టోకు ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 1.26%
13 నెలల గరిష్టం
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 1.26 శాతంగా నమోదైంది. గడచిన 13 నెలల్లో ఈ స్థాయి టోకు ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడం దీనికి ప్రధాన కారణం. ఫుడ్ ఆరి్టకల్స్‌లో పాటు, విద్యుత్, క్రూడ్ పెట్రోలియం, సహజ వాయువు, కొన్ని తయారీ ఉత్పత్తుల ధరలూ పెరిగినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సూచీ వరుసగా రెండు నెలల నుంచి పెరుగుతూ వస్తోంది. ఫిబ్రవరిలో 0.20% ఉన్న డబ్ల్యూపీఐ, మార్చిలో 0.53 శాతానికి ఎగసింది. గత 2023 ఏప్రిల్‌లో సూచీ 0.79 శాతం పెరిగింది.
అధికారిక గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే..
⇒ ఫుడ్ ఆర్టికల్స్ ధరలు మార్చిలో 6.88 శాతం పెరిగితే, ఏప్రిల్‌లో 7.74 శాతం ఎగశాయి. ఇదే కాలంలో కూరగాయల ధరలు 19.52 శాతం నుంచి 23.60 శాతానికి ఎగశాయి. ఆలూ ధరలు 52.96 శాతం నుంచి 71.97 శాతానికి పెరిగాయి. ఇక ఉల్లి ధరలు మార్చిలో 56.99% పెరిగితే, ఏప్రిల్‌లో 59.75 % ఎగశాయి.
⇒ఫ్యూయల్ అండ్ పవర్ బాస్కెట్ విభాగంలో ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 1.38 శాతంగా ఉంది. మార్చిలో ఈ విభాగంలో అసలు పెరుగుదల లేకపోగా మైనస్ 0.77 శాతంగా (క్షీణత) నమోదైంది.
⇒సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం మాత్రం ఏప్రిల్‌లో పెరక్కపోగా, 0.42 శాతం క్షీణించింది. అయితే మార్చిలో ఈ క్షీణ రేటు 0.85 శాతం ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment