Consumer Inflation
-
రీటైల్ ద్రవ్యోల్బణం పైకి, ఐఐపీ కిందికి
సాక్షి, న్యూఢిల్లీ : రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలలో 3.05 శాతంతో పోలిస్తే ఈ నెలలో 3.18 శాతానికి పెరిగింది. శుక్రవారం విడుదల చేసిన గణాంకాల విభాగం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఫ్యాక్టరీ ఉత్పత్తి ఇండెక్స్ పడిపోయింది. మే నెలలో ఐఐపీ 4.1 శాతంగా ఉండగా జూన్ నెలలో 3.1 శాతానికి తగ్గింది. కూరలు, పళ్లు, బియ్యం ధరలు తగ్గుముఖం పట్టగా, గుడ్లు, మాంసం, చేపలు ధరలు భగ్గుమన్నాయి. ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. తాజా రీటైల్ ద్రవ్యోల్బణం డేటా గణాంకాలను బట్టి ఆర్థిక వ్యవస్థకు మరింత ప్రమాదం తప్పదని ఎనలిస్టులు భావిస్తున్నారు. అలాగే వచ్చే నెల (ఆగస్టు)లో జరగనున్న ఆర్బీఐ ద్వైమాసిక పాలసీ రివ్యూలో మరోసారి 25 బేసిస్ పాయింట్ల రేటు తగ్గింపునకు మొగ్గు చూపనుందని అంచనా. మార్చి త్రైమాసికంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఐదేళ్ల కనిష్టానికి 5.8 శాతానికి మందగించడంతో 2019-20 వృద్ధి అంచనాను 2019-20 సంవత్సరానికి 7.2 శాతం నుండి 7 శాతానికి ఆర్బిఐ సవరించింది. గత నెలలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) వరుసగా మూడవ సారి పాలసీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల ద్వారా తగ్గించిన సంగతి తెలిసిందే. -
5 నెలల గరిష్టానికి వినియోగదారుల ద్రవ్యోల్బణం
సాక్షి, ముంబై : వినియోగదారుల ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్టానికి ఎగిసింది. ఆగస్టు నెలలో వినియోగదారుల ద్రవ్యోల్బణం 3.36 శాతంగా నమోదైంది. ఆహారం, ఇంధన ధరలు ఎక్కువగా పెరుగడంతో ఈ ద్రవ్యోల్బణం పెరిగిందని మంగళవారం ప్రభుత్వం వెలువరించిన డేటాలో వెల్లడైంది. జూలై నెలలో ఈ ద్రవ్యోల్బణం 2.36 శాతంగా నమోదైంది. ఇదే సమయంలో పారిశ్రామికోత్పత్తి రికవరీ అయింది. జూలై నెలలో దీని వృద్ధి 1.2 శాతంగా నమోదైనట్టు తెలిసింది. జూన్ నెలలో ఈ ఉత్పత్తి కేవలం 0.2 శాతంగానే ఉంది. రాయిటర్స్ డేటా అంచనాల ప్రకారం ఆగస్టు నెలలో వినియోగదారుల ద్రవ్యోల్బణం 3.20 శాతంగానే ఉంటుందనని తెలిసింది. ఇటీవల కాలంలో వచ్చిన వర్షాల వల్ల పంటలు భారీగా దెబ్బతినడంతో, ఆహార ఉత్పత్తుల ధరలు పైకి ఎగిశాయి. వరుసగా మూడు నెలల పాటు కిందకి దిగజారిన రిటైల్ ద్రవ్యోల్బణం, జూలై నుంచి పెరుగడం ప్రారంభమైంది. అయినప్పటికీ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నిర్దేశించిన 4 శాతం కంటే తక్కువగానే ఉంది. హోల్సేల్ ధరలు కూడా 3 శాతం పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ గణాంకాలు బుధవారం వెలువడనున్నాయి. -
ద్రవ్యోల్బణం పెరిగింది.. ఉత్పత్తి తగ్గింది!
న్యూఢిల్లీ : వినియోగదారుల ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్ట స్థాయికి ఎగిసింది. ఇంధన ధరలు పెరుగడంతో మార్చి నెల ద్రవ్యోల్భణం పెరిగినట్టు బుధవారం విడుదలైన డేటాలో వెల్లడైంది. ధరలు పెరుగుతాయని ముందుగానే ఊహించిన రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా పాలసీ రేట్లను యథాతథంగా ఉంచింది. వారి అంచనాల మేరకే ద్రవ్యోల్బణం ఎగిసింది. గత నెల వినియోగదారుల ద్రవ్యోల్బణం 3.81 శాతం పైకి ఎగిసినట్టు ప్రభుత్వ డేటాలో తెలిసింది. 2016 అక్టోబర్ నుంచి ఇదే అత్యంత వేగవంతమైన పెరుగుదలని తేలింది. ఫిబ్రవరి నెలలో ద్రవ్యోల్బణం 3.65 శాతానికి ఎగిసినప్పటికీ, ఇంత వేగంగా పెరుగలేదని గణాంకాల మంత్రిత్వశాఖ డేటాలో వెల్లడైంది. ఫిబ్రవరి నెలలో 3.91శాతంగా ఉన్న రిటైల్ ఇంధన ద్రవ్యోల్బణం మార్చి నెలలో ఏకంగా 5.56 శాతానికి పెరిగింది. ఆహారపు ధరలు కూడా 1.93 శాతం పైకి వెళ్లాయి. కానీ ముందస్తు నెలతో పోల్చుకుంటే ఇది తక్కువేనని తెలిసింది. ఓ వైపు వినియోగదారుల ద్రవ్యోల్బణం పెరుగగా.. మరోవైపు పారిశ్రామికోత్పత్తి అనూహ్యంగా ఫిబ్రవరి నెలలో 1.2 శాతం పడిపోయింది. జనవరి నెలలో ఈ ఉత్పత్తి 2.7 శాతం వృద్ధి నమోదుచేసుకుంది. కానీ పారిశ్రామికోత్పత్తి 1.3 శాతం వృద్ధి నమోదుచేస్తుందని రాయిటర్స్ అంచనావేసింది. ప్రస్తుతం రాయిటర్స్ అంచనాలు తప్పాయి. -
నాలుగు నెలల గరిష్టానికి వినియోగ ధరల సూచీ
న్యూఢిల్లీ: ఫిబ్రవరి నెలకు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రేటు భారీగా పెరిగింది. దేశం వార్షిక వినియోగదారుల ధర ద్రవ్యోల్బణం 3.65 శాతంగా నమోదైంది. 2016 అక్టోబర్ సెప్టెంబర్ స్థాయిని నమోదు చేసి , నాలుగునెలల గరిష్టానికి చేరింది. గత నెలలో ఇది 3.17శాతంగా ఉంది. ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం ఫిబ్రవరి మాసానికిగాను 2.01 శాతంగా నిలిచి ఐదు సంవత్సరాల కనిష్ఠ స్థాయికి చేరింది. ఈ గణాంకాలను ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. గత జనవరిలో ఇది 0.53శాతంగా ఉంది. రాయిటర్స్ఆర్థికవేత్తలు గత నెల వార్షిక చిల్లర ద్రవ్యోల్బణం జనవరిలో 3.17 శాతం పోలిస్తే, 3.58 శాతంగా ఉండనుందని భావించారు.