సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనంతో అన్ని రంగాలు కుదేలవుతుంటే తాజా గణాంకాలు మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అక్టోబర్‌లో దేశ పారిశ్రామిక ఉత్పాదకత 3.8 శాతం పతనమైందని, విద్యుత్, మైనింగ్, తయారీ రంగాలు మెరుగైన సామర్థ్యం ప్రదర్శించకపోవడమే ఇందుకు కారణమని గురువారం వెల్లడైన గణాంకాలు స్పష్టం చేశాయి. పారిశ్రామిక ఉత్పాదకత గత ఏడాది అక్టోబర్‌లో 8.4 శాతం పెరిగింది. గత ఏడాది అక్టోబర్‌లో తయారీ రంగం 8.2 శాతం వృద్ధి నమోదు చేయగా, ఈ ఏడాది అక్టోబర్‌లో 2.1 శాతం తగ్గడం స్లోడౌన్ భయాలను పెంచుతోంది. ఇక గత ఏడాది అక్టోబర్‌లో 10.8 శాతం విద్యుత్ ఉత్పత్తి పెరగ్గా, తాజాగా అది 12.2 శాతం పతనమైంది. మైనింగ్ ఉత్పత్తి గత ఏడాది ఇదే నెలలో 7.3 శాతం పెరగ్గా, ప్రస్తుతం 8 శాతం మేర పడిపోయింది. మరోవైపు ఆహారోత్పత్తుల ధరలు ఎగబాకడంతో నవంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం మూడేళ్ల గరిష్టస్ధాయిలో 5.54 శాతానికి ఎగిసింది.
Comments
Please login to add a commentAdd a comment