IIP data
-
పరిశ్రమ పరుగులు
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) సెప్టెంబర్‌లో 3.1 శాతం వృద్ధిని (2023 ఇదే నెలతో పోల్చి) నమోదుచేసుకుంది. ఆగస్టు సూచీలో వృద్ధిలేకపోగా 0.1 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. తయారీ, మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి రంగాలు సూచీని సమీక్షా నెల్లో వృద్ధి బాటన నిలబెట్టాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం... మైనింగ్ రంగం 0.2 శాతం పురోగమించింది. మొత్తం సూచీలో దాదాపు 70 శాతం వాటా ఉన్న తయారీ రంగం 3.9 శాతం వృద్ధిని సాధించింది.విద్యుత్ ఉత్పత్తి 0.5 శాతం ఎగసింది. ఆగస్టులో మైనింగ్ రంగం ఉత్పత్తి 4.3 శాతం, విద్యుత్ ఉత్పత్తి 3.7 శాతం క్షీణించగా, తయారీ రంగం కేవలం 1.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. కాగా తాజా సమీక్షా నెల్లో భారీ యంత్ర పరికరాల డిమాండ్‌కు సంబంధించిన క్యాపిటల్ గూడ్స్ విభాగంలో వృద్ధి రేటు 2.8 శాతంగా ఉంది. కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ విభాగంలో వృద్ధి రేటు 2 శాతంగా ఉంది. కన్జూమర్ డ్యూరబుల్స్‌లో వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదయ్యింది. ఆరు నెలల్లో 4 శాతం వృద్ధి ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఐఐపీ 4 శాతం పురోగమించింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 6.2 శాతం. -
ఐఐపీ డేటా: పారిశ్రామిక ఉత్పత్తి ఓకే!
న్యూఢిల్లీ: భారత్ పారిశ్రామిక ఉత్పత్తి 2023 జనవరిలో మంచి పనితీరును కనబరిచింది. ఇందుకు సంబంధించిన సూచీ (ఐఐపీ) 5.2 శాతం పెరిగింది. 2022 డిసెంబర్లో సూచీ పెరుగుదల రేటు 4.7 శాతంగా ఉంది. ఇక 2022 జనవరిలో ఐఐపీ వృద్ధి రేటు కేవలం 2 శాతం. జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం విద్యుత్, తయారీ రంగాలు చక్కటి పనితీరును ప్రదర్శించాయి. ఇవీ చదవండి: బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్ ‘రిథమ్’ సన్‌గ్లాసెస్: భారీ తగ్గింపుతో Amazon Mega Electronics Day sale: అద్భుతమైన ఆఫర్లు, డోంట్ మిస్! -
దిగొచ్చిన ద్రవ్యోల్బణం, పుంజుకున్న ఐఐపీ వృద్ధి
సాక్షి,ముంబై: దేశ రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలతో పోలిస్తే తగ్గుముఖం పట్టింది. మంత్రిత్వ శాఖ గణాంకాలు , ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ (MoSPI) గురువారం విడుదల చేసిన డేటా ప్రకారం కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం డిసెంబర్లో 5.72శాతానికి దిగి వచ్చింది. ఇది నవంబర్‌లో 5.88శాతంగా, అక్టోబర్ 2022లో 6.77శాతంగాఉంది. ఆహార వస్తువుల ధరలు తగ్గడంతో డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాది కనిష్ట స్థాయికి చేరింది. కాగా ఆర్బీఐ నియంత్రణ స్థాయి కంటే రిటైల్ ద్రవ్యోల్బణం తక్కువగా నమోదు కావడం వరుసగా రెండో నెల. మార్చి 2026తో ముగిసే ఐదేళ్ల కాలానికి ఇరువైపులా 2శాతం మార్జిన్‌తో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4శాతం వద్ద కొనసాగించాలని ప్రభుత్వం ఆర్బీఐని ఆదేశించింది. నవంబర్ ఐఐపీ వృద్ధి మరోవైపు, ప్రభుత్వ గణాంకాల ప్రకారం, పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపి) పరంగా ఫ్యాక్టరీ ఉత్పత్తి అక్టోబర్‌లో 4శాతం నుండి నవంబర్‌లో 7.1శాతానికి పెరిగింది. ఐఐపీ పనితీరు పుంజుకుంటుదనీ ఊహించినప్పటికీ, అక్టోబర్ 2022లో 4.2శాతంతో పోలిస్తే బాగా పుంజుకుంది. 2022 డిసెంబరులో సింగిల్ డిజిట్‌కు వృద్ధి చెందుతుందని అని ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ చెప్పారు. -
ఐఐపీ డేటా షాక్: పడిపోయిన పారిశ్రామికోత్పత్తి
న్యూఢిల్లీ: ఒకవైపు ద్రవ్యోల్బణం శాంతించగా, మరోవైపు పారిశ్రామికోత్పత్తి గణనీయంగా తగ్గి పోయింది. మైనస్ 4 శాతానికి అక్టోబర్‌లో క్షీణించింది. ప్రధానంగా తయారీ తగ్గడం, మైనింగ్, విద్యుత్ విభాగాల్లో వృద్ధి లేకపోవడం ఈ పరిస్థితికి దారితీసింది. ఈ వివరాలను ఎన్ఎస్వో విడుదల చేసింది. మైనింగ్ విభాగం కేవలం 2.5 శాతం వృద్ధిని నమోదు చేయగా, తయారీ విభాగం మైనస్ 5.6 శాతానికి పడిపోయింది. (దగ్గు నివారణకు హెర్బల్ సిరప్: వాసా తులసి ప్లస్) విద్యుత్ ఉత్పత్తి 1.2 శాతం పెరిగింది. క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి 2.3 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ విభాగం 15 శాతం మేర, కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్‌లో 13.4 శాతం క్షీణత నమోదైంది. ఇంటర్ మీడియట్ గూడ్స్ ఉత్పత్తి 2.8 శాతం తగ్గగా, ప్రైమరీ గూడ్స్ 2 శాతం, ఇన్ఫ్రా/కన్స్ట్రక్షన్ గూడ్స్ ఉత్పత్తి 1 శాతం వృద్ధిని చూశాయి. అంతకుముందు సెప్టెంబర్‌లో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 3.1 శాతం వృద్ధిని చూడగా, 2021 అక్టోబర్ నెలలోనూ 4.2 శాతం వృద్ధి నమోదు కావడాన్ని గమనించొచ్చు. మొత్తం మీద అక్టోబర్‌లో ఐఐపీ గణాంకాలు అంచనాల కంటే తక్కువగా రావడం గమనార్హం. 2020 ఆగస్ట్ నెలకు నమోదైన మైనస్ 7 తర్వాత, మళ్లీ ఇంత కనిష్టాలకు తయారీ రంగం పనితీరు పడి పోవడం ఇదే మొదటిసారి. (ఎట్టకేలకు..మూడు రంగుల్లో ట్విటర్ వెరిఫైడ్ మార్క్ షురూ) -
దారుణంగా పడిపోయిన పారిశ్రామికోత్పత్తి
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ ఆర్థిక వృద్దిపై మరింత ఆందోళన రేపుతున్నాయి తాజా ఐఐపీ గణాంకాలు. ఉత్పత్తి రంగంలో నెలకొన్న సంక్షోభంతో పారిశ్రామిక ఉత్పత్తి డిసెంబరులో పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపి) 0.3 శాతానికి పడిపోయింది. 2018 డిసెంబర్లో ఇది 2.5 శాతం. ప్రధానంగా చైనాలో వ్యాపించిన కోవిడ్-2019 (కరోనా వైరస్) బాగా ప్రభావం చూసినట్టు ఎనలిస్టులు చెబుతున్నారు. ప్రభుత్వం ఐఐపీ గణాంకాలను బుధవారం విడదుల చేసింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) గణాంకాల ప్రకారం, ఏడాది క్రితం ఇదే నెలలో 2.9 శాతం వృద్ధితో పోలిస్తే ఉత్పాదక రంగాల ఉత్పత్తి 1.2 శాతం క్షీణించింది. విద్యుత్ ఉత్పత్తి కూడా 0.1 శాతం తగ్గింది. 2018 డిసెంబర్లో 4.5 శాతం వృద్ధిని సాధించింది. అయితే మైనింగ్ రంగ ఉత్పత్తి 5.4 శాతం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ కాలంలో ఐఐపి వృద్ధి 0.5 శాతానికి క్షీణించింది. 2018-19 ఇదే కాలంలో 4.7 శాతం పెరిగింది. చదవండి : ధరల మంట: రీటైల్ ద్రవ్యోల్బణం ఆరేళ్ల గరిష్టం కోవిడ్-19 : ఎలక్ట్రానిక్ పరిశ్రమలు మూత -
స్లోడౌన్ సెగలు : భారీగా తగ్గిన ఐఐపీ
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనంతో అన్ని రంగాలు కుదేలవుతుంటే తాజా గణాంకాలు మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అక్టోబర్‌లో దేశ పారిశ్రామిక ఉత్పాదకత 3.8 శాతం పతనమైందని, విద్యుత్, మైనింగ్, తయారీ రంగాలు మెరుగైన సామర్థ్యం ప్రదర్శించకపోవడమే ఇందుకు కారణమని గురువారం వెల్లడైన గణాంకాలు స్పష్టం చేశాయి. పారిశ్రామిక ఉత్పాదకత గత ఏడాది అక్టోబర్‌లో 8.4 శాతం పెరిగింది. గత ఏడాది అక్టోబర్‌లో తయారీ రంగం 8.2 శాతం వృద్ధి నమోదు చేయగా, ఈ ఏడాది అక్టోబర్‌లో 2.1 శాతం తగ్గడం స్లోడౌన్ భయాలను పెంచుతోంది. ఇక గత ఏడాది అక్టోబర్‌లో 10.8 శాతం విద్యుత్ ఉత్పత్తి పెరగ్గా, తాజాగా అది 12.2 శాతం పతనమైంది. మైనింగ్ ఉత్పత్తి గత ఏడాది ఇదే నెలలో 7.3 శాతం పెరగ్గా, ప్రస్తుతం 8 శాతం మేర పడిపోయింది. మరోవైపు ఆహారోత్పత్తుల ధరలు ఎగబాకడంతో నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం మూడేళ్ల గరిష్టస్ధాయిలో 5.54 శాతానికి ఎగిసింది. -
షాకింగ్ : భారీగా పడిపోయిన పారిశ్రామిక ఉత్పత్తి
న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం దేశ ఆర్థిక వ్యవస్థను ఆందోళనలో పడవేస్తుండగా తాజాగా ఆగస్ట్‌లో పారిశ్రామిక ఉత్పత్తి భారీగా పడిపోయిందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. తయారీ, విద్యుత్ ఉత్పత్తి, మైనింగ్ సహా పలు రంగాల్లో వృద్ధి మందకొడిగా ఉండటంతో ఆగస్ట్‌లో పారిశ్రామిక ఉత్పత్తి 1.1 శాతం తగ్గిందని ఈ గణాంకాలు వెల్లడించాయి. గత ఏడాది ఆగస్ట్‌లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 4.8 శాతం మేర పెరిగింది. గత ఏడాది ఇదే నెలలో విద్యుత్ ఉత్పత్తి 7.6 శాతం పెరగ్గా తాజాగా విద్యుత్ ఉత్పత్తి 0.9 శాతం పడిపోయింది. మైనింగ్ రంగం కేవలం 0.1 శాతం పెరుగుదల నమోదు చేసింది. ఇక ఐఐపీలో 77 శాతం వాటా ఉండే తయారీ రంగం ఈ ఏడాది ఆగస్ట్‌లో 1.2 శాతం మేర కుదేలైంది. ఈ కీలక రంగం గత ఏడాది ఇదే నెలలో 5.2 శాతం వృద్ధి కనబరచడం గమనార్హం. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిరేటు గత ఏడాది ఆగస్ట్‌లో 5.3 శాతం నుంచి ఈ ఏడాది ఆగస్ట్‌లో 2.4 శాతానికి పరిమితమైంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఐపీ వృద్ధి గణాంకాలను సోమవారం వెల్లడించనున్నట్టు గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పేర్కొంది. -
ఆర్ధిక గణాంకాల నిరాశ!
న్యూఢిల్లీ: ఆర్ధిక వ్యవస్థకు సంబంధించి గురువారం వెలువడిన కీలక గణాంకాలు నిరాశపరిచాయి. కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం– జూలైలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) కేవలం 4.3 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే నెలలో ఈ వృద్ధి రేటు 6.5 శాతం. అయితే నెలవారీగా చూస్తే మాత్రం కొంత బెటర్. 2019 జూన్‌లో ఈ వృద్ధి రేటు అతి తక్కువగా 1.2 శాతంగా నమోదయ్యింది. కాగా రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నా, (ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 4 శాతం లోపు) ఆగస్టులో ఇది అప్‌ట్రెండ్‌లోనే ఉంది. 3.21 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో నమోదయ్యింది. ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణం. గణాంకాల్లో ముఖ్యాంశాలను చూస్తే... తయారీ రంగం పేలవం... ♦ మొత్తం సూచీలో దాదాపు 70 శాతం వాటా కలిగిన తయారీ రంగం జూలైలో నిరాశ కలిగించింది. తయారీ రంగం 4.2 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంటే, 2018 ఇదే నెలలో ఈ రేటు 7 శాతంగా ఉంది. తయారీ రంగంలోని మొత్తం 23 గ్రూపుల్లో 13 జూలైలో సానుకూలంగా ఉంటే, మిగిలినవి నేలచూపులు చూశాయి. ఇందులో పేపర్, పేపర్ ఉత్పత్తుల తయారీ పారిశ్రామిక గ్రూప్ భారీగా –15.4 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. మోటార్ వెహికల్స్ తయారీ విభాగంలో రేటు –13.3%. ప్రింటింగ్, రీప్రొడక్షన్ విభాగంలో క్షీణత రేటు –10.9 శాతంగా ఉంది. ♦ క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్ర పరికరాల ఉత్పత్తికి సంకేతంగా ఉన్న క్యాపిటల్ గూడ్స్ విభాగంలో అసలు వృద్ధి లేకపోగా – 7.1 శాతం క్షీణత నమోదయ్యింది. 2018 ఇదే నెలలో ఈ విభాగంలో వృద్ధి రేటు కనీసం 2.3%గా ఉంది. ♦ విద్యుత్: ఈ రంగంలో కూడా వృద్ధి రేటు 6.6 శాతం నుంచి 4.8 శాతానికి పడింది. ♦ కన్జూమర్ డ్యూరబుల్స్: ఫ్రిజ్‌లు, టీవీల వంటి ఈ విభాగంలో ఉత్పాదకత – 2.7 క్షీణించింది. ♦ మైనింగ్: కొంచెం మెరుగుపడింది. వృద్ధి రేటు 3.4 శాతం నుంచి 4.9 శాతానికి పెరిగింది. ♦ కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్: సబ్బులు ఇతర ప్యాకేజ్డ్ గూడ్స్ వంటి ఫాస్ట్ మూవింగ్ వినియోగ వస్తువుల విభాగంలో మాత్రం వృద్ధి రేటు 8.3 శాతంగా ఉంది. నాలుగు నెలల్లోనూ నేలచూపే... ♦ ఆరి్థక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో (ఏప్రిల్–జూలై) పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 3.3 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే కాలంలో ఈ రేటు 5.4 శాతంగా ఉంది. 10 నెలల గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 3.21 శాతానికి పెరిగింది. గడచిన పది నెలల కాలంలో ఇంత అధిక రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. మాంసం, చేపలు, కూరలు, పప్పు దినుసుల వంటి ఆహార ఉత్పత్తుల అధిక ధరలు రిటైల్ ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమని గణాంకాలు వివరిస్తున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం స్థాయిలో(2 శాతం అటుఇటుగా) ఉండాలని ఆర్బీఐ నిర్దేశిస్తోంది. ఈ లెక్కన ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నట్లు భావించాల్సి ఉంటుంది. అందువల్ల ఆర్బీఐ రెపోరేటు ను (ప్రస్తుతం 5.4%) మరో పావుశాతం తగ్గించే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆగస్టులో ఫుడ్ బాస్కెట్ ధరల స్పీడ్ 2.36% (జూలైలో) 2.99 శాతానికి పెరిగింది. చేపలు, మాంసం బాస్కెట్ ధర 8.51% పెరిగితే, పప్పు ధాన్యాల ధరలు 6.94% ఎగశాయి. కూరగాయల ధరలు ఆగస్టులో 6.9% పెరిగాయి. -
రీటైల్ ద్రవ్యోల్బణం పైకి, ఐఐపీ కిందికి
సాక్షి, న్యూఢిల్లీ : రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలలో 3.05 శాతంతో పోలిస్తే ఈ నెలలో 3.18 శాతానికి పెరిగింది. శుక్రవారం విడుదల చేసిన గణాంకాల విభాగం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఫ్యాక్టరీ ఉత్పత్తి ఇండెక్స్ పడిపోయింది. మే నెలలో ఐఐపీ 4.1 శాతంగా ఉండగా జూన్ నెలలో 3.1 శాతానికి తగ్గింది. కూరలు, పళ్లు, బియ్యం ధరలు తగ్గుముఖం పట్టగా, గుడ్లు, మాంసం, చేపలు ధరలు భగ్గుమన్నాయి. ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. తాజా రీటైల్ ద్రవ్యోల్బణం డేటా గణాంకాలను బట్టి ఆర్థిక వ్యవస్థకు మరింత ప్రమాదం తప్పదని ఎనలిస్టులు భావిస్తున్నారు. అలాగే వచ్చే నెల (ఆగస్టు)లో జరగనున్న ఆర్బీఐ ద్వైమాసిక పాలసీ రివ్యూలో మరోసారి 25 బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపునకు మొగ్గు చూపనుందని అంచనా. మార్చి త్రైమాసికంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఐదేళ్ల కనిష్టానికి 5.8 శాతానికి మందగించడంతో 2019-20 వృద్ధి అంచనాను 2019-20 సంవత్సరానికి 7.2 శాతం నుండి 7 శాతానికి ఆర్బిఐ సవరించింది. గత నెలలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) వరుసగా మూడవ సారి పాలసీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల ద్వారా తగ్గించిన సంగతి తెలిసిందే. -
పడిపోయిన దేశీయ పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ)
సాక్షి, న్యూఢిల్లీ : మార్చి నెల ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్ (ఐఐపీ) డేటా 0.1 శాతంగా నమోదైంది. మే 10 న ప్రభుత్వం విడుదల చేసిన పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) గణాంకాల ప్రకారం దాదాపు 21 నెలల కనిష్టానికి చేరింది. ఫిబ్రవరిలో 0.1 శాతం వద్ద 20 నెలల కనిష్ట స్థాయికి చేరి ఐఐపీ డేటా తాజాగా నెగిటివ్ జోన్లో దిగజారింది మొత్తం ఇండెక్స్‌లో మూడు వంతులకు పైగా ఉత్పత్తి చేసే ఉత్పాదక ఉత్పాదకత, 0.4 శాతానికి పడిపోయింది, అయితే ఫిబ్రవరిలో చూసిన 1.2 శాతం మొఎంఎం వృద్ధితో పోలిస్తే వినియోగదారుల వృద్ధి 5.1 శాతం తగ్గింది. ప్రైవేటు రంగ పెట్టుబడుల కార్యకలాపాలను అంచనా వేసే ప్రాసిక్యూట్ కాపిటల్ గూడ్స్ ఉత్పత్తి 8.7 శాతం పడిపోయింది. ఫిబ్రవరిలో చూసిన 4.3 శాతం వృద్ధిరేటుతో పోల్చుకుంటే వినియోగదారుల నిర్ణేతర రంగం 0.3 శాతం వృద్ధిని సాధించింది. ఫిబ్రవరితో పోలిస్తే విద్యుత్ రంగం 2.2 శాతం, మైనింగ్ రంగం వృద్ధి 0.8 శాతం చొప్పున వృద్ధి సాధించింది. ప్రైవేటు వినియోగం తగ్గుముఖం పట్టడం, స్థిరమైన పెట్టుబడులు పెరగడం, ఎగుమతులు తగ్గడం లాంటివి 2018-19 ఆర్థిక సంవత్సరంలో మందగింపుపై ప్రభావం చూపాయని ఆర్థికమంత్రిత్వ శాఖ తన నివేదికలో పేర్కొంది. అలాగే వ్యవసాయ రంగం వృద్ధిలో మెరుగుదల, పరిశ్రమలో వృద్ధిని కొనసాగించడం సవాలుగా మారిందని తెలిపింది. పరిశ్రమల పరంగా, ఉత్పాదక రంగంలో గత ఏడాదితో పోలిస్తే మార్చి నెలలో 23 పరిశ్రమల్లో 12 సంస్థ తికూల వృద్ధిని సాధించాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి గత నెలలో భారత స్థూల జాతీయోత్పత్తి వృద్ధిరేటును( 2019-20 నాటికి) 7.3 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. -
3.8శాతం పడిపోయిన ఐఐపీ సూచీ
సాక్షి, న్యూఢిల్లీ: సెప్టెంబర్ త్రైమాసికంలో పారిశ్రామిక ఉత్పాదక సూచీ (ఐఐపి) ఇడెక్స్ క్షీణించింది. శుక్రవారం ప్రకటించిన డేటా ప్రకారం ఐఐపీ ఇండెక్స్ సెప్టెంబరులో 3.8 శాతానికి పడిపోయింది. గత నెలలో ఇది 4.3 శాతంగా నమోదైంది. అయితే ఉత్పాదన ఉత్పత్తి ఇండెక్స్ ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన 2.5శాతం వృద్ధిని సాధించింది. గత ఏడాది ఇదే నెలలో 3.4 శాతంగా ఉండగా, గత ఆగస్టులో 3.1 శాతంగా ఉంది. సెప్టెంబరులో విద్యుత్ ఉత్పత్తి గత ఏడాది 5.1 శాతంశాతంతో పోలిస్తే 3.4 శాతం పెరిగింది. మైనింగ్ ఉత్పత్తి 7.9 శాతం( సంవత్సరం ప్రాతిపదికన) పెరిగింది. -
361 పాయింట్ల హైజంప్
ఇరాక్, గాజా, ఉక్రెయిన్లపై ఆందోళనలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు నెమ్మదించాయి. దీంతో వరుసగా రెండో రోజు ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఉత్సాహం చూపారు. వెరసి సెన్సెక్స్ 361 పాయింట్లు ఎగసింది. ఇది గత 10 వారాల్లోనే అత్యధికంకాగా, 25,881 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇంతక్రితం జూన్ 6న మాత్రమే ఈ స్థాయిలో 377 పాయింట్లు లాభపడింది. ఇక నిఫ్టీ కూడా 101 పాయింట్లు జంప్‌చేసి 7,727 వద్ద స్థిరపడింది. ప్రధానంగా ఆటో, ఆయిల్, బ్యాంకింగ్ రంగాలు 1.5% స్థాయిలో పుంజుకున్నాయి. ఇందుకు టాటా మోటార్స్, బీపీసీఎల్, ఐవోసీ వంటి దిగ్గజాలు ప్రకటించిన ప్రోత్సాహకర ఫలితాలు దోహదపడ్డాయి. ఆసియా మార్కెట్ల ప్రభావంతో సెన్సెక్స్ తొలుత 25,704 వద్ద లాభాలతో మొదలైంది. చివరి గంటన్నరలో ఊపందుకున్న కొనుగోళ్లతో గరిష్టంగా 25,905కు చేరింది. పలు బ్లూచిప్ కంపెనీల ఆకర్షణీయ ఫలితాలు, ఆయిల్ ధరలు చల్లబడటం వంటి అంశాలు సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇతర విశేషాలివీ... సెన్సెక్స్ దిగ్గజాలలో టాటా మోటార్స్, హెచ్ డీఎఫ్సీ 5%పైగా జంప్‌చేయగా, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, ఎల్అండ్టీ 3-1.5% మధ్య లాభపడ్డాయి. ఇతర బ్లూచిప్స్‌లో కేవలం 3 షేర్లు నీరసించగా, భారతీ 1.7% నష్టపోయింది. ఆయిల్ షేర్లలో గెయిల్ 6% దూసుకెళ్లగా, ఐవోసీ, ఓఎన్జీసీ, బీపీసీఎల్ 4-3% మధ్య పురోగమించాయి. బ్యాంకింగ్ దిగ్గజాలలో బీవోబీ, యస్‌బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా, యాక్సిస్ 3-1.5% మధ్య పెరిగాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 0.5% చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,555 లాభపడితే, 1,366 నష్టపోయాయి. ఎఫ్ఐఐలు రూ. 371 కోట్లను ఇన్వెస్ట్‌చేశారు. బీఎస్ఈ-500లో ఎస్ఆర్ఎఫ్, నవనీత్ ఎడ్యుకేషన్, జేకే సిమెంట్, ఐషర్ మోటార్స్, రామ్‌కో సిమెంట్, పీటీసీ, కేఈసీ, టిమ్కెన్ 13-6% మధ్య దూసుకెళ్లాయి. -
102 పాయింట్లు ప్లస్
* 25,576 వద్దకు సెన్సెక్స్ * ఇంట్రాడేలో 25,600పైకి * పలుమార్లు హెచ్చుతగ్గులు * ఎఫ్ఐఐల పెట్టుబడులు పలుమార్లు ఊగిసలాటకు లోనైనప్పటికీ చివరికి మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 102 పాయింట్లు లాభపడి 25,576 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 23 పాయింట్లు బలపడి 7,650 వద్ద నిలిచింది. రోజు మొత్తం 200 పాయింట్ల పరిధిలో హెచ్చుతగ్గులను చవిచూసిన సెన్సెక్స్ ఒక దశలో 25,600ను అధిగమించడం గమనార్హం. కాగా, ఏప్రిల్ పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), మే రిటైల్ ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు మార్కెట్లు ముగిశాక వెలువడ్డాయి. వీటిపై దృష్టితో ఇన్వెస్టర్లు కొంతమేర ఆచితూచి వ్యవహరించారని నిపుణులు పేర్కొన్నారు. ఐఐపీ మెరుగుపడటం, సీపీఐ బలహీనపడటం వంటి అంశాలు వడ్డీ రేట్ల తగ్గింపునకు రిజర్వ్ బ్యాంక్‌కు అవకాశమిస్తాయని వ్యాఖ్యానించారు. భారతీ డీలా బ్లూచిప్స్‌లో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ షేరు 4% పతనమైంది. విదేశీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ క్రెడిట్ స్వీస్ న్యూట్రల్ నుంచి అండర్పెర్ఫార్మ్ స్థాయికి షేరును డౌన్‌గ్రేడ్ చేయడమే దీనికి కారణం. ముకేష్ గ్రూప్ సంస్థ రిలయన్స్ జియో నుంచి పెరగనున్న పోటీ నేపథ్యంలో రేటింగ్‌ను తగ్గించింది. మిగిలిన దిగ్గజాలలో కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, భెల్, ఆర్ఐఎల్, ఐసీఐసీఐ 2-0.5% మధ్య నష్టపోయాయి. అయితే మరోవైపు హిందాల్కో 4% పుంజుకోగా, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ ద్వయం, మారుతీ, ఎన్టీపీసీ, టీసీఎస్ 3-1% మధ్య లాభపడ్డాయి. ఇక కొత్త సీఈవోను ప్రకటించిన ఇన్ఫోసిస్ 0.4% నష్టపోయింది. చిన్న షేర్లు ఓకే మెరుగుపడ్డ సెంటిమెంట్‌కు అనుగుణంగా మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 0.5% స్థాయిలో పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,746 లాభపడగా, 1,356 తిరోగమించాయి. ఎఫ్ఐఐలు రూ. 652 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, దేశీ సంస్థలు రూ. 742 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. -
నడత మారని పారిశ్రామికం
న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగంలో రికవరీ కనబడ్డం లేదు. ఫిబ్రవరి తరహాలోనే (-1.8 శాతం) మార్చిలో సైతం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో వృద్ధిలేకపోగా క్షీణత నమోదయ్యింది. ఈ సూచీ -0.5 శాతం క్షీణించింది. ప్రధాన రంగాలు తయారీ, మైనింగ్, క్యాపిటల్ గూడ్స్ పేలవ పనితీరు దీనికి ప్రధాన కారణం. అయితే ఫిబ్రవరితో పోల్చితే క్షీణత రేటు మెరుగుపడ్డమే ఇక్కడ చెప్పుకోదగింది. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) సోమవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. 2013 మార్చి నెలలో పారిశ్రామిక వృద్ధి రేటు 3.5 శాతం. ప్రధాన రంగాల పనితీరును పరిశీలిస్తే... తయారీ: మొత్తం సూచీలో దాదాపు 70% వాటా కలిగిన తయారీ రంగం వృద్ధి రేటు క్షీణతలోకి జారింది. 4.3% వృద్ధి రేటు మైనస్ 1.2%లోకి జారింది. మైనింగ్: సూచీలో 14 శాతం వెయిటేజ్ ఉన్న ఈ రంగంలో క్షీణత కొనసాగుతోంది. అయితే క్షీణత (-) 2.1 శాతం నుంచి 0.4 శాతానికి తగ్గింది. విద్యుత్: ఈ రంగంలో వృద్ధిరేటు మాత్రం బాగుంది. ఇది 3.5 శాతం నుంచి 5.4 శాతానికి మెరుగుపడింది. క్యాపిటల్ గూడ్స్: డిమాండ్‌కు ప్రధాన సూచికగా ఉండే భారీ ఉత్పత్తుల రంగం క్యాపిటల్ గూడ్స్ 9.6% వృద్ధి నుంచి మైనస్ 12.5 శాతంలోకి పడిపోయింది. వినియోగ వస్తువులు: ఈ రంగం 1.8% వృద్ధి నుంచి 0.9% క్షీణతలోకి చేరింది. ఈ రంగంలోని వినియోగ మన్నిక ఉత్పత్తుల్లో అసలు వృద్ధిలేకపోగా 11.8% క్షీణించింది. 2013 మార్చిలో సైతం ఈ రంగం క్షీణతలో ఉన్నా, అప్పట్లో ఇది మైనస్ 4.9 శాతం. -
రోజంతా అమ్మకాలే
ప్రపంచ మార్కెట్ల నష్టాలు దేశీయ స్టాక్స్‌పైనా ప్రభావం చూపాయి. మరోవైపు మార్చి నెలకు వాణిజ్య లోటు 10.5 బిలియన్ డాలర్లకు చేరడంతో సెంటిమెంట్ బలహీనపడింది. దీంతో ఇటీవల భారీగా లాభపడుతూ వ చ్చిన మార్కెట్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలకు దిగారు. వెరసి సెన్సెక్స్ రోజంతా నష్టాలలోనే కదిలింది. ఒక దశలో 190 పాయింట్ల వరకూ క్షీణించి 22,526 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. చివర్లో షార్ట్ కవరింగ్ కారణంగా కొంత కోలుకుని 86 పాయింట్ల నష్టంతో 22,629 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ కూడా 20 పాయింట్లు తగ్గి 6,776 వద్ద నిలిచింది. గత రెండు రోజుల్లో సెన్సెక్స్ 372 పాయింట్లు ఎగసిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఆయిల్, బ్యాంకింగ్, ఆటో రంగాలు 1% స్థాయిలో నీరసించగా, ఐటీ ఇండెక్స్ 1.5%, హెల్త్‌కేర్ 1% చొప్పున పుంజుకున్నాయి. వెలుగులో సాఫ్ట్వేర్ షేర్లు వచ్చే వారం మొదట్లో ఫలితాలు ప్రకటించనున్న సాఫ్ట్వేర్ దిగ్గజాల షేర్లు వెలుగులో నిలిచాయి. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ 2-1% మధ్య పుంజుకోగా, హెల్త్‌కేర్ దిగ్గజాలు సన్ ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ సైతం అదే స్థాయిలో లాభపడ్డాయి. కాగా, మరోవైపు ఆటో దిగ్గజాలు ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, హీరోమోటో, మారుతీ సహా ఆర్ఐఎల్, ఎస్బీఐ, హిందాల్కో, హెచ్‌యూఎల్, ఎల్అండ్టీ 1.5% స్థాయిలో క్షీణించాయి. ఎఫ్ఐఐల అమ్మకాలు శుక్రవారం కూడా చిన్న షేర్లకు డిమాండ్ కొనసాగింది. దీంతో ట్రేడైన షేర్లలో 1,539 పురోగమిస్తే, 1,267 నష్టపోయాయి. ఇటీవల నికర పెట్టుబడులకే కట్టుబడుతున్న ఎఫ్ఐఐలు తొలిసారి 362 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీ ఫండ్స్ రూటగు మార్చి రూ. 365 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. -
రికవరీ ఆశల పై నీళ్లు...!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు ఆర్థిక రికవరీ ఆశలపై నీళ్లు చల్లాయి. 2013 డిసెంబర్ పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు చూస్తే... ఉత్పత్తిలో అసలు వృద్ధి లేకపోగా, క్షీణ దశ కొనసాగుతున్నట్లు వెల్లడైంది. ఇందుకు సంబంధించి 2012 డిసెంబర్లో -0.6 శాతం క్షీణత నమోదుకాగా, 2013 డిసెంబర్లో కూడా ఇదే ఫలితం వెలువడింది. క్షీణత యథాపూర్వం -0.6 శాతంగా నమోదయింది. అయితే కొంతలో కొంత ఊరట అనుకుంటే క్షీణత రేటు తగ్గడం. అక్టోబర్ పారిశ్రామిక ఉత్పత్తి క్షీణత -1.6 శాతం. నవంబర్‌లో -1.3 శాతం. తాజాగా ఇది మరింత తగ్గి - 0.6 శాతానికి చేరింది. ఐదు ప్రధాన రంగాల తీరు... మొత్తం ఐఐపీలో దాదాపు 75 శాతం వాటా కలిగిన తయారీ రంగం క్షీణత మరింత పెరిగింది. 2012 డిసెంబర్లో క్షీణత -0.8 శాతం. అదిప్పుడు ఏకంగా -1.6 శాతానికి చేరింది. మొత్తం పారిశ్రామికోత్పత్తి సూచీలో 14 శాతం వాటా ఉండే మైనింగ్ రంగం క్షీణత నుంచి బయటపడింది. ఈ రంగం -3.1 శాతం క్షీణత నుంచి 0.4 శాతం వృద్ధికి మళ్లింది. విద్యుత్ రంగం వృద్ధి రేటు కొంత సానుకూల రీతిలో 5.2 శాతం నుంచి 7.5 శాతానికి ఎగసింది. మొత్తం వినియోగ వస్తువుల విభాగం క్షీణత మరింత పెరిగి -3.6 శాతం నుంచి -5.3 శాతానికి చేరింది. ఇందులో మన్నికైన వస్తువుల (డ్యూరబుల్) విభాగంలో సైతం క్షీణత మరింత పెరిగింది. -8.1 శాతం నుంచి -16.2 శాతానికి చేరింది. కన్సూమర్ నాన్-డ్యూరబుల్కు వస్తే ఈ విభాగం వృద్ధిబాటకు మళ్లింది. -0.5 శాతం క్షీణత నుంచి 1.6 శాతం వృద్ధిబాటకు మళ్లింది. ఇక డిమాండ్‌కు సూచిక అయిన భారీ వస్తువుల ఉత్పత్తి రంగం క్యాపిటల్ గూడ్స్ విభాగంలో క్షీణత మరింత పెరిగింది. -1.1 శాతం నుంచి -3 శాతానికి పడింది. 9 నెలల్లోనూ క్షీణతే... కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లోనూ (2013-14 మార్చి-డిసెంబర్) పారిశ్రామిక రంగం రివర్స్‌గేర్‌లోనే పయనించింది. ఉత్పాదకత క్షీణతలోనే నమోదైంది. 2012 ఏడాది ఇదే కాలంలో 0.7 శాతం వృద్ధి రేటు నమోదుకాగా, ప్రస్తుతం అసలు వృద్ధిలేకపోగా -0.1 శాతానికి ఉత్పత్తి కుంగింది. వడ్డీ రేట్ల కోత తప్పనిసరి: పరిశ్రమలు తాజా గణాంకాల పట్ల పారిశ్రామిక వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. పారిశ్రామిక రంగంలో వృద్ధికి ఆర్బీఐ రెపో రేటు తగ్గించాల్సిన అవసరం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే తయారీ రంగం పునరుత్తేజానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశాయి. ముఖ్యంగా తాము తయారీ రంగం తీరు పట్ల ఆందోళన చెందుతున్నట్లు సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ చెప్పారు. పెట్టుబడులు, డిమాండ్ పెరగడానికి తగిన పరపతి విధానం అవసరమన్నారు. ద్రవ్యోల్బణం తగ్గుతున్న ధోరణి నేపథ్యంలో వడ్డీరేటు తగ్గించడానికి వెసులుబాటు ఉంటుందని విశ్లేషించారు. అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ కూడా దాదాపు అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. పారిశ్రామిక రంగం వ్యవస్థాగత అడ్డంకులను ఎదుర్కొంటున్నట్లు పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ శరద్ జైపూరియా అన్నారు. తగిన మౌలిక సదుపాయాలు లేకపోవడం, దీనిపై వ్యయాలు తీవ్రంగా ఉండడం, రుణ సమీకరణ వ్యయాల భారం వంటి అంశాలను ప్రస్తావించారు. కాగా ద్రవ్యోల్బణం-వృద్ధి మధ్య సమతౌల్యతను సాధించడానికి, ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తూ... వృద్ధికి ఊతం ఇవ్వడానికి ఆర్బీఐ, ప్రభుత్వం కలిసి పనిచేయాలని ఫిక్కీ సెక్రటరీ జనరల్ దిబార్ సింగ్ కోరారు. -
తొలి లాభాలు చివర్లో ఆవిరి
పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ కేసు దాఖలుకు ఆదేశించడంతో స్టాక్ మార్కెట్లు చివర్లో మందగించాయి. కేజీ బేసిన్లో లభించే గ్యాస్ ధర విషయంలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఆయిల్ మంత్రి వీరప్ప మొయిలీ, మాజీ మంత్రి మురళీ దేవరాలతోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీపై క్రిమినల్ కేసుల దాఖలుకు ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు2% నష్టపోయి రూ. 805 వద్ద ముగిసింది. ఇది మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. వెరసి సెన్సెక్స్ తొలుత ఆర్జించిన 110 పాయింట్ల లాభాన్ని చాలావరకూ పోగొట్టుకుంది. చివరికి 29 పాయింట్ల వృద్ధితో 20,363 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 9 పాయింట్లు బలపడి 6,063 వద్ద స్థిరపడింది. వాణిజ్య లోటు జోష్ జనవరి నెలకు దిగుమతులు నీరసించడంతోపాటు ఎగుమతులు పుంజుకోవడం ద్వారా వాణిజ్య లోటు 10 బిలియన్ డాలర్లకు పరిమితంకావడంతో సెంటిమెంట్ మెరుగుపడింది. మరోవైపు టాటా మోటార్స్, టాటా స్టీల్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి దిగ్గజాలు 2-1% మధ్య లాభపడటం తొలుత మార్కెట్లకు సహకరించింది. అయితే ఆర్ఐఎల్కు జతగా ఎన్టీపీసీ, హిందాల్కో, హీరో మోటో 2% స్థాయిలో నష్టపోయాయి. మరోసారి ఎఫ్ఐఐలు అమ్మకాలకే కట్టుబడటం గమనార్హం. సోమవారం రూ. 455 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఎఫ్ఐఐలు తాజాగా రూ. 165 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీయ ఫండ్స్ మాత్రం రూ. 242 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. -
పరిశ్రమలు పాతాళంలో..
న్యూఢిల్లీ: పారిశ్రామికోత్పత్తి అక్టోబర్‌లో అసలు వృద్ధి నమోదు కాలేదు. పైగా క్షీణత బాటలో మైనస్ (-) 1.8 శాతంలోకి జారిపోయింది. అంటే వార్షిక ప్రాతిపదికన చూస్తే సంబంధిత సూచీ (ఐఐపీ)లో అసలు వృద్ధి లేకపోగా, క్షీణించిందన్నమాట. వరుసగా రెండు నెలల క్షీణబాట వీడి జూలై నుంచీ వరుసగా మూడు నెలల పాటు 2012 ఇదే నెలతో పోల్చితే పారిశ్రామిక ఉత్పత్తి సూచీ కొద్దోగొప్పో వృద్ధి సాధిస్తూ వస్తోంది (జూలైలో 2.8 శాతం, ఆగస్టులో 0.4 శాతం, సెప్టెంబర్‌లో 2 శాతం). అయితే తిరిగి అక్టోబర్‌లో క్షీణతలోకి జారిపోయింది. గురువారం ప్రభుత్వం ఈ గణాంకాలను విడుదల చేసింది. 2012 అక్టోబర్‌లో ఐఐపీ వృద్ధి 8.4 శాతం. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో సైతం ఐఐపీలో అసలు వృద్ధి నమోదు కాలేదు. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 1.2 శాతం. కీలక రంగాలు ఇలా... తయారీ: మొత్తం సూచీలో దాదాపు 70 శాతం వాటా కలిగిన తయారీ రంగం అక్టోబర్‌లో గత ఏడాది ఇదే నెలతో పోల్చితే 9.9 శాతం వృద్ధి నుంచి 2.0 క్షీణతలోకి జారిపోయింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో సైతం 1.1 శాతం వృద్ధి నుంచి -0.3 శాతం క్షీణతలోకి జారింది. తయారీ రంగంలోని మొత్తం 22 గ్రూప్‌లలో 10 గ్రూపులు అక్టోబర్‌లో ప్రతికూలతను నమోదు చేసుకున్నాయి. మైనింగ్: ఐఐపీలో 14 శాతం వాటా కలిగిన ఈ రంగం క్షీణత మరింత పెరిగింది. ఇది -0.2 శాతం నుంచి -3.5 శాతానికి పడిపోయింది. 2013-14 మొదటి ఏడు నెలల కాలంలో ఈ రేటు -1 శాతం నుంచి -2.7 శాతానికి పడిపోయింది. విద్యుత్: విద్యుత్ రంగంలో వృద్ధి సైతం 5.5 శాతం నుంచి 1.3 శాతానికి పడిపోయింది. ఏప్రిల్-అక్టోబర్ మధ్య మాత్రం ఈ రేటు 4.7 శాతం నుంచి 5.3 శాతానికి ఎగసింది. క్యాపిటల్ గూడ్స్: డిమాండ్‌ను ప్రతిబింబించే ఈ రంగంలో వృద్ధిరేటు 7 శాతం నుంచి 2.3శాతానికి పడిపోయింది. ఏడు నెలల కాలంలో చూస్తే క్షీణత కొంత తగ్గడం కొంతలోకొంత ఊరట. ఈ కాలంలో ఈ రేటు -11.6 శాతం నుంచి -0.2 శాతానికి తగ్గింది. వినియోగ వస్తువులు: ఈ విభాగం అక్టోబర్‌లో అసలు వృద్ధిని నమోదుచేసుకోలేదు. గత ఏడాది ఇదే నెలలో వృద్ధి 13.8 శాతంకాగా, 2013 ఇదే నెలలో ఈ రేటు -5.1 శాతంగా ఉంది. ఇక ఏడు నెలల కాలంలో 4.2 శాతం వృద్ధి రేటు -1.8 శాతంలోకి జారిపోయింది. ఈ విభాగంలో భాగమైన కన్సూమర్ డ్యూరబుల్స్ మొత్తంగా కూడా క్షీణతలోకి జారింది. 16.7 శాతం వృద్ధి నుంచి భారీగా 12 శాతం క్షీణతలోకి పడిపోయింది. ఏడు నెలల కాలంలో 5.7 శాతం వృద్ధి రేటు సైతం -11.2 క్షీణతలోకి జారిపోయింది. ఇక ఈ విభాగంలో మరో భాగమైన నాన్-డ్యూరబుల్స్ విభాగం వృద్ధి 11.2 శాతం నుంచి 1.8 శాతానికి పడిపోయింది. ఏడు నెలల కాలంలో ఈ రేటు వృద్ధి 2.8 శాతం నుంచి 6.7 శాతానికి పెరిగింది. వడ్డీ రేట్లు తగ్గించాల్సిందే...: పారిశ్రామిక వర్గాలు అక్టోబర్ పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాల పట్ల పారిశ్రామిక వర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. తయారీ రంగంసహా పారిశ్రామిక రంగం పునరుత్తేజానికి రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను తగ్గించాల్సిందేనని ఫిక్కీ ప్రెసిడెంట్ నైనా లాల్ కిద్వాయ్ పేర్కొన్నారు. వడ్డీరేట్ల కోత జరగనిదే సమీప భవిష్యత్తులో పారిశ్రామికోత్పత్తి మెరుగుదలను చూడలేమని ఆమె అన్నారు. భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి ప్రస్తుత స్థాయికన్నా తక్కువకు పడబోదని, పారిశ్రామిక క్రియాశీలత తిరిగి మెరుగవుతుందని ఇటీవల నెలకొన్న ఆశలపై ఈ గణాంకాలు నీళ్లుజల్లాయని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. పరిస్థితి మెరుగుపడాలంటే పటిష్ట, నిర్ణయాత్మకమైన పాలసీ నిర్ణయాలు అవసరమని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు.