కాంక్రీట్ స్లాబే కొంప ముంచింది! | Lower Jurala event, a panel of experts | Sakshi
Sakshi News home page

కాంక్రీట్ స్లాబే కొంప ముంచింది!

Published Mon, Sep 8 2014 12:49 AM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM

Lower Jurala event, a panel of experts

లోయర్ జూరాల ఘటనపై నిపుణుల కమిటీ
 
ఆత్మకూర్: మహబూబ్‌నగర్ జిల్లా దిగువ జూరాల జెన్‌కో జలవిద్యుదుత్పత్తి కేంద్రంలోని నాలుగో యూనిట్‌లో ఏడో గేట్ కాంక్రీట్ స్లాబ్ కూలడంతోనే పవర్‌హౌస్ వరదనీటిలో మునిగి పోయిందని నిపుణుల కమిటీ నిర్ధారణకు వచ్చిం ది. ఈ ఘటనపై మరో రెండువారాల్లో పూర్తిస్థాయిలో విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపింది.

జూలై 30న పవర్‌హౌస్‌ను వరదనీరు ముంచెత్తిన ఘటనపై కారణాలు తెలుసుకునేందుకు ఆదివారం నీటిపారుదల శాఖ మెకానికల్ చీఫ్ ఇంజనీర్లు, గేట్, కాంక్రీట్ నిపుణులు, ప్రొఫెసర్లతో కూడిన ఐదుగురు కమిటీసభ్యుల బృందం ఆదివారం దిగువ జూరాలను పవర్‌హౌస్‌ను పరిశీలించింది. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ నాలుగో యూ నిట్‌లోని ఏడో గేట్‌వద్ద కాంక్రీట్ స్లాబ్ కూలడంతోనే సంఘటన జరిగిందని, కాంక్రీట్ కూలడానికి కారణాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కమిటీలో మురళీధర్, సత్యనారాయణ, రమేష్‌రెడ్డి, రమణారావు, రామ్మోహన్‌రావు ఉన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement