low level
-
నెమ్మదించిన పరిశ్రమలు
న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం జూన్‌లో నెమ్మదించింది. ఐదు నెలల్లో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 4.2 శాతంగా నమోదయ్యింది. ఐఐపీ సూచీలో మెజారిటీ వెయిటేజ్ కలిగిన తయారీ రంగం పనితీరు నిరుత్సాహ పరిచినప్పటికీ విద్యుత్, మైనింగ్ రంగాలు చక్కటి ఫలితాలను నమోదుచేశాయి. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సూచీ వరుసగా 4.2%, 5.6%, 5.5%, 5.0%, 6.2 శాతం వృద్ధి రేట్లను (2023 ఇవే నెలలతో పోల్చి) నమోదుచేసుకుంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో సూచీ 5.2 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 4.7 శాతం. గత ఏడాది జూన్‌లో ఐఐపీ వృద్ధి రేటు 4 శాతంగా నమోదయ్యింది. అంటే అప్పటికన్నా తాజా సమీక్షా నెల జూన్‌లో (4.2 శాతం) కొంత మెరుగైన ఫలితం వెలువడ్డం గమనార్హం. 2023 అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో 11.9 శాతం ఐఐపీ వృద్ధి నమోదైంది. -
కనిష్ట శ్లాబు వారికి ఐటీ ఊరట కల్పించాలి
న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న నేపథ్యంలో తక్కువ స్థాయి శ్లాబ్‌లో ఉన్న ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఊరట కలి్పంచే అంశాన్ని బడ్జెట్లో పరిశీలించాలని పరిశ్రమల సమాఖ్య సీఐఐకి కొత్త ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సంజీవ్ పురి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. భూ, కారి్మక, విద్యుత్, వ్యవసాయ రంగ సంస్కరణలన్నింటిని అమలు చేసేందుకు కేంద్రం, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధన కోసం సంస్థాగత వేదికను ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ మూడో దఫా ప్రభుత్వం సంస్కరణలను అమలు చేయడానికి సంకీర్ణ రాజకీయాలనేవి అడ్డంకులు కాబోవని భావిస్తున్నట్లు పురి చెప్పారు. ఇప్పటికే రెండు విడతల్లో విధానాలను విజయవంతంగా అమలు చేయడం, దేశ ఎకానమీ మెరుగ్గా రాణిస్తుండటం వంటి అంశాలు తదుపరి సంస్కరణలను వేగవంతం చేసేందుకు దన్నుగా ఉండగలవని ఆయన పేర్కొన్నారు. -
ఐటీలో నియామకాలకు 6 నెలలు బ్రేక్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఐటీ కంపెనీలు నియామకాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఆరు నెలల పాటు హైరింగ్‌కు కాస్త విరామం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఆర్థిక ఫలితాలను చూస్తే ప్రతి త్రైమాసికంలోనూ నికర నియామకాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయని, రాబోయే రోజుల్లోనూ కొన్నాళ్ల పాటు ఇదే ధోరణి కొనసాగవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అంతక్రితం ఏడాది జోరుగా రిక్రూట్ చేసుకున్నప్పటికీ ప్రస్తుతం డిమాండ్ మాత్రమే కీలకాంశంగా మారిందని పేర్కొన్నాయి. మూడో త్రైమాసికంలోనే నియామకాలు తక్కువ స్థాయిలో ఉండగా.. నాలుగో త్రైమాసికంలోనూ దాదాపు అదే రకమైన ట్రెండ్ నెలకొందని టీమ్‌లీజ్ డిజిటల్ వర్గాలు వివరించాయి. చాలామటుకు కంపెనీలు వేచి చూసే ధోరణిలో ఉన్నాయని పేర్కొన్నాయి. ఎక్స్‌ఫెనో జాబ్ రిపోర్ట్ ప్రకారం మార్చి త్రైమాసికంలో ఉద్యోగావకాశాలు గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 56 శాతం క్షీణించాయి. మరికొద్ది రోజుల్లో కంపెనీలు నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించడం మొదలుపెట్టనున్న నేపథ్యంలో ఈ అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బ్యాంకింగ్ కష్టాలు. అంతర్జాతీయంగా బ్యాంకింగ్ రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు కూడా ఐటీ రంగంలో నియామకాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఎక్కువగా బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) సంస్థలకు సేవలు అందించే దేశీ ఐటీ కంపెనీల్లో హైరింగ్ మందగించింది. ఈ పరిస్థితి నెమ్మదిగా మారనున్నప్పటికీ, కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నాళ్లలో మాత్రం ఆ ప్రభావాలు అలాగే కొనసాగవచ్చని ఎక్స్‌ఫెనో సహవ్యవస్థాపకుడు అనిల్ ఎథనూర్ పేర్కొన్నారు. గత రెండు త్రైమాసికాలుగా హైరింగ్‌పై కాస్త సానుకూలంగా ఉన్నా, ఇంటర్వ్యూ చేసిన అభ్యర్ధులను తీసుకునే విషయంలో మాత్రం కంపెనీలు ముందుకు వెళ్లడం లేదని టీమ్‌లీజ్ డిజిటల్ సీఈవో సునీల్ చెమ్మన్‌కొటిల్ తెలిపారు. ఆయా సంస్థలు వేచి, చూసే ధోరణి పాటిస్తున్నాయని, ఈ త్రైమాసికంలో నియామకాల పరిస్థితి ఆశావహంగా ఉండకపోవచ్చని పేర్కొన్నారు. తొలి ఆరు నెలల్లో నికరంగా నియామకాలు 40% తగ్గొచ్చని భావిస్తున్నట్లు వివరించారు. బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా క్యూ4లో కంపెనీల ప్రణాళికలు మారిపోయాయని, హైరింగ్‌పై దాని ప్రభావం పడిందని కెరియర్‌నెట్ సీఈవో అన్షుమన్ దాస్ చెప్పారు. వాస్తవానికి అంతక్రితం త్రైమాసికంలో ఐటీ కంపెనీలు హైరింగ్‌ను ప్రారంభించడంపై సానుకూల యోచనల్లోనే ఉన్నప్పటికీ .. బ్యాంకింగ్ సంక్షోభంతో పెద్దగా రిక్రూట్మెంట్ తలపెట్టలేదని వివరించారు. ఈ నేపథ్యంలో తొలి ఆరు నెలలు హైరింగ్ అంత ఆశావహంగా కనిపించడం లేదన్నారు. పరిస్థితులపై ఇంకా స్పష్టత రానందున కంపెనీలు వేచి చూసే ధోరణే కొనసాగించవచ్చని.. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం కాస్త మెరుగ్గా ఉండవచ్చని దాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. 2.5 లక్షలకు పరిమితం కావచ్చు.. దేశీ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా క్యూ1లో 59,704, క్యూ2లో 34,713 మందిని రిక్రూట్ చేసుకోగా క్యూ3లో ఇది ఏకంగా 4,904కి పడిపోయింది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఐటీ, బీపీవో సర్వీసుల విభాగంలో నికరంగా 4.80 లక్షల నియామకాలు జరగ్గా, 2023 ఆర్థిక సంవత్సరంలో ఇది 2.80 లక్షల స్థాయిలో ఉండొచ్చని హాన్ డిజిటల్ సీఈవో శరణ్ బాలసుందరమ్ తెలిపారు. ప్రస్తుత ధోరణులను బట్టి చూస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో నికర నియామకాలు సుమారు 2.5 లక్షల స్థాయిలో ఉండొచ్చని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొన్ని కంపెనీలు తాము ఇచ్చిన ఆఫర్లకు కట్టుబడి ఉండొచ్చని, మరికొన్ని వాటిని రద్దు చేసుకునే అవకాశం ఉందని బాలసుందరమ్ చెప్పారు. 2021 ఆర్థిక సంవత్సరంలో హైరింగ్ అంతగా జరగకపోవడం, కోవిడ్ పరిస్థితులపరమైన డిమాండు కారణంగా 2022 ఆర్థిక సంవత్సరంలో నియామకాలు భారీగా జరిగాయని ఆయన చెప్పారు. ఆ ఒక్క సంవత్సరాన్ని పక్కన పెడితే ఐటీలో ఏటా 2–3 లక్షల మంది హైరింగ్ సాధారణంగానే ఉంటుందని పేర్కొన్నారు. -
వృద్ధి రేటు 6.6 శాతమే..
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధికి సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంతవ్సరం (2018 ఏప్రిల్ 2019 మార్చి) అక్టోబర్–డిసెంబర్ (మూడవ త్రైమాసికం) ఫలితాలు వెలువడ్డాయి. ఈ కాలంలో వృద్ధిరేటు కేవలం 6.6 శాతంగా నమోదయ్యింది. గడచిన ఐదు త్రైమాసికాల్లో (15 నెలలు) ఇంత తక్కువ స్థాయి వృద్ధి నమోదుకావడం ఇదే తొలిసారి. అయినా ఈ స్థాయి వృద్ధి రేటు ప్రపంచంలోని ఏ దేశంలోనూ నమోదుకాకపోవడం గమనార్హం. ఇదే మూడు నెలల్లో చైనా 6.4 శాతం వృద్ధితో రెండవ స్థానంలో ఉంది. దీనితో ప్రపంచంలో వేగవంతమైన వృద్ధి రేటును సాధిస్తున్న దేశంగా భారత్ కొనసాగుతోంది. కాగా 2017–18 అక్టోబర్– డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు 7.7 శాతం. గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) గురువారం విడుదల చేసిన గణాంకాల ముఖ్యాంశాలను క్లుప్తంగా చూస్తే... ► చూస్తే, 2018–19 అక్టోబర్–డిసెంబర్ మధ్య జీడీపీ విలువ రూ.35 లక్షల కోట్లు. 2017–18 ఇదే నెలలో జీడీపీ విలువ రూ.32.85 లక్షల కోట్లు. అంటే వృద్ధి 6.6 శాతంగా ఉందన్నమాట. ► వ్యవసాయం, తయారీ రంగంవృద్ధి తగ్గడం, బలహీన వినియోగ డిమాండ్ మూడవ త్రైమాసికంలో వృద్ధి స్పీడ్‌ను తగ్గించాయి. ► మార్చి 31వ తేదీతో ముగిసే ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాలు ఇంతక్రితం 7.2 శాతంకాగా ఇప్పుడు 7 శాతానికి తగ్గించడం జరిగింది. ఇదే ఫలితం వెలువడితే, గడచిన ఐదు సంవత్సరాల్లో ఇంత తక్కువ స్థాయి ఇదే తొలిసారి అవుతుంది. అయితే 7 శాతం స్థాయి వృద్ధి సాధించడానికి సైతం నాల్గవ త్రైమాసికంలో కనీనం 6.5 శాతం వృద్ధిని సాధించాల్సి ఉంటుంది. కాగా క్యూ4లో 6.5 శాతం వృద్ధి సాధనకు దేశ ఎగుమతుల్లో వృద్ధి కనీసం 14 శాతం ఉండాలని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ వరకూ జరిగిన త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు 8 శాతం అయితే, జూలై–సెప్టెంబర్ మధ్య ఈ రేటు 7 శాతంగా ఉంది. తొలి అంచనాలకన్నా (వరుసగా 8.2 శాతం, 7.1 శాతం) కేంద్ర గణాంకాల శాఖ ఈ వృద్ధి రేట్లను తగ్గించడం గమనార్హం. ► వినియోగ వ్యయం వృద్ధి రేటు మూడవ త్రైమాసికంలో 8.4 శాతంగా నమోదయ్యింది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ రేటు 9.9 శాతం. ► వ్యవసాయ రంగం వృద్ధి రేటు త్రైమాసికాల పరంగా తగ్గుతూ వస్తుండడం గమనార్హం. క్యూ1లో వృద్ధి రేటు 4.6 శాతం అయితే, క్యూ2లో 4.2 శాతంగా ఉంది. ఇక క్యూ3లో భారీగా 2.7 శాతానికి పడిపోయింది. ► వార్షికంగా చూస్తే, మైనింగ్, క్వారీయింగ్ రంగాల వృద్ధి రేటు 4.5 శాతం నుంచి 1.3 శాతానికి తగ్గింది. ► తయారీ రంగం వృద్ధి రేటు 8.6 శాతం నుంచి6.7 శాతానికి దిగింది. ► సీఎస్ఓ అంచనాల ప్రకారం, 2018–19లో వ్యవసాయ రంగం 2.7 శాతం వృద్ధి సాధిస్తుంది. 