సాక్షి, న్యూఢిల్లీ: సెప్టెంబర్ త్రైమాసికంలో పారిశ్రామిక ఉత్పాదక సూచీ (ఐఐపి) ఇడెక్స్ క్షీణించింది. శుక్రవారం ప్రకటించిన డేటా ప్రకారం ఐఐపీ ఇండెక్స్ సెప్టెంబరులో 3.8 శాతానికి పడిపోయింది. గత నెలలో ఇది 4.3 శాతంగా నమోదైంది. అయితే ఉత్పాదన ఉత్పత్తి ఇండెక్స్ ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన 2.5శాతం వృద్ధిని సాధించింది. గత ఏడాది ఇదే నెలలో 3.4 శాతంగా ఉండగా, గత ఆగస్టులో 3.1 శాతంగా ఉంది.
సెప్టెంబరులో విద్యుత్ ఉత్పత్తి గత ఏడాది 5.1 శాతంశాతంతో పోలిస్తే 3.4 శాతం పెరిగింది. మైనింగ్ ఉత్పత్తి 7.9 శాతం( సంవత్సరం ప్రాతిపదికన) పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment