wholesale inflation
-
ఆహార ధరల తీవ్రత
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 1.26 శాతంగా నమోదైంది. గడచిన 13 నెలల్లో ఈ స్థాయి టోకు ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడం దీనికి ప్రధాన కారణం. ఫుడ్ ఆరి్టకల్స్‌లో పాటు, విద్యుత్, క్రూడ్ పెట్రోలియం, సహజ వాయువు, కొన్ని తయారీ ఉత్పత్తుల ధరలూ పెరిగినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సూచీ వరుసగా రెండు నెలల నుంచి పెరుగుతూ వస్తోంది. ఫిబ్రవరిలో 0.20% ఉన్న డబ్ల్యూపీఐ, మార్చిలో 0.53 శాతానికి ఎగసింది. గత 2023 ఏప్రిల్‌లో సూచీ 0.79 శాతం పెరిగింది. అధికారిక గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ⇒ ఫుడ్ ఆర్టికల్స్ ధరలు మార్చిలో 6.88 శాతం పెరిగితే, ఏప్రిల్‌లో 7.74 శాతం ఎగశాయి. ఇదే కాలంలో కూరగాయల ధరలు 19.52 శాతం నుంచి 23.60 శాతానికి ఎగశాయి. ఆలూ ధరలు 52.96 శాతం నుంచి 71.97 శాతానికి పెరిగాయి. ఇక ఉల్లి ధరలు మార్చిలో 56.99% పెరిగితే, ఏప్రిల్‌లో 59.75 % ఎగశాయి. ⇒ఫ్యూయల్ అండ్ పవర్ బాస్కెట్ విభాగంలో ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 1.38 శాతంగా ఉంది. మార్చిలో ఈ విభాగంలో అసలు పెరుగుదల లేకపోగా మైనస్ 0.77 శాతంగా (క్షీణత) నమోదైంది. ⇒సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం మాత్రం ఏప్రిల్‌లో పెరక్కపోగా, 0.42 శాతం క్షీణించింది. అయితే మార్చిలో ఈ క్షీణ రేటు 0.85 శాతం ఉండడం గమనార్హం. -
Wholesale price inflation: 3 నెలల గరిష్టానికి టోకు ధరలు
న్యూఢిల్లీ: దేశీయంగా టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యూపీఐ) మూడు నెలల గరిష్టానికి ఎగిసింది. కూరగాయలు, బంగాళదుంప, ఉల్లి, ముడి చమురు మొదలైన వాటి ధరల పెరుగుదల కారణంగా మార్చిలో 0.53 శాతంగా (ప్రొవిజనల్) నమోదైంది. ఫిబ్రవరిలో ఇది 0.20 శాతంగా ఉంది. గతేడాది మార్చిలో ఇది 1.41 శాతంగా నమోదైంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మైనస్‌లోనే ఉన్న టోకు ధరల ఆధారిత సూచీ నవంబర్‌లో ప్లస్ 0.26 శాతానికి వచి్చంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. రిటైల్ ద్రవ్యోల్బణం అయిదు నెలల కనిష్ట స్థాయి 4.85 శాతానికి తగ్గిన నేపథ్యంలో తాజా టోకు గణాంకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బేస్ ఎఫెక్ట్ తగ్గుతుండటంతో రాబోయే రోజుల్లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. గతేడాది మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం 5.42 శాతం నుంచి 6.88 శాతానికి చేరింది. కూరగాయల ధరల పెరుగుదల మైనస్ 2.39 శాతం నుంచి 19.52 శాతానికి ఎగిసింది. -
టోకు ద్రవ్యోల్బణం.. 7వ నెలా రివర్స్..
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా ఏడవనెల అక్టోబర్‌లోనూ మైనస్‌లోనే నిలిచింది. సమీక్షా నెల్లో సూచీ మైనస్ (–)0.52 వద్ద ఉంది. సూచీలో అసలు పెరుగుదల లేకపోగా, క్షీణతలో ఉండే ఈ తరహా పరిస్థితిని ప్రతిద్రవ్యోల్బణంగా వ్యవహరిస్తారు. కొన్ని కీలక ఉత్పత్తుల ధరలు పెరక్కపోవడం ఈ పరిస్థితికి ప్రధాన కారణం. వ్యవస్థలో తగిన డిమాండ్ లేని పరిస్థితితో పాటు, వార్షికంగా హైబేస్ కూడా ఈ పరిస్థితికి కారణంగా ఉంటుంది. ఇక్కడ గత ఏడాది అక్టోబర్‌ను చూస్తే టోకు ద్రవ్యోల్బణం 8.67 శాతం (హైబేస్తో)గా ఉంది. -
5.85 శాతానికి టోకు ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం మాదిరే టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) సైతం నవంబర్‌లో గణనీయంగా తగ్గి 5.85 శాతానికి పరిమితమైంది. అంతకుముందు నెలలో (అక్టోబర్) ఇది 8.39 శాతంగా ఉంది. ఆహారం, చమురు, తయారీ ధరలు తగ్గుముఖం పట్టడం ద్రవ్యోల్బణం వేడి తగ్గేందుకు సాయపడ్డాయి. నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం సైతం అక్టోబర్‌లో ఉన్న 6.77 శాతం నుంచి 5.88 శాతానికి తగ్గడం తెలిసిందే. గతేడాది నవంబర్‌లో డబ్ల్యూపీఐ బేస్ అధికంగా ఉండడం, ఆహార ధరలు కొంత తగ్గడం ద్రవ్యోల్బణం నియంత్రణకు సాయపడినట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ఓ పరిశోధన పత్రంలో పేర్కొంది. 2021 ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 4.83% తర్వాత, అతి తక్కువ స్థాయిలో నమోదు కావడం మళ్లీ ఇదే మొదటిసారి. విభాగాల వారీగా.. ► ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 8.33% ఉంటే, నవంబర్‌లో 1.07%గా ఉంది. ► కూరగాయల ధరలు అయితే ఊహించని విధంగా నియంత్రణలోకి వచ్చాయి. కూరగాయలకు సంబంధించి ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 17.61 శాతంగా ఉంటే, నవంబర్‌లో ఏకంగా మైనస్ 20 శాతానికి (డిఫ్లేషన్) పడిపోయింది. ► ఇంధనం, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం 17.35 శాతంగా నమోదైంది. ► తయారీ ఉత్పత్తులకు సంబంధించి 3.59 శాతంగా ఉంది. మరింత తగ్గిస్తాం.. ప్రధాని మోదీ, మంత్రుల బృందం, అధికారులు ఎప్పటికప్పుడు జోక్యం చేసుకోవడం, చర్యలు తీసుకోవడం ఫలితాలనిచ్చాయి అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు తెలిపారు. సామాన్యుడి కోసం ద్రవ్యోల్బణాన్ని మరింత తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. -
ఐదు నెలల కనిష్టానికి టోకు ధరలు
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం తరహాలోనే టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం స్పీడ్ కూడా దిగువముఖం పట్టింది. జూలైలో ఐదు నెలల కనిష్ట స్థాయిలో 13.93 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 జూలైతో పోల్చితే 2022 జూలైలో టోకు ధరల బాస్కెట్ ధర పెరుగుదల 13.93 శాతమన్నమాట. నెలవారీగా ఆహార, తయారీ ఉత్పత్తుల ధరల తగ్గుదల తాజా సానుకూల గణాంకానికి ప్రధాన కారణమని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. టోకు ధరల సూచీ తగ్గుదల ఇది వరుసగా రెండవనెల. మేలో సూచీ 15.88 శాతం రికార్డు గరిష్టానికి చేరింది. అయితే జూన్‌లో 15.18 శాతానికి తగ్గింది. తాజా సమీక్షా నెల్లో మరికొంత (13.93) దిగివచ్చింది. అయితే రెండంకెలపైనే డబ్ల్యూపీఐ స్పీడ్ కొనసాగడం వరుసగా 16వ నెల. రిటైల్ ద్రవ్యోల్బణం కూడా మేలో 7.04%కి చేరింది. అయితే జూన్‌లో 7.01%కి, జూలైలో 6.71 శాతానికి తగ్గింది. సరఫరాల పరంగా ప్రభుత్వం, ద్రవ్య పాలసీవైపు ఆర్బీఐ, పంట దిగుబడులు ద్రవ్యోల్బణం దిగిరావడానికి కారణమని భావిస్తున్నారు. ►ఆహార ఉత్పత్తుల ద్రవ్యోల్బణం జూన్‌లో 14.39 శాతం ఉంటే, జూలైలో 10.77 శాతానికి తగ్గింది. ఇందులో కూరగాయల ధరల స్పీడ్ 18.25 శాతం. జూన్‌లో ఈ స్పీడ్ ఏకంగా 56.75 శాతంగా ఉంది. ►ఇంధన, విద్యుత్ బాస్కెట్ ద్రవ్యోల్బణం జూన్‌లో 40.38% ఉంటే, జూలైలో 43.75%కి పెరిగింది. ►సూచీలో మెజారిటీ వెయిటేజ్ ఉన్న తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 8.16 శాతానికి చేరింది. -
అసలే భారంగా ధరలు..ఇప్పుడు మరింత పైపైకి..!
న్యూఢిల్లీ: టోకు ధరలు ఆందోళనకరంగా తయారయ్యాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మార్చిలో ఏకంగా 14.55 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 ఇదే నెలతో పోల్చితే టోకు బాస్కెట్‌లోని వస్తువుల ధర 14.55 శాతం పెరిగిందన్నమాట. గడచిన నాలుగు నెలల్లో ఈ స్థాయి టోకు ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. క్రూడ్, ఇతర కమోడిటీల ధరల తీవ్రత తాజా గణాంకాలపై ప్రతిబింబిస్తున్నట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో సరఫరాల చైన్‌కు తీవ్ర విఘాతం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనితో అసలే భారంగా ఉన్న టోకు ధరల తీవ్రత మరింత పెరిగింది. 2021 మార్చిలో టోకు ద్రవ్యోల్బణం 7.80 శాతంగా ఉంది. 2021 ఏప్రిల్ నుంచి ప్రారంభమైన ఆర్థిక సంవత్సరం మొత్తం 12 నెలల్లో టోకు ధరలు రెండంకెలపైన కొనసాగడం గమనార్హం. కొన్ని ముఖ్యాంశాలు... ► ఫిబ్రవరిలో ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం 8.19 శాతం ఉంటే, మార్చిలో 8.06 శాతానికి తగ్గింది. కూరగాయల ధరల స్పీడ్ కూడా నెలల వారీగా 26.93 శాతం నుంచి 19.88 శాతానికి దిగివచ్చింది. అయితే ఈ స్థాయి ధరలు కూడా సామాన్యుడిని బెంబేలెత్తిస్తాయి. ► మొత్తం సూచీలో దాదాపు 60% వాటా ఉన్న తయారీ రంగంలో టోకు ద్రవ్యోల్బణం 9.84% నుం చి (ఫిబ్రవరి) నుంచి 10.71 శాతానికి ఎగసింది. ► 20 శాతం వాటా ఉన్న ఫ్యూయల్ అండ్ పవర్ బాస్కెట్లో ద్రవ్యోల్బణం నెల వారీగా 31.50 శాతం నుంచి 34.52 శాతానికి ఎగసింది. ఒక్క క్రూడ్ పెట్రోలియంలో ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 55.17 శాతం ఉంటే మార్చిలో 83.56 శాతంగా నమోదయ్యింది. రేటు పెంపు అవకాశం... ద్రవ్యోల్బణం తీవ్రత కొనసాగితే, జూన్‌లో జరిగే ఆర్థిక సంవత్సరం రెండవ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కఠిన ద్రవ్య విధానాన్ని అవలంబించే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 4 శాతం)ను పావుశాతం పెంచే అవకాశం ఉందని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆర్థిక విశ్లేషణా సంస్థ ఎకోర్యాప్, రేటింగ్ సంస్థ ఇక్రా అంచనావేస్తున్నాయి. ద్రవ్యోల్బణాన్ని కట్టడిలో ఉంచుతూ, వృద్ధే లక్ష్యంగా వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల నుంచి ఆర్బీఐ ఎంపీసీ రెపో రేటును యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 2–6 శాతం శ్రేణిలో ద్రవ్యోల్బణం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐని కేంద్రం నిర్దేశిస్తోంది. అయితే జనవరి (6.01 శాతం), ఫిబ్రవరి (6.07 శాతం), మార్చి (17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతం) నెలల్లో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం హద్దులు మీరి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. -
టోకు ధరలూ పెరిగాయ్!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 1.48 శాతం ఎగసింది. అంటే 2019 అక్టోబర్‌తో పోల్చితే 2020 అక్టోబర్‌లో టోకు వస్తువుల బాస్కెట్ ధర 1.48 శాతం పెరిగిందన్నమాట. ఎనిమిది నెలల్లో ఈ స్థాయి టోకు ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. తయారీ ఉత్పత్తుల ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణం. ఆర్థిక మందగమనం, వ్యవస్థలో డిమాండ్ లేకపోవడం, కరోనా ప్రతికూలతలు వంటి అంశాల నేపథ్యంలో టోకు ధరల సూచీ ‘జీరో’ లేదా ప్రతిద్రవ్యోల్బణం స్థాయిలో నమోదవుతోంది. సూచీలోని ఒక్క ఆహార ఉత్పత్తుల ధరలు మాత్రమే పెరుగుదలను సూచిస్తున్నాయి. అయితే వ్యవస్థలో కొంత డిమాండ్ నెలకొనడంతోపాటు, బేస్ ఎఫెక్ట్ (2019 అక్టోబర్‌లో ‘జీరో’ ద్రవ్యోల్బణం) కూడా తాజాగా సూచీ పెరుగుదలకు ఒక కారణమవుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆవిష్కరించిన తాజా గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► మొత్తం సూచీలో దాదాపు 12% వెయిటేజ్ ఉన్న ఆహార ఉత్పత్తుల ధరలు టోకును 6.37% పెరిగాయి. ఒక్క కూరగాయల ధరలు 25.23 శాతం పెరిగితే, ఆలూ ధరలు ఏకంగా 107.70% ఎగశాయి (2019 అక్టోబర్ ధరలతో పోల్చితే). ► సూచీలో 12% వెయిటేజ్ ఉన్న నాన్–ఫుడ్ ఆర్టికల్స్, మినరల్స్ ధరలు 2.85 శాతం, 9.11 శాతం చొప్పున ఎగశాయి. ► మొత్తం సూచీలో దాదాపు 62 శాతం వాటా ఉన్న తయారీ రంగంలో ధరలు 2.12 శాతం ఎగశాయి. ► 14% వెయిటేజ్ ఉన్న ఫ్యూయల్ అండ్ పవర్ ఇండెక్స్‌లో అసలు పెరుగుదల లేకపోగా 10.95% క్షీణించాయి. ఆర్బీఐ రేట్ల తగ్గింపు ఉండకపోవచ్చు... ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) తగ్గింపు ప్రక్రియకు ఇక తెరపడినట్లేనని నిపుణులు అంచనావేస్తున్నారు. వచ్చే నెల్లో జరగనున్న ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో యథాతథ రేటును కొనసాగించే వీలుందన్నది వారి విశ్లేషణ. టోకు ధరలే తీవ్రంగా ఉంటే, ఇక రిటైల్ ధరలు మరింత పెరుగుతాయని వారు విశ్లేషిస్తున్నారు. ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉండాలని కేంద్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి నిర్దేశిస్తోంది. అయితే ఈ స్థాయికి మించి ఈ రేటు నమోదవుతోంది. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటే, సెప్టెంబర్‌లో ఎనిమిది నెలల గరిష్టం 7.27 శాతానికి పెరిగింది. ఈ ఏడాది మార్చి తరువాత 115 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) రెపోరేటు తగ్గించిన ఆర్బీఐ, రిటల్ ద్రవ్యోల్బణం ఇబ్బందులతో ఆగస్టు, అక్టోబర్ నెలల్లో జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగించింది. అయితే సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్నా, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో లక్ష్యాల మేరకు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయని ఆర్బీఐ అంచనావేస్తోంది. -
అంతర్జాతీయ అంశాలే నడిపిస్తాయ్!
