సాగర్‌ నుంచి విమానయానం | Water Aerodrome Facility Begins in Nagarjuna Sagar | Sakshi
Sakshi News home page

సాగర్‌ నుంచి విమానయానం

Published Tue, Jan 29 2019 10:30 AM | Last Updated on Tue, Jan 29 2019 10:30 AM

Water Aerodrome Facility Begins in Nagarjuna Sagar - Sakshi

పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్‌ జలాశయంనుంచి విమానసేవలు అందుబాటులోకి రానున్నాయి. దేశంలో ఆరు వాటర్‌ ఏరో డ్రమ్స్‌ ఏర్పాటుకు కేంద్రవిమానయానశాఖ పచ్చజెండా ఊపింది. అందులో నాగార్జునసాగర్‌ ఒకటి. ఇప్పటికే ఇక్కడినుంచి విమాన సర్వీసులు నడపాలని ఆలోచనకు వచ్చిన అధికారులు ఆరునెలల క్రితం జలాశయాన్ని పరిశీలించి వెళ్లారు. అంతా సవ్యంగానే ఉండడంతో ఇప్పుడు జలాశయంనుంచి విమానాలు నడిపేందుకు ఓకే చెప్పారు. ఎర్తుడ్యాం మీద ఉన్న చిల్డ్రన్స్‌ పార్కులో హైడ్రో ఏరోడ్రమ్‌ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. 

నాగార్జునసాగర్‌ : ప్రపంచ పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెంది, బౌద్ధదామంగా రూపుదిద్దుకుం టున్న నాగార్జునసాగర్‌కు విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి.  కేంద్ర ప్రభుత్వ ఉడాన్‌ స్కీంలో భాగంగా సాగర్‌ జలాశయంలో  హైడ్రో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కేంద్ర పౌరవిమానయా న మంత్రిత్వశాఖ జెండా ఊపింది. దేశంలో ఆరు వాటర్‌ ఎరోడ్రమ్స్‌ వినియోగంలోకి తెచ్చేందుకు కేంద్రవిమానయాన శాఖ  అనుమతి ఇచ్చింది. వీటిల్లో నాగార్జునసాగర్‌ ఒకటి. సాగర్‌నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాద్‌ నుంచి సాగర్‌కు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నుంచి నాగార్జునసాగర్‌కు విమానాలను నడిపేందుకు టర్బో ఏవియేషన్‌ ఏయిర్‌లైన్స్‌ అనుమతి పొం దింది. 

ఇందుకోసం ఆరు నెలల క్రితమే కేంద్ర విమానయాన మంత్రిత్వ శాకుకు చెందిన అధికారి కెప్టెన్‌ ఇల్షాద్‌ అహ్మద్‌  నేతృత్వంలో తెలంగా ణలోని నాగార్జునసాగర్‌సాగర్, శ్రీశైలం, హుస్సేన్‌సాగర్, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం బ్యారేజీ తది తర ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు.  ఈ జలాశయాల్లో  చిన్నవిమానాలు దిగేందుకు అనువుగా ఉన్నాయా?లేవా  అని పరిశీలన చేసి జలాశయం లోతు, పొడవు, వెడల్పులను అంచనా వేశారు.  

అనంతరం సాగర్‌ జలాశయం హైడ్రో ఎయిర్‌పోర్టుకు అనువుగా ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో రిజర్వాయర్‌ కనక్టింగ్‌ సర్వీస్‌ 9,12,20సీట్ల సామర్థ్యం కల్గిన విమాన సర్వీసులను నడిపేందుకు  జలాశయాలు అనువుగా ఉన్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 235కొత్తరూట్లకు అనుమతినిచ్చే దానిలో భాగంగా నాగార్జునసాగర్‌నుంచి కూడా విమానాలు నడుపుకునేందుకు టర్బో ఏవియేషన్‌ సంస్థకు అనుమతినిచ్చింది.

చిల్డ్రన్స్‌ పార్కులోనే ఏర్పాటు..
సాగర్‌ ఎర్తుడ్యాం మీద ఉన్న చిల్డ్రన్స్‌ పార్కు హైడ్రో ఎరోడ్రమ్‌ ఏర్పాటుకు అనుకూలమైన ప్రదేశంగా అధికారులు గుర్తించారు.2004 సంవత్సరంలో జరిగిన కృష్ణాపుష్కరాల సమయంలో ఇక్కడ పుష్కరఘాట్‌ను ఏర్పాటు చేశారు. పుష్కరఘాట్‌ కోసం  గతంలో ఏర్పాటు చేసిన మెట్లు, జలాశయంలోపలకు కాంక్రీట్‌తో వేసిన దారి చెక్కుచెదరకుండా అలాగే ఉంది. ప్రస్తుతం దానినే వినియోగంలోకి తీసుక రానున్నట్లు సమాచారం.

సాగర్‌కు పెరగనున్న విదేశీ పర్యాటకులు
సాగర్‌ నుంచి విమానాలు నడిపేందుకు అనుమతి ఇవ్వడంతో విదేశీ బౌద్ధులు నాగార్జునసాగర్‌ను సందర్శించేందుకు అత్యధిక సంఖ్యలో రానున్నారు. ఇప్పటికే జలాశయం మధ్యలోగల నాగార్జునకొండ బౌద్ధదామంగా విరాజిల్లుతోంది. అలాగే సాగర్‌ జలాశయం తీరం నాగార్జునుడు నడయాడిన ప్రాంతంగా గుర్తించిన ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో గల బౌద్ధమతానికి  సంబంధించిన ఆనవాళ్లను  ఏర్పాటు చేసేందుకు శ్రీపర్వతా రామం నిర్మాణాన్ని మొదలు పెట్టింది. ప్రపంచంలోని అన్ని దేశాలు ఇక్కడ నిర్మాణాలు చేసుకునేందు స్థలాలను ఇచ్చేందుకు గాను జలాశయతీరంలో  275ఎకరాలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే పలుదేశాలకు భూములను అప్పగించింది. నిర్మాణాలు మరో రెండు నెలల్లో కొంత మేరకు  పూర్తి కానున్నాయి. ప్రజల సందర్శననార్థం తెలంగాణ  రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా బుద్ధవనం ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.  విమానాలు ప్రారంభమైతే సాగర్‌ అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని పలువురు  ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement