aviation ministry
-
Air India: 20 గంటలు ఆలస్యం.. కేంద్ర మంత్రిత్వశాఖ నోటీసులు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా విమానం గంటల తరబడి ఆలస్యం కావడంపై కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన విమానం దాదాపు 20 గంటలు ఆలస్యంగా కారణంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. గంటల తరబడి విమానంలోనే కూర్చోవాల్సి రావడం, ఏసీ కూడా పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనున్నారు కొందరైతే స్పృహతప్పి పడిపోయారు. కొన్ని అనివార్య కారణాల వల్ల విమానం ఆలస్యమైందని, ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి. అయితే అసలే 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఢిల్లీలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చర్యట్లు ఎందుకు చేపట్టలేదో వివరణ ఇవ్వాలని కేంద్రమంత్రిత్వశాఖ విమానయాన సంస్థను కోరింది.కాగాఎయిరిండియా కు చెందిన బోయింగ్ 777 విమానం 200 మంది ప్రయాణికులతో గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు దిల్లీ నుంచి అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో బయల్దేరాలి.. కానీ దాదాపు ఆరు గంటలు ఆలస్యమైంది. రాత్రి 8 గంటలకు రీ షెడ్యూల్ చేశారు. సాంకేతిక సమస్యలతో విమానం మార్చారు. దీంతో ప్రయాణికులు రాత్రి 7.20 గంటలకు మరో విమానంలో బోర్డింగ్ అయ్యారు. అనంతరం విమానం మళ్లీ ఆలస్యమని ప్రకటన చేశారు.అయితే అప్పటికే ప్రయాణికుల బోర్డింగ్ పూర్తవ్వగా వారిని బయటకు వెళ్లేందుకు సిబ్బంది అనుమతించలేదు.న్ని గంటల పాటు వారు విమానంలోనే కూర్చోవాల్సి వచ్చింది. దీనికితోడు ఏసీలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. తిరిగి విమానాశ్రయానికి వెళ్లేందుకు గేట్లు కూడా తెరవకపోవడంతో ప్రయాణికులు దాదాపు గంటపాటు ఏరోబ్రిడ్జిలో వేచి ఉండాల్సి వచ్చింది. ప్రయాణికుల్లో వృద్ధులు, పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు. -
ఎయిర్ఏషియా చీఫ్‌గా అలోక్ సింగ్
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాలో కాస్ట్ ఎయిర్‌లైన్ (ఎల్సీసీ) సీఈవోగా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సీఈవో అలోక్ సింగ్ జనవరి 1 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎయిర్ ఇండియా ఎల్సీసీలో ఎయిర్ఏషియా ఇండియాతోపాటు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. ఏయిర్‌ఏషియా ఇండియా ప్రస్తుత సీఈవో సునీల్ భాస్కరన్ ఇక నుంచి ఏవియేషన్ ట్రైనింగ్ అకాడమీకి నాయకత్వం వహిస్తారు. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఏయిర్‌ఏషియా ఇండియా, విస్తారా కంపెనీలు టాటా గ్రూప్‌లో భాగం. -
ఇండియా నుంచే ఏషియా తొలి ఫ్లయింగ్ కారు! మంత్రి కీలక ప్రకటన
స్టార్టప్‌ల రాకతో టెక్నాలజీ పరంగా సరికొత్త ఆవిష్కరణలు ఇండియాలో వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఏషియాలో మిగిలిన దేశాలను వెనక్కి నెడుతు తొలి ఫ్లయింగ్ కారును మార్కెట్లోకి తెచ్చేందుకు మన వాళ్లు తీవ్రంగా కృషి చేస్తున్నారు. వినత నుంచి మేకిన్ ఇండియా స్ఫూర్తితో ఇండియా దూసుకుపోతుంది. మరోవైపు రెండుమూడేళ్ల కిందట స్టార్టప్‌లుగా మొదలైన కంపెనీలు ప్రస్తుతం యూనికార్న్‌లు మారుతున్నాయి. ఈ పరంపరలో మరో మైలురాయి దాటేందుకు ఇండియాకు చెందిన వినత స్టార్టప్ ప్రయత్నిస్తోంది, ఏషియాలోనే తొలిసారి చెన్నైకి చెందిన వినత స్టార్టప్ రూపొందించిన ఫ్లైయింగ్ కారుకు సంబంధించిన ప్రోటోటైప్‌ను కేంద్ర ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింథియా పరిశీలించారు. ఫ్లైయింగ్ కారుకి సంబంధించిన పూర్తి వివరాలను మంత్రికి కంపెనీ ప్రతినిధులు వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఏషియా నుంచి తొలి ఫ్లైయింగ్ కారు మన దేశం నుంచి వచ్చే అవకాశం ఉందంటూ ప్రశంసించారు. ఇప్పటికే కొరియాకు చెందిన హ్యుందాయ్ కంపెనీ సైతం ఏషియా నుంచి ఫ్లైయింగ్ కారు తయారీ పనిలో ఉంది. Delighted to have been introduced to the concept model of the soon-to-become Asia’s First Hybrid flying car by the young team of VINATA AeroMobility: Civil Aviation Minister Jyotiraditya Scindia (1/2) pic.twitter.com/Jqtz9gbikk — ANI (@ANI) September 20, 2021 గరిష్టంగా 60 నిమిషాలు వినత రూపొందించిన ఫ్లైయింగ్ కారు రోడ్డు, వాయు మార్గంలో ప్రయాణించగలదు. ఇందులో ఒకే సారి ఇద్దరు ప్రయాణించే వీలుంది. గరిష్టంగా 1300ల కేజీల బరువును మోసుకెళ్లగలదు. గాలిలో గరిష్టంగా 60 నిమిషాల వరకు ఎగురగలదు. గరిష్ట వేగం గంటలకు 120 కిలోమీటర్లు. భూమి నుంచి 3000 అడుగుల ఎత్తులో ఈ ఫ్లైయింగ్ కారు ప్రయాణిస్తుంది. వాలుగా కాకుండా నిట్టనిలువుగా ల్యాండింగ్, టేకాఫ్ అవడం ఈ కారు ప్రత్యేకత. బయో ఫ్యూయల్ ఈ హైబ్రిడ్ ఫ్లైయింగ్ కారులో బ్యాటరీలతో పాటు ఇంధనంగా బయో ఫ్యూయల్‌ను ఉపయోగిస్తారు. కో యాక్సియల్ క్వాడ్ రోటార్ సిస్టమ్ ఆధారంగా ఈ కారు గాలిలో పైకి లేస్తుంది. ఎనిమిది రోటార్లలో ఒకటి చెడిపోయినా ఎటువంటి ఇబ్బంది లేకుండా నేలపైకి సురక్షితంగా ఈ ఫ్లైయింగ్ కారుని ల్యాండ్ చేయోచ్చని వినత కంపెనీ చెబుతోంది. మెడికల్ ఎమర్జెన్సీలో ఫ్లైయింగ్‌కారు కాన్సెప్టు అందుబాటులోకి వస్తే మెడికల్ ఎమర్జెన్సీలో వైద్య సేవలు సత్వరమే అందించే వీలు ఉంటుందని మంత్రి జ్యోతిరాదిత్య అన్నారు. మరోవైపు రోడ్ ట్రాన్స్‌పోర్టులో ట్రాఫిక్ సమస్యలు నిత్యకృత్యం కావడంతో ఉబర్ లాంటి సంస్థలు ఫ్లైయింగ్ కారు కాన్సెప్టు పట్ల ఆసక్తిగా ఉన్నాయి. లండన్‌లో 2021 అక్టోబరు 5న లండన్ వేదికగా జరగనున్న హెలిటెక్ ఎగ్జిబిషన్లో తొలిసారిగా ఈ ఫ్లైయింగ్ కారుని ప్రదర్శించనున్నారు. చదవండి: ఓలా కార్స్.. నడిపి చూడండి .. నచ్చితేనే కొనండి ! -
కరోనా : విదేశాల్లో చిక్కుకున్న వారికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులకు శుభవార్త. అమెరికా, యూరోపియన్ దేశాల్లోని భారతీయులను వందే భారత్ మిషన్ తరహాలో అంతర్జాతీయ విమానాల ద్వారా స్వదేశానికి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని భారత విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. తద్వారా భారతీయులను దేశానికి తీసుకురావడంతోపాటు, ఇక్కడ ఉండిపోయిన విదేశీయులను వారి సొంత దేశాలకు పంపించే అవకాశం లభించనుంది. వందే భారత్ మిషన్ తరహాలో చార్టర్డ్ విమాన సేవలకు తమ కంపెనీలనూ అనుమతించాలంటూ అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సహా పలు దేశాల విమానయాన సంస్థల నుంచి అభ్యర్ధనలు వచ్చాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇవి పరిశీలనలో ఉన్నాయని చర్చలకనుగుణంగా త్వరలోనే తుది నిర్ణయాన్ని తీసుకుంటామని వెల్లడించింది. దీనిపై జూన్ 15న యుఎస్ రవాణా శాఖ, యుఎస్ ఎంబసీ ప్రతినిధులతో ఒక రౌండ్ చర్చలు జరిపామని