Hydro
-
విద్యుత్ లేకుండా వాగు నీటిని ఎత్తిపోసే హైడ్రో లిఫ్ట్!
కొండ్ర ప్రాంత వాగుల్లో ఎత్తయిన ప్రాంతం నుంచి వాలుకు ఉరకలెత్తుతూ ప్రవహించే సెలయేళ్లు సందర్శకులకు కనువిందు చేస్తూ మనోల్లాసం కలిగిస్తుంటాయి. అయితే, ఆయా కొండల్లో వ్యవసాయమే జీవనాధారంగా బతికే రైతులకు మాత్రం ఈ సెలయేళ్లలో నీరు ఏ మాత్రం ఉపయోగపడదు. పొలాలు ఎత్తులో ఉండటమే కారణం. విద్యుత్ మోటార్లతో వాగుల్లో నిటిని రైతులు తోడుకోవచ్చు. అయితే, చాలా కొండ ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయం ఉండదు. డీజిల్ ఇంజన్లు పెట్టుకునే స్థోమత రెక్కాడితే గాని డొక్కడని అక్కడి చిన్న, సన్నకారు రైతులకు అసలే ఉండదు. కళ్ల ముందు నీరున్నా ఆ పక్కనే కొద్ది ఎత్తులో ఉన్న తమ పొలాల్లో పంటలకు పెట్టుకోలేని అశక్తత ఆ రైతుల పేదరికాన్ని పరిహసిస్తూ ఉంటుంది. ఏజన్సీవాసులకు శాశ్వతంగా మేలు జరిగేలా వాగుల్లో పారే నీటిని విద్యుత్తు అవసరం లేకుండా ఎత్తిపోసేందుకు తన శక్తిమేరకు ఏదైనా ఉపాయం ఆలోచించాలని గ్రామీణ ఆవిష్కర్త పంపన శ్రీనివాస్(47) లక్ష్యంగా పెట్టుకున్నారు. కాకినాడ జిల్లా కైకవోలు ఆయన స్వగ్రామం. చదివింది ఐటిఐ మాత్రమే అయినా, లక్ష్యసాధన కోసం అనేక ఏళ్ల పాటు అనేక ప్రయోగాలు చేస్తూ చివరికి విజయం సాధించారు. వాగుల్లో నుంచి నీటిని విద్యుత్ లేకుండా పరిసర పొలాల్లోకి ఎత్తిపోయటంలో ఆయన సాధించిన విజయాలు రెండు: 1. పాతకాలపు ర్యాం పంపు సాంకేతికతను మెరుగుపరచి వాగుల్లో ర్యాం పంపులను ఏర్పాటు చేయటం. 2. హైడ్రో లిఫ్ట్ అనే కొత్త యంత్రాన్ని ఆవిష్కరించటం.హైడ్రో లిఫ్ట్ ఆవిష్కరణవాగులో 4–5 అడుగుల ఎత్తు నుంచి చెంగు చెంగున కిందికి దూకే నీటిని ఒడిసిపట్టి పరిసర పంట పొలాల్లోకి ఎత్తి΄ోసే ‘హైడ్రో లిఫ్ట్’ అనే వినూత్న యంత్రాన్ని శ్రీనివాస్ సొంత ఆలోచనతో, సొంత ఖర్చుతో ఆవిష్కరించారు. ఈ గ్రామీణ ఆవిష్కర్త రూపొందించిన చిన్న నమూనా ప్రొటోటైప్) యంత్రాన్ని ఉమ్మడి తూ.గో. జిల్లా దివిలికి సమీపంలోని ముక్కోలు చెక్‌డ్యామ్ వద్ద విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. దీని పనితీరును నిపుణులు ప్రశంసించారు. ఇది మూడు అడుగుల పొడవు, ఒక డయామీటర్‌తో ఉంది. దీని చుట్టూతా అంగుళం బ్లేడ్లు వాలుగా అమర్చి వుంటాయి. నీటి ఉధృతికి లేదా వరదకు దుంగలు, రాళ్లు కొట్టుకొచ్చినా కదిలి΄ోకుండా ఉండేలా ఇనుప చట్రంలో ఈ చక్రాన్ని అమర్చారు. హైడ్రో లిఫ్ట్‌తో కూడిన ఈ చట్రాన్ని చెక్‌డ్యామ్ కింది భాగాన ఏర్పాటు చేశారు. సెకనుకు 20 లీటర్ల చొప్పున ఈ చక్రంపై పడేలా నీటి ప్రవాహం ఉంటే సెకనుకు 1 లీటరు నీటిని పొలంలోకి ఎత్తి΄ోయటానికి వీలవుతుందని శ్రీనివాస్ తెలి΄ారు. నీటి ప్రవాహ వేగం తక్కువగా