మావో మళ్లీ పుట్టింది.. ఇందులో వ్యాకరణ దోషమేమీ లేదు. మావో ఒక మహిళ రూపంలో చైనీయులను ఆకట్టుకొంటున్నాడు. మావోను అమితంగా ఇష్టపడే చైనీయులు ఈ మహిళా మావోను ఆశ్చర్యంగా గమనిస్తున్నారు! అచ్చం మావోలానే ఉన్నావే.. అంటున్నారు. మావోలాగా కనిపించే వాళ్లు, ఆయన వేషధారణతో ఉండే వాళ్లు చాలామంది ఉంటారు. అయితే ఇక్కడ చెన్‌యాన్ అనే ఒక మహిళ మావోను తలపింపజేస్తుండటమే అసలైన విశేషం. దీంతో ఆమెకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది.
ఈ 51 యేళ్ల మహిళ ఒక షాప్‌కీపర్. తన ఫేస్‌కట్‌లో మావో పోలికలను గమనించిన యాన్ ఒక బ్యూటీ పార్లర్ వారి సాయం తీసుకొని మావోలా గెటప్ మార్చింది. అంతే... ఈమె పనిచేసే షాప్ వాళ్లు ఆశ్చర్యపోయారు. ఆమె తమ షాపింగ్ మాల్‌కు ఆకర్షణగా మారుతుందని భావించారు. వెంటనే అమలు చేసేశారు కూడా! ఒకరోజు మావో గెటప్‌లో కనిపిస్తే దాదాపుగా పదివేల రూపాయలు ఇస్తున్నారు. ఈ విధంగా మావో వేషధారణ యాన్‌కు బతుకుతెరువుగా మారింది.
మావో మళ్లీ పుట్టింది!
Published Mon, Nov 25 2013 12:00 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement
Advertisement