న్యూఢిల్లీ: ఫిబ్రవరి నెలకు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రేటు భారీగా పెరిగింది. దేశం వార్షిక వినియోగదారుల ధర ద్రవ్యోల్బణం 3.65 శాతంగా నమోదైంది. 2016 అక్టోబర్ సెప్టెంబర్ స్థాయిని నమోదు చేసి , నాలుగునెలల గరిష్టానికి చేరింది. గత నెలలో ఇది 3.17శాతంగా ఉంది.
ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం ఫిబ్రవరి మాసానికిగాను 2.01 శాతంగా నిలిచి ఐదు సంవత్సరాల కనిష్ఠ స్థాయికి చేరింది. ఈ గణాంకాలను ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. గత జనవరిలో ఇది 0.53శాతంగా ఉంది.
రాయిటర్స్ఆర్థికవేత్తలు గత నెల వార్షిక చిల్లర ద్రవ్యోల్బణం జనవరిలో 3.17 శాతం పోలిస్తే, 3.58 శాతంగా ఉండనుందని భావించారు.