట్టి ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం. ఎస్సెస్సీ పాస్ లేదా ఫెయిల్ కనీస విద్యార్హతగా నిర్ణయించాం. 25 మందికి బ్యాచ్ చొప్పున శిక్షణ ఇస్తున్నాం. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తున్నాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే మా సంస్థ ముఖ్య ఉద్దేశం. -డాక్టర్ ఎన్.కిషోర్‌రెడ్డి, ఇన్చార్జ్ డెరైక్టర్, ఎస్ఆర్టీఆర్ఐ మార్కెట్లో డిమాండ్ ఉంది బ్యూటీషియన్ కోర్సుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సొం తంగా షాపు పెట్టుకొని స్వయం ఉపాధి పొందవచ్చు. కోర్సులో బేసిక్స్ నేర్పిస్తున్నాం. నేర్చుకున్నది మరిచిపోకుండా నోట్స్ కూడా రాయిస్తున్నాం. చాలా మంది ఈ కోర్సును నేర్చుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. -గీత, ఇన్స్ట్రక్టర్ -
‘నెట్’లో నీలి చిత్రాలు పెడతామని బెదిరింపులు
ఐదుగురు బీటెక్ విద్యార్థులు, డ్రైవర్ అరెస్టు బోడుప్పల్: తమకు డబ్బు ఇవ్వాలని, లేకపోతే నగ్న వీడియో చిత్రాలను ఇంటర్నెట్లో పెడతామని యువతిని బెదిరించిన ఆరుగురిని శుక్రవారం మేడిపల్లి పోలీ సులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నింది తుల్లో ఐదుగురు విద్యార్థులు, ఒక కారు డ్రైవర్ ఉన్నా డు. ఎస్ఐ టంగుటూరి శ్రీను కథనం ప్రకారం... నగరంలోని హైదర్‌గూడకు చెందిన దుగ్గిరాల గౌతం (19) బీటెక్ చదువుతున్నాడు. కాలేజీ ఫీజు కట్టేందు కు తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బును జల్సాలకు వాడుకున్నాడు. ఫీజు కట్టేందుకు ఏదో విధంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో రాజేం దర్ అనే కారు డ్రైవర్‌తో పాటు మరో నలుగురు బీటె క్ విద్యార్థులు రోహిత్(19), అనరుద్(19), సందీప్(19) ప్రేంచంద్(19)లతో కలిసి ముఠా కట్టాడు. మే డిపల్లికి చెందిన మహిళ (35) బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. ముఠాలోని అనురుధ్ ఆమెకు ఫోన్ చేసి.. ‘మీ నగ్న చిత్రాలు మావద్ద ఉన్నాయి. మాకు రూ.1.20 ల క్షలు ఇవ్వండి. లేకపోతే వాటిని ఇంటర్నెట్లో పెట్టేస్తాం. మీ భర్తకు పంపడంతో పాటు అందరి సెల్ఫోన్లకు పంపిస్తాం’ అని బెదిరించాడు. బాధితురాలు మేడిపల్లి పోలీ సులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులు గౌతం, రోహిత్, అనరుథ్, సందీప్, ప్రేంచంద్ డ్రైవర్ రాజేందర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
ప్యారా.. తిరంగా!
ఇండిపెండెన్స్ డే ఫీవర్.. సిటీని ఊపేస్తోంది. రెస్టారెంట్లు, బ్యూటీ పార్లర్లు.. ఫ్యాషన్, ట్రెడిషన్.. ఎక్కడ చూసినా యువ‘తిరంగా’లు ఎగసిపడుతున్నాయి. యువతని ఆకట్టుకునేందుకు ఈ-కామర్స్ వెబ్సైట్లు సహా వ్యాపార సంస్థలన్నీ మువ్వన్నెల ముస్తాబుతో కనువిందు చేస్తున్నాయి. పంద్రాగస్టున కళ్లు చెదిరేలా మువ్వన్నెలతో కనిపించి దేశభక్తిని చాటుకొనేందుకు యువత సన్నద్ధమవుతోంది. వస్త్రధారణలో, అలంకరణలో.. ఆఖరుకు ఆహారంలోనూ అణువణువునా దేశభక్తి ప్రతిఫలించేలా వ్యాపార సంస్థలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. తమ సృజనాత్మకతకు పదునుపెట్టుకుని ముందుకొచ్చాయి. ముఖ్యంగా ఈ-కామర్స్ వెబ్సైట్లు యువతను ఆకట్టుకోవడంలో ముందంజలో ఉంటున్నాయి. ఈ-ప్రపంచం.. త్రివర్ణభరితం వోయ్లా డాట్ కామ్, షాప్‌క్లూస్ డాట్ కామ్, స్నాప్‌డీల్ డాట్ కామ్ వంటి పలు ఈ-కామర్స్ వెబ్సైట్లు కొద్దిరోజులుగా త్రివర్ణభరితంగా మారాయి. ఆన్లైన్ స్టోర్స్‌లో అందుబాటు ధరల్లో ‘తిరంగా’ జుయెలరీ కలెక్షన్‌ను అందిస్తున్నాయి. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లోని రంగు రాళ్లు, పూసలు వంటి వాటితో ఈ ఆభరణాలను రూపొందించాయి. అలాగే కాటన్‌తో తయారు చేసిన జాతీయ పతాకం సహా దేశభక్తిని ప్రతిబింబించేలా రూపొందించిన ఫ్యాషన్ వస్తువులను విక్రయిస్తున్నాయి. మువ్వన్నెల ఫ్యాషన్ సందడి స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్యాషన్ బ్రాండ్స్ సరికొత్తగా రూపొందించిన దుస్తులు, యాక్సెసరీస్‌తో ముందుకొస్తున్నాయి. సంప్రదాయబద్ధంగా కనిపించే కుర్తాలు, మూడురంగుల స్టోల్స్, సల్వార్ కమీజ్‌లు, టీ-షర్టులు అందిస్తున్నాయి. అన్ని వర్గాల వారికీ, అన్ని వయసుల వారికీ అందుబాటులో పలు ఫ్యాషన్ వస్తువులను ముందుకు తెస్తున్నాయి. యువతులైతే జెండా డిజైన్‌లో నెయిల్ ఆర్ట్, కనురెప్పల మేకప్, మువ్వన్నెల కేశాలంకరణ వంటివి చేయించుకుంటూ దేశభక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇవే కాకుండా హ్యాండ్‌బ్యాగ్స్, గాజులు, గొలుసులు వంటి యాక్సెసరీస్ సైతం ‘తిరంగా’ డిజైన్లలోనే ఎంపిక చేసుకుంటున్నారు. మూడు రంగుల్లో ముచ్చటైన రుచులు రెస్టారెంట్లు సైతం మూడు రంగుల వంటకాలను ముచ్చటైన రుచుల్లో అందిస్తున్నాయి. చీజ్ కేక్స్, చాక్లెట్ బ్రౌనీస్, హరా కబాబ్స్, ఆచారి పనీర్ టిక్కా వంటి ప్రత్యేక వంటకాలతో దేశభక్తిని చాటకుంటూనే, భోజనప్రియులనూ అలరిస్తున్నాయి. - శిరీష చల్లపల్లి -
ముత్యాల ఫేసియల్...
ముఖ నిగారింపు కోసం బ్యూటీపార్లర్‌కి వెళితే ఫ్రూట్, పెర్ల్, గోల్డ్, డైమండ్... ఫేసియల్స్ అంటూ ఓ జాబితా ముందుంచుతారు. ఏ ఫేసియల్‌కు ఎంత ఖర్చు అవుతుందో రాసుంటుంది. చర్మతత్త్వానికి ఏ ఫేసియల్ నప్పుతుందో తెలియకపోయినా ఖర్చును బట్టి నిగారింపు వస్తుంది అని ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. అలా కాకుండా చర్మతత్త్వానికి తగ్గ ఫేసియల్ ఎంచుకోవాలంటే... నిపుణుల సలహా తీసుకోవాలి. పెర్ల్ ఫేసియల్: ముత్యాల పొడిని ఈ తరహా ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. ముత్యాల పొడిలో ఉండే సుగుణాలు చర్మం పైభాగంలో ఉండే మెలనిన్‌ను ప్రభావితం చేస్తాయి. ఫలితంగా ఎండ వల్ల దెబ్బతిన్న చర్మం (ట్యాన్) సాధారణ స్థితికి వస్తుంది. అంతేకాదు ముత్యాలలో బలమైన పోషకాలు, అమినో యాసిడ్స్, మినరల్స్, ప్రొటీన్లు ఉండి చర్మకణాలను శక్తిమంతం చేస్తాయి. ఫలితంగా చర్మగ్రంథులు చురుగ్గా పనిచేస్తాయి. అందుకే ముత్యాల పొడిని సౌందర్య ఉత్పాదనలలో ఉపయోగిస్తుంటారు. ముత్యాల ఫేసియల్ జిడ్డు చర్మం గలవారికి మంచి ఫలితాన్ని ఇస్తుంది. నోట్: ఫేసియల్‌కు ఏ ఉత్పత్తులను వాడుతున్నారో నిపుణులను డిమాండ్ చేయవచ్చు. ఎందుకంటే నాణ్యమైన ఉత్పత్తులు వాడితేనే తీరైన ఫలితం. -
మావో మళ్లీ పుట్టింది!
మావో మళ్లీ పుట్టింది.. ఇందులో వ్యాకరణ దోషమేమీ లేదు. మావో ఒక మహిళ రూపంలో చైనీయులను ఆకట్టుకొంటున్నాడు. మావోను అమితంగా ఇష్టపడే చైనీయులు ఈ మహిళా మావోను ఆశ్చర్యంగా గమనిస్తున్నారు! అచ్చం మావోలానే ఉన్నావే.. అంటున్నారు. మావోలాగా కనిపించే వాళ్లు, ఆయన వేషధారణతో ఉండే వాళ్లు చాలామంది ఉంటారు. అయితే ఇక్కడ చెన్యాన్ అనే ఒక మహిళ మావోను తలపింపజేస్తుండటమే అసలైన విశేషం. దీంతో ఆమెకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఈ 51 యేళ్ల మహిళ ఒక షాప్కీపర్. తన ఫేస్కట్లో మావో పోలికలను గమనించిన యాన్ ఒక బ్యూటీ పార్లర్ వారి సాయం తీసుకొని మావోలా గెటప్ మార్చింది. అంతే... ఈమె పనిచేసే షాప్ వాళ్లు ఆశ్చర్యపోయారు. ఆమె తమ షాపింగ్ మాల్‌కు ఆకర్షణగా మారుతుందని భావించారు. వెంటనే అమలు చేసేశారు కూడా! ఒకరోజు మావో గెటప్‌లో కనిపిస్తే దాదాపుగా పదివేల రూపాయలు ఇస్తున్నారు. ఈ విధంగా మావో వేషధారణ యాన్‌కు బతుకుతెరువుగా మారింది.