roll out
-
ఆధార్: జూలై 1నుంచి ఫేస్ రికగ్నిషన్
సాక్షి, న్యూఢిల్లీ: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ) ఈఏడాది జనవరిలో ప్రకటించిన ఫేస్ రికగ్నిషన్ ఫీచర్‌ను త్వరలోనే లాంచ్ చేస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. ఆధార్ పరిశీలన కోసం వేలిముద్రలు, కనుపాపలతో పాటు ముఖ గుర్తింపు సదుపాయన్నీ ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి తేనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు యుఐడిఎఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే అధికారికంగా జూలై 1న లాచ్ చేయనున్నామని గత వారం సుప్రీంకోర్టుకు తెలిపారు. వేలిముద్రలు చెరిగిపోయిన, మసకబారిన వంటి సమస్యల వల్ల బయోమెట్రిక్ వివరాల ధృవీకరణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న(ముఖ్యంగా వృద్ధులు) వారి కోసం ఇలాంటిది తీసుకు వస్తామని జనవరిలోనే యూఐడీఏఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల సుప్రీం కోర్టుకు కూడా ఈ విషయన్ని నివేదించింది. అయితే ఆధార్ ధ్రువీకరణకు ముఖం ఒక్కటే సరిపోదని యూఐడీఏఐ పేర్కొంది. దీనికి అదనంగా వేలిముద్రలు, కంటిపాప, వన్‌టైం పాస్వర్డ్(ఓటీపీ)ల్లో ఒకదాన్ని కూడా సరిపోల్చాల్సి ఉంటుందని స్పష్టతనిచ్చింది. -
జీఎస్టీ అమలు సెప్టెంబర్‌కు మార్చండి!
న్యూఢిల్లీ: జీఎస్టీ అమలుపై చెలరేగుతున్న అనేక ఊహాగానాలకు తోడు తాజాగా విమానయాన మంత్రిత్వశాఖ లేఖ జరింత చేరింది. ఒకవైపు దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి గూడ్స అండ్ సర్వీస్ టాక్స్ యాక్ట్( జీఎస్టీ)ను అమలు చేసేందుకు కేంద్రం సన్నద్ధమతోంది. మరోవైపు కొత్త పరోక్ష పన్నుల విధానం అమలుకు కొంత సమయంకావాలని భావిస్తోంది. ఈ మేరకు రెవెన్యూ కార్యదర్శికి ఒక లేఖను కూడా రాసింది. దీంతోపాటు జీఎస్టీ పన్నుల విధానం ఆందోళన వ్యక్తం చేసింది. జీఎస్టీ అమలు గడువును సెప్టెంబర్‌కు పెంచాల్సిందిగా కోరుతూ విమానయాన మంత్రిత్వశాఖ ఆర్థికమంత్రిత్వ శాఖకు ఈ లేఖ రాసింది. జూలైలో జీఎస్టీ పన్నుల ను అమలు చేయడం కష్టంగా ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే అంతర్జాతీయ విమానాలకు, కనెక్టింగ్ విమానాలకు ఒకేపన్ను రేటు అమలు చేయాలని కూడా మంత్రిత్వ శాఖ రెవెన్యూ సెక్రటరి హస్ముఖ అధియాకు రాసిన లేఖలో కోరింది. అంతేకాదు జీఎస్టీ వల్ల అంతర్జాతీయ ప్రయాణాలు, ఇన్పుట్ పన్ను క్రెడిట్లకు సంబంధించి విదేశీ సంస్థలకంటే అంతర్జాతీయ ఎయిర్ లైన్లకు లాభదాయకంగా ఉండనుందని లేఖలో పేర్కొన్నారు. ప్రపంచ టికెటింగ్ వ్యవస్థలో మార్పును ప్రభావితం చేస్తాయని ఎయిర్‌లైన్స్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అందుకే జిఎస్టి అమలుకు తమకు మరింత సమయం ఇవ్వాలని ఆర్ధిక మంత్రిత్వ శాఖ కోరిందని ఏవియేషన్ మినిస్ట్రీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. సోమవారం ఈ లేఖ రాసినట్లు ఈ అధికారి తెలిపారు. కాగా దేశీయ విమానయాన సంస్థ జెట్ ఎయిరవేస్ సహా కొన్ని దేశీయ విమానయాన సంస్థలు కూడా జీఎస్టీ అమలుకు సహా కొన్ని దేశీయ విమానయాన సంస్థలు, తమకుకొంత సమయం కావాలని అభిప్రాయపడ్డాయి. ఇప్పటికే వివిధ వర్గాలు వారు జీఎస్టీఅమలుకు మరింత గడువునుకోరుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి. అయితే రెవెన్యూ కార్యదర్శి హాస్ముఖ్ ఆధియాకుజూలై 1, 2017నుంచి జీఎస్టీ అమలు వాయిదాకానుందన్న వార్తలను ట్విట్టర్ ద్వారా ఖండించిన సంగతి తెలిసిందే.