జూన్‌లో ఐఐపీ 4.2%
5 నెలల కనిష్టం
న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం జూన్‌లో నెమ్మదించింది. ఐదు నెలల్లో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 4.2 శాతంగా నమోదయ్యింది. ఐఐపీ సూచీలో మెజారిటీ వెయిటేజ్ కలిగిన తయారీ రంగం పనితీరు నిరుత్సాహ పరిచినప్పటికీ విద్యుత్, మైనింగ్ రంగాలు చక్కటి ఫలితాలను నమోదుచేశాయి.
2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సూచీ వరుసగా 4.2%, 5.6%, 5.5%, 5.0%, 6.2 శాతం వృద్ధి రేట్లను (2023 ఇవే నెలలతో పోల్చి) నమోదుచేసుకుంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో సూచీ 5.2 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 4.7 శాతం. గత ఏడాది జూన్‌లో ఐఐపీ వృద్ధి రేటు 4 శాతంగా నమోదయ్యింది. అంటే అప్పటికన్నా తాజా సమీక్షా నెల జూన్‌లో (4.2 శాతం) కొంత మెరుగైన ఫలితం వెలువడ్డం గమనార్హం. 2023 అక్టోబర్లో రికార్డు స్థాయిలో 11.9 శాతం ఐఐపీ వృద్ధి నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment