soars
-
మళ్లీ సెంచరీ కొట్టిన టమాటా
సాక్షి,కర్నూలు: కూరగాయల ధరలు మండుతున్నాయి. కేజీ టమాట ధర 80 నుంచి 100 రూపాయలు పలుకుతోంది. రైతు బజార్లో మాత్రం కేజీ టమాటా 80 రూపాయలకు అందిస్తున్నారు. వంటింట్లో ఎక్కువగా వాడే టమాటాతో పాటు ఇతర కూరగాయల ధరలు ఆకాశాన్నంటుండుంతుండటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. టమాట ధర వారం రోజుల్లోనే అమాంతం పెరిగిపోయింది. గతంలో అధిక ధరలున్న వేళ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం టమాటాను సబ్సిడీ ధరతో అందించింది. కేజీ టమాటాను రూ.50కే వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం మాత్రం టమాటను నోలాస్ నో పప్రాఫిట్ పేరుతో పెరిగిన ధరలకు కాస్త అటుఇటుగానే ప్రజలకు అందజేస్తోంది. -
టమాటా ధర పెరిగిందని టెన్షన్ వద్దు.. ఆ లోటుని ఇలా భర్తీ చేయండి!
ప్రస్తుతం కూరగాయాల ధరలు అమాంతం పెరిగి సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. ఏం కొనలేం తినలేం అన్నట్లు ఉంది పరిస్థితి. గడిచిన నెలలో ఎండల తీవ్రత.. దీనికి తోడు అకాల వర్షాలు..వీటన్నింటి కారణంగా సరైన దిగుబడి లేకుండా పోయింది. అదే సమయంలో ఇతర ప్రాంతాల నుంచి ఆశించిన స్థాయిలో దిగుమతులు కూడాలేవు. దీంతో మొన్నటి వరకు సాధారణ స్థితిలో ఉన్న కూరగాయాల ధరలు కాస్తా ఒకేసారి సామాన్యుడు కొనలేనంతగా పైకి ఎగబాకాయి. అందులోనూ.. టమాట ధర సెంచరీ కొట్టేసింది. మొన్నటి వరకు కిలో రూ. 20, రూ. 40గా ఉన్నాయి వంద రూపాయాలు పైనే పలుకుతోంది. అన్ని కూరల్లోనూ గ్రేవీ కోసం టమాటాలను విరివిగా వాడటం సర్వసాధారణం. అలాంటిది ఇప్పుడూ కొనాలన్నా, ఉపయోగించాలన్న ఆలోచించాల్సిన స్థితి. టమాట వేస్తే ఆ కూర రుచే వేరే. ఆఖరికి రెస్టారెంట్లు, హోటళ్ల వాళ్లు సైతం కస్టమర్లకు గ్రేవీతో కూడిన కూర సర్వ్ చేయాలంటే.. అక్కడ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉంది. కానీ గృహణులు ఇలాంటి సమయంలోనే తమ పాక శాస్త్ర ప్రావిణ్యాన్ని వెలికితీసి టమాటాకే డౌటు తెప్పించే రుచిగా వండాలి. ఈ ప్రత్యామ్నాయాలతో ఆ కొరతను భర్తీ చేసుకుంటూ టమాటా లాంటి రుచిని తెప్పించి చూపించ్చొఉ. అందుకు కాస్త తెలివిని ఉపయోగిస్తే చాలు. ఇంతకీ అవేమిటో చూద్దామా!. టమాటాలకు అల్ట్రనేటివ్గా వేటిని ఉపయోగించాలంటే.. ►టమాటా వేయగానే కాస్త పులుపు తీపి మిక్సింగ్‌లతో కూర రుచి అదిరిపోతుంది కదా. దాని ప్లేస్‌లో చింతపండును చక్కగా ఉపయోగించవచ్చు. అది కూడా కూరకు సరిపడగా పులుపు ఎక్కువ కాకుండా జాగ్రత్త పడితే ఆ కూర రుచి అదర్స్ అనే చెప్పాలి. ►మార్కెట్లో దొరికే టమాటో పేస్ట్‌తో కూడా ఆలోటును సులభంగా భర్తి చేసుకోవచ్చు. తాజా టమాటాలు అందుబాటులో లేనప్పుడూ, కొనలేని స్థితిలో ఇది మంచి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. ఇవి మార్కెట్లో కూడా సరసమైన ధరలోనే అందుబాటులో ఉంటాయి. ►ఇక రెడ్ బెల్ పెప్పర్ కూడా టమాటా మాదిరిగా కూరకు రుచిని ఇవ్వగలదు. పైగా కూర మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ►ఇంకోకటి ఆలివ్‌లు వీటిని ఉడికించి లేదా నేరుగా ఉపయోగించవచ్చు. పండిన ఆలివ్‌లు అయితే టమాటకు బెస్ట్ ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు ►అలాగే ఉసిరి కూడా మంచి పులుపు వగరుతో కూడిని స్వీట్‌ని అందిస్తుంది. దీనిలో ఫైబర్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. అంతేగాదు దీనిలో ఉండే ఎల్లాజిక్ యాసిడ్ కారణంగా క్యాన్సర్-నిరోధక లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఈ చిన్న ఆకుపచ్చ ఉసిరికాయ ఆకుపచ్చ టమాటాలను గుర్తుకు తెచ్చే పుల్లని రుచిని అందిస్తుంది. గృహుణులు ఇలాంటి ప్రత్నామ్నాయ చిట్కాలతో టమాటాకు ప్రత్యామ్నాయంగా వాడటం తోపాటు కుటుంబసభ్యులందరికి ఆరోగ్యకరమైన భోజనం పెట్టినవాళ్లం అవుతాం. సో మహిళలు మేథస్సు మన సోంతం. తెలివిగా ఇలాంటి చిట్కాలతో పెరుగుతున్న ధరలకు చెక్‌పెట్టేలా ఇలా ఇంటిని చక్కబెట్టుకోండి. (చదవండి: మసాల మజ్జిగా ఇలా ట్రై చేస్తే..మైమరిచి తాగేస్తారు) -