చెప్పింది. అలాగే గల్ఫ్ దేశాల నుండి షెడ్యూల్ చేసిన విమానాలను తిరిగి ప్రారంభించాలన్న అభ్యర్థన కూడా పెండింగ్‌లో ఉందని తెలిపింది. విదేశాల్లో ఉన్నభారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఇపుడు మన దేశంలోని ఇతర దేశాల పౌరులను వారి వారి దేశాలకు తరలించనున్నామని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా కోవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రపంచం నలుమూలల చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తరలించడానికి భారతదేశం వందే భారత్ మిషన్‌ను ప్రారంభించింది. అయితే భారత ప్రభుత్వం వివక్షా పూరితంగా వ్యవహరించి ఇరు దేశాల విమానయాన ఒప్పందాలను ఉల్లంఘించిందని ఆరోపించిన ఆమెరికా ఇటీవల వందే భారత్ మిషన్‌కు అభ్యంతరం తెలిపింది. తమ విమానయాన సంస్థలకు చెందిన చార్టర్డ్ విమానాల రాకపోకలను భారత్ అడ్డుకుంటున్నందు వల్లే ఎయిరిండియా చార్టర్డ్ విమానాల రాకపోకలపై జూలై 22 నుంచి నిషేధం అమలవుతుందని అమెరికా రవాణా విభాగం(డీఓటీ) ప్రకటించింది. అంతేకాదు చిక్కుకుపోయిన పౌరుల తరలింపు సమయంలో ఎయిరిండియా అక్రమంగా టికెట్లను అమ్ముకుంటోందని డీఓటీ ఆరోపించిన సంగతి తెలిసిందే. -
విమాన టికెట్లు క్రెడిట్ షెల్‌లోకి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ నెల 15 నుంచి పరిస్థితులను బట్టి దశల వారీగా విమానయాన సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించిందే ఆలస్యం.. అన్ని దేశీయ విమానయాన కంపెనీలు టికెట్ల బుకింగ్స్‌ను ప్రారంభించేశాయి. కానీ, అనుకోని విపత్కర పరిస్థితులు ఎదురైతే మాత్రం లాక్‌డౌన్‌ను పొడిగిస్తామని కేంద్రం ప్రకటించింది. మరి, ఇలాంటి పరిస్థితుల్లో విమాన టికెట్లను బుకింగ్ చేసుకోవాలా? వద్దా? దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 22 నుంచి అంతర్జాతీయ విమానాలను, మార్చి 25 నుంచి దేశీయ విమాన సర్వీస్‌లను కేంద్రం నిలిపివేసిన సంగతి తెలిసిందే. 3 వారాల లాక్డౌన్ తర్వాత విమాన సేవల పునరుద్ధ్దరణ నిర్ణయం ఎయిర్‌లైన్స్ కంపెనీలకు ఊరటనిచ్చే అంశమే. ఎవరైతే మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 మధ్య టికెట్లను బుకింగ్ చేశారో ఆయా ప్యాసింజర్లకు ఉచిత రీషెడ్యూలింగ్ ఆప్షన్స్‌ను, కొన్ని కంపెనీలైతే ట్రావెల్ ఓచర్లను అందిస్తున్నాయి. ఆయా పీఎన్ఆర్ స్టేటస్ రద్దు కాకుండా కస్టమర్లు ఇతరత్రా తేదీల్లో వినియోగించుకునే వీలుంటుందని స్పైస్‌జెట్‌కు చెందిన ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుతం స్సైస్జెట్లో రోజుకు 600 విమానాలు తిరుగుతుంటాయి. ఇందులో 10 శాతం వాటా అంతర్జాతీయ విమానాలుంటాయి. నెలకు 50 వేల టికెట్లు బుకింగ్స్ ఉంటాయని ఆయన తెలిపారు. 15 నుంచి క్రెడిట్ షెల్‌లోకి.. ఇండిగో, స్పైస్‌జెట్ వంటి అన్ని ఎయిర్‌లైన్స్ కంపెనీలు ఆయా వెబ్సైట్లలో టికెట్ల బుకింగ్ సమయంలో క్రెడిట్ షెల్ ఆప్షన్‌ను ఇస్తున్నాయి. ఇదేంటంటే.. ఒకవేళ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కాని పక్షంలో కేంద్రం లాక్‌డౌన్‌ను కంటిన్యూ చేస్తే.. మీరు బుకింగ్ చేసిన టికెట్ల తాలుకు నగదు మీ ఖాతాలో జమ కాదు. అది క్రెడిట్ షెల్ రూపంలో నిల్వ ఉంటుంది. దీన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 లోపు అదే పాసింజర్ ఏ సమయంలోనైనా.. ఎప్పుడైనా వినియోగించుకునే వీలుంటుందన్నమాట. ఒకవేళ కస్టమరే టికెట్లను రద్దు చేసుకుంటే మాత్రం నిబంధనల ప్రకారం రద్దు చార్జీలను భరించాల్సిందే. ఫిబ్రవరిలో 1.23 కోట్ల దేశీయ ప్రయాణికులు.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో దేశీయ విమానాల్లో 1.27 కోట్ల మంది, ఫిబ్రవరిలో 1.23 కోట్ల మంది ప్రయాణికుల ప్రయాణించారు. గతేడాది జనవరిలో 1.25 కోట్లు.. ఫిబ్రవరిలో 1.13 కోట్లుగా ఉంది. డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్‌లో నెలవారీ ట్రాఫిక్ వృద్ధి రేటు 8.98 శాతంగా ఉంది. రద్దీ తాత్కాలికమే.. ఈ నెల 15 నుంచి ఒకవేళ దేశీయ విమానయాన సేవలు పునఃప్రారంభమైతే మాత్రం రద్దీ విపరీతంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే వివిధ నగరాల్లో చిక్కుకున్న ప్రజలు ఇళ్లకు చేరేందుకు ప్రయత్నిస్తారు. ఇది విమానయాన సంస్థలకు మూలధనాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీంతో కంపెనీ ఉద్యోగుల సామూహిక లే ఆఫ్‌లు కొంత వరకు తగ్గుతాయని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ సంఖ్య పెరుగుదల తాత్కాలికంగానే ఉంటుందని.. వైరస్ భయాల కారణంగా ప్రయాణికుల సంఖ్య క్రమంగా తగ్గుతుందని చెబుతున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో చాలా వరకు ఎయిర్‌లైన్స్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు, వేతనాలను తగ్గించిన విషయం తెలిసిందే. -
సాగర్ నుంచి విమానయానం
పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్ జలాశయంనుంచి విమానసేవలు అందుబాటులోకి రానున్నాయి. దేశంలో ఆరు వాటర్ ఏరో డ్రమ్స్ ఏర్పాటుకు కేంద్రవిమానయానశాఖ పచ్చజెండా ఊపింది. అందులో నాగార్జునసాగర్ ఒకటి. ఇప్పటికే ఇక్కడినుంచి విమాన సర్వీసులు నడపాలని ఆలోచనకు వచ్చిన అధికారులు ఆరునెలల క్రితం జలాశయాన్ని పరిశీలించి వెళ్లారు. అంతా సవ్యంగానే ఉండడంతో ఇప్పుడు జలాశయంనుంచి విమానాలు నడిపేందుకు ఓకే చెప్పారు. ఎర్తుడ్యాం మీద ఉన్న చిల్డ్రన్స్ పార్కులో హైడ్రో ఏరోడ్రమ్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. నాగార్జునసాగర్ : ప్రపంచ పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెంది, బౌద్ధదామంగా రూపుదిద్దుకుం టున్న నాగార్జునసాగర్‌కు విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉడాన్ స్కీంలో భాగంగా సాగర్ జలాశయంలో హైడ్రో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కేంద్ర పౌరవిమానయా న మంత్రిత్వశాఖ జెండా ఊపింది. దేశంలో ఆరు వాటర్ ఎరోడ్రమ్స్ వినియోగంలోకి తెచ్చేందుకు కేంద్రవిమానయాన శాఖ అనుమతి ఇచ్చింది. వీటిల్లో నాగార్జునసాగర్ ఒకటి. సాగర్‌నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాద్ నుంచి సాగర్‌కు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నుంచి నాగార్జునసాగర్‌కు విమానాలను నడిపేందుకు టర్బో ఏవియేషన్ ఏయిర్‌లైన్స్ అనుమతి పొం దింది. ఇందుకోసం ఆరు నెలల క్రితమే కేంద్ర విమానయాన మంత్రిత్వ శాకుకు చెందిన అధికారి కెప్టెన్ ఇల్షాద్ అహ్మద్ నేతృత్వంలో తెలంగా ణలోని నాగార్జునసాగర్సాగర్, శ్రీశైలం, హుస్సేన్‌సాగర్, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం బ్యారేజీ తది తర ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. ఈ జలాశయాల్లో చిన్నవిమానాలు దిగేందుకు అనువుగా ఉన్నాయా?లేవా అని పరిశీలన చేసి జలాశయం లోతు, పొడవు, వెడల్పులను అంచనా వేశారు. అనంతరం సాగర్ జలాశయం హైడ్రో ఎయిర్‌పోర్టుకు అనువుగా ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రిజర్వాయర్ కనక్టింగ్ సర్వీస్ 9,12,20సీట్ల సామర్థ్యం కల్గిన విమాన సర్వీసులను నడిపేందుకు జలాశయాలు అనువుగా ఉన్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 235కొత్తరూట్లకు అనుమతినిచ్చే దానిలో భాగంగా నాగార్జునసాగర్నుంచి కూడా విమానాలు నడుపుకునేందుకు టర్బో ఏవియేషన్ సంస్థకు అనుమతినిచ్చింది. చిల్డ్రన్స్ పార్కులోనే ఏర్పాటు.. సాగర్ ఎర్తుడ్యాం మీద ఉన్న చిల్డ్రన్స్ పార్కు హైడ్రో ఎరోడ్రమ్ ఏర్పాటుకు అనుకూలమైన ప్రదేశంగా అధికారులు గుర్తించారు.2004 సంవత్సరంలో జరిగిన కృష్ణాపుష్కరాల సమయంలో ఇక్కడ పుష్కరఘాట్‌ను ఏర్పాటు చేశారు. పుష్కరఘాట్ కోసం గతంలో ఏర్పాటు చేసిన మెట్లు, జలాశయంలోపలకు కాంక్రీట్‌తో వేసిన దారి చెక్కుచెదరకుండా అలాగే ఉంది. ప్రస్తుతం దానినే వినియోగంలోకి తీసుక రానున్నట్లు సమాచారం. సాగర్‌కు పెరగనున్న విదేశీ పర్యాటకులు సాగర్ నుంచి విమానాలు నడిపేందుకు అనుమతి ఇవ్వడంతో విదేశీ బౌద్ధులు నాగార్జునసాగర్‌ను సందర్శించేందుకు అత్యధిక సంఖ్యలో రానున్నారు. ఇప్పటికే జలాశయం మధ్యలోగల నాగార్జునకొండ బౌద్ధదామంగా విరాజిల్లుతోంది. అలాగే సాగర్ జలాశయం తీరం నాగార్జునుడు నడయాడిన ప్రాంతంగా గుర్తించిన ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో గల బౌద్ధమతానికి సంబంధించిన ఆనవాళ్లను ఏర్పాటు చేసేందుకు శ్రీపర్వతా రామం నిర్మాణాన్ని మొదలు పెట్టింది. ప్రపంచంలోని అన్ని దేశాలు ఇక్కడ నిర్మాణాలు చేసుకునేందు స్థలాలను ఇచ్చేందుకు గాను జలాశయతీరంలో 275ఎకరాలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే పలుదేశాలకు భూములను అప్పగించింది. నిర్మాణాలు మరో రెండు నెలల్లో కొంత మేరకు పూర్తి కానున్నాయి. ప్రజల సందర్శననార్థం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా బుద్ధవనం ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. విమానాలు ప్రారంభమైతే సాగర్ అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
ఇక రూ. 2500కే బ్యాంకాక్ వెళ్లొచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉడాన్ పథకం కింద చిన్న విమానాశ్రయాలను అంతర్జాతీయ గమ్యస్ధానాలకు అనుసంధించాలని యోచిస్తోంది. ఈ పథకం కింద అంతర్జాతీయ గమ్యస్ధానాలకు రూ. 2500 కంటే తక్కువ చార్జీలతోనే చేరుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దేశ ప్రజల్లో ఎక్కువ మందికి విమానాయానం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం ద్వారా చిన్న నగరాలనూ దేశంలోని పలు ప్రధాన నగరాలకు కనెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అంతర్జాతీయ రూట్లనూ సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ పథకాన్ని విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఉడాన్ మూడవ దశలో ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పథకం కింద అసోంలోని విమానాశ్రయాలు థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్, నేపాల్‌లోని ఖట్మాండులతో కనెక్ట్ కానున్నాయి. ఇదే తరహాలో బిహార్ ఎయిర్‌పోర్ట్‌లను నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల్లోని ఎయిర్‌పోర్ట్‌లకు నేరుగా అనుసంధానించనున్నారు. అసోం ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు సమ్మతించగా, స్పైస్‌జెట్ సహా పలు విమానయాన సంస్థలు బ్యాంకాక్ వంటి ప్రముఖ గమ్యస్ధానాలకు విమాన సర్వీసులను చేపట్టేందుకు ఆసక్తి కనబరిచాయి. ప్రభుత్వం తన ప్రణాళికలతో ముందుకు వెళితే త్వరలోనే రూ. 2500తో అంతర్జాతీయ విమాన టికెట్లను ఆఫర్ చేస్తూ పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటన చేస్తుందని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఉడాన్ మూడవ దశకు ఇటీవల ప్రభుత్వం బిడ్లు ఆహ్వానించగా 111 రూట్ల కోసం 15 ఎయిర్లైన్ల నుంచి బిడ్లను పొందింది. -
ఇండిగో కొత్త బాదుడు : మంత్రిత్వ శాఖ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికులపై భారీ వడ్డింపునకు సిద్ధమైంది. విమానాశ్రయాల్లో భారీ క్యూలను తగ్గించేందుకు, సమయాన్ని ఆదా చేసేందుకుద్దేశించిన వెబ్ చెక్ ఇన్ అవకాశంపై భారీగా చార్జీలను వసూలు చేయనుంది. వెబ్ చెక్ఇన్ చేసుకునే అన్నిఅన్ని విమాన టికెట్లపై చార్జీ ఉంటుందని ఇండిగో ప్రయాణికుడికి సమాధానంగా ట్విటర్లో వెల్లడించింది. ప్రయాణికుడు ఎంచుకున్న సీటు ఆధారంగా ఈ ఫీజు 200-1000 రూపాయల దాకా ఉండనుంది. సవరించిన తమ కొత్త విధానం ప్రకారం ఈ చార్జి చెల్లించాల్సి ఉంటుందనీ, అయితే ఎయిర్పోర్ట్ ఈ సదుపాయం ఉచితమేనని స్పష్టం చేసింది. దీనిపై ప్రయాణికులు మండిపడుతున్నారు. మరోవైపు ఈ పరిణామంపై విమానయాన శాఖ స్పందించింది. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సీనియర్ అధికారి తెలిపారు. ఈ కొత్త మార్పు నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా అనేది సమీక్షించనున్నామని ఏవియేషన్ కార్యదర్శి ఆర్ ఎన్ చౌబే వెల్లడించారు. కాగా ఇండిగో, జెట్ ఎయిర్వేస్, కొన్ని సీట్లపై మాత్రమే వెబ్ చెక్ ఇన్ ఫీజును వస్తూలు చేస్తుండగా, స్పైస్‌జెట్ అన్నిటికీ చేస్తుంది. అలాగే విస్తారా ఎయిర్‌లైన్స్ లోవెబ్ చెక్ ఇన్ పూర్తిగా ఉచితం. వెబ్ చెక్ ఇన్: దేశీయంగా విమాన టికెట్‌ను బుక్ చేసుకున్న ప్రయాణికులు ఆన్లైన్లోనే వివరాల పరిశీలనతోపాటు, బోర్డింగ్ పాస్‌ను కూడా ఈ వెబ్ చెక్ఇన్ ద్వారా పొందవచ్చు. MoCA has noted that airlines are now charging for web check-in for all seats. We are reviewing these fees to see whether they fall within the unbundled pricing framework. — Ministry of Civil Aviation (@MoCA_GoI) November 26, 2018 -
డ్రోన్ల వాణిజ్య వినియోగానికి గ్రీన్‌సిగ్నల్
సాక్షి,న్యూఢిల్లీ: వాణిజ్య అవసరాలకు డ్రోన్ల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీచేసింది. డ్రోన్లను వ్యాపార కార్యకలాపాలు సహా అందరూ వినియోగించుకోవడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, నిబంధనలకు అనుగుణంగా డ్రోన్ల వినియోగానికి అనుమతిస్తామని పౌర విమానయాన కార్యదర్శి ఆర్ఎన్ చూబే చెప్పారు. 250 కిలోగ్రాముల నుంచి 150 కేజీల బరువుండే డ్రోన్లు ఐదు క్యాటగిరీలుగా విభజిస్తూ నూతన డ్రోన్ విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. నిబంధనలకు అనుగుణంగా 200 అడుగుల కంటే ఎక్కువ ఎత్తును నో డ్రోన్ జోన్‌గా పరిగణిస్తారు. విమానాశ్రయానికి ఐదు కిమీ పరిధిలో డ్రోన్లను అనుమతించరు. ఢిల్లీలోని విజయ్ చౌక్ వంటి ప్రాంతాలు నో డ్రోన్ జోన్ పరిధిలోకి వస్తాయి. ఇక ఈ సంవత్సరాంతానికి సమగ్ర డ్రోన్ పాలసీ వెల్లడవుతుందని విమానయాన మంత్రిత్వ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. -
జీఎస్టీ అమలు సెప్టెంబర్‌కు మార్చండి!
