న్యూఢిల్లీ: టోకు ధరల ద్రవ్యోల్బణం అంచనాలకు మించి పైకి ఎగబాకింది. జూన్ మాసంలోఇది 1.62 శాతంగా నమోదైంది. ఈ ఏడాది మే నెలలోని 0.79 శాతంతో పోలిస్తే అంచనాలకు మించి మరింత పైకి దూసుకుపోయింది. ఆహార ద్రవ్యోల్బం 8.18శాతానికి చేరింది. రిటైల్ ద్రవ్యోల్బణం 22 నెలల గరిష్టాన్ని తాకడం దీనికి కారణంగా అంచనావేస్తున్నారు. కూరగాయలకు, పళ్లు,తృణ ధాన్యాల ధరల్లో పెరడతంతో టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం పెరుగుదలకు దోహదం చేసిందన్నారు.
జూన్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.77 శాతంతో 22 నెలల గరిష్టాన్ని తాకింది. గతేడాది జూన్‌లో ఈ రిటైల్ ద్రవ్యోల్బణం 5.40 శాతంగా ఉంది. మరో వైపు ఇదే ఏడాది మే నెలలో 5.76 శాతంగా ఉంది. ఆగస్టు 2014లో వినియోగదారు(రిటైల్) ద్రవ్యోల్బణం 7.8 శాతంగా నమోదయిన తర్వాత మళ్లీ దాదాపు ఆ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. రిటైల్ ద్రవ్యోల్బణం 22 నెలల గరిష్టానికి, పారిశ్రామిక ఉత్పత్తి విభాగాల వారీ చూస్తే ఆహార ద్రవ్యోల్బణం మే నెలలో 7.47 శాతం ఉండగా, జూన్‌లో 7.79 శాతానికి పెరిగింది. కూరగాయలకు సంబంధించిన ధరల్లో పెరుగుదల మే నెలలో 10.77 శాతం ఉండగా జూన్‌లో 14.74 శాతానికి పెరిగింది. మే నెలలో కూరగాయల ద్రవ్యోల్బణం 31.57 శాతం ఉండగా జూన్ నెలకు 26.86 శాతానికి తగ్గింది. మే నెలలో పారిశ్రామిక ఉత్పత్తి 1.2 శాతం వృద్ది తో ఉత్సాహకరంగా నిలిచింది.
దూసుకెళ్లిన టోకు ద్రవ్యోల్బణం
Published Thu, Jul 14 2016 1:12 PM | Last Updated on Mon, Sep 4 2017 4:51 AM
Advertisement
Advertisement