సీతంపేట: బ్యూటీపార్లర్ ముసుగులో వ్యభిచా రం నిర్వహిస్తున్న పార్లర్ నిర్వాహకురాలు, వి టుడు, ఆనందపురం మాజీ ఎంపీపీ కోరాడ రా జబాబు పోలీసులకు పట్టుబడ్డారు. ద్వారకా పో లీస్‌స్టేషన్ సీఐ పి.వి.వి.నర సింహారావు తెలిపిన వివరాల ప్రకారం సీతమ్మధార టీపీటీ కాలనీలో ఓ మహిళ ఫ్లోరా పేరుతో బ్యూటీపార్లర్ నిర్వహిస్తోంది. వ్యభిచారం జరుగుతోందన్న స్థానికుల సమాచారంతో సీఐ నరసింహారావు, ఎస్‌ఐ భా స్కర్ సిబ్బందితో కలసి పార్లర్‌పై దాడి చేశారు.
పార్లర్ కింద గ్రిల్స్ లాక్ చేసి ఉండటంతో పోలీ సులు గ్రిల్స్ ఎక్కి పార్లర్‌లోకి వెళ్లారు. పోలీసులను చూసి పారిపోతున్న నిర్వాహకురాలు, మరో ముగ్గురు మహిళా సిబ్బంది, విటుడు కోరాడ రాజబాబును అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.2,040ల నగదు, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పార్లర్‌లో మూడు గదులు ఉండగా, కేవలం ఒక్క గదిలో మాత్రమే ఎక్విప్‌మెంట్ ఉంది. మిగతా రెండు గదుల్లో నేలపై పరుపులు వేసి ఉన్నాయి. పార్లర్ నిర్వహణకు అనుమతులు, పనిచేస్తున్న సిబ్బందికి గుర్తింపు లేదని పోలీసుల విచారణలో బయటపడింది.
బ్యూటీపార్లర్ ముసుగులో వ్యభిచారం
Published Mon, Aug 3 2015 11:51 PM | Last Updated on Sun, Sep 3 2017 6:43 AM
Advertisement
Advertisement