న్యూఢిల్లీ: జీఎస్టీ అమలుపై చెలరేగుతున్న అనేక ఊహాగానాలకు తోడు తాజాగా విమానయాన మంత్రిత్వశాఖ లేఖ జరింత చేరింది. ఒకవైపు దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి గూడ్స అండ్ సర్వీస్ టాక్స్ యాక్ట్( జీఎస్టీ)ను అమలు చేసేందుకు కేంద్రం సన్నద్ధమతోంది. మరోవైపు కొత్త పరోక్ష పన్నుల విధానం అమలుకు కొంత సమయంకావాలని భావిస్తోంది. ఈ మేరకు రెవెన్యూ కార్యదర్శికి ఒక లేఖను కూడా రాసింది. దీంతోపాటు జీఎస్టీ పన్నుల విధానం ఆందోళన వ్యక్తం చేసింది. జీఎస్టీ అమలు గడువును సెప్టెంబర్‌కు పెంచాల్సిందిగా కోరుతూ విమానయాన మంత్రిత్వశాఖ ఆర్థికమంత్రిత్వ శాఖకు ఈ లేఖ రాసింది. జూలైలో జీఎస్టీ పన్నుల ను అమలు చేయడం కష్టంగా ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే అంతర్జాతీయ విమానాలకు, కనెక్టింగ్ విమానాలకు ఒకేపన్ను రేటు అమలు చేయాలని కూడా మంత్రిత్వ శాఖ రెవెన్యూ సెక్రటరి హస్ముఖ అధియాకు రాసిన లేఖలో కోరింది. అంతేకాదు జీఎస్టీ వల్ల అంతర్జాతీయ ప్రయాణాలు, ఇన్పుట్ పన్ను క్రెడిట్లకు సంబంధించి విదేశీ సంస్థలకంటే అంతర్జాతీయ ఎయిర్ లైన్లకు లాభదాయకంగా ఉండనుందని లేఖలో పేర్కొన్నారు. ప్రపంచ టికెటింగ్ వ్యవస్థలో మార్పును ప్రభావితం చేస్తాయని ఎయిర్‌లైన్స్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అందుకే జిఎస్టి అమలుకు తమకు మరింత సమయం ఇవ్వాలని ఆర్ధిక మంత్రిత్వ శాఖ కోరిందని ఏవియేషన్ మినిస్ట్రీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. సోమవారం ఈ లేఖ రాసినట్లు ఈ అధికారి తెలిపారు. కాగా దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిరవేస్ సహా కొన్ని దేశీయ విమానయాన సంస్థలు కూడా జీఎస్టీ అమలుకు సహా కొన్ని దేశీయ విమానయాన సంస్థలు, తమకుకొంత సమయం కావాలని అభిప్రాయపడ్డాయి. ఇప్పటికే వివిధ వర్గాలు వారు జీఎస్టీఅమలుకు మరింత గడువునుకోరుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. అయితే రెవెన్యూ కార్యదర్శి హాస్ముఖ్ ఆధియాకుజూలై 1, 2017నుంచి జీఎస్టీ అమలు వాయిదాకానుందన్న వార్తలను ట్విట్టర్ ద్వారా ఖండించిన సంగతి తెలిసిందే. -
ఇక దేశంలో ప్రయాణించాలన్నా పాస్‌పోర్ట్!
-
ఇక దేశంలో ప్రయాణించాలన్నా పాస్‌పోర్ట్!
న్యూఢిల్లీ: భారత పౌర విమానాయాన సంస్థలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇక నుంచి దేశం లోపల విమానాల్లో ప్రయాణించాలనుకున్నప్పటికీ పాస్‌పోర్టు వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. లేదా ఆధార్ కార్డు వివరాలు అందజేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్ (సీఏఆర్)ముసాయిదాను ఇప్పటికే సిద్ధం చేశారు. వచ్చే వారం దానిని ప్రజల ముందుకు తీసుకొచ్చి అభిప్రాయం కోరనున్నారు. నెల రోజుల్లోగా ప్రజలు తమ అభిప్రాయాలను, సలహాలను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని మూడు నాలుగు నెలల్లో అమలుచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విమానాల్లో ప్రయాణిస్తూ నిబంధనలు అతిక్రమించేవారికి నాలుగు స్థాయిల్లో వారు చేసిన పనిని బట్టి శిక్ష విధించే యోచనను భారత పౌర విమానాయాన సంస్థ చేస్తోంది. ఈ నేపథ్యంలో అలా తప్పిదాలకు పాల్పడే వారి పూర్తి వివరాలు తెలుసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ముందస్తుగా టికెట్ బుకింగ్ చేసుకునే సమయంలో పాస్‌పోర్ట్, ఆధార్‌ను తప్పనిసరి చేయనున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించేందుకు ఈ నిబంధన ఉన్న విషయం తెలిసిందే. -
ఏవియేషన్ శాఖ సరికొత్త నిర్ణయం
న్యూఢిల్లీ :విమానప్రయాణికుల సమస్యల సత్వర పరిష్కార దిశగా ఏవియేషన్ మంత్రిత్వశాఖ అడుగులు వేస్తోంది. విమానసంస్థలకు వ్యతిరేకంగా ప్రయాణికులు తమ ఫిర్యాదులను దాఖలు చేసేందుకు వీలుగా ఓ వెబ్‌సైట్‌ను లాంచ్ చేయాలని ఏవియేషన్ మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఆ ఫిర్యాదులను విమానసంస్థలకు పంపించి, సత్వరమే సమస్య పరిష్కారం అయ్యేలా ఆ వెబ్‌సైట్‌ను రూపొందించనున్నారు. ఏవియేషన్ సహాయ మంత్రి జయంత్ సిన్హా ఆలోచన మేరకు ఈ ప్లాట్‌ఫాంను ఏర్పాటుచేయనున్నట్టు ఆ మంత్రిత్వశాఖ తెలిపింది. విమానయానం చేసేటప్పుడు ఏదైన సమస్య ఎదురై మనోవేదనకు గురైనప్పుడు.. ఆ సమస్యను విమానసంస్థలకు తెలియజేయడానికి ఇప్పటివరకు సరియైన ప్లాట్ ఫామే లేదు. ఈ నేపథ్యంలో ఏవియేషన్ మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఏవియేషన్ మంత్రిత్వ శాఖ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్లోని సభ్యులు ఈ ప్లాట్‌ఫాంను నిర్వహించనున్నట్టు సీనియర్ అధికారులు చెబుతున్నారు. అయితే ఇంకా ఎవరన్నది తెలియరాలేదు. సోషల్ మీడియా లాంటి వివిధ సమాచార మాధ్యమాల ద్వారా విమానసంస్థలకు ఫిర్యాదులను అందిస్తున్న ప్రయాణికులకు, ఈ వెబ్సైట్ సమస్యల సత్వర పరిష్కారానికి ఓ ప్లాట్ఫామ్లాగా దోహదం చేయనుంది. ప్రయాణికులు ఫిర్యాదును విమానసంస్థలకు తెలియజేయాలనుకున్నప్పుడు.. ప్రయాణికుల ఏవియేషన్ అందించే ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయి, ఫిర్యాదును నమోదుచేయాల్సి ఉంటుంది. అనంతరం ఆ ఫిర్యాదును విమానసంస్థకు పంపిస్తారు. నిబంధనలకు అనుగుణంగా ఫిర్యాదును విమానసంస్థలు పరిష్కరిస్తాయి. ఏవియేషన్ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని విమాన ప్రయాణికులు స్వాగతిస్తున్నారు. అయితే ప్రయాణికులు సమస్యలు తెలియజేయడానికి తమ దగ్గర సిస్టమ్స్ ఉన్నాయని విమాన సంస్థలు అంటున్నాయి. సోషల్ మీడియా సైట్ల ద్వారా సమస్యలు తెలుసుకుని, ఫిర్యాదులను పరిష్కృతం చేస్తున్నామని ఓ ఎయిర్‌లైన్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. దానికంటే ఎక్కువగా సమస్యల పరిష్కారానికి ఈ వెబ్సైట్ దోహదం చేయగలదా అని ప్రశ్నిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటుచేయడం అద్భుతమైన అడుగని ఎయిర్ ప్యాసెంజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి తెలిపారు. -
ఇక మనకూ ఎయిర్‌బస్ ఎ-380లు!!
ఎయిర్‌బస్ ఎ-380.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానం. ఇది వస్తోందంటేనే పెద్ద రాజసం కనపడుతుంది. ఎన్నాళ్లనుంచో ఈ తరహా విమానాలను మన దేశంలోకి అనుమతించాలని పలు విమానయాన సంస్థలు కోరతుండటంతో.. ఇప్పటికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వాటికి పచ్చజెండా ఊపింది. దేశంలో ఇంత పెద్ద విమానాలను ఆపరేట్ చేయగల నాలుగు విమానాశ్రయాలలోకి మాత్రమే వీటిని అనుమతిస్తున్నారు. ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, బెంగళూరు విమానాశ్రయాలకు మాత్రమే ఈ సామర్థ్యం ఉంది. పూర్తిస్థాయి డబుల్ డెక్కర్ విమానాలైన వీటిపై ఉన్న నియంత్రణను ఎయిరిండియా, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ, డీజీసీఏతో చర్చించిన అనంతరం ఎత్తేశారు. ఈ విమానంలో అంతా ఎకానమీ క్లాస్ అయితే ఒకేసారి మొత్తం 850 మంది ప్రయాణం చేయొచ్చు. అదే మూడు తరగతులు ఉండాలంటే మాత్రం 550-600 మంది వరకు పడతారు. సింగపూర్ ఎయిర్‌లైన్స్, ఎమిరేట్స్, లుఫ్తాన్సా సంస్థలు ఎప్పటినుంచో ఈ విమానాలు తెస్తామని అంటున్నాయి. మన దేశంలో విమానాలు నడిపిస్తున్న మొత్తం 10 అంతర్జాతీయ విమానయాన సంస్థలో తొమ్మిదింటి వద్ద ఈ భారీ విమానాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 110 ఎ-380లు ప్రస్తుతం ఎగురుతున్నాయి.