ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ ఆర్థిక వృద్దిపై మరింత ఆందోళన రేపుతున్నాయి తాజా ఐఐపీ గణాంకాలు. ఉత్పత్తి రంగంలో నెలకొన్న సంక్షోభంతో పారిశ్రామిక ఉత్పత్తి డిసెంబరులో పారిశ్రామిక ఉత్పత్తి సూచిక (ఐఐపి) 0.3 శాతానికి పడిపోయింది. 2018 డిసెంబర్‌లో ఇది 2.5 శాతం. ప్రధానంగా చైనాలో వ్యాపించిన కోవిడ్-2019 (కరోనా వైరస్) బాగా ప్రభావం చూసినట్టు ఎనలిస్టులు చెబుతున్నారు.
ప్రభుత్వం ఐఐపీ గణాంకాలను బుధవారం విడదుల చేసింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఓ) గణాంకాల ప్రకారం, ఏడాది క్రితం ఇదే నెలలో 2.9 శాతం వృద్ధితో పోలిస్తే ఉత్పాదక రంగాల ఉత్పత్తి 1.2 శాతం క్షీణించింది. విద్యుత్ ఉత్పత్తి కూడా 0.1 శాతం తగ్గింది. 2018 డిసెంబర్‌లో 4.5 శాతం వృద్ధిని సాధించింది. అయితే మైనింగ్ రంగ ఉత్పత్తి 5.4 శాతం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ కాలంలో ఐఐపి వృద్ధి 0.5 శాతానికి క్షీణించింది. 2018-19 ఇదే కాలంలో 4.7 శాతం పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment