
సాక్షి,కర్నూలు: కూరగాయల ధరలు మండుతున్నాయి. కేజీ టమాట ధర 80 నుంచి 100 రూపాయలు పలుకుతోంది. రైతు బజార్‌లో మాత్రం కేజీ టమాటా 80 రూపాయలకు అందిస్తున్నారు.
వంటింట్లో ఎక్కువగా వాడే టమాటాతో పాటు ఇతర కూరగాయల ధరలు ఆకాశాన్నంటుండుంతుండటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. టమాట ధర వారం రోజుల్లోనే అమాంతం పెరిగిపోయింది.
గతంలో అధిక ధరలున్న వేళ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం టమాటాను సబ్సిడీ ధరతో అందించింది. కేజీ టమాటాను రూ.50కే వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం మాత్రం టమాటను నోలాస్ నో పప్రాఫిట్ పేరుతో పెరిగిన ధరలకు కాస్త అటుఇటుగానే ప్రజలకు అందజేస్తోంది.