వున్నా నిమిషానికి 40 సార్లు (ఆర్పిఎం) ఇది శక్తివంతంగా తిరుగుతోంది. ఈ బాక్స్ షాఫ్ట్నకు అమర్చిన పిస్టన్ 300 ఆర్పిఎంతో నడుస్తుంది. చిన్న హైడ్రో లిఫ్ట్‌తో ఎకరానికి నీరునిమిషానికి 60 లీటర్ల నీటిని వాగులో నుంచి 20 అడుగుల ఎత్తుకు (40 అడుగుల ఎత్తుకైతే నిమిషానికి 40 లీటర్లు) తోడే శక్తి ఈ ప్రోటోటైప్ హైడ్రో లిఫ్ట్‌కు ఉంది. ఈ నీరు పారగడితే ఎకరంలో కూరగాయల సాగుకు సరిపోతుందని, డ్రిప్ ఏర్పాటు చేసుకుంటే ఎకరానికి సరిపోతుందని శ్రీనివాస్ తెలిపారు. దీని తయారీకి రూ. 35 వేలు ఖర్చవుతుందని, వాగులో ఇన్స్టాల్ చేయటానికి అదనంగా ఖర్చవుతుందన్నారు. వాగు నీటి ఉధృతిని బట్టి, అధిక విస్తీర్ణంలో సాగు భూమి నీటి అవసరాలను బట్టి హైడ్రో లిఫ్ట్ పొడవు 9–16 అడుగుల పొడవు, 2–4 అడుగుల డయామీటర్ సైజులో తయారు చేసుకుంటే అధిక పరిమాణంలో నీటిని ఎత్తిపోయవచ్చునని శ్రీనివాస్ వివరించారు. గత అక్టోబర్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శోధాయాత్రలో భాగంగా పల్లెసృజన అధ్యక్షులు పోగుల గణేశం బృందం ఈ హైడ్రో లిఫ్ట్ పనితీరును పరిశీలించి మెచ్చుకున్నారన్నారు. పల్లెసృజన తోడ్పాటుతో పేటెంట్ కోసం దరఖాస్తు చేయబోతున్నాన్నారు. ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటునందించి పెద్ద హైడ్రో లిఫ్టులను తయారు చేసి పెడితే కొండ ప్రాంతవాసుల సాగు నీటి కష్టాలు కొంతైనా తీరుతాయి. ర్యాం పంపుతో పదెకరాలకు నీరుఎత్తు నుంచి లోతట్టు ప్రాంతాలకు పారే వాగు నీటిని ఒడిసిపట్టే ర్యాం పంపు సాంకేతికత ఇప్పటికే అందుబాటులో ఉంది. ఏజన్సీవాసుల నీటి కష్టాలు తీర్చేందుకు విద్యుత్ అవసరం లేకుండా పనిచేసే ఈ ర్యాం పంపును మెరుగైన రీతిలో వినియోగంపై శ్రీనివాస్ తొలుత కృషి చేశారు. వివిధ సంస్థల తోడ్పాటుతో కొన్ని చోట్ల ర్యాం పంపులు ఏర్పాటు చేశారు. అయితే, ర్యాం పంపు సాంకేతికతకు ఉన్న పరిమితులు కూడా ఎక్కువేనని శ్రీనివాస్ గ్రహించారు. ర్యాం పంపు అమర్చాలి అంటే.. వాగులో 4 నుండి 6 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందికి పారే చిన్నసైజు జలపాతం ఉండాలి. ఆ నీటిని ప్రవాహానికి ఎదురుగా పొడవాటి ఇనుప గొట్టాన్ని అమర్చి, ఆ గొట్టం ద్వారా ఒడిసిపట్టిన నీటిని పిస్టన్ల ద్వారా ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఒక్కో ర్యాం పంపు బెడ్‌పైన రెండు పిస్టన్లు అమర్చుతారు. ఒక పిస్టన్ను కాలితో లేదా చేతితో రెండు మూడు సార్లు కిందికి నొక్కితే చాలా ఇక వాటంతట అవే రెండు పిస్టన్లు ఒకదాని తర్వాత మరొకటి, పైకి కిందకు లేచి పడుతూ ఉంటాయి. అలా పిస్టన్లు పనిచేయటం వల్ల నీరు వత్తిడి ద్వారా పక్కనే ఏర్పాటు చేసిన ఒక నాన్ రిటర్న్ వాల్వ్‌కు అమర్చిన పైపు ద్వారా పంట పొలాలకు నీరు ఎత్తి΄ోస్తారు. రెండున్నర అంగుళాల పైపు ద్వారా నీరు వెళ్తుంది. ర్యాం పంపు నెలకొల్పడానికి రూ. 