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారికి సంబంధించిన పరిణామాలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా నెలకొనే ట్రెండ్స్‌పై ఇన్వెస్టర్లు దృష్టిసారించనున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. మార్కెట్‌ను ప్రభావితం చేసే కీలక దేశీయ అంశాలేవీ లేనందున అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగానే సూచీలు కదలాడనున్నాయని వారు పేర్కొన్నారు. ‘దీపావళి బలిప్రతిపద‘ను పురస్కరించుకుని నేడు (సోమవారం) మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో ఈ వారంలో దేశీ మార్కెట్లలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. ‘ఈవారంలో మార్కెట్ ఒక రోజు సెలవు, అలాగే కార్పొరేట్ ఫలితాల వెల్లడి కూడా దాదాపు పూర్తయినట్లే. దీంతో మార్కెట్‌ను ప్రభావితం చేయగల కీలక దేశీయ అంశాలేవీ లేనందున ఇన్వెస్టర్లు ప్రపంచ పరిణామాలపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నారు’ అని రెలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్) అజిత్ మిశ్రా పేర్కొన్నారు. అమెరికా, యూరప్‌లలో మళ్లీ కేసులు పెరుగుతుండటంతో, కరోనావైరస్ ధోరణులు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుతం మార్కెట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ వారంలో టోకు ద్రవ్యోల్బణం కొంత ప్రభావం చూపవచ్చు’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. కాగా, డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు, క్రూడ్ ధర, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడి ధోరణులను కూడా ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించనున్నారు. ‘ఇన్వెస్టర్లు రానున్న రోజుల్లో కోవిడ్–19 కేసులు అలాగే వ్యాక్సిన్ అభివృద్ధికి సంబంధించిన పరిణామాలపై దృష్టి పెట్టనున్నారు‘ అని ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా పేర్కొన్నారు. ‘విదేశీ’ నిధుల వెల్లువ... భారత్ మార్కెట్లోకి విదేశీ నిధుల వెల్లువ కొనసాగుతోంది. మెరుగైన కార్పొరేట్ ఆర్థిక ఫలితాలు(క్యూ2), పెట్టుబడులు పుంజుకునేలా ప్రభుత్వం ప్రకటించిన సంస్కరణ చర్యలతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం ఉరకలేస్తోంది. దీంతో మార్కెట్లు కూడా కొత్త రికార్డులతో దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో నవంబర్ నెలలో ఇప్పటిదాకా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) దేశీ క్యాపిటల్ మార్కెట్లో రూ.35,109 కోట్ల భారీ నిధులను వెచ్చించారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం నవంబర్ 2 నుంచి 13 మధ్య ఎఫ్‌పీఐలు స్టాక్స్‌లో నికరంగా రూ.29,436 కోట్లు, డెట్ (బాండ్స్) విభాగంలో రూ.5,673 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. అక్టోబర్‌లో సైతం ఎఫ్‌పీఐలు రూ.22,033 కోట్లను నికరంగా దేశీ మార్కెట్లో కుమ్మరించడం విశేషం. ‘రానున్న రోజుల్లో కూడా భారత్ మార్కెట్లపై ఎఫ్‌పీఐలు ఆశావహ ధోరణినే కొనసాగించే అవకాశం ఉంది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆర్థిక మందగమనాన్ని తట్టుకొని నిలబడిన రంగాల్లో పెట్టుబడులకు ఆస్కారం నెలకొంది’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ సంస్థాగత వ్యాపార విభాగం హెడ్ అర్జున్ యష్ మహాజన్ పేర్కొన్నారు. ‘మూరత్’ రికార్డులు... దీపావళి సందర్భంగా శనివారం గంటపాటు జరిగిన ప్రత్యేక మూరత్ ట్రేడింగ్‌లో దేశీ మార్కెట్లు రికార్డులను బద్దలుకొట్టాయి. ‘సంవత్ 2076’ ఏడాదికి లాభాలు, రికార్డులతో వీడ్కోలు పలికిన సూచీలు... ‘సంవత్ 2077’ కొత్త సంవత్సరాన్ని కూడా సరికొత్త ఆల్‌టైమ్ గరిష్టాలతో ఆరంభించాయి. సెస్సెక్స్ 43,831 పాయింట్లను తాకి కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. చివరకు 195 పాయింట్ల లాభంతో 43,638 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 12,829 పాయింట్లకు ఎగసి కొత్త ఆల్‌టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 60 పాయింట్లు లాభపడి 12,780 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 షేర్లలో భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, సన్ ఫార్మా, బజాజ్ ఫిన్సర్వ్, ఐటీసీ, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఓఎన్జీసీ 1.12 శాతం వరకు లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్ మాత్రమే నష్టాలతో ముగిశాయి. మొత్తం మీద గతవారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 1,745 పాయింట్లు (4.16%), ఎన్ఎస్ఈ నిఫ్టీ 517 పాయింట్లు (4.20%) దూసుకెళ్లాయి. సాంప్రదాయ హిందూ క్యాలెండర్ ప్రకారం దీపావళి నుంచి దీపావళికి ‘విక్రమ్ సంవత్‘ ఏడాదిగా పరిగణిస్తారు. కాగా, గత సంవత్ 2076 సంవత్సరం మొత్తంలో చూస్తే, సెన్సెక్స్ 4,385 పాయింట్లు (11.22%), నిఫ్టీ 1,136 పాయింట్ల (9.8%) చొప్పున ఎగబాకాయి. -
టోకు ధరలు.. మైనస్ నుంచి ప్లస్
న్యూఢిల్లీ: ప్రభుత్వం సోమవారం నాడు ఆగస్టుకు సంబంధించి అటు టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలను, ఇటు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను విడుదల చేసింది. టోకు ద్రవ్యోల్బణం 0.16 శాతం నమోదయితే, రిటైల్ ద్రవ్యోల్బణం 6.69 శాతంగా నమోదయ్యింది. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ విడుదల చేసిన టోకు ధరల గణాంకాల్లో కీలక అంశాలను పరిశీలిస్తే... టోకు డిమాండ్ మెరుగుపడుతుందనుకోలేం! టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం నాలుగు నెలల తర్వాత మొట్టమొదటిసారి ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితుల నుంచి బయటపడింది. ఆగస్టులో ద్రవ్యోల్బణం 0.16 శాతంగా నమోదయ్యింది. అంటే 2019 ఆగస్టుతో పోల్చితే 2020 ఆగస్టులో టోకు బాస్కెట్‌లోని మొత్తం ఉత్పత్తుల ధర 0.16 శాతం పెరిగిందన్నమాట. కరోనా కట్టడికి లాక్డౌన్ విధించిన తర్వాత వరుసగా ఏప్రిల్ (– 1.57%), మే (–3.37%), జూన్ (–1.81%), జూలై (–0.58%) నెలల్లో ప్రతికూల టోకు ద్రవ్యోల్బణం రేట్లు నమోదయ్యాయి. వ్యవస్థలో డిమాండ్ లేమి పరిస్థితులను ప్రతి ద్రవ్యోల్బణం సూచిస్తుంది. అయితే తాజా గణాంకాలు ఆర్థిక వ్యవస్థలో మళ్లీ డిమాండ్ కనిపిస్తోందనడానికి సూచన కాదన్నది నిపుణుల అభిప్రాయం. ఆగస్టులో ద్రవ్యోల్బణం పెరగడానికి బేస్ ఎఫెక్టే కారణమన్నది వారి అంచనా. అంటే 2019 ఆగస్టులో నమోదయిన టోకు ద్రవ్యోల్బణం అతి తక్కువగా ఉండడం (కేవలం 1.17%), ఆర్థిక మందగమనం వల్ల అటు తర్వాత నెలల్లోనూ వ్యవస్థలో పూర్తి ప్రతి ద్రవ్యోల్బణం పరిస్థితులే నెలకొనడం వంటి అంశాలతో తాజా సమీక్షా నెల 2020 ఆగస్టులో టోకు ద్రవ్యోల్బణం కొంచెం పెరిగినట్లు ‘గణాంకాల్లో’ కనిపిస్తోందన్నది వారి అభిప్రాయం. దీనినే బేస్ ఎఫెక్ట్ మాయగా నిపుణులు పేర్కొంటారు. కాగా మార్చిలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 0.42%. మూడు ప్రధాన విభాగాలను చూస్తే... ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్ ఫుడ్ విభాగాలతో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్‌లో ద్రవ్యోల్బణం ఆగస్టులో 1.60 శాతానికి తగ్గింది. 2019 ఆగస్టులో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 6.51 శాతం. ఇక ఈ విభాగంలో కేవలం ఫుడ్ ఆర్టికల్స్‌ను తీసుకుంటే, ద్రవ్యోల్బణం 7.80 శాతం నుంచి 3.84 శాతానికి తగ్గింది. నాన్ ఫుడ్ ఆర్టికల్స్‌లో మాత్రం ప్రతి ద్రవ్యోల్బణం (–1.46 శాతం) కొనసాగుతోంది. 2019 ఇదే నెలలో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 4.68 శాతం. ► ఇంధనం, విద్యుత్: ప్రతి ద్రవ్యోల్బణం మైనస్ 3.53 శాతం నుంచి మరింతగా మైనస్ 9.68 శాతానికి పెరిగింది. ► తయారీ: తయారీ రంగంలో 1.27 శాతం ద్రవ్యోల్బణం నమోదయ్యింది. 2019 ఆగస్టులో ఇది స్థిరంగా ఉంది. టోకున ‘నిత్యావసరాల’ మంట డబ్ల్యూపీఐ... ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం వార్షికంగా చూస్తే 7.80% నుంచి 3.84%కి తగ్గినా, నిత్యావసరాల ధరలు మాత్రం ఇంకా సామాన్యునికి భారంగానే ఉండడం గమనార్హం. కూరగాయల ధరలు 7.03% పెరిగాయి (2019 ఆగస్టుతో పోల్చి). పప్పు దినుసుల ధరలు 9.86% ఎగశాయి. ప్రొటీన్ ఆధారిత గుడ్లు, మాంసం, చేపల ధరలు 6.23% పెరిగాయి. ఆలూ ధరలు భారీగా 82.93 శాతం ఎగశాయి. అయితే ఉల్లిపాయల ధరలు మాత్రం 34.48% తగ్గాయి. -
ఆలూ, ఉల్లి షాక్: డబ్ల్యూపీఐ 2.59 శాతం
సాక్షి,న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం బాటలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) కూడా నడిచింది. డిసెంబరు నెల టోకు ధరల సూచీ మరింత ఎగిసింది. నవంబరు 0.58 శాతం శాతంతో పోలిస్తే డిసెంబరు మాసంలో 2.59 శాతంగా ఉంది. ప్రధానంగా ఆహార పదార్థాలు(ఆలూ, ఉల్లి) ఇంధన ధరలు సెగ డబ్ల్యూపీఐని ప్రభావితం చేసింది. ఆహార ద్రవ్యోల్బణం (డబ్ల్యుపిఐ ఫుడ్ ఇండెక్స్) 13.24 శాతం పెరిగింది. నవంబరులో ఇది 11 శాతం. నవంబరు మాసంలో 172.3 శాతంగా ఉన్న ఉల్లి ద్రవ్యోల్బణ రేటు డిసెంబరులో 455.8 శాతానికి చేరింది. రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబరులో 7.35 శాతం వద్ద ఐదున్నర సంవత్సరాల గరిష్ట స్థాయినికి చేరుకున్న సంగతి తెలిసిందే. -
రేట్ల కోతకు ‘ధర’ల ఊతం!!
న్యూఢిల్లీ: ధరల భయాలు డిసెంబర్లో తక్కువగా ఉన్నాయని సోమవారం విడుదలైన అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి. ఈ నెలలో టోకు, రిటైల్ ద్రవ్యోల్బణం రెండూ తగ్గుముఖం పట్టాయని లెక్కలు వెల్లడించాయి. దీనితో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.50) తగ్గింపునకు ఇది అవకాశమని పారిశ్రామిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. తద్వారా దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడాలని కోరుతున్నాయి. నవంబర్ పారిశ్రామిక ఉత్పత్తి ఏడు నెలల కనిష్ట స్థాయి అరశాతంగా నమోదయిన విషయాన్ని పారిశ్రామిక వర్గాలు ప్రస్తావిస్తూ, ఈ రంగానికి చేయూత నివ్వాల్సిన తక్షణ అవసరాన్ని ఉద్ఘాటిస్తున్నాయి. జనవరి–మార్చికి సంబంధించి డీఅండ్‌బీ వ్యాపార ఆశావహ పరిస్థితి కూడా ఇక్కడ గమనార్హం. కొత్త గవర్నర్ శక్తికాంత్ దాస్ నేతృత్వంలోని ద్రవ్య పరపతి విధాన కమిటీ ఫిబ్రవరి 7వ తేదీన ద్వైమాసిన ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విడుదలైన స్థూల ఆర్థిక గణాంకాలను చూస్తే... వరుసగా రెండవ నెల తగ్గిన టోకు ధరలు ► వరుసగా రెండు నెలల నుంచీ తగ్గిన టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు రేటు కోత అవకాశాలపై పారిశ్రామిక వర్గాల్లో ఆశావహ స్థితిని సృష్టిస్తున్నాయి. అక్టోబర్‌లో టోకు ద్రవ్యోల్బణం పెరుగుదల రేటు 5.54 శాతం ఉంటే, నవంబర్‌లో 4.64 శాతంగా నమోదయ్యింది. ► మొత్తంగా...: 2018 డిసెంబర్లో (2017 ఇదే నెల ధరలతో పోల్చి) టోకు వస్తువుల బాస్కెట్ ధర కేవలం 3.80 శాతమే పెరిగింది. అంతక్రితం ఎనిమిది నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో టోకు ధరల నమోదు ఇదే తొలిసారి. ఇంధనం, కొన్ని ఆహార ఉత్పత్తుల ధరలు టోకున తగ్గడం దీనికి ప్రధాన కారణం. ► ప్రైమరీ ఆర్టికల్స్: సూచీలో ఆహార, ఆహారేతర ఉత్పత్తులకు సంబంధించిన ఈ విభాగంలో పెరుగుదల రేటు 2.28 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ రేటు 3.86 శాతం. ఇక ఇందులో ఒక్క ఆహార విభాగాన్ని చూసుకుంటే పెరుగుదల అసలు లేకపోగా –0.07 శాతం తగ్గుదల నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ విభాగంలో ధరల పెరుగుదల రేటు 4.72 శాతం. కూరగాయల ధరలు వరుసగా ఆరు నెలల నుంచీ తగ్గుతూ వస్తున్నాయి. నవంబర్‌లో పెరుగుదల రేటు 26.98 శాతం ఉంటే, డిసెంబర్లో ఈ రేటు 17.55 శాతంగా ఉంది. టమోటా ధరలు నవంబర్‌లో పెరుగుదల రేటు 88 శాతంగా ఉంటే, డిసెంబర్లో 49 శాతానికి తగ్గాయి. ఇక పప్పు దినుసుల పెరుగుదల రేటు 2.1 శాతంగా ఉంది. గుడ్లు, మాంసం, చేపల ధరల పెరుగుదల రేటు 4.55 శాతం. ఉల్లిపాయల ధరలు మాత్రం 64 శాతం తగ్గాయి. అయితే నాన్ ఫుడ్ ఆర్టికల్స్ విషయంలో మాత్రం ద్రవ్యోల్బణం 4.45 శాతం పెరిగింది. 2017 డిసెంబర్లో ఇది క్షీణతలో –0.17శాతంగా నమోదయ్యింది. ► ఇంధనం, విద్యుత్: ఈ విభాగంలో రేటు 8.03 శాతం నుంచి 8.38 శాతానికి ఎగిసింది. 2018 నవంబర్‌లో ఈ రేటు ఏకంగా 16.28 శాతం ఉండటం గమనార్హం. ► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60% వాటా ఉన్న తయారీ రంగంలో ధరల పెరుగుదల వార్షికంగా 2.79% నుంచి 3.59%కి పెరిగింది. అయితే నెలవారీగా చూస్తే, నవంబర్‌లో ఈ రేటు 4.21%. రిటైల్‌గా చూసినా తగ్గిన ధరల స్పీడ్.. ఇక వినియోగ ధరల సూచీ(సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదల రేటు 2018 డిసెంబర్లో 2.19%. అంటే 2017 ఇదే నెలతో పోల్చితే రిటైల్‌గా ధరల బాస్కెట్ 2.19% పెరిగిందన్నమాట. గడచిన 18 నెలల్లో ఇంత తక్కువ స్థాయిలో రిటైల్ ధరలు పెరగడం ఇదే తొలిసారి. పండ్లు, కూరగాయలు, ఇంధనం ధరల స్పీడ్ తగ్గడం ఇందుకు ప్రధానంగా దోహదపడింది. 2018 నవంబర్‌లో రిటైల్ ధరల స్పీడ్ 2.33 శాతం ఉండగా, డిసెంబర్లో 5.21 శాతంగా నమోదయ్యింది. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం– ఆహార ఉత్పత్తుల ధరలు పెరక్కపోగా –2.51 శాతం తగ్గాయి. ఇంధనం, లైట్ ద్రవ్యోల్బణం స్పీడ్ 7.39%(నవంబర్‌లో) నుంచి 4.54%కి (డిసెంబర్) తగ్గింది. -
14 నెలల గరిష్టానికి డబ్ల్యుపీఐ
సాక్షి, న్యూఢిల్లీ: డబ్ల్యుపీఐ మరోసారి పెరిగింది. మే నెల టోకు ధరల ద్రవ్యోల్బణం 4.45 శాతానికి పెరిగింది. దాదాపు14 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. కొన్ని ఆహార పదార్థాలు, ఇంధన ధరలు పెరడంతో డబ్ల్యూపీఐ కూడా గరిష్టానికి చేరింది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గురువారం ఈ గణాంకాలను విడుదల చేసింది. ఏప్రిల్ నెలలో డబ్ల్యుపిఐ 3.18 శాతం పెరగ్గా , గత ఏడాది మే నెలలో 2.26 శాతం పెరుగుదల నమోదైంది. ఏప్రిల్ నెలలో 0.89 శాతంతో పోలిస్తే మే నెలలో కూరగాయల ధరలు 2.51 శాతం పెరిగాయి. మొత్తం టోకు ధరల సూచీలో ఐదో స్థానంలో ఉన్న ప్రాథమిక వస్తువులు మే నెలలో 3.16 శాతం పెరిగింది. మే నెలలో పప్పు ధాన్యాల ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం కూడా పెరిగి 13.15 శాతంగా ఉంది. ఏప్రిల్‌లో ఇది 7.85 శాతంగా ఉండగా, గత ఏడాది 11.81 శాతం పెరిగింది. ఏప్రిల్ నెల9.45 శాతందనుంచి పెట్రోల్ ధరలు మేనెలలో 13.90 శాతం మేర పెరిగాయి. గత ఏప్రిల్‌లో 13.01 శాతంతో పోలిస్తే డీజిల్ ధరలు 17. 34 శాతం పెరిగాయి. -
మళ్లీ ధరాభారం!
జూలైలో టోకు ద్రవ్యోల్బణం 1.88 శాతం ► ఐదు నెలల గరిష్ట స్థాయి ► ఇక ఇదే నెల్లో రిటైల్ ధరల పెరుగుదల స్పీడ్ 2.36% ► కూరగాయల ధరలు రయ్... ► జీఎస్టీ అమలు ప్రారంభ నేపథ్యం... న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్దేశిత అంచనాల పరిధిలోనే ఉన్నప్పటికీ ద్రవ్యోల్బణం జూలై గణాంకాలు కొంత ఆందోళనకు కారణమయ్యాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం, వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఎగువబాట పట్టాయి. టోకు ద్రవ్యోల్బణం జూలైలో 1.88 శాతంగా నమోదయ్యింది. అంటే 2016 జూలైతో పోల్చితే 2017 జూలైలో టోకున ఉత్పత్తుల బాస్కెట్ ధర 1.88 శాతం పెరిగిందన్నమాట. గడచిన ఐదు నెలల్లో ఈ స్థాయిలో ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. 2017 జూన్‌లో ఈ రేటు 0.90 శాతం కాగా, 2016 జూలైలో ద్రవ్యోల్బణం రేటు 0.63 శాతం. ఇక రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదల స్పీడ్ కూడా ఈ ఏడాది జూన్‌లో 1.46 శాతం ఉంటే, జూలైలో ఇది 2.36 శాతానికి ఎగసింది. ప్రత్యేకించి కూరగాయల ధరలు పెరిగాయి. ప్లస్ 2 లేదా మైనస్ 2తో ద్రవ్యోల్బణం 4 శాతంగా ఉండాలని ఆర్బీఐ నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే. టోకు సూచీని విభాగాల వారీగా వార్షిక రీతిన పరిశీలిస్తే... టోకున ‘ఫుడ్’ ఓకే...! ♦ ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్ ఆర్టికల్స్, నాన్–ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం వార్షికంగా 6.03 శాతం నుంచి 0.46 శాతానికి తగ్గింది. ఇక్కడ ఫుడ్ ఆర్టికల్స్‌లో ధరల పెరుగుదల స్పీడ్ 8 శాతం నుంచి 2.15 శాతానికి తగ్గితే, నాన్ ఫుడ్ ఆర్టికల్స్‌లో ద్రవ్యోల్బణ రేటు 8.96 శాతం నుంచి ఏకంగా –6.32 క్షీణతలోకి జారింది. ♦ ఇంధనం, విద్యుత్: వార్షికంగా చూస్తే ఈ విభాగం –9.70 శాతం క్షీణ రేటు నుంచి 4.37 శాతం పెరుగుదలకు మారింది. ఈ ఏడాది జూన్ నెలలో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 5.28 శాతం. ♦ మొత్తం సూచీలో దాదాపు 60% వాటా కలిగిన తయారీ రంగంలో ద్రవ్యోల్బణం రేటు 0.36 శాతం నుంచి 2.18 శాతానికి పెరిగింది. 2017 జూన్‌లో ఈ రేటు కొంచెం ఎక్కువగా 2.27 శాతంగా ఉంది. కూరగాయల ధరలు పైకి... వార్షికంగా మొత్తం ఆహార ఉత్పత్తుల బాస్కెట్ ధరల స్పీడ్ తగ్గినట్లు కనిపించినప్పటికీ, కొన్ని నిత్యావసరాల ఉత్పత్తుల ధరలు మాత్రం ఆకాశాన్నంటాయి. ప్రత్యేకించి కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. 2017 మే, జూన్ నెలల్లో కూరగాయల ధరల బాస్కెట్ ధరల్లో (2016 మే, జూన్ నెలల ధరలతో పోల్చి) క్షీణత కనిపించింది. అయితే 2017 జూలైలో మాత్రం కూరగాయల ధరల స్పీడ్ భారీగా పెరిగింది. జూన్‌లో కూరగాయల ధరల్లో అసలు పెరుగుదల లేకపోగా – 21.16 శాతం క్షీణిస్తే, జూలైలో ఈ రేటు భారీగా 21.95 శాతం ఎగిసింది. గుడ్లు, మాంసం, చేపల ధరలు 3.30 శాతం పెరిగితే, పండ్ల ధరలు 2.71 శాతం, తృణధాన్యాల ధరలు 0.63 శాతం, ధాన్యం ధర 3.47 శాతం ఎగిశాయి. చక్కెర ధర 8.44 శాతం పెరిగింది. కాగా బంగాళదుంపల ధరలు 42.45 శాతం తగ్గాయి. పప్పుల ధరలు 32.56 శాతం దిగివచ్చాయి. రిటైల్‌గా చూస్తే... జూలైలో చక్కెర, తీపి పదార్థాల ఉత్పత్తులు (8.27 శాతం), పాన్, పొగాకు, ఇతర మత్తు ప్రేరిత ఉత్పత్తుల (6.39 శాతం) ధరలు పెరిగాయి. ఆహార ధరల ద్రవ్యోల్బణం క్షీణతలోనే ఉన్నప్పటికీ, ఇది –2.12 శాతం (జూన్) నుంచి –0.29 శాతానికి (జూలై) చేరింది. హౌసింగ్ వ్యయాలు 4.98 శాతం ఎగిశాయి. ఫ్యూయల్, లైట్ విభాగంలో పెరుగుదల రేటు 4.86 శాతంగా ఉంది. దుస్తులు, పాదరక్షల ధరలు 4.22 శాతం ఎగిశాయి. ఇక పప్పు దినుసుల ధరలు –24.75 శాతం తగ్గాయి. ఇక వేర్వేరుగా చూస్తే... గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం రేటు 1.52 శాతం నుంచి 2.41 శాతానికి పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో రేటు 1.41 శాతం నుంచి 2.17 శాతానికి ఎగిసింది. -
దిగి వచ్చిన టోకు ధరల సూచీ..
న్యూఢిల్లీ: మార్చి నెల టోకు ధరల ఆధారిత సూచీ (డబ్ల్యూపీఐ) దిగివచ్చింది. ఫిబ్రవరి నెలలో 6.55 శాతంతో పోలిస్తే మార్చినెల డబ్ల్యుపీఐ 5.70శాతంగా నమోదైంది. ఇంధన ధరలు, తయారీ వస్తువుల ధరలు తగ్గిన కారణంగా టోకు ధరల ద్రవ్యోల్బణం కూడా శాంతించింది. 2016-17 ఆర్థికి సంవత్సరంలో పెరుగుతే వచ్చిన సూచీ నాలుగు సం.రాల గరిష్టాన్నినమోదు చేసింది. ఎనలిస్టుల అంచనాలను తారుమారుచేస్తూ టోకు ధరల సూచి దిగి రావడం విశేషం. గతేడాది ఇదేకాలంతో పోల్చితే.. డిఫ్లేషన్ నుంచి బయటపడింది. 2016 ఫిబ్రవరిలో మైనెస్ 0.45 శాతంగా ఉన్న డబ్ల్యూపీఐ ప్రతికూలత నుంచి బయకువచ్చింది. తయారీ వస్తువుల ధరలు తగ్గిన కారణంగానే సూచీ 5.70 శాతంగా నమోదయ్యిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇంధన ధరలు 21.02 శాతం నుంచి 18.16 శాతానికి తగ్గడం, తయారీ వస్తువుల ధరలు 3.66 శాతం నుంచి 2.99 శాతానికి తగ్గడం లాంటి సానుకూల అంశాలతో నెలరోజుల పరంగా తగ్గుదల నమోదయ్యింది. అయితే, ఆహారోత్పత్తుల ధరలు 2.69 శాతం నుంచి 3.12 శాతం పెరగడం.. ప్రత్యేకించి పండ్ల ధరలు 7.62 శాతంగా నమోదు కావడం, గుడ్లు, మాంసం, చేపల ధరలు 3.12 శాతంగా ఉండడం వల్ల టోకు ధరల సూచీ 5.70 శాతంగా నమోదయ్యింది. లేదంటే, డబ్ల్యూపీఐ ఇంకా తగ్గేదని డేటా వెల్లడిస్తోంది. మరోవైపు 2017 సగటు ద్రవ్యోల్బణ సగటు 3.7 శాతంతోలిస్తే 2018 ఆర్థికసంవత్సరంలో ద్రవ్యోల్బణం సగటున 4.8 శాతంగా ఉండనుందని కొటక్ మహీంద్రా బ్యాంకు విశ్లేషకులు అంచనా వేశారు. -
టోకు, రిటైల్ ధరల మంట..
⇒ ఫిబ్రవరిలో టోకు ద్రవ్యోల్బణం 6.55 శాతం ⇒ రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 3.65 శాతం ⇒ వేగంగా పెరిగిన నిత్యావసర ఆహార ఉత్పత్తుల ధరలు న్యూఢిల్లీ: నిత్యావసర ఆహార ఉత్పత్తుల ధరల తీవ్రత ప్రభావం ఫిబ్రవరిలో అటు టోకు ధరలు, ఇటు రిటైల్ ధరలు రెండింటిపై ప్రభావం చూపించింది. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత టోకు ద్రవ్యోల్బణం 6.55 శాతంగా నమోదుకాగా, వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 3.65 శాతంగా నమోదయ్యింది (2016 ఫిబ్రవరితో పోల్చిచూస్తే). 2017 జనవరిలో టోకు ద్రవ్యోల్బణం రేటు 5.25%గా ఉండగా, రిటైల్ ద్రవ్యోల్బణం 3.17 శాతంగా ఉంది. సూచీలనూ వేర్వేరుగా చూస్తే... టోకు ద్రవ్యోల్బణం 39 నెలల గరిష్టం.. ⇔ ఆహార, ఇంధన ధరలు పెరగడం ఇందుకు ప్రధాన కారణం. 2017 జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 5.25 శాతంగా ఉంది. ఆహార ధరలు ఫిబ్రవరిలో వార్షికంగా 2.69 శాతం పెరిగితే, జనవరిలో ఈ రేటు 0.56 శాతంగా ఉంది. తృణధాన్యాలు, బియ్యం, పండ్ల ధరలు పెరిగాయి. అయితే కూరగాయల ధరలు మాత్రం 8.05 శాతం పెరిగాయి. ⇔ ఇంధన ధరల బాస్కెట్ –7.07 శాతం క్షీణత నుంచి 21.02 శాతానికి పెరిగింది. ⇔ సూచీలో మెజారిటీ వెయిటేజ్ ఉన్న తయారీ రంగంలో ద్రవ్యోల్బణం వార్షికంగా క్షీణత –0.52 శాతం నుంచి 3.66 శాతానికి ఎగసింది. రిటైల్ నాలుగు నెలల గరిష్టానికి... జనవరిలో 3.17 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం, తరువాతి నెల ఫిబ్రవరిలో నాలుగు నెలల గరిష్ట స్థాయి 3.65 శాతానికి చేరింది. రిటైల్‌గా చూస్తే– ఆహార ఉత్పత్తుల ద్రవ్యో ల్బణం 2.01 శాతంగా నమోదయ్యింది. (జనవరిలో 0.61 శాతం) పండ్ల ధరలు భారీగా 8.33 శాతం పెరిగాయి. ఇంధనం, లైట్ విభాగంలో రేటు 3.9 శాతంగా ఉంది. మాంసం, చేపల ధరలు 3.5 శాతానికి ఎగశాయి. చక్కెర, తీపి పదార్థాల ధరలు 18.83 శాతం పైకి లేచాయి. పాలు, పాల ఉత్పత్తుల ధరలు 4.22 శాతం పెరిగాయి. గృహోపకరణాలు, సేవల విభాగంలో రేటు 4.09 శాతంగా ఉంది. ఆరోగ్య విభాగంలో ద్రవ్యోల్బణం 4 శాతం ఉంది. రవాణా, కమ్యూనికేషన్ల విభాగంలో ద్రవ్యోల్బణం 5.39 శాతం ఎగసింది. కూరగాయలు, పప్పు దినుసుల ధరలు మాత్రం –8.29 శాతం, –9.02 శాతం చొప్పున తగ్గాయి.దుస్తులు, పాదరక్ష విభాగంలో రేటు 4.38 శాతంగా ఉంది. హౌసింగ్ సెగ్మెంట్లో ఈ రేటు 4.9 శాతంగా ఉంది. మరోవైపు గ్రామీణ ప్రాంత రిటైల్ ద్రవ్యోల్బణం నెలవారీగా ఫిబ్రవరిలో 3.36 శాతం నుంచి 3.67 శాతానికి పెరగ్గా, పట్టణ ప్రాంతాల్లో ఈ రేటు 2.9 శాతం నుంచి 3.55 శాతానికి చేరింది. కాగా ధరల పెరుగుదల కారణంగా 2017 మార్చి నాటికి ద్రవ్యోల్బణం 4.5 శాతంపైకి ఎగసే అవకాశం ఉందని ఇక్రా ప్రిన్షిపల్ ఎకనమిస్ట్ ఆదితి నయ్యర్ అభిప్రాయపడ్డారు. రేట్లు ఇక యథాతథమే..! బ్యాంకులకు తానిచ్చే రుణరేటు– రెపో (ప్రస్తుతం 6.25 శాతం) ఇక తగ్గించడం కష్టమేనని గత పాలసీ సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పేర్కొంది. తాజా ద్రవ్యోల్బణం ఒత్తిళ్ల నేపథ్యంలో ఇదే విధంగా ఆర్బీఐ ఇకముందూ కొనసాగించే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ 6న ఆర్బీఐ తదుపరి పాలసీ సమీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. -
జనవరి, ఫిబ్రవరిల్లో ‘టోకు’ ద్రవ్యోల్బణం పెరుగుతుంది
ఇక్రా అంచనా... న్యూఢిల్లీ: వృద్ధిని పెంచే సంస్కరణలు కావాలని ఫిక్కి ప్రెసిడెంట్ పంకజ్ పటేల్ కోరారు. వినియోగం జోరు పెంచే వృద్ధి ఆధారిత సంస్కరణలు, ఉద్యోగ కల్పన పెంచే పెట్టుబడులు అవసరమని పేర్కొన్నారు. మరోవైపు డిసెంబర్లో టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) 3.39 శాతానికి పెరగడంతో జనవరి, ఫిబ్రవరిల్లో కూడా టోకు ధరల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలే ఉన్నాయని ప్రముఖ రేటింగ్ సంస్థ, ఇక్రా అంచనా వేస్తోంది. 2015, డిసెంబర్లో మైనస్ 1.06 శాతంగా ఉన్న టోకు ధరల ద్రవ్యోల్బణం గత ఏడాది నవంబర్‌లో 3.15 శాతంగా నమోదైంది. పారిశ్రామికోత్పత్తి మెరుగుపడిందని తాజా గణాంకాలు వెల్లడించాయని, బేస్ ఎఫెక్ట్ దీనికి కారణమని ఫిక్కి ప్రెసిడెంట్ పంకజ్ పటేల్ చెప్పారు. నిలకడైన వృద్ధి సాధించాలంటే సంస్కరణలపై దృష్టి పెట్టాలని సూచించారు. ముడి చమురు ధరలు పెరుగుతుండడం, డాలర్ బలపడుతుండడం వల్ల్ల గత నెలలో ఉత్పత్తి వ్యయాలు పెరిగాయని ఆసోచామ్ సెక్రటరీ జనరల్ డి.ఎస్. రావత్ చెప్పారు. ఇప్పటికే డిమాండ్ తగ్గి కుదేలై ఉన్న కంపెనీల లాభదాయకతపై ఉత్పత్తి వ్యయాలు పెరగడం ప్రతికూల ప్రభావం చూపుతోందని వివరించారు. ఆహార ద్రవ్యోల్బణం ఈ క్వార్టర్లో, టోకు ధరల ద్రవ్యోల్బణం జనవరి, ఫిబ్రవరిల్లో పెరిగే అవకాశాలున్నాయని ఇక్రా ప్రధాన ఆర్థిక వేత్త అదితి నాయర్ చెప్పారు. -
టోకు వస్తువుల డిమాండూ డౌన్!
• నవంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం 3.15% • పెద్ద నోట్ల రద్దు ప్రభావం... న్యూఢిల్లీ: రూ.500, రూ.1,000 పెద్ద నోట్ల రద్దు ప్రభావం వ్యవస్థలో డిమాండ్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. రిటైల్‌తో పాటు టోకు వస్తువుల డిమాండ్ ప్రత్యేకించి ఆహార ఉత్పత్తుల విషయంలో భారీగా పడిపోయింది. నవంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం 3.15 శాతంగా నమోదయ్యింది. అంటే టోకు వస్తువుల బాస్కెట్ ధర 2015 నవంబర్‌తో పోల్చితే 2016 నవంబర్‌లో 3.15 శాతమే పెరిగిందన్నమాట. అక్టోబర్‌లో ఈ రేటు 3.39 శాతం. ఫుడ్, నాన్–ఫుడ్ ఆర్టికల్స్ విభాగంలో డిమాండ్ మందగమన జాడలు బుధవారం వాణిజ్యమంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల్లో కనిపించాయి. మంగళవారం విడుదలైన నవంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం కూడా రెండేళ్ల కనిష్ట స్థాయిలో 3.63 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. తాజా గణాంకాలు చూస్తే... ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్–ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో టోకు ద్రవ్యోల్బణం 1.25 శాతంగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 2.15 శాతం. వేర్వేరుగా చూస్తే, ఫుడ్ ఆర్టికల్స్‌లో రేటు 2.55 శాతం నుంచి 1.54 శాతానికి తగ్గింది (అక్టోబర్‌లో 4.34 శాతం). నాన్–ఫుడ్ ఆర్టికల్స్‌లో ద్రవ్యోల్బణం పెరక్కపోగా –0.14% క్షీణించింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 6.33 శాతం. ఆహార ఉత్పత్తులకు సంబంధించి టోకున కూరగాయల ధరలు అసలు పెరక్కపోగా, – 24.10 శాతం క్షీణించాయి. తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60 శాతం వాటా కలిగిన ఈ విభాగంలో కూడా టోకు ద్రవ్యోల్బణం –1.42 క్షీణత నుంచి 3.20 శాతం పెరుగుదల నమోదుచేసుకుంది. -
దిగి వచ్చిన టోకు ధరల ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: అక్టోబర్ నెలకు సంబంధించిన టోకు ధరల సూచి (డబ్ల్యుపిఐ) క్రమంగా దిగి వచ్చింది. ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం వరుసగా రెండో నెలలో కూడా టోకుధరల ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. అక్టోబరు లో 3.39 శాతంగా నమోదైంది. దేశీ టోకు ధరలు ఊహించిన కంటే తక్కువ వేగంగా పెరిగాయని ఎనలిస్టులు చెబుతున్నారు. రాయిటర్స్ పోల్ లో ఆర్థికవేత్తలు 3.75 శాతం వార్షిక పెరుగుదలను అంచనా వేశారు. సెప్టెంబర్ మాసానికి టోకు ధరల ద్రవ్యోల్బణం3.57 శాతంగా ఉంది. సెప్టెంబర్ నెలలో 5.75 పెరుగుదలతో పోలిస్తే గత నెలలో ఆహార ధరలు 4.34 శాతానికి దిగి వచ్చాయి.. గత నెలలో టోకు ఆహార ధరలు సెప్టెంబర్ లో ఒక తాత్కాలిక 5.75 శాతం పోలిస్తే 4.34 శాతంగా నమోదైంది. -
రెండేళ్ల గరిష్టానికి టోకు ధరల ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: జూలై నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) అంచనాలకు మించి ఎగబాకింది. జూన్ నెలతో పోలిస్తే దాదాపు రెట్టింపు శాతం నమోదైంది. 1.62 శాతం నుంచి 3.55 శాతానికి పెరగడం మార్కెట్ల వర్గాలను విస్మయ పర్చింది. ఆహార ధరలు 3.55 శాతంతో దాదాపు 23 నెలల గరిష్టానికి తాకింది. . జూన్‌లో టోకు ద్రవ్యోల్బణం 1.62 శాతంగా ఉంది. 2013 తరువాత ఇదే గరిష్టమని ఎనలిస్టులు చెబుతున్నారు. దీంతో మార్కెట్లో సెంటిమెంట్ దెబ్బతినడంతో భారీ అమ్మకాల ఒత్తిడి ఏర్పడింది. సెప్టెంబర్ లో కొత్త పంట వస్తే తప్ప ద్రవ్యోల్బణం ఒత్తిడి తగ్గదని కేర్ రేటింగ్స్ చీఫ్ ఆర్థికవేత్త, మదన్ సబ్నవీస్ అభిప్రాయపడ్డారు. పంట అనంతరం ద్రవ్యోల్బణం ఒత్తిడి తగ్గించేందుకు అవకాశం ఉంది అన్నారు. జూన్‌లో 8.18 శాతం లాభంతో పోలిస్తే టోకు ఆహార ధరలు గత నెల 11.82 శాతం పెరిగింది వ్యక్తిగత ఆహార వస్తువులలో బంగాళాదుంప ధరలు 59 శాతం, కూరగాయలు 28శాతం, పప్పులు 36 శాతం, చక్కెర 32 శాతం పెరిగాయి. వినియోగదారుల ధరలు ఊహించిన దానికంటే వేగంగా పెరిగాయి. జూన్ లో 5.77 శాతం ఉంటే ప్రస్తుతం 6.07 శాతం ఎగబాకాయి. -
దూసుకెళ్లిన టోకు ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: టోకు ధరల ద్రవ్యోల్బణం అంచనాలకు మించి పైకి ఎగబాకింది. జూన్ మాసంలోఇది 1.62 శాతంగా నమోదైంది. ఈ ఏడాది మే నెలలోని 0.79 శాతంతో పోలిస్తే అంచనాలకు మించి మరింత పైకి దూసుకుపోయింది. ఆహార ద్రవ్యోల్బం 8.18శాతానికి చేరింది. రిటైల్ ద్రవ్యోల్బణం 22 నెలల గరిష్టాన్ని తాకడం దీనికి కారణంగా అంచనావేస్తున్నారు. కూరగాయలకు, పళ్లు,తృణ ధాన్యాల ధరల్లో పెరడతంతో టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం పెరుగుదలకు దోహదం చేసిందన్నారు. జూన్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.77 శాతంతో 22 నెలల గరిష్టాన్ని తాకింది. గతేడాది జూన్‌లో ఈ రిటైల్ ద్రవ్యోల్బణం 5.40 శాతంగా ఉంది. మరో వైపు ఇదే ఏడాది మే నెలలో 5.76 శాతంగా ఉంది. ఆగస్టు 2014లో వినియోగదారు(రిటైల్) ద్రవ్యోల్బణం 7.8 శాతంగా నమోదయిన తర్వాత మళ్లీ దాదాపు ఆ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. రిటైల్ ద్రవ్యోల్బణం 22 నెలల గరిష్టానికి, పారిశ్రామిక ఉత్పత్తి విభాగాల వారీ చూస్తే ఆహార ద్రవ్యోల్బణం మే నెలలో 7.47 శాతం ఉండగా, జూన్‌లో 7.79 శాతానికి పెరిగింది. కూరగాయలకు సంబంధించిన ధరల్లో పెరుగుదల మే నెలలో 10.77 శాతం ఉండగా జూన్‌లో 14.74 శాతానికి పెరిగింది. మే నెలలో కూరగాయల ద్రవ్యోల్బణం 31.57 శాతం ఉండగా జూన్ నెలకు 26.86 శాతానికి తగ్గింది. మే నెలలో పారిశ్రామిక ఉత్పత్తి 1.2 శాతం వృద్ది తో ఉత్సాహకరంగా నిలిచింది. -
పెరిగిన టోకు ధరల ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ : టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మొదటిసారి పాజిటివ్ గా నమోదైంది. వరుసగా గత 17 నెలలుగా క్షీణతలోనే ఉన్న టోకు ధరల ద్రవ్యోల్బణం 18నెలల్లో మొదటిసారి పెరిగింది. సోమవారం విడుదల చేసిన ఏప్రిల్ నెల టోకుధరల ద్రవ్యోల్బణం గతేడాది ఇదే నెలతో పోలిస్తే 0.34 శాతం పెరిగింది. ఆహార, తయారీ ఉత్పత్తుల ధరలు పెరగడంతో ఈ ద్రవ్యోల్బణం పెరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ నెలలో దేశీయ ఆహార ధరల ఇండెక్స్ 4.23 శాతం పెరిగిందని ప్రభుత్వం తెలిపింది. మార్చిలో ఈ ఇండెక్స్ 3.73శాతంగా ఉంది. తయారీ ఉత్పత్తుల ధరలు ఏప్రిల్ లో 0.71 శాతం పెరిగినట్టు గణాంకాలు వెల్లడయ్యాయి. అయితే ఆయిల్ ధరలు ఏప్రిల్ నెలలో 4.83శాతం పడిపోయాయి. ద్రవ్యోల్బణాన్ని కొలవడంలో టోకుధరల సూచీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. టోకు అమ్మకాల ఉత్పత్తుల ధరలకనుగుణంగా ఈ గణాంకాలను విడుదల చేస్తారు. భారత్ లో టోకు ధరల సూచీని ముఖ్యంగా మూడు గ్రూపులుగా విభజిస్తారు. ప్రైమరీ ఆర్టికల్స్(మొత్తం కొలమానంలో 20.1శాతం) ఆయిల్, విద్యుత్(14.9శాతం), తయారీ ఉత్పత్తులు(65శాతం). ప్రైమరీ ఆర్టికల్స్ లో ఆహార ఉత్పత్తులను ప్రధాన వాటిగా గుర్తిస్తారు. ఇవి 14.3శాతం వాటాను కలిగి ఉంటాయి. తయారీ ఉత్పత్తుల గ్రూపులో కెమికల్, కెమికల్ ఉత్పత్తులు 12శాతం వాటాతో ముఖ్యమైనవిగా ఉంటాయి. బేసిక్ మెటల్స్, అలాయ్ అండ్ మెటల్ ఉత్పత్తులు 10.8శాతం, టెక్స్ టైల్స్ 7.3శాతం, రవాణా, పరికరాలు, పార్ట్ లు 5.2శాతం, మిషనరీ, మిషనరీ టూల్స్ 8.9శాతం వాటాను కలిగి ఉంటాయి. -
దిగి వస్తున్న ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ : సోమవారం విడుదల చేసిన మార్చి నెల టోకుధరల ద్రవ్యోల్బణం సూచీ శుభసంకేతాలు అందించింది. వరుసగా 17 నెలలుగా నేలచూపులు చూస్తున్న ద్రవ్యోల్బణం ఈ నెలలో కూడా పతనమైంది. క్రమేపీ దిగి వస్తూ మార్చి నెలలో 0.85 శాతంగా నమోదైంది. దీంతో గత కొంతకాలంగా భగ్గుమంటున్న టోకు ధరలు దిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. అటు ఈనెలలో విడుదల అవుతున్న ఫలితాలన్నీ మార్కెట్ కు సానుకూల సంకేతాలను అందిండంతో స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఓ వైపు టోకుధరల ద్రవ్యోల్బణం క్షీణత, మరోవైపు ఇన్ఫోసిస్ షేర్ల లాభాలు, మార్కెట్లకు మంచి ఉత్సాహాన్నిచ్చాయి. దీంతో 162 పాయింట్లకు పైగా లాభపడి జోరుగా ట్రేడ్ అవుతోంది. ఫిబ్రవరి నెలలో ఈ టోకుధరల ద్రవ్యోల్బణం 0.91శాతంగా ఉంది. ఆయిల్ ధరలు, తయారీ ఉత్పత్తుల ధరలు పడిపోవడంతో టోకుధరలు తగ్గినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కిందటేడాది మార్చి కంటే క్రూడ్ ధరలు 8.30శాతం పడిపోయాయి. తయారీ ఉత్పత్తులు 0.13 శాతం కిందకు జారాయి. ఈ టోకుధరల ద్రవ్యోల్బణం లెక్కించడంలో వాణిజ్య ఆహారోత్పత్తులతో పాటు క్రూడ్, విద్యుత్, తయారీ ఉత్పత్తులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఫిబ్రవరిలో 3.35 శాతంగా ఉన్న ఆహారోత్పత్తుల ధరలు మార్చిలో 3.7శాతం కు పెరిగాయి. వాణిజ్య ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగుతూ ఉండటంతో, అధిక వేగంతో ధరల తగ్గుదలను (డిఫ్లేషన్) నిరోధిస్తుందని ఐసీఆర్ఏ ఎకనామిస్ట్ అదితీ నాయర్ చెప్పారు. దీనివల్ల రూపాయి విలువ కూడా పెరుగుతుందన్నారు. వినియోగదారుల సూచీలో రిటైల్ ఆహారోత్పత్తులకు ముఖ్య పాత్ర ఉండగా, టోకు ధరల సూచీలో వాణిజ్య ఉత్పత్తులను, కమోడిటీలను ప్రధాన ఉత్ప్తత్తులుగా తీసుకుంటారు. -
క్యూ2 ఫలితాలు కీలకం..
రిటైల్, టోకు ద్రవ్యోల్బణం గణాంకాలకూ ప్రాధాన్యత * ఐఐపీ ఎఫెక్ట్ ఉంటుంది * ట్రేడింగ్ 4 రోజులకే పరిమితం * ఈ వారం మార్కెట్ల తీరుపై నిపుణుల అంచనా న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం(2014-15) జూలై-సెప్టెంబర్(క్యూ2) కాలానికి దేశీ కార్పొరేట్ దిగ్గజాల పనితీరుపై మార్కెట్లు దృష్టిపెడతాయని స్టాక్ విశ్లేషకులు పేర్కొన్నారు. పెట్రోకెమికల్స్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ వంటి బ్లూచిప్ కంపెనీలు ఈ వారం క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇవికాకుండా రిటైల్ ధరల ద్రవ్యోల్బణ(సీపీఐ) గణాంకాలు సోమవారం(13న), టోకు ధరల ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) వివరాలు మంగళవారం(14న) వెలువడనున్నాయి. అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బుధవారం(15న) బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెలవు ప్రకటించారు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా, గడిచిన శుక్రవారం(10న) మార్కెట్లు ముగిశాక ఆగస్ట్ నెలకు పారిశ్రామికోత్పత్తి గణాంకాలు(ఐఐపీ) వెలువడ్డాయి. పలు మీడియా సంస్థలు, ఆర్థికవేత్తలు 2% స్థాయిలో పారిశ్రామిక వృద్ధిని అంచనా వేయగా, 0.4%కు పరిమితమైంది. ఈ ప్రభావం సోమవారం(13న) ట్రేడింగ్‌లో ప్రతిఫలించే అవకాశమున్నట్లు నిపుణులు అంచనా వేశారు. చమురు ధరల ప్రభావం: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపట్ల చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పతనమవుతూ వస్తున్నాయి. మరోవైపు డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ రూపాయి బలహీనపడుతూ వస్తోంది. ఈ రెండు అంశాలు మార్కెట్ల దిశను నిర్ధారించే అవకాశముందని అత్యధిక శాతం మంది నిపుణులు విశ్లేషించారు. ఎఫ్ఐఐల పెట్టుబడులపై దృష్టి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) లావాదేవీలపైనా ప్రధానంగా ట్రేడర్లు దృష్టిసారిస్తారని విశ్లేషకులు పేర్కొన్నారు. గత కొద్ది నెలల ట్రెండ్‌కు విరుద్ధంగా రెండు వారాల నుంచి దేశీ స్టాక్స్‌లో ఎఫ్ఐఐలు నికర అమ్మకందారులుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఎఫ్ఐఐల పెట్టుబడుల తీరు సెంటిమెంట్‌ను ప్రభావితం చేసే అవకాశముందని స్టాక్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా, సోమవారం ట్రెండ్‌పై తొలుత ఐఐపీ ప్రభావం ఉంటుందని, ఆపై సీపీఐ వివరాలు సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ చెప్పారు. ప్రధానంగా వినియోగ వస్తువులకు డిమాండ్ తగ్గడం, తయారీ రంగం మందగించడం వంటి అంశాల కారణంగా ఆగస్ట్‌లో పారిశ్రామికోత్పత్తి ఐదు నెలల కనిష్టానికి చేరిందని జయంత్ విశ్లేషించారు. ఫలితాల బాటలో దిగ్గజాలు ఈ వారం రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ వంటి దిగ్గజాలతోపాటు, ఆటో రంగ దిగ్గజాలు బజాజ్ ఆటో, హీరోమోటో కార్ప్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, అల్ట్రాటెక్ సిమెంట్ క్యూ2 ఫలితాలను ప్రకటించనున్నాయి. వెరసి ఈ వారం ట్రేడింగ్‌ను దిగ్గజాల ఫలితాలు, ద్రవ్యోల్బణ గణాంకాలు నడిపించనున్నాయని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా పేర్కొన్నారు. అంతర్జాతీయ బలహీనతల కారణంగా గత వారం సెన్సెక్స్ 271 పాయింట్ల నష్టంతో 26,297 వద్ద ముగిసింది. ఎఫ్ఐఐల అమ్మకాలు ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) ఈక్విటీలలో నికరంగా రూ.800 కోట్ల అమ్మకాలను చేపట్టారు. అయితే ఇదే సమయంలో మరోపక్క రుణ సెక్యూరిటీలలో రూ. 6,300 కోట్లను నికరంగా ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. 7 నెలల తరువాత మళ్లీ సెప్టెంబర్ నెలలో ఎఫ్ఐఐల పెట్టుబడులు కనిష్టానికి చేరిన నేపథ్యంలో తాజా అమ్మకాలకు ప్రాధాన్యత ఏర్పడింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ అంచనాలకంటే ముందుగానే వడ్డీ రేట్ల పెంపు నిర్ణయాన్ని ప్రకటించవచ్చునన్న అంచనాలు ఇందుకు కొంతమేర కారణమైనట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీ మార్కెట్లు స్థిరీకరణ(కన్సాలిడేషన్)లో ఉన్నాయని, దీంతో ఎఫ్ఐఐలు లాభాల స్వీకరణకు అమ్మకాలు చేపడుతున్నారని సీఎన్ఐ రీసెర్చ్ హెడ్ కిషోర్ ఓస్త్వాల్ చెప్పారు. ఈ ఏడాది జనవరి మొదలు ఇప్పటివరకూ ఎఫ్ఐఐలు దేశీ స్టాక్స్‌లో రూ. 82,561 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, సెప్టెంబర్‌లో ఇవి రూ. 5,100 కోట్లు. -
టోకు ధరలూ...దిగొచ్చాయ్
న్యూఢిల్లీ: ధరాఘాతం నుంచి సామాన్యుడికి కాస్త ఉపశమనం లభిస్తోంది. తొమ్మిది నెలల తర్వాత తొలిసారిగా టోకు ధరల సూచీ ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం కీలకమైన 5 శాతం కిందికి దిగొచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 4.68 శాతానికి తగ్గుముఖం పట్టింది. జనవరిలో ఈ రేటు 5.05 శాతంగా, క్రితం ఏడాది ఫిబ్రవరిలో 7.28 శాతంగా నమోదైంది. ప్రధానంగా ఉల్లిపాయలు, బంగాళాదుంపల ధరలు భారీగా తగ్గడం ద్రవ్యోల్బణం శాంతించేందుకు దోహదం చేసింది. గతేడాది మే నెల(4.58%) తర్వాత మళ్లీ ఈ స్థాయిలో టోకు ధరల రేటు నమోదు కావడం ఇదే మొదటిసారి. రిటైల్ ధరల ద్రవ్యోల్బణం కూడా ఫిబ్రవరిలో 25 నెలల కనిష్టానికి(8.1%) తగ్గడం తెలిసిందే. ధరల కట్టడి నేపథ్యంలో వచ్చే నెల 1న ఆర్బీఐ చేపట్టనున్న పరపతి విధాన సమీక్షలో పాలసీ వడీరేట్లను తగ్గించేందుకు అవకాశం ఉందన్న ఆశలు పెరుగుతున్నాయి. ఆహార ధరలకు కళ్లెం... ప్రభుత్వానికి ఆందోళనకరంగా మారిన ఆహార ద్రవ్యోల్బణం భారీగా దిగొచ్చింది. జనవరిలో 8.8 శాతంగా ఉన్న ఈ రేటు ఫిబ్రవరిలో 8.12 శాతానికి తగ్గింది. పాలు, పండ్లు, బియ్యం మినహా దాదాపు అన్ని రకాల ఆహార వస్తువుల ధరలూ శాంతించడం గమనార్హం. వార్షిక ప్రాతిపదికన... అంటే గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఇదే నెలలో ఉల్లిపాయల ధరలు 20.06% బంగాళాదుంపల ధరలు 8.36% తగ్గాయి. మొత్తం కూరగాయల విభాగం ద్రవ్యోల్బణం ఏకంగా ఫిబ్రవరిలో 3.99 శాతానికి దిగొచ్చింది. జనవరిలో ఈ రేటు 16.6 శాతం కావడం గమనార్హం. పప్పులు, తృణధాన్యాలు, గోధుమలు, పండ్లు, పాలు, గుడ్లు, చేపలు, మాంసం ధరలు మాత్రం ఫిబ్రవరిలో ప్రియం అయ్యాయి. వంటనూనెలు, చక్కెర ఇతరత్రా వస్తువులతో కూడిన తయారీ రంగ విభాగం ద్రవ్యోల్బణం రేటు జనవరిలో మాదిరిగానే 2.76 శాతంగా నమోదైంది. ఇకనైనా వడ్డీరేట్లు తగ్గించాలి: కార్పొరేట్లు రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణాలు రెండూ భారీగా దిగొచ్చిన నేపథ్యంలో ఆర్బీఐ ఇకనైనా వడ్డీరేట్లను తగ్గించాలని పారిశ్రామిక రంగం డిమాండ్ చేసింది. స్ధూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటును మందగమనం నుంచి గాడిలోపెట్టాలంటే రేట్ల కోత తప్పనిసరి అని కార్పొరేట్లు పేర్కొన్నారు. ఆనందంగా ఉంది మొత్తంమీద ధరలు దిగొస్తుండటం ఆనందం కలిగిస్తోంది. అయితే ద్రవ్యోల్బణం ధోరణిని జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ధరలు శాంతించడం సంతృప్తి కలిగిస్తోంది. - పి. చిదంబరం, ఆర్థిక మంత్రి శుభవార్త ఇది ధరల పరిస్థితి అదుపులోకి రావడం నిజంగా శుభవార్తే. ఇప్పటిదాకా ఆందోళన కలిగిస్తున్న ద్రవ్యోల్బణం... ఎట్టకేలకు సంతృప్తికరమైన స్థాయికి దిగిరావడం ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూర్చే అంశం. - మాంటెక్ సింగ్, ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్