లిక్విడిటీ బూస్ట్ : మార్కెట్ల హై జంప్
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు దూకుడు పదర్శిస్తున్నాయి.తొలుత కొన్నినిముషాలపాటు ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ తరువాత జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు అన్ని రంగాల కౌంటర్లలోనూ కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రస్తుతం సెన్సెక్స్550 పాయింట్లు జంప్‌చేసి 33,922వద్ద నిఫ్టీ 150 పాయింట్ల ఎగసి 10,180 వద్ద ట్రేడవుతోంది. ఆర్బీఐ ఇచ్చిన లిక్వడిటీ బూస్టప్తోపీఎస్యూ బ్యాంక్స్ జోరుగా ఉన్నాయి. ఓపెన్‌మార్కెట్ ద్వారా రూ. 40వేల కోట్ల ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనున్నామన్న ఆర్బీఐ ప్రకటన రుపీ, బాండ్, ఈక్విటీ మార్కెట్లకు జోష్‌నిచ్చింది. ముఖ్యంగా ఎస్‌యూ బ్యాంక్స్ ఇండెక్స్ 6.6 శాతం దూసుకెళ్లింది. అలాగే ఫార్మా 4.5 శాతం జంప్‌చేసింది. రియల్టీ, ప్రయివేట్ బ్యాంక్స్, ఆటో, ఐటీ షేర్లు సహా ఇమిగతా అన్ని రంగాలూ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐసీఐసీఐ 10శాతం ఎగిసి బ్యాంకింగ్ సెక్టార్లో టాప్ విన్నర్‌గా ఉంది. ఓబీసీ,యూనియన్, కెనరా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్, పీఎన్బీ, బీవోబీ, ఎస్బీఐ, విజయా, సెంట్రల్ బ్యాంక్ భారీలా లాభపడుతున్నాయి. ఇక ఫార్మా కౌంటర్లలోనూ దివీస్ 14 శాతం దూసుకెళ్లగా.. అరబిందో, డాక్టర్ రెడ్డీస్, లుపిన్, సిప్లా, సన్ ఫార్మా, కేడిలా హెల్త్‌కేర్, బయోకాన్, గ్లెన్‌మార్క్ కూడా ఇదే బాటలో ఉన్నాయి. అలాగే రియల్టీ షేర్లలో గోద్రెజ్ ప్రాపర్టీస్, డీఎల్ఎఫ్, సన్‌టెక్, ఇండియాబుల్స్ మెరుపులు మెరిపిస్తున్నాయి. మరోవైపు జెట్ ఎయిర్వేస్, హెక్సావేర్, ఇన్ఫీబీమ్, భారత్ ఫైనాన్స్, ఈక్విటాస్, దాల్మియా భారత్, భారత్ ఎలక్ట్రానిక్స్ 5-2 శాతం మధ్య పతనమయ్యాయి. అటు రూపీ కూడా డాలరు మారకంలో లాభాలతో కొనసాగుతోంది. -
దూసుకెళ్లిన టోకు ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: టోకు ధరల ద్రవ్యోల్బణం అంచనాలకు మించి పైకి ఎగబాకింది. జూన్ మాసంలోఇది 1.62 శాతంగా నమోదైంది. ఈ ఏడాది మే నెలలోని 0.79 శాతంతో పోలిస్తే అంచనాలకు మించి మరింత పైకి దూసుకుపోయింది. ఆహార ద్రవ్యోల్బం 8.18శాతానికి చేరింది. రిటైల్ ద్రవ్యోల్బణం 22 నెలల గరిష్టాన్ని తాకడం దీనికి కారణంగా అంచనావేస్తున్నారు. కూరగాయలకు, పళ్లు,తృణ ధాన్యాల ధరల్లో పెరడతంతో టోకు ధరల సూచి ఆధారిత ద్రవ్యోల్బణం పెరుగుదలకు దోహదం చేసిందన్నారు. జూన్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.77 శాతంతో 22 నెలల గరిష్టాన్ని తాకింది. గతేడాది జూన్‌లో ఈ రిటైల్ ద్రవ్యోల్బణం 5.40 శాతంగా ఉంది. మరో వైపు ఇదే ఏడాది మే నెలలో 5.76 శాతంగా ఉంది. ఆగస్టు 2014లో వినియోగదారు(రిటైల్) ద్రవ్యోల్బణం 7.8 శాతంగా నమోదయిన తర్వాత మళ్లీ దాదాపు ఆ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. రిటైల్ ద్రవ్యోల్బణం 22 నెలల గరిష్టానికి, పారిశ్రామిక ఉత్పత్తి విభాగాల వారీ చూస్తే ఆహార ద్రవ్యోల్బణం మే నెలలో 7.47 శాతం ఉండగా, జూన్‌లో 7.79 శాతానికి పెరిగింది. కూరగాయలకు సంబంధించిన ధరల్లో పెరుగుదల మే నెలలో 10.77 శాతం ఉండగా జూన్‌లో 14.74 శాతానికి పెరిగింది. మే నెలలో కూరగాయల ద్రవ్యోల్బణం 31.57 శాతం ఉండగా జూన్ నెలకు 26.86 శాతానికి తగ్గింది. మే నెలలో పారిశ్రామిక ఉత్పత్తి 1.2 శాతం వృద్ది తో ఉత్సాహకరంగా నిలిచింది.