2.5–3.5 లక్షలు ఖర్చవుతుంది. ఒకసారి పెట్టుబడి పెడితే రోజుకు కనీసం 10 ఎకరాలకు నీటిని పారించవచ్చు. విద్యుత్తు అవసరం లేదు. పిస్టన్లకు ఆయిల్ సీల్స్ లాంటి విడి భాగాలు ఏవీ ఉండవు కాబట్టి, నిర్వహణ ఖర్చేమీ ఉండదు. ర్యాం పంప్‌ల తయారీకి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ రీసెర్చ్ (సీడీఆర్), టాటా ట్రస్టు విసిఎఫ్, సిసిఎల్ తదితర సంస్థలు ఆర్థిక సహాయాన్నందించాయి. ర్యాం పంపుల పరిమితులు అయితే, కనీసం 8–10 అడుగుల ఎత్తు నుంచి కిందికి నీరు పారే చోట్ల మాత్రమే ర్యాం పంపును నిర్మించగలం. ఇందుకు అనుకూలమైన చోట్లు చాలా తక్కువే ఉంటాయి. దీన్ని నెలకొల్పడానికి సిమెంటు కాంక్రీటుతో పునాదిని నిర్మించాలి. బండ రాళ్లు అనువైన రీతిలో ఉంటేనే సివిల్ వర్క్ చేయడానికి అనుకూలం. అందువల్ల కాంక్రీట్ వర్క్ కొన్నిచోట్ల విఫలమవుతూ ఉంటుంది. ర్యాం పంపులకు ఉన్న ఈ పరిమితుల దృష్ట్యా తక్కువ ఎత్తు నుంచి నీరు పారే చోట్ల నుంచి నీటిని ఎత్తిపోసే కొత్త యంత్రాన్ని తయారు చేస్తే ఎక్కువ భూములకు సాగు నీరందించవచ్చన్న ఆలోచన శ్రీనివాస్ మదిలో మెదిలింది. అలా పుట్టిన ఆవిష్కరణే ‘హైడ్రో లిఫ్ట్’. ఇటు పొలాలకు నీరు.. అటు ఇళ్లకు విద్యుత్తు!రంపచోడవరం, చింతూరు, పాడేరు ఐటిడిఏల పరిధిలో కొండలపై నుంచి వాగులు, వంకలు నిత్యం ప్రవహిస్తున్నాయి. వాగు నీటి ప్రవాహ శక్తిని బట్టి వాగు ఇరువైపులా ఉన్నటు భూమి ఎత్తు, స్వభావాన్ని బట్టి తగినంత రూ. 15–20 లక్షల ఖర్చుతో 9–16 అడుగుల వరకు పొడవైన హైడ్రో లిఫ్ట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. దీని ద్వారా 6 అంగుళాల పంపుతో విద్యుత్ లేకుండానే వాగు ఇరువైపులా 50 నుంచి 100 ఎకరాల భూమికి సాగు నీరు అందించవచ్చు. అంతేకాకుండా, ఒక్కో వాటర్ వీల్ ద్వారా 15 కెవి విద్యుత్‌ను తయారు చేసి సుమారు 20–30 కుటుంబాలకు అందించవచ్చు. ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, గిరిజనాభివృద్ధి శాఖలు, స్వచ్ఛంద సేవా సంస్థలు హైడ్రో లిఫ్ట్ పద్ధతిని ప్రోత్సహిస్తే నా వంతు కృషి చేస్తా. – పంపన శ్రీనివాస్ (79895 99512), గ్రామీణ ఆవిష్కర్త, కైకవోలు, పెదపూడి మండలం, కాకినాడ జిల్లా – లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి, ప్రతినిధి కాకినాడ -
సాగర్ నుంచి విమానయానం
పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్ జలాశయంనుంచి విమానసేవలు అందుబాటులోకి రానున్నాయి. దేశంలో ఆరు వాటర్ ఏరో డ్రమ్స్ ఏర్పాటుకు కేంద్రవిమానయానశాఖ పచ్చజెండా ఊపింది. అందులో నాగార్జునసాగర్ ఒకటి. ఇప్పటికే ఇక్కడినుంచి విమాన సర్వీసులు నడపాలని ఆలోచనకు వచ్చిన అధికారులు ఆరునెలల క్రితం జలాశయాన్ని పరిశీలించి వెళ్లారు. అంతా సవ్యంగానే ఉండడంతో ఇప్పుడు జలాశయంనుంచి విమానాలు నడిపేందుకు ఓకే చెప్పారు. ఎర్తుడ్యాం మీద ఉన్న చిల్డ్రన్స్ పార్కులో హైడ్రో ఏరోడ్రమ్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. నాగార్జునసాగర్ : ప్రపంచ పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెంది, బౌద్ధదామంగా రూపుదిద్దుకుం టున్న నాగార్జునసాగర్‌కు విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉడాన్ స్కీంలో భాగంగా సాగర్ జలాశయంలో హైడ్రో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కేంద్ర పౌరవిమానయా న మంత్రిత్వశాఖ జెండా ఊపింది. దేశంలో ఆరు వాటర్ ఎరోడ్రమ్స్ వినియోగంలోకి తెచ్చేందుకు కేంద్రవిమానయాన శాఖ అనుమతి ఇచ్చింది. వీటిల్లో నాగార్జునసాగర్ ఒకటి. సాగర్‌నుంచి హైదరాబాద్‌కు, హైదరాబాద్ నుంచి సాగర్‌కు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నుంచి నాగార్జునసాగర్‌కు విమానాలను నడిపేందుకు టర్బో ఏవియేషన్ ఏయిర్‌లైన్స్ అనుమతి పొం దింది. ఇందుకోసం ఆరు నెలల క్రితమే కేంద్ర విమానయాన మంత్రిత్వ శాకుకు చెందిన అధికారి కెప్టెన్ ఇల్షాద్ అహ్మద్ నేతృత్వంలో తెలంగా ణలోని నాగార్జునసాగర్సాగర్, శ్రీశైలం, హుస్సేన్‌సాగర్, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం బ్యారేజీ తది తర ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. ఈ జలాశయాల్లో చిన్నవిమానాలు దిగేందుకు అనువుగా ఉన్నాయా?లేవా అని పరిశీలన చేసి జలాశయం లోతు, పొడవు, వెడల్పులను అంచనా వేశారు. అనంతరం సాగర్ జలాశయం హైడ్రో ఎయిర్‌పోర్టుకు అనువుగా ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రిజర్వాయర్ కనక్టింగ్ సర్వీస్ 9,12,20సీట్ల సామర్థ్యం కల్గిన విమాన సర్వీసులను నడిపేందుకు జలాశయాలు అనువుగా ఉన్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 235కొత్తరూట్లకు అనుమతినిచ్చే దానిలో భాగంగా నాగార్జునసాగర్నుంచి కూడా విమానాలు నడుపుకునేందుకు టర్బో ఏవియేషన్ సంస్థకు అనుమతినిచ్చింది. చిల్డ్రన్స్ పార్కులోనే ఏర్పాటు.. సాగర్ ఎర్తుడ్యాం మీద ఉన్న చిల్డ్రన్స్ పార్కు హైడ్రో ఎరోడ్రమ్ ఏర్పాటుకు అనుకూలమైన ప్రదేశంగా అధికారులు గుర్తించారు.2004 సంవత్సరంలో జరిగిన కృష్ణాపుష్కరాల సమయంలో ఇక్కడ పుష్కరఘాట్‌ను ఏర్పాటు చేశారు. పుష్కరఘాట్ కోసం గతంలో ఏర్పాటు చేసిన మెట్లు, జలాశయంలోపలకు కాంక్రీట్‌తో వేసిన దారి చెక్కుచెదరకుండా అలాగే ఉంది. ప్రస్తుతం దానినే వినియోగంలోకి