సాక్షి,న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం బాటలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) కూడా నడిచింది. డిసెంబరు నెల టోకు ధరల సూచీ మరింత ఎగిసింది. నవంబరు 0.58 శాతం శాతంతో పోలిస్తే డిసెంబరు మాసంలో 2.59 శాతంగా ఉంది. ప్రధానంగా ఆహార పదార్థాలు(ఆలూ, ఉల్లి) ఇంధన ధరలు సెగ డబ్ల్యూపీఐని ప్రభావితం చేసింది. ఆహార ద్రవ్యోల్బణం (డబ్ల్యుపిఐ ఫుడ్ ఇండెక్స్) 13.24 శాతం పెరిగింది. నవంబరులో ఇది 11 శాతం. నవంబరు మాసంలో 172.3 శాతంగా ఉన్న ఉల్లి ద్రవ్యోల్బణ రేటు డిసెంబరులో 455.8 శాతానికి చేరింది. రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబరులో 7.35 శాతం వద్ద ఐదున్నర సంవత్సరాల గరిష్ట స్థాయినికి చేరుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment