న్యూఢిల్లీ: జీఎస్‌టీ అమలుపై చెలరేగుతున్న అనేక ఊహాగానాలకు తోడు తాజాగా విమానయాన మంత్రిత్వశాఖ లేఖ జరింత చేరింది. ఒకవైపు దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి గూడ్స అండ్ సర్వీస్ టాక్స్ యాక్ట్( జీఎస్‌టీ)ను అమలు చేసేందుకు కేంద్రం సన్నద్ధమతోంది. మరోవైపు కొత్త పరోక్ష పన్నుల విధానం అమలుకు కొంత సమయంకావాలని భావిస్తోంది. ఈ మేరకు రెవెన్యూ కార్యదర్శికి ఒక లేఖను కూడా రాసింది. దీంతోపాటు జీఎస్‌టీ పన్నుల విధానం ఆందోళన వ్యక్తం చేసింది.
జీఎస్‌టీ అమలు గడువును సెప్టెంబర్‌కు పెంచాల్సిందిగా కోరుతూ విమానయాన మంత్రిత్వశాఖ ఆర్థికమంత్రిత్వ శాఖకు ఈ లేఖ రాసింది. జూలైలో జీఎస్‌టీ పన్నుల ను అమలు చేయడం కష్టంగా ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే అంతర్జాతీయ విమానాలకు, కనెక్టింగ్ విమానాలకు ఒకేపన్ను రేటు అమలు చేయాలని కూడా మంత్రిత్వ శాఖ రెవెన్యూ సెక్రటరి హస్ముఖ అధియాకు రాసిన లేఖలో కోరింది. అంతేకాదు జీఎస్‌టీ వల్ల అంతర్జాతీయ ప్రయాణాలు, ఇన్పుట్ పన్ను క్రెడిట్లకు సంబంధించి విదేశీ సంస్థలకంటే అంతర్జాతీయ ఎయిర్ లైన్లకు లాభదాయకంగా ఉండనుందని లేఖలో పేర్కొన్నారు.
ప్రపంచ టికెటింగ్ వ్యవస్థలో మార్పును ప్రభావితం చేస్తాయని ఎయిర్లైన్స్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అందుకే జిఎస్టి అమలుకు తమకు మరింత సమయం ఇవ్వాలని ఆర్ధిక మంత్రిత్వ శాఖ కోరిందని ఏవియేషన్ మినిస్ట్రీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. సోమవారం ఈ లేఖ రాసినట్లు ఈ అధికారి తెలిపారు.
కాగా దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిరవేస్ సహా కొన్ని దేశీయ విమానయాన సంస్థలు కూడా జీఎస్‌టీ అమలుకు సహా కొన్ని దేశీయ విమానయాన సంస్థలు, తమకుకొంత సమయం కావాలని అభిప్రాయపడ్డాయి. ఇప్పటికే వివిధ వర్గాలు వారు జీఎస్‌టీఅమలుకు మరింత గడువునుకోరుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. అయితే రెవెన్యూ కార్యదర్శి హాస్ముఖ్ ఆధియాకుజూలై 1, 2017నుంచి జీఎస్‌టీ అమలు వాయిదాకానుందన్న వార్తలను ట్విట్టర్ ద్వారా ఖండించిన సంగతి తెలిసిందే.
జీఎస్‌టీ అమలు సెప్టెంబర్‌కు మార్చండి!
Published Thu, Jun 15 2017 1:26 PM | Last Updated on Tue, Oct 2 2018 4:26 PM
Advertisement