మార్చిలో డబ్ల్యూపీఐ 0.53 శాతం
న్యూఢిల్లీ: దేశీయంగా టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యూపీఐ) మూడు నెలల గరిష్టానికి ఎగిసింది. కూరగాయలు, బంగాళదుంప, ఉల్లి, ముడి చమురు మొదలైన వాటి ధరల పెరుగుదల కారణంగా మార్చిలో 0.53 శాతంగా (ప్రొవిజనల్) నమోదైంది. ఫిబ్రవరిలో ఇది 0.20 శాతంగా ఉంది. గతేడాది మార్చిలో ఇది 1.41 శాతంగా నమోదైంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మైనస్‌లోనే ఉన్న టోకు ధరల ఆధారిత సూచీ నవంబర్‌లో ప్లస్ 0.26 శాతానికి వచి్చంది.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. రిటైల్ ద్రవ్యోల్బణం అయిదు నెలల కనిష్ట స్థాయి 4.85 శాతానికి తగ్గిన నేపథ్యంలో తాజా టోకు గణాంకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బేస్ ఎఫెక్ట్ తగ్గుతుండటంతో రాబోయే రోజుల్లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. గతేడాది మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం 5.42 శాతం నుంచి 6.88 శాతానికి చేరింది. కూరగాయల ధరల పెరుగుదల మైనస్ 2.39 శాతం నుంచి 19.52 శాతానికి ఎగిసింది.
Comments
Please login to add a commentAdd a comment