2017–18లో ఈ రేటు 5 శాతం. తయారీ రంగం వృద్ధి మాత్రం 5.9 శాతం నుంచి 8.1 శాతం వృద్ధి పెరిగే అవకాశం ఉంది. వాణిజ్యం, హోటెల్, రవాణా రంగాల వృద్ధి రేటు 6.8 శాతంగా నమోదయ్యే వీలుంది. మైనింగ్, క్వారీయింగ్ రంగాల వృద్ధి రేటు 5.1 శాతం నుంచి 1.2 శాతానికి తగ్గుతుంది. పెట్టుబడుల సూచీ స్థూల స్థిర మూలధన ఏర్పాటు (జీఎఫ్‌సీఎఫ్) రూ.48.97 లక్షల కోట్ల నుంచి రూ.55.02 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. తలసరి ఆదాయం రూ.92,718! కాగా ఈ ఆర్థిక సంవత్సరం(2018–19) మొత్తంగా తలసరి ఆదాయం (2017–18తో పోల్చిచూస్తే) రూ.87,623 నుంచి రూ.92,718 కోట్లకు పెరిగే అవకాశం ఉందని గణాంకాల శాఖ పేర్కొంది. ఇందుకు సంబంధించి వృద్ధి రేటు 5.7 శాతం నుంచి 5.8 శాతానికి పెరగనున్నట్లు అంచనా. మౌలిక రంగం నిరాశ జనవరిలో కేవలం 1.8 శాతం వృద్ధి 19 నెలల కనిష్ట స్థాయి న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్ జనవరి వృద్ధి ధోరణి నిరాశ కలిగించింది. వృద్ధి రేటు కేవలం 1.8 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 జనవరితో (6.2 శాతం వృద్ధి) పోల్చిచూస్తే, 2019 జనవరిలో ఎనిమిది పరిశ్రమల బాస్కెట్ వృద్ధి కేవలం 1.8 శాతంగా నమోదయ్యిందన్నమాట. గడచిన 19 నెలల్లో (2017 జూన్‌లో కేవలం 1 శాతం) ఇంత తక్కువ స్థాయి వృద్ధి నమోదుకావడం ఇదే తొలిసారి. 2018 డిసెంబర్లో కూడా ఈ గ్రూప్ వృద్ధి రేటు 2.7 శాతంగా నమోదయ్యింది. గురువారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం గ్రూప్‌లో పరిశ్రమలను వేర్వేరుగా పరిశీలిస్తే... ► క్రూడ్ ఆయిల్ (–4.3 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (–2.6 శాతం), విద్యుత్ (–0.4 శాతం) రంగాల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణత నమోదయ్యింది. 2013 ఫిబ్రవరి తరువాత విద్యుత్ రంగంలో ఇలాంటి ప్రతికూల స్థితి నెలకొనడం ఇదే తొలిసారని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ పేర్కొంది. ► బొగ్గు (1.7 శాతం), సిమెంట్ (11 శాతం) రంగాల స్పీడ్ తగ్గింది. 2018 జనవరిలో ఈ వృద్ధి రేట్లు వరుసగా 3.8 శాతం, 19.6 శాతంగా నమోదయ్యాయి. ► కాగా సహజవాయువులు (6.2 శాతం), ఎరువులు (10.5 శాతం), స్టీల్ (8.2 శాతం) మెరుగైన పురోగతిని నమోదుచేశాయి. ► మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ)లో ఈ ఎమినిది రంగాల వాటా దాదాపు 41 శాతం. జనవరి ఐఐపీ గణాంకాలు మార్చి రెండవ వారంలో వెలువడనున్నాయి. ఎనిమిది పరిశ్రమల పేలవ పనితీరు మొత్తం జనవరి ఐఐపీ గణాంకాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్నది విశ్లేషకుల అంచనా. ఏప్రిల్ నుంచి జనవరి వరకూ... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018 ఏప్రిల్ నుంచి 2019 మార్చి) జనవరి వరకూ చూస్తే, ఎనిమిది పరిశ్రమల గ్రూప్ వృద్ధి రేటు 4.1 శాతం నుంచి 4.5 శాతానికి పెరిగాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడించాయి. -
ముంచేస్తున్నారు
స్రాక్షి ప్రతినిధి, ఏలూరు : అధికారుల అనాలోచిత పనుల వల్ల పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు మరోసారి నిలువునా మునిగిపోయే పరిస్థితి తలెత్తుతోంది. జల్లేరు ముంపు ప్రాంతంలో పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించడం విమర్శలకు దారి తీస్తోంది. జల్లేరు రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచనుండటంతో.. నిర్వాసితులకు కేటాయించిన భూములన్నీ భవిష్యత్‌లో ముంపునకు గురికావడం ఖాయమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం, పి.నారాయణపురం గ్రామాల్లో పోలవరం నిర్వాసితులకు పునరావాసం పేరిట భూములు కేటాయిస్తున్నారు. ఇవి జల్లేరు ముంపు ప్రాంతంలో ఉన్నాయి. జల్లేరు రిజర్వాయర్ ప్రస్తుత సామర్థ్యం 8 టీఎంసీలు కాగా.. 20 టీఎంసీలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో, పోలవరం నిర్వాసితులకు జల్లేరు రిజర్వాయర్ వద్ద ప్రస్తుతం కేటాయించిన ప్రాంతం కూడా ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. రాచన్నగూడెం, పి.నారాయణపురం గ్రామాల్లో నిర్వాసితులకు కేటాయిస్తున్న భూములు, ఇళ్ల స్థలాలు 8 టీఎంసీల రిజర్వాయర్ (డీపీఆర్) ప్రకారం ముంపు ప్రాంతం నిర్వాసితుల పునరావాస కాలనీకి కూత వేటు దూరంలోనే ఉంది. పి.నారాయణపురంలో టేకూరు గ్రామానికి చెందిన పోలవరం నిర్వాసితులకు కేటాయించిన ఇళ్ల స్థలాలు, భూమికి భూమి కింద కేటాయించిన స్థలం 8 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్ ముంపు ప్రాంతంలోనే అర కిలోమీటర్ దూరంలో భూమిని కేటాయించారు. ఇప్పుడు రిజర్వాయర్ సామర్థ్యాన్ని 8 నుంచి 20 టీఎంసీలకు పెంచారు. రిజర్వాయర్‌కు కేవలం అర కిలోమీటర్ దూరంలో ఉన్న తాము ముంపునకు గురవుతామని నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. వీరికి కేటాయించిన భూములు, ఇళ్లస్థలాలు పెంచిన రిజర్వాయర్ సామర్థ్యం ప్రకారం మళ్లీ ముంపులోకి వెళ్లడం ఖాయం. అదేవిధంగా రాచన్నగూడెంలో కేటాయిస్తున్న పునరావాస కాలనీలో ఇచ్చిన భూమికి భూమి ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి ఉంది. మరోసారి నిర్వాసితులు కావాల్సిందేనా! జల్లేరు రిజర్వాయర్ ముంపు ప్రాంతంలో భూములు కేటాయించడంతో తాము ఎన్నిసార్లు నిర్వాసితులు కావాలంటూ పోలవరం పునరావాసులు ప్రశ్నిస్తున్నారు. జల్లేరు రిజర్వాయర్ సామర్థ్యం పెంపు నిర్ణయం గ్రామాలను కబళించే పరిస్థితి ఉండటంతో గిరిజనులకు కంటిమీద కునుకు పడటం లేదు. జీలుగుమిల్లి మండలంలోని తాటిరామన్న గూడెం, జిల్లెళ్ల గూడెం, పాకల గూడెం, బొత్తప్పగూడెం, పి.నారాయణపురం, బుట్టాయగూడెం మండలం బెడదనూరు నీటిలో మునిగిపోనున్నాయి. 8 టీఎంసీల సామర్థ్యం ప్రకారం ముంపు గ్రామాలు 7 ఉండగా, సుమారు 5 వేల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టపోతారు. రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచితే ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. జల్లేరు రిజర్వాయర్ తమ హక్కులను కబళిస్తోందని స్ధానిక గిరిజనులు అంటున్నారు. ఇక్కడ 1/70 యాక్ట్ ఉల్లంఘన జరుగుతుందనేది గిరిజనుల వాదన. 2013 భూసేకరణ చట్ట ప్రకారం సెక్షన్–41 సబ్ క్లాజ్–3 ప్రకారం తప్పనిసరిగా గిరిజన గ్రామాల్లో పీసా గ్రామసభలు (గిరిజన కమిటీ) నిర్వహించి ప్రతిపాదనలకు ఆమోదం పొందాలి. జీవో ఎంఎస్ 262 ప్రకారం బాధితులను ముందుగా గుర్తించాలి. అయితే ముంపు గ్రామాల నిర్వాసితులను గుర్తించకుండానే అవార్డు విచారణలు ముగించేశారు. ఇది సుప్రీం కోర్టు తీర్పులకు వ్యతిరేకమని గిరిజనులు ఆరోపిస్తున్నారు. జల్లేరు రిజర్వాయర్ నిమిత్తం పర్యావరణ మండలి ఇచ్చిన అనుమతులను ప్రజల ముందు పెట్టాలనేది స్థానికుల డిమాండ్. ఎక్కడా ఈ పని చేసిన దాఖలాలు లేవు. ఈ ప్రాంతంలో అనేక ఎల్టీఆర్ కేసులు పెండింగ్‌లో ఉన్నా రిజర్వాయర్ విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్లడాన్ని గిరిజనులు తప్పు పడుతున్నారు. రిజర్వాయర్ నిర్మాణాన్ని తాము వ్యతిరేకించడం లేదని.. తమకు న్యాయం చేసిన తర్వాతే రిజర్వాయర్ నిర్మాణం విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్లాలనేది గిరిజనుల వాదన. -
అల్లీ‘పూర్’!
అడుగంటిన భూగర్భ జలం ఈ గ్రామంలో 54.15 మీ.లోతుకు జలం జిల్లాలో అత్యధిక లోతు ఇక్కడే! కొన్ని మండలాల్లో మెరుగైన పరిస్థితి సాక్షి, సంగారెడ్డి: అడపాదడపా కురుస్తున్న వర్షాలకు భూగర్భ జలాలలు కొన్ని ప్రాంతాల్లో పెరిగినా.. చాలా వరకు మండలాల్లో పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని అధికారుల రికార్డులు చెబుతున్నాయి. గత నెలలో 24.64 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉండగా.. ఈ నెలలో 23.64 మీటర్లకు పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే అత్యధికంగా అల్లీపూర్లో భూగర్భ జలం అడుగుకంటిందని తెలుస్తోంది. చిన్నకోడూరు మండలంలో గల ఈ గ్రామంలో భూగర్భజలాలు ప్రస్తుతం 54.15 మీటర్ల లోతున చేరుకున్నాయి. జిల్లాలో ఇక్కడే అత్యదిక లోతుకు భూగర్భజలం పడిపోయిందని అధికారులు అంటున్నారు. అలాగే, పటాన్చెరు మండలం కిష్టాపూర్‌లో మాత్రం 1.41 మీటర్లలోనే జలాలు ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు అత్యధికంగా నంగనూరు మండలం ఖాతా గ్రామంలో 15.95 మీటర్ల మేర భూగర్భజలాలు పెరిగాయి. ఖాతా గ్రామంలో జూన్‌లో 32.50 మీటర్లలో జలాలు ఉండగా.. జూలై చివరకు 24.63 మీటర్లకు పెరిగాయి. కల్హేర్ మండలంలో 7.97 మీటర్లు, నారాయణఖేడ్‌లో 5.36, సంగారెడ్డిలో 5.34, న్యాల్కల్లో 3.30, గజ్వేల్‌లో 1.48, మెదక్‌లో 1.22, జిన్నారంలో 1.20, రామచంద్రాపురంలో 1.12, చిన్నకోడూరులో 1.08, హత్నూరలో 1.04 మీటర్ల మేర భూగర్భజలమట్టాలు పెరిగాయి. మిగితా మండలాల్లో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. కొంత మెరుగు.. ఇంకొంత తరుగు.. భూగర్భ జలాల తీరు జిల్లా వ్యాప్తంగా ఒక్క తీరుగా లేదు. రెండేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో మంజీరా నదితో పాటు చెరువులు ఎండిపోయాయి. 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అత్యంత దిగువకు భూగర్భజలాలు పడిపోవడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమైంది. ఫలితంగా తాగు, సాగుకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో గడిచిన రెడు నెలల్లో పడిన మోస్తరు నుంచి భారీగా వర్షాలతో భూగర్భజలాల మట్టాలు కొన్ని ప్రాంతాల్లో పెరిగాయని అధికారులు అంటున్నారు. వర్షపునీరు భూమి పొరల్లోకి మెల్లిగా ఇంకుతుందని, దీంతో ఒక్కసారిగా జలమట్టాలు పెరగవని జియాలజిస్టులు చెబుతున్నారు. -
ముడిచమురు ధర కనిష్ట స్థాయికి