
సాక్షి, న్యూఢిల్లీ : రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలలో 3.05 శాతంతో పోలిస్తే ఈ నెలలో 3.18 శాతానికి పెరిగింది. శుక్రవారం విడుదల చేసిన గణాంకాల విభాగం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఫ్యాక్టరీ ఉత్పత్తి ఇండెక్స్ పడిపోయింది. మే నెలలో ఐఐపీ 4.1 శాతంగా ఉండగా జూన్ నెలలో 3.1 శాతానికి తగ్గింది. కూరలు, పళ్లు, బియ్యం ధరలు తగ్గుముఖం పట్టగా, గుడ్లు, మాంసం, చేపలు ధరలు భగ్గుమన్నాయి. ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి.
తాజా రీటైల్ ద్రవ్యోల్బణం డేటా గణాంకాలను బట్టి ఆర్థిక వ్యవస్థకు మరింత ప్రమాదం తప్పదని ఎనలిస్టులు భావిస్తున్నారు. అలాగే వచ్చే నెల (ఆగస్టు)లో జరగనున్న ఆర్‌బీఐ ద్వైమాసిక పాలసీ రివ్యూలో మరోసారి 25 బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపునకు మొగ్గు చూపనుందని అంచనా.
మార్చి త్రైమాసికంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఐదేళ్ల కనిష్టానికి 5.8 శాతానికి మందగించడంతో 2019-20 వృద్ధి అంచనాను 2019-20 సంవత్సరానికి 7.2 శాతం నుండి 7 శాతానికి ఆర్‌బిఐ సవరించింది. గత నెలలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) వరుసగా మూడవ సారి పాలసీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల ద్వారా తగ్గించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment