సాక్షి,ముంబై: దేశ రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలతో పోలిస్తే తగ్గుముఖం పట్టింది. మంత్రిత్వ శాఖ గణాంకాలు , ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ (MoSPI) గురువారం విడుదల చేసిన డేటా ప్రకారం కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో 5.72శాతానికి దిగి వచ్చింది. ఇది నవంబర్‌లో 5.88శాతంగా, అక్టోబర్ 2022లో 6.77శాతంగాఉంది.
ఆహార వస్తువుల ధరలు తగ్గడంతో డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాది కనిష్ట స్థాయికి చేరింది. కాగా ఆర్బీఐ నియంత్రణ స్థాయి కంటే రిటైల్ ద్రవ్యోల్బణం తక్కువగా నమోదు కావడం వరుసగా రెండో నెల. మార్చి 2026తో ముగిసే ఐదేళ్ల కాలానికి ఇరువైపులా 2శాతం మార్జిన్‌తో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4శాతం వద్ద కొనసాగించాలని ప్రభుత్వం ఆర్బీఐని ఆదేశించింది.
నవంబర్ ఐఐపీ వృద్ధి
మరోవైపు, ప్రభుత్వ గణాంకాల ప్రకారం, పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపి) పరంగా ఫ్యాక్టరీ ఉత్పత్తి అక్టోబర్‌లో 4శాతం నుండి నవంబర్‌లో 7.1శాతానికి పెరిగింది. ఐఐపీ పనితీరు పుంజుకుంటుదనీ ఊహించినప్పటికీ, అక్టోబర్ 2022లో 4.2శాతంతో పోలిస్తే బాగా పుంజుకుంది. 2022 డిసెంబరులో సింగిల్ డిజిట్‌కు వృద్ధి చెందుతుందని అని ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment