న్యూఢిల్లీ: అక్టోబర్ నెలకు సంబంధించిన టోకు ధరల సూచి (డబ్ల్యుపిఐ) క్రమంగా దిగి వచ్చింది. ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం వరుసగా రెండో నెలలో కూడా టోకుధరల ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. అక్టోబరు లో 3.39 శాతంగా నమోదైంది. దేశీ టోకు ధరలు ఊహించిన కంటే తక్కువ వేగంగా పెరిగాయని ఎనలిస్టులు చెబుతున్నారు.
రాయిటర్స్ పోల్ లో ఆర్థికవేత్తలు 3.75 శాతం వార్షిక పెరుగుదలను అంచనా వేశారు. సెప్టెంబర్ మాసానికి టోకు ధరల ద్రవ్యోల్బణం3.57 శాతంగా ఉంది. సెప్టెంబర్ నెలలో 5.75 పెరుగుదలతో పోలిస్తే గత నెలలో ఆహార ధరలు 4.34 శాతానికి దిగి వచ్చాయి.. గత నెలలో టోకు ఆహార ధరలు సెప్టెంబర్ లో ఒక తాత్కాలిక 5.75 శాతం పోలిస్తే 4.34 శాతంగా నమోదైంది.