తీసుక రానున్నట్లు సమాచారం. సాగర్‌కు పెరగనున్న విదేశీ పర్యాటకులు సాగర్ నుంచి విమానాలు నడిపేందుకు అనుమతి ఇవ్వడంతో విదేశీ బౌద్ధులు నాగార్జునసాగర్‌ను సందర్శించేందుకు అత్యధిక సంఖ్యలో రానున్నారు. ఇప్పటికే జలాశయం మధ్యలోగల నాగార్జునకొండ బౌద్ధదామంగా విరాజిల్లుతోంది. అలాగే సాగర్ జలాశయం తీరం నాగార్జునుడు నడయాడిన ప్రాంతంగా గుర్తించిన ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో గల బౌద్ధమతానికి సంబంధించిన ఆనవాళ్లను ఏర్పాటు చేసేందుకు శ్రీపర్వతా రామం నిర్మాణాన్ని మొదలు పెట్టింది. ప్రపంచంలోని అన్ని దేశాలు ఇక్కడ నిర్మాణాలు చేసుకునేందు స్థలాలను ఇచ్చేందుకు గాను జలాశయతీరంలో 275ఎకరాలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే పలుదేశాలకు భూములను అప్పగించింది. నిర్మాణాలు మరో రెండు నెలల్లో కొంత మేరకు పూర్తి కానున్నాయి. ప్రజల సందర్శననార్థం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా బుద్ధవనం ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. విమానాలు ప్రారంభమైతే సాగర్ అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
‘ఎత్తి’పోతలేనా!
ఆశలు.. ఆటలు మల్యాల నుంచి హంద్రీనీవాకు మొదలైన కృష్ణాజలాల ఎత్తిపోతలు 2వేల క్యూసెక్కులు పంపింగ్.. నేటి సాయంత్రానికి జీడిపల్లికి చేరిక ఆ తర్వాత గొల్లపల్లికి పరుగులిడనున్న కృష్ణమ్మ గతేడాది 26 టీఎంసీలు వచ్చినా ఆయకట్టుకు నీరివ్వని వైనం ఏడాది కూడా పూర్తికాని డిస్ట్రిబ్యూటరీలు వ్యవసాయానికి నీరు అందడం కష్టమే కరువు సీమను సస్యశ్యామలం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. కళ్లెదుటే నీళ్లున్నా.. ఒక్క ఎకరాను కూడా తడపలేని పరిస్థితి చూస్తే రైతులపై చంద్రబాబు సర్కారుకున్న ప్రేమ ఇట్టే అర్థమవుతుంది. చెరువులను నింపే పేరిట ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తుండటంతో విలువైన జలం వృథా అవుతోంది. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నా.. చుక్క నీరు అందించకపోవడంతో అనంత రైతు కంట్లో కన్నీరు ఉబుకుతోంది. రెండేళ్లుగా ఇదే తంతు. హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా 2015లో 16.9 టీఎంసీలు ఎత్తిపోశారు. ఇందులో జిల్లాకు 14 టీఎంసీలు చేరగా.. ఈ నీటితో 1.40లక్షల ఎకరాలకు సాగునీరు అందించే వీలుంది. అయితే ప్రధాన కాలువ పూర్తయినా.. డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ పూర్తికాకపోవడం, అధికారులు ప్రణాళిక లేకుండా వ్యవహరించడంతో జలాలన్నీ వృథా అయ్యాయి. గతేడాది 32 టీఎంసీలు ఎత్తిపోస్తే అందులో 26 టీఎంసీలు ‘అనంత’కు చేరాయి. ఈ నీటిని వరిసాగుకు వినియోగించినా 2.60 లక్షల ఎకరాలకు అందించొచ్చు. ఆరుతడి పంటలకైతే 3.5 నుంచి 4లక్షల ఎకరాలకు నీరు పారించే అవకాశం ఉంది. గతేడాది కూడా ఒక్క ఎకరాకు నీరివ్వలేదు. హంద్రీనీవా ఆయకట్టుకు నీరిస్తామని మూడేళ్లుగా మంత్రులు, అధికారులు చేస్తున్న ప్రకటనలు కార్యరూపం దాల్చని పరిస్థితి. హంద్రీనీవాను ప్రత్యేక సాగునీరు వనరుగా భావించకుండా హెచ్చెల్సీకి ఉపకాలువగా ప్రభుత్వం భావిస్తున్నట్లు కన్పిస్తోంది. అందుకే ఈ నీటిని హెచ్చెల్సీలో కలిపేస్తున్నారు. అది కూడా ప్రణాళికాబద్ధంగాగా ఆయకట్టుకు అందించకపోవడం గమనార్హం. చెరువులకు నింపుతున్నట్లు ప్రకటిస్తూ మొత్తం నీటిని వృథా చేశారు. వృథా ఇలా: మల్యాల వద్ద 32 టీఎంసీలను ఎత్తిపోస్తే, అందులో 26 టీఎంసీలు జిల్లాకు చేరాయి. రాగులపాడు లిఫ్ట్ వద్ద 24 టీఎంసీలు వచ్చినట్లు అధికారులు లెక్కతేల్చారు. అంటే మల్యాల నుంచి రాగులపాడుకు 2 టీఎంసీలు నష్టం కింద లెక్కగట్టారు. తక్కిన నీటిలో 14 టీఎంసీలను పీఏబీఆర్‌కు పంపగా.. 2.5 టీఎంసీలను ఫేజ్–2లోని గొల్లపల్లి రిజర్వాయర్‌కు తరలించారు. పీఏబీఆర్ నుంచి ఎంపీఆర్‌కు, అటు నుండి సీబీఆర్, చెరువులకు నింపినట్లు అధికారులు చెబుతున్నారు. ఫేజ్–2లోని 2.5 టీఎంసీలతో గొల్లపల్లి రిజర్వాయర్‌ను నింపారు. అంటే 26 టీఎంసీలలో 16.5 టీఎంసీలు మినహా తక్కిన నీటిని నష్టాల కింద(ఆవిరి, భూగర్భజలాలుగా ఇంకిపోవడం) చూపుతున్నారు. ఫేజ్–1లో హెచ్చెల్సీ కింద కూడా ఆయకట్టుకు నీరివ్వలేదు. నీటి కోసం శింగనమల రైతులు గతేడాది రెన్నెల్ల పాటు అలుపెరుగని ఉద్యమం చేశారు. నీరు అందుబాటులో ఉన్నా ప్రభుత్వం అందించలేకపోయింది. ప్రణాళిక లేకుండా వ్యవహరించడం, డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయకపోవడమే ఈ పరిస్థితికి కారణమైంది. ఈ ఏడాదైనా ఆయకట్టుకు నీరందేనా? హంద్రీనీవా డిస్ట్రిబ్యూటరీలు పూర్తి కాలేదు. ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం 33, 34 ప్యాకేజీలు డిస్ట్రిబ్యూటరీ పనులు మొదలైనా పూర్తి కాలేదు. దీంతో హంద్రీనీవా ఆయకట్టుకు నీరివ్వడం అసాధ్యం. ఈ నీటిని పీఏబీఆర్ ద్వారా హెచ్చెల్సీకి మళ్లించడం అనివార్యం. హెచ్చెల్సీ ద్వారా అయినా ఆయకట్టుకు ఇస్తారా? లేదా? అనేది వేచి చూడాలి. తుంగభద్ర డ్యాంలో ఇన్‌ఫ్లో ఆశాజనకంగా లేదని కేవలం తాగునీటికి మాత్రమే కేటాయింపులు చేశారు. హెచ్చెల్సీ కింద పంటలకు నీరివ్వలేమని అధికారులు చెప్పారు. ఈక్రమంలో హంద్రీనీవా నీటిని హెచ్చెల్సీ కింద పొలాలకైనా మళ్లించి పంటలు కాపాడితే ఉపయోగకరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇన్‌ఫ్లో ఆశాజనకంగా ఉంటే 40 టీఎంసీలు వచ్చే అవకాశం శ్రీశైలానికి ప్రస్తుతం 1.90లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. పదిరోజుల పాటు ఇదే ఇన్‌ఫ్లో కొనసాగితే డ్యాం పూర్తిగా నిండి కళకళలాడుతుంది. హంద్రీనీవా ద్వారా 836 అడుగుల వరకూ మనం నీటిని తీసుకునే అవకాశం ఉంది. గతేడాది 32 టీఎంసీలు ఎత్తిపోశారు. ఈ ఏడాది ఇన్‌ఫ్లో ఆశాజనకంగా ఉంటే 40 టీఎంసీల వరకూ డ్రా చేసే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. ఇందులో అనంతకు కనీసం 33–35 టీఎంసీలు చేరే అవకాశం ఉంది. ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోసేందుకు రూ.12కోట్ల కరెంటు బిల్లు వస్తుంది. ఈ లెక్కన 40 టీఎంసీలు ఎత్తిపోస్తే రూ.480 కోట్లు కరెంటు బిల్లు రూపంలో ఖర్చవుతుంది. ఈ ఖర్చును చూస్తే ‘అనంత’కు వచ్చే కృష్ణాజలాలు ఎంత విలువైనవో ఇట్టే తెలుస్తుంది. ఇలాంటి జలాలను గత మూడేళ్లుగా ప్రణాళిక లేకుండా ఎవరికి అధికార, అంగ బలం ఉంటే వారు చెప్పినట్లు అధికారులు విడుదల చేస్తున్నారు. రైతుల శ్రేయస్సును ఆలోచించడం లేదు. ఈ క్రమంలో ఈ ఏడాదైనా ప్రణాళికతో వ్యవహరించి కొద్దిమేరకైనా ఆయకట్టును కాపాడాలని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. తాగునీటికే ప్రాధాన్యత మల్యాలలో 2వేల క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు. మంగళవారం సాయంత్రం నాటికి జీడిపల్లికి చేరుకుంటాయి. తాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇస్తాం. తర్వాత జీడిపల్లిని నింపి గొల్లపల్లికి తరలిస్తాం. పుష్కలంగా నీరొస్తే చెరువులకు అందిస్తాం. ఆపై ఆయకట్టుకు నీరిందించే విషయాన్ని ఆలోచిస్తాం. - జలంధర్, సీఈ -
కాంక్రీట్ స్లాబే కొంప ముంచింది!
లోయర్ జూరాల ఘటనపై నిపుణుల కమిటీ ఆత్మకూర్: మహబూబ్‌నగర్ జిల్లా దిగువ జూరాల జెన్కో జలవిద్యుదుత్పత్తి కేంద్రంలోని నాలుగో యూనిట్లో ఏడో గేట్ కాంక్రీట్ స్లాబ్ కూలడంతోనే పవర్‌హౌస్ వరదనీటిలో మునిగి పోయిందని నిపుణుల కమిటీ నిర్ధారణకు వచ్చిం ది. ఈ ఘటనపై మరో రెండువారాల్లో పూర్తిస్థాయిలో విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపింది. జూలై 30న పవర్‌హౌస్‌ను వరదనీరు ముంచెత్తిన ఘటనపై కారణాలు తెలుసుకునేందుకు ఆదివారం నీటిపారుదల శాఖ మెకానికల్ చీఫ్ ఇంజనీర్లు, గేట్, కాంక్రీట్ నిపుణులు, ప్రొఫెసర్లతో కూడిన ఐదుగురు కమిటీసభ్యుల బృందం ఆదివారం దిగువ జూరాలను పవర్‌హౌస్‌ను పరిశీలించింది. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ నాలుగో యూ నిట్‌లోని ఏడో గేట్‌వద్ద కాంక్రీట్ స్లాబ్ కూలడంతోనే సంఘటన జరిగిందని, కాంక్రీట్ కూలడానికి కారణాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కమిటీలో మురళీధర్, సత్యనారాయణ, రమేష్‌రెడ్డి, రమణారావు, రామ్మోహన్రావు ఉన్నారు.