బ్యూటీ పార్లర్‌లో వ్యభిచారం
బంజారాహిల్స్ (హైదరాబాద్): బ్యూటీ పార్లర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మాదాపూర్‌కు చెందిన కోట సంపత్‌కుమార్(36) వనస్థలిపురంకు చెందిన మరో మహిళ (30) బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఎమ్మెల్యేకాలనీ సమీపంలో లోటస్ ఫ్యామిలీ సెలూన్ పేరుతో కొంత కాలంగా బ్యూటీ పార్లర్ నడిపిస్తున్నారు.
కాసులకు కక్కుర్తిపడ్డ వీరిద్దరూ ఎన్బీటీ నగర్‌కు చెందిన రఘు అనే బ్రోకర్‌తో పరిచయం పెంచుకొని సెలూన్‌లో పనిచేసే యువతులను వ్యభిచారం కూపంలోకి దింపారు. పార్లర్‌లో వ్యభిచారం చేయిస్తున్నారని సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు శనివారం రాత్రి సిబ్బందితో కలిసి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించడంతో గుట్టురట్టయింది. వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకొని పునరావాస కేంద్రానికి తరలించారు. నిర్వాహకులను, బ్రోకర్